మాతృకావిలాసంలోని ఏకాక్షరనిఘంటువు - 6
సాహితీమిత్రులారా!
మాతృకావిలాములోని ఏకాక్షరనిఘంటువు తరువాయి భాగం ..
జజాజిజీజుజూజేజైజోజౌజంజః ॥ 8 ॥
జో జనో జనకో రాజా జా యోనిర్జిః సదాశివః ॥ 25 ॥
జీర్జిష్ణుః కరుణో యూకా జుర్విష్ణుర్జూః కులాలకః ॥
జేః శునీ జోऽథ జైః పూషా వహ్నిజోః కమలాసనః ॥ 26 ॥
జౌర్జరిజో యువా జం చ జాతం రజతమేవ చ ॥
జః ప్రాగుక్తోऽపి జల్పాకో జపనిష్టో జయేచ్ఛుకః ॥ 27 ॥
· జ: జనుడు, తండ్రి (జనకుడు), రాజు.
· జా: పుట్టుక (యోని).
· జి: శివుడు (సదాశివుడు).
· జీ: జయశీలుడు (జిష్ణుః), కరుణ గలవాడు, పేను (యూకా).
· జు: విష్ణువు.
· జూ: కుమ్మరి.
· జే: కుక్క (శునీ).
· జై: సూర్యుడు (పూషా), అగ్ని.
· జో: బ్రహ్మ (కమలాసన).
· జౌ: ముసలివాడు (జరి), యువకుడు.
· జం: పుట్టినది, వెండి (రజతం).
· జః: ఎక్కువగా మాట్లాడేవాడు (జల్పాకుడు), జపనిష్ఠ గలవాడు.
ఝఝాఝిఝీఝుఝూఝేఝైఝోఝౌఝంఝః ॥ 9 ॥
ఝో హస్తో ఝకటో ఝల్లో ఝా యోనిఝిః కలా కపిః ॥
ఝీః కరీ ఝుర్భృగుర్భూశ్చ ధ్రువః సంఘోऽమరోరగౌ ॥ 28 ॥
ఝేశ్చర్మకృద్భవో సోమో రోమరామోऽథ ఝైర్గూరుః ॥
ఝోః కర్ణో ఝౌః స్మృతో నాకో ఝం మైథునమితి స్మృతమ్ ॥ 29 ॥
ఝః ప్రాగుక్తోऽపి శీఘ్రార్థే ఝంఝావాతే చ దుర్దినే ॥
· ఝ: చెయ్యి (హస్తము), బండి (శకటము),
ఒక రకమైన జంతువు
(ఝల్లము).
·
ఝా: పుట్టుక స్థానము (యోని).
·
ఝి: ఒక కళ, కోతి
(కపి).
·
ఝీ: ఏనుగు (కరీ).
·
ఝు: భృగు మహర్షి.
· ఝూ: ధ్రువుడు, సమూహము (సంఘము),
దేవత (అమర), పాము
(ఉరగము).
· ఝే: చర్మకారుడు, శివుడు (భవః), చంద్రుడు (సోమః),
శరీరముపై
రోమము.
·
ఝై: గురువు.
·
ఝో: చెవి (కర్ణము).
·
ఝౌ: స్వర్గము (నాకము).
·
ఝం: మైథునము.
.jpg)
No comments:
Post a Comment