Sunday, October 29, 2017

జొన్నవిత్తుల వారి పేరడీలు


జొన్నవిత్తుల వారి పేరడీలు




సాహితీమిత్రులారా!

పేరడీలు వ్రాయడంలో జొన్నవిత్తుల వారిది ఒక ప్రత్యేక శైలి
వారిని టి.వి.9 ఇంటర్వూ చేసింది అప్పటి ఇంటర్వూ
ఇక్కడ చూడండి వినండి-


Saturday, October 28, 2017

కాళోజీ గొడవ


కాళోజీ గొడవ




సాహితీమిత్రులారా!

కాళోజీ గారు ప్రజాకవి. 
"చెమ్మగిలని కనులని కనులు బ్రతుకు కమ్మదనము చూడలేవు"
అంటారాయన. వారి రసార్ధ్ర హృదయమే వారి కవితల్లో అంతర్లీనంగా
స్పందిస్తుంది. సమాజంలోని అసమానతలు తొలగించాలనే 
కాళోజీ గొడవ - గులాబిని చూచి ఆయన పెట్టిన గొడవ -


లెక్కకు మించిన రెక్కలు వున్నా
గులాబి పువ్వొకటేనన్నా
మన దేశం ఒకటే అయినా 
కులమత భేదాలెన్నో ఎన్నో

          వికసించిన పువ్వుకు రెక్కలు 
          విహరించే పక్షికి రెక్కలు
          ప్రతిమనిషికి వున్నవి రెక్కలు
          రెక్కలు కలిపిన వుండవు చిక్కులు

రెక్క లాడినా డొక్కలు పూడవు కొందరికి
డొక్కలునిండీ రెక్కలాడవు కొందరికి

           వికసించిన గులాబిరేకులు
           చైతన్యపు సంకేతాలు
           అటపొంచిన గులాబిముళ్ళు
           గురిపెట్టిన తుపాకి గుళ్ళు

(శ్రీరమణ పేరడీలు నుండి................)

Friday, October 27, 2017

ఏకాక్షర కందములు



ఏకాక్షర కందములు




సాహితీమిత్రులారా!



శబ్దచిత్రంలో ఒకే హల్లును ఉపయోగించి
కూర్చిన కందపద్యాలు ఏకాక్షర కందపద్యాలు
వీటిలో అచ్చులుమాత్రం ఏవైనా ఉపయోగించవచ్చు
కాని హల్లు ఒకటే ఉంటుంది చూడండి-

ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలోని 223వ పద్యం

లోలాళిలాలిలీలా
ళీలాలీలాలలేలలీలలలలులే
లోలోలైలాలలల
ల్లీలైలలలాలలోలలేలోలేలా

(ఇందులో ల-ళ లకు భేదము లేదు కావున పద్యమంతా
ల - అనే హల్లుతో కూర్చబడినదిగా భావించాలి)

లోల - చలించుచున్నట్టి, అళి - తుమ్మెదలను,
లాలి - లాలించునట్టి, లీలా - శృంగారక్రియగలిగినట్టి,
ఆళీ - చెలికత్తెలయొక్క, లాలీ - లాలిపాటలయొక్క,
లాల - లాలయను పాటయొక్క, ఏల - ఏలపదాలయొక్క,
లీలలు - విలాసములు, అలలు - అతిశయములు,
లే - అవులే, లోలో - లోలోయనే, ల - స్వీకరించయోగ్యమయినట్టి,
ఐల - గుహలయందు, అల - అఖండములయినట్టి,
లలత్ - కదలుచున్నట్టియు, లీల - క్రీడార్థమయినట్టియు,
ఏలల - ఏలకీతీగలయొక్క, లాల - ఉయ్యాలలు,
 ఓలలు - హేరాళములే, లోల - ఆసక్తిగలిగిన,
ఐలా - భూదేవిగల శ్రీవేంకటేశ్వరస్వామీ

నానాననునిననూనున
నేను నిను ననున్ను నెన్న నీనీననిను
న్నానొని న నోన్ని నానౌ
నేనే నను నన్నునాన నేనను నన్నన్
                                                         (వరాహపురాణము- 10- 90)


         నిన్ను నిను నెన్న నీనే
      నెన్నిన నన్నన్న ననననిన నానే నా
      నిన్నూని నా ననూనున్
      నన్నూనన్నాను నేననా నున్నానా

                                        శ్రీవేంకటేశ చిత్రరత్నాకరం పూర్వభాగంలోనిది.

అనిన = నీకుపైన ప్రభువులులేని, నానా = సర్వమునకు, ఇనా = ప్రభువైనవాడా, ఇనున్ = సర్వేశ్వరుడవైన, నిన్నున్, ఎన్నన్ = స్తుతించుటకొరకు, ఈనేను, ఎన్నినన్ = ఆలోచించినచో, ననను = చిగురును, (అల్పుడని అర్థం), అన్నన్న= చోద్యం, అనూనున్ = గొప్పవాడవైన, 
నినున్ = నిన్ను, ఊనినాను = ఆశ్రయించినాను, నున్న = త్రోసివేయబడిన, అనా = శకటముగలవాడవైన, అనా = తండ్రీ, నేను, నన్ను+ ఊను = ఆదుకొనుము, 
అన్నాను = అంటిని.


నానను నానిన నానను
నేనని నూని నను నిన్ను నేనన్నను నా
నా నేనను నున్ననో నా
నేనె ననున్నాను నెన్న నీనను నానన్
                                                        (శ్రీకువలాశ్వ విజయము5-69)
(ఇందులో మూడవ పాదంలో గణభంగం జరిగినది
ముద్రణా దోషము కావచ్చు)

మామా మీమో మౌమా
మామా! మిమ్మొమ్ము మామ మామా మేమా
మేమొమ్మము మీ మైమే
మేమే మమ్మోము మోము మిమ్మౌ మౌమా!
                                                                (చంపూ భారతం పుట. 249 )

మా = చంద్రుని యొక్క, మా = శోభ,
మోము + ఔ = ముఖముగా గల,
మామా- మా = మాయొక్క, మా = మేధ,
మిమ్ము = మిమ్ములను, ఒమ్ము =-అనుకూలించును,
మామమామా = మామకు మామవైన దేవా!,
ఆము = గర్వమును, ఏమి =- ఏమియు,
ఒమ్మము = అంగీకరించము, మీమై = మీ శరీరము,
మేము ఏమే = మేము మేమే, మమ్ము,
ఓ ముము + ఓముము = కాపాడుము, కాపాడుము,
ఇమ్ము = అనుకూలము, ఔము = ఔమా + అగుము - అగుమా

నిన్నే నెన్నేనని నే
నెన్నైనను నెన్నునిన్నని నేనా
ని న్నాన నూన నేనిన్
నన్నానును నాననాను నననీనన్నా
                                                          (మధురవాణీవిలాసము2-11)
మామామోమౌ మామా
మామా మిమ్మోమ్మో మామ మామామేమా
మేమోమమ్మోము మిమైమే 
మేమే మమ్మోము మోము మిమ్మా మామా

మా - చంద్రుని
మా - శోభ
మోమౌ - ముఖముగల
మామా - మాయొక్క
మా - మేథ
మిమ్ము, ఒమ్ము - అనుకూలించును
మామ మామా - మామకు మామా
ఆము - గర్వమును
ఏమి + ఒమ్మము - ఏమి ఒప్పుకోము
మిమై - మీశరీరము
మేము ఏమే - మేము మేమే
మమ్ము ఓముము + ఓముము - కాపాడుము, కాపాడుము
ఇమ్ము - ఔము - అనుకూలమగుమా

చంద్రుని వంటి ముఖముగల దేవా!
మాబుద్ధి మీకు అనుకూలించును.
గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము.
సశరీరివై మాకు అనుకూలంగా ఉండి
మమ్ముకాపాడుము - అని అర్థం.


శతకంలో ఏకాక్షరి కందపద్యం-

ఋత తిత ఊత్తు త్తీతా
తతేతి తాతేత తాత తత్తై తత్తా
తత తుత్తా తతి తుత్తిన్ 
సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్
                                                                             (సత్యవ్రతి శతకము)

ఇందులో త - అనే హల్లు ఒకటే
ఉపయోగించి కూర్చబడినది.
మరియు  ఇందులో నాలుగవ పాదము
అన్ని పద్యములకు
మకుటంగా ఉన్నందున
అది ఒకే వ్యంజనము
ఉండనవసరములేదు.

ఋత - సత్యమనెడు, తితఉ - జల్లెడచేతను,
ఇత - పొందబడిన, ఆతత - విస్తారియగు,
ఇతి - జ్ఞానము చేతను, తాత - తండ్రివంటి
పరమేశ్వరుని యొక్క, ఇత - పొందబడిన,
తాత - దయచేతను, తత్తైతత్తా - అది ఇది
అనే భేదభావముచేత కలిగిన, తత - అధికమగు,
తుత్తాతతి - బాధ సమూహమును,
తుత్తిన్ - కొట్టుటచేతను,
సత్యవ్రతికి సంతసమొసగును.

పదార్థశోధనముచే గలిగిన జ్ఞానముచేతను,
ఈశ్వరజ్ఞానము చేతను, సంసార దుఃఖము
తొలగుననియు అందుకు సత్యము మూలమని
తాత్పర్యము.

నానానూనా నానా
నానాన్నని నిన్నునెన్ననా నేనన్నా
నేనాననూని నేనీ
వానిని కురుమూర్తి శ్రీనివాస మహాత్మా 
((వైద్యం వేంకటేశ్వరాచార్యుల శ్రీనివాస శతకంలోనిది-94)


Wednesday, October 25, 2017

బోయీ భీమన్న


బోయీ భీమన్న




సాహితీమిత్రులారా!

-గులాబీ వర్ణన-
ఆంధ్ర కవితాకుమారికి ఊరూరా జరిగిన ఊరేగింపులో యథాశక్తి
పల్లకీ మోసిన బోయీ భీమన్న గారు. వీరి గుడిసెలు కాలిపోతున్నై
కవితా సంపుటికి అకాడమీ బహుమతి లభించింది.
వీరు గులాబీ వర్ణన చేస్తే ఇలా గుంటిందని చెప్పుకోవడమే ఇది.

గులాబీలు పూస్తున్నై
ఒహో పూస్తున్నై

ఎవరికోసమో పాపం
కలవారికే అయివుంటై
రోజాలు రాజాలకు కాక
మరెవరి కోసం

ఒకసారి కోసిన గులాబీలు
మరి మళ్ళీ కోయడానికి
ఎక్కడనుంచి వస్తుంటై

       అవును నిజమే
       ఎక్కడ నుంచి వస్తుంటై

అదే మన సృష్టిలోని రహస్యం
వున్నవారి వినోదార్థం
ఈ గులాబీలు
మళ్ళీమళ్ళీ అవతరిస్తుంటై
పోతుంటో పుట్టుకొస్తుంటై

       ఈ విషవలయం సాగడం
       ఎంతవరకు
       ఆ మొక్కను వేళ్ళతో సహా
       పెకిలించేంతవరకు

(శ్రీరమణ పేరడీలు నుండి...........)

Monday, October 23, 2017

పావులూరి సుప్రభగారి - ద్వినాగబంధం


పావులూరి సుప్రభగారి -  ద్వినాగబంధం




సాహితీమిత్రులారా!

నాగబంధాలలో అనేక రకాలున్నాయి
వాటిలో ఇదోక రకమునకు చెందినది.
సుప్రభగారు పట్టుదలతో బంధలను
అల్లుతున్నారు వాటిలోని బంధము
ఈ నాగబంధము
కందపద్యం-
చారు కరుణాలవాలా
కూరిమితో కురిసిన పలుకులు ముదమిచ్చున్‌
చేరు గురు మ్రోల బాలా
పేరిమితో సరియని బిరబిర పదమిచ్చున్‌

ద్వినాగ బంధము అంటే రెండు నాగులు పెనవేసుకున్న
బంధం ఇది పద్యాన్ని బంధాన్ని చూస్తూ  చదివి గమనించండి.


Sunday, October 22, 2017

ది గ్రేట్ లౌ లెటర్


ది గ్రేట్ లౌ లెటర్




సాహితీమిత్రులారా!


గురజాడవారు సృష్టించిన "గరీశం" ముళ్లపూడివారి చేతిలో
పునర్యవ్వనాన్ని సంతరించుకున్నాడు. లెక్చర్లకు అలవాటు 
పడిన గిరీశం ప్రేమలేఖ ఇలా సాగుతుంది.

      మిస్ బుచ్చెమ్మ,
      లెటర్ రాయమంటే - ఓ యిటీజ్ కంప్లీట్లీ ఔట్ డే టెడ్. లౌ అండ్ ఇట్స్ నేచర్ మీద ఓ ఘంట లెక్చరిచ్చేద్దును గాని మన టెలుగూస్ కి కొన్ని ఫార్మాలిటీస్ అఘోరించాయి కదా!
పోతే వదినా!  మీకిక్కడ వో విషయం చెప్పాలి. ఎప్పుడూ యీ  గిరీశం లోక కళ్యాణం కోసం అంటే వరల్డ్ మారేజ్ కోసమే కంకణం కట్టుకున్నాగాని సొంతానికి వోసారయినా కట్టుకున్నాడు కాదు మీరు డేరింగా - డార్లింగ్ అంటే యిహ పెళ్లి విషయమంటారా దొరల ఫాయలాలో లాగించేద్దాం. అయితే ప్రేమను గురించి మీకిక్కడ నాలుగు ముక్కలు చెప్పకపోతే సందర్భం వదలి చెపాయించినట్టు అయిపోతుంది. మీరు కొసాకి చదివాక నచ్చకపోతే గుగ్గిలం వేసుకోండి. గిరీశం అక్షరం నిప్పుల్లో వేసినా ఘుమ ఘుమలాడుతుంది. చర్చిల్ మహాశయుడు చచ్చి ఏ లోకాన వున్నాడో - నీ లెటర్స్ వుంటే లంక పువాకు బలాదూరోయ్ అనేవాడు. అసలీ ప్రేమలేఖలు డిక్టేషనుకి వొదగవుగాని లేకపోతే పూటకొహటి దంచెయ్యకపోయానా టెంథౌజెండ్
బ్రెయిన్సు. ఇరవై వేల చెవుూ వున్న సభల్లో లెక్చర్లివ్వడానికి నోరు తిరిగిన వాడికి ఆఫ్ట్రాల్ వొక్కరు చదువుకునే వుత్తరం ముక్క రాయాలంటే డామిట్... చెడ్డ చిర్రెత్తుకొస్తుంది. సీమ దొరలకి సంతాప సందేశాలు రాసిపెడితే ఆ భాషా అదీ చూసి బట్టీయం పెట్టేవారు. బతికుండగానే అబిట్యురీలు రాయించుకుని చట్రాలు  కట్టించుకున్న దొరలు యింకా బతికే వున్నారు. కావాలంటే సాక్షీకం యిప్పించేగల్ను. నా ప్రేమ వ్యవహారం. కచేరీ వ్యవహారంతో జతచేసి మీ నాన్నతో మాట్లాడగలను. ఆయన మనసు మీ మనసులాగా మెత్తన కాదు చూశారూ. తొందరగా నాటుతుందని అనుకోను. బ్రదరిల్లా వెంకటేశం మన ప్రేమకు అంబరిల్లా లాంటివాడు. సిగార్స్ కే కాపర్స్ కొరత వుండగా తపాలు ఖర్చులకు ప్రతిసారి ఠస్సా వెయ్యాల్సి వస్తోంది.

(ఏమిటి నా లెటర్లన్నీ కచేరీ నుంచి వచ్చాయని 
మీ నాన్నకు యిచ్చావా డామిట్ ప్రేమ అడ్డం తిరిగింది.)

(శ్రీరమణ పేరడీలు నుండి.................)

Saturday, October 21, 2017

ప్రేమ - లేఖై పారిపోయింది


ప్రేమ - లేఖై పారిపోయింది




సాహితీమిత్రులారా!


శేషేంద్ర శర్మ గారిది తెలుగులో కొత్తబాణి. ఆయనదొక ప్రత్యేకవాణి.
వారు రాసే లేఖ వచనకవితలాంటి గద్యంలో సాగితే యిలా వుండవచ్చు.............

       కాదంబరీ!
       నాటి ప్రత్యూషంలో క్షణక్షణమూ నీవే అయి పరిస్పందిస్తున్నప్పుడు - నా హృదయ కుహరంలో లార్క్ పాడిన పాటను మొహమల్ తివాచిగా పరిచాను నీకోసం.
       నీ రూపం సోకి నా మనసు ముక్కలై వడగళ్ళను వర్షిస్తోంది. ఉద్యానంలో రాలిపోతున్న లిల్లీలు నా గుండెలోకి జారిపడే పిడుగులు
గుప్పెడు గుల్ మొహర్ లు నీడలు నా తాపాన్ని చల్లార్చలేక ఆవిరులై దిగంతాలకు పారి పోతున్నాయ్-
       చిట్టిపోయిన ఊహల్లోంచి స్రవిస్తున్న అశ్రువులు చెంపల్ని జలపాతాలు చేసి, పాదపీఠాన్ని నిర్దాక్షిణ్యంగా కోసేస్తున్నాయి - కోమల విషాదాన్ని భరిస్తూ, నీ సౌమ్యశాసనం కోసం బానిసనై నిలబడ్డాను.....
       సాగరగర్భంలోంచి చీల్చుకు వస్తున్న ప్రతి కెరటపులయలోనూ నీ రూపాన్ని దర్శిస్తున్నా - విచ్చుకుంటున్న ప్రతి పువ్వు చేసే రెక్కల సవ్వడిలోనూ ఆ సీమ చైతన్యమూర్తిని వీక్షిస్తున్నా-
       వేకువలో నీ లావణ్యాన్ని పాటలలోకి తర్జుమాచేసి నా కళ్లకు విన్పిస్తుంది. చిన్న పక్షి ఘోషించే కోటి జలపాతాలను భరిస్తున్న నన్నాపాట సముచ్ఛకితుణ్ణి చేస్తుంది. నీ పదధ్యనుల్ని దోసిళ్ళలో గ్రోలి, నీ దరహాసాలను చూపుల చెమ్కీదారాలతో దండలల్లి హృదయ దవాక్షానికి తోరణం కట్టాలని వుంది-
      కాదంబరీ నీ రాక ఎప్పుడో నీకోసం నిరీక్షిస్తూనే వుంటా - మృత్యువుతో కబురంపినా చాలు.......

(లేఖ చదివాక మనసు దూదిపింజలై తేలిపోతుంది - జవాబు మాట యెలా వున్నా)

(శ్రీరమణ పేరడీలు నుండి...........)
       

Friday, October 20, 2017

హైకూలూ, స్మయికూలూ


హైకూలూ, స్మయికూలూ


సాహితీమిత్రులారా!


హైకూలూ, స్మయికూలూ

                                            తెలుగు మాతృక - అజంతా
                                            స్వేచ్ఛానువాదం - శ్రీరమణ

నా నిద్రని మరచెంబులో వడపోసి
గుప్పెడు అక్షరాల్ని పడేసి మూత పెట్టేశా
ప్రతి అక్షరం ఒక పిల్లకల
శ్రీమద్గురు గురు తావళం పూస

      మో-కాళ్ల పర్వతం పాకలేను
      శ్రీనివాసా దిగిరా నీకు పుణ్యముంటుంది

అడవిలో తుపాకీ బుల్లెట్ గుడ్లు పెట్టింది
వార్ గ్రూప్ లు సమస్తం గ్రూప్ వార్ లు

        మూడో తరం దాటిపోయింది
        సపిండీకరణానికి సరైన సమయం

ప్లాట్ పారం మీద కపాలమోక్షాలు అవుతున్నాయి
రాజకీయ శ్రీరాగంలో దైవతం వేసుకోవచ్చు శిష్యా

         ఈ భూగోళం గంగిగోవు
         నా దేశం గంగడోలు

ఆవుపాలూ అనుభూతి పళ్ళూ
జరీ ఉత్తరీయాలూ కవిత్వాల కొలబద్దలు

హైకూలు స్మయికూలు
అందరూ క్యూలో నిలబడండి
వరుసగా నరుక్కొస్తా-

తాజాకలం అను అసలు సంగతి

పోనీ,
ఓ పని చేద్దాం
చెట్లన్నిటికీ కులాల పేర్లు పెట్టుకుందాం
అప్పుడేలాగూ చచ్చినట్టు బతికించుకుంటాం
                                                                         (ఆంధ్రప్రభ దినపత్రిక 1994)

(శ్రీరమణ పేరడీలు నుండి.................)

Thursday, October 19, 2017

మేఁక తొక తోఁక తొక తోఁక తోఁక మేఁక


మేఁక తొక తోఁక తొక తోఁక తోఁక మేఁక





సాహితీమిత్రులారా!

ఈ పద్యాన్ని శ్రీనాథుడు కూర్చాడు.
ఇది సీసపద్యం అంతా అంటే నాలుగు పాదాలు
ఒకే విధంగా ఉంటుంది. అలాగే దీని తరువాతి
గీతపద్యం కూడ అంతా నాలుగుపాదాలు ఒకే పాదంతో
కూర్చబడినది. వీటిని ఏకపాది పద్యాలుగాను ద్విపాది
పద్యాలుగాను చెప్పవచ్చు

రాజనందన రాజరాజాత్మజుల సాటి 
           తలపనల్లయ వేమ ధరణిపతికి
రాజనందన రాజరాజాత్మజుల సాటి 
           తలపనల్లయ వేమ ధరణిపతికి
రాజనందన రాజరాజాత్మజుల సాటి 
           తలపనల్లయ వేమ ధరణిపతికి
రాజనందన రాజరాజాత్మజుల సాటి 
           తలపనల్లయ వేమ ధరణిపతికి
భావభవభోగ సత్కళాభావములను
భావభవభోగ సత్కళాభావములను
భావభవభోగ సత్కళాభావములను
భావభవభోగ సత్కళాభావములను

ఈ పద్యాన్ని తెనాలిరామకృష్ణకవి చాటువుగా చెబుతారు
ఇందులోను ఒకే పాదం సీసమంతా, ఒకేపాదం గీతమంతా
కూర్చబడినదే

మేక తోఁకకు తోఁక తోఁక మేఁకకు మేఁక
     మేఁక తోఁకకు తోఁక తోఁక మేఁక
మేక తోఁకకు తోఁక తోఁక మేఁకకు మేఁక
     మేఁక తోఁకకు తోఁక తోఁక మేఁక
మేక తోఁకకు తోఁక తోఁక మేఁకకు మేఁక
     మేఁక తోఁకకు తోఁక తోఁక మేఁక
మేక తోఁకకు తోఁక తోఁక మేఁకకు మేఁక
     మేఁక తోఁకకు తోఁక తోఁక మేఁక
మేఁక తొక తోఁక తొక తోఁక తోఁక మేఁక
మేఁక తొక తోఁక తొక తోఁక తోఁక మేఁక
మేఁక తొక తోఁక తొక తోఁక తోఁక మేఁక
మేఁక తొక తోఁక తొక తోఁక తోఁక మేఁక

ఈ రెండు పద్యాలను తెనాలిరామకృష్ణ సినిమాలో
చిత్రించారు అది ఇక్కడ గమనించగలరు.


దీపావళి శుభాకాంక్షలు


దీపావళి శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు
శ్రేయోభిలాషులకు
దీపావళి శుభాకాంక్షలు



Monday, October 16, 2017

అక్షరోత్పత్తి - వాటి ప్రభావం


అక్షరోత్పత్తి - వాటి ప్రభావం




సాహితీమిత్రులారా!

అక్షరం అంటే ఏమిటి?
అవి ఎక్కడ నుండి పుడుతున్నాయి?
మన శరీరంలో ఆ అక్షరాలు ఎక్కడున్నాయి?
మహేశ్వరసూత్రం లో వివరించిన అంశాలు
వీటన్నిటిని వివరిస్తూ సామవేదం షణ్ముఖశర్మగారు
ప్రవచించిన ప్రవచనం ఒకసారి వినండి
మరిన్ని అంశాలు మనకు అవగతమౌతాయి.


Sunday, October 15, 2017

పెళ్ళిచేసుకొని ఇల్లుచూసుకుని - పేరడీ


పెళ్ళిచేసుకొని ఇల్లుచూసుకుని - పేరడీ




సాహితీమిత్రులారా!

జొన్నవిత్తులవారి పేరడీ
పాటలు
పెళ్ళిచేసుకొని ఇల్లుచూసుకుని
మరియు
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

వినండి మరి-



Saturday, October 14, 2017

నీవేనా నను పిలచినది - పేరడీ


నీవేనా నను పిలచినది - పేరడీ




సాహితీమిత్రులారా!

ఈ.టీ.వీ. ప్రోగ్రాం ఆహా ఈహీ ఓహో
నందు జొన్నవిత్తులగారు,
గురుమూర్తిగారితో
నీవేనా నను పిలచినది అనే మాయాబజార్
సినిమాలోని పాటను ఆర్. నారాయణమూర్తిగారి
నైజంతో ఆయన స్వరంఅనుకరించి పాడటం
కూడ ఒక పేరడీగా తీసుకోవచ్చు. దానితో
పాటు జొన్నవిత్తులవారు మరోపాటకు పేరడీ
వినిపించారు వినండి-


Friday, October 13, 2017

కావ్య మాహు రమృత ప్రతిమం కిమ్?


కావ్య మాహు రమృత ప్రతిమం కిమ్?




సాహితీమిత్రులారా!


వర్థమానాక్షరమ్ అనే రకానికి చెందిన
ప్రశ్నోత్తరచిత్రం ఇది
గమనించండి

విద్య యాస్తి సహకో2త్ర విరోధీ?
కా మువే రపి మనొ మదయంతీ?
రావణ శ్చ భృశ మీర్ష్యతి కస్మై?
కావ్య మాహు రమృత ప్రతిమం కిమ్?

ఇందులో నాలుగు ప్రశ్నలున్నాయి
కాని జవాబులు ఇక్కడ లేవు
అందుకే దీన్ని బహిర్లాపిక అనే ప్రహేలికకు
చెందినదిగా కూడ చెప్పవచ్చు.

1. విద్య యాస్తి సహకో2త్ర విరోధీ?
    విద్యకు విరుద్ధమైనదేది?
    - రాః (ధనం లేక ద్రవ్యం)
      సరస్వతి ఉన్నచోట లక్ష్మి ఉండదు.

2.  కా మువే రపి మనొ మదయంతీ?
     మహర్షుల మనస్సున కూడ మత్తు, ముత్తు(సంతోషము)ను  
      పుట్టించునది ఏది?
    - రామా (అందగత్తె)
     సున్దరీ, రమణీ, రామా అని అమరకోశం

3. రావణ శ్చ భృశ మీర్ష్యతి కస్మై?
    రావణుడు ఎవరిపై ఎక్కువ ఈర్ష్య కలిగి ఉండును?
   - రామాయ (రామునికొఱకు లేక రామునిపై)

4. కావ్య మాహు రమృత ప్రతిమం కిమ్?
     అమృత తుల్యమైన కావ్యం ఏది
       - రామాయణం
     వాల్మీకి కృత రామాయణం
     అది అమృత సమానమైన కావ్యం అని భావం

దీనిలో మొదటి ప్రశ్నకు సమాధానం - రాః
      రెండవ ప్రశ్నకు సమాధానం  - రామా
      మూడవ ప్రశ్నకు సమాధానం -రామాయ
      నాలుగవ ప్రశ్నకు సమాధానం - రామాయణం
దీనిలోని సమాధానాలు గమనించినట్లయితే
ప్రతి దానిలో అక్షరాలు పేరుగుతూ వచ్చాయి
అందువల్ల దీన్ని వర్ధమానాక్షరమ్ అని గమనించగలం.

Thursday, October 12, 2017

ష్ గప్ చుప్ లోని తిట్ల దండకం


ష్ గప్ చుప్ లోని తిట్ల దండకం




సాహితీమిత్రులారా!

"జొన్నవిత్తుల"గారి 
ఆధునిక తిట్ల దండకం
"ష్ గప్ చుప్" సినిమాలో జంధ్యాలగారి
చిత్రీకరణ ఎంత బాగుందో చూడండి-



Wednesday, October 11, 2017

ఆధునిక తిట్ల దండకం


ఆధునిక తిట్ల దండకం




సాహితీమిత్రులారా!

రకరకాల దండకాలను వినుంటాము
కాని తిట్లే దండకం పూర్వం కొందరు
కూర్చారు కాని ఇప్పుడు జొన్నవిత్తులగారు
కూర్చిన ఈ ఆధునిక తిట్ల దండకం
ఆయన గళంలోనే వినండి-

జంధ్యాలగారి ష్ గప్ చుప్ సినిమాలో
తీసుకోబడింది ఈ దండకం




Tuesday, October 10, 2017

ఆధునిక కాఫీ దండకం


కాఫీ దండకం




సాహితీమిత్రులారా!


ఆధునిక కాఫీ దండకం జొన్నవిత్తుల 
రామలింగంగేశ్వర రావు గారి రచన
ఆయన గళంలోనే



Monday, October 9, 2017

ఆవకాయ మనందరిదీ(పేరడీ)


ఆవకాయ మనందరిదీ(పేరడీ)




సాహితీమిత్రులారా!




మన పేరడీ చక్రవర్తిగా పేరుగన్న
జొన్నవిత్తులవారి ఈ పేరడీ
పాట చూడండి

బృందావనమది అందరిదీ
గోవిందుడు అందరివాడేలే

పాటకు పేరడీ
ఆవకాయ మనంఅందరిదీ



Saturday, October 7, 2017

రూపాయి దండకం


రూపాయి దండకం



సాహితీమిత్రులారా!

దండకాలలో కొన్ని విచిత్రమై వున్నాయి
ఈ చిత్రమైన విచిత్రమైన వాటిలో
జొన్నవిత్తులవారి ఈ రూపాయి దండకం
దీన్ని బాలుగారు పాడారు వినండి-



Friday, October 6, 2017

గూఢచిత్రం


గూఢచిత్రం




సాహితీమిత్రులారా!



సమాజంలో తిన్నగా మాట్లాడటం కంటె
గూఢంగా మాట్లాడడం కొందరికి అలవాటు
కొన్ని విషయాలను నేరుగాగాక గూఢంగా
చెప్పి ఆనందించడం అలవాటుగా ఉన్నవారు
సమాజంలో కనబడుతుంటారు. అలాంటి
వాటిలో కొన్ని............

దింపడే వాన సిరా

అని కొందరితో వ్రాయించి
తిప్పి చదవమంటుంటారు

వ్రాసి తిప్పి చదవండి-
ఇదోక విలోమ(గతిచిత్ర) చమత్కారం.

ఇలాకాక పద్యంలోని పాదాల మొదటి అక్షరాలను కలుపగా
ఒక రకమైన బూతు, చివరి అక్షరాలు కలుపగా మరోరకమైన
బూతుమాటలు వచ్చే పద్యం ఇది దీన్ని సెట్టి నరసింహంగారు
కూర్చారు చూడండి-

పూర్ణశశి సమమై మోము పొలిచెనేమొ
కురులపేరి మబ్బులు దగుల్కొనియె నడ్డ
నాతి మిన్న తోడ నిన్న మగ లాగు
కుతుకమున సల్పఁ దానెపై కొన్నయపుడు

పై చెప్పిన ప్రకారం కూర్చుకొని చూడండి మీకే తెలుస్తుంది.
ఇలాంటివి ఆ కాలంలో ఒక ప్రత్యేక ప్రయోజనమాసించి
వ్రాశారని కొందరంటున్నారు. అదేమో మనకు తెలియదు.

Tuesday, October 3, 2017

శ్రీరంగ కవితలు


శ్రీరంగ కవితలు




సాహితీమిత్రులారా!



నెమలిని జాతీయ పక్షిగా నిర్ణయించిన 
సందర్భంగా గురించి వర్ణన కవిసమ్మేళనం

ఆవేదనకి, ఆవేశానికి శ్రీకారం శ్రీశ్రీ. మాటల పొదుపు, ఉక్తిలో నవ్యత, బిగింపుగల భాష ఈయనకు మహాకవి యోగ్యత పట్టడానికి గల అర్హతలు. అనితర సాధ్యం నా మార్గం అని చెప్పుకున్న శ్రీరంగం శ్రీనివాసరావ్ గారి వెంట నాలుగు అడుగులు....

నట్టడవి లోంచి
నయాదిల్లీకి
మహాప్రస్థానం
మర్చిపోకు నేస్తం
నీ వాణ్ణి నేను
జాతీయ జంతువని
మనిషిని
అగ్బర్ నామా
పీకాక్ త్రోన్
బ్రిటిష్ రాణి
గతం గతః

పక్షులు
అక్షులు
కుక్కలు 
రుక్కులు
అన్నీ వొకటే రష్యాలో
ఇక్కడ మాత్రం వొకటొకటే!

(శ్రీరమణ పేరడీలు నుండి.............)

గూఢచిత్రం


గూఢచిత్రం




సాహితీమిత్రులారా! 



ఈ చిత్రం చూడండి-



దీన్ని క్రింది నుండి పైకి త్రిప్పితే
ఈ చిత్రం వస్తుంది. దీన్ని చూడండి-






Monday, October 2, 2017

సంజీవనీశైలి


సంజీవనీశైలి




సాహితీమిత్రులారా!

ఒక రచయిత పద్య లేదా గద్యశైలిని 
హాస్యస్ఫోరంగా అనుకరిస్తే - అది పేరడీ.

వెళుతున్న రైలు - ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో
అతడేదో ఆలోచిస్తూ ప్రయాణం చేయడం

ఈ సన్నివేశంతో రాసిన పేరడీ-

   సంజీవదేవ్ గారు గద్యరచనలో కొత్త పోకడలను ప్రవేశ పెట్టారు. తర్కమూ, గంభీరమైన సంస్కృతపదాలను సామాన్యవాక్యాల్లో పొదగడమూ వీరి ప్రత్యేకత. ఇదే సంఘటనను సంజీవ్ దేవ్ గారయితే!

   "రైలు జడమే అయినా అది కదుల్తుంది. చెట్టు చేతనమే అయినా అది కదలదు. కదలే అచేతనాలు, కదలని సచేతనాలు, కదలే సచేతనాలు: కదలని అచేతనాలు కూడా తారసపడతాయి. నిత్యజీవితంలో కదలిక సజీవమైన ప్రాణస్పందనకు గతిశీల చిహ్నం.
రైలు చేస్తున్న శబ్దం లయాత్మకంగా తట్టసాగింది ఫస్ట్ క్లాస్ లో కూర్చున్న అతనికి, కిటికీ గుండా బాహ్యజగత్తును అనుశీలన చేయసాగేడు. అభివ్యక్తపరచబడిన భావాలేవో అతని మానసాకాశంలో వుండి వున్నాయి. దూరాన ఛాయారూపంలో అస్పష్టంగా అగపడే పర్వత పంక్తులు ముక్తాకాశం క్రింద రమ్యంగా గోచరిస్తున్నవి. అతను వివాహితుడా?అవివాహితుడా? అని ఆలోచన చేయసాగేను. కొందరు వివాహితులు అవివాహితల్లాగాను కొందరు అవివాహితులు వివాహితుల్లాగాను వుంటారు. అతను వివాహితుడనే నిర్ణయానికి వచ్చాను. కాని, నా నిర్ణయం భ్రమయేమోననే సందేహం కూడా కలిగింది."

(శ్రీరమణ పేరడీలు నుండి.............)


Sunday, October 1, 2017

రైలుబండిలో వైతాళికులు -(చివరి భాగం)


రైలుబండిలో వైతాళికులు  -(చివరి భాగం)




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి...........



     టిక్కెట్లవాడు వుదాసీనంగా విని, రైలు ఆగే స్టేషన్ కోసం చూస్తున్నాడు - ఓ నిర్ణయానికి వచ్చేసి.

     కొందరు వినయం ప్రదర్శిస్తూ నిలబడ్డారు.

     కొందరు కానున్నది కాక మాననా యని కూర్చున్నారు.

     కాటూరిగారు చుట్టకాల్చడం మానలేదు.

     "చుట్ట పారెయ్యండి. బొత్తిగా లౌక్యం తెలీదు.... " అని గుసగుసలు విన్పిస్తున్నాయి.

     కృష్ణశాస్త్రిగారి పరిమళం తగ్గలేదు.

     కురుమెళ్లవారు స్తిమితపడ్డారు. సభాపతి ఈ విధంగానైనా రుక్మిణీనాథానికి శాస్తి జరుగుతుందని లోలోపల తృప్తి పడుతుండగా-

      రైలు ఆగింది-

      శ్రీశ్రీ చేత "రుక్కాయ్ "అని పిలువబడే రుక్మిణీనాథం రొప్పుతూ రోస్తూ రావడం కన్పించింది.

      అందరికీ జ్యోతిర్దర్శనం అయినంత సంతోషమైంది.

      "కొంప ముంచావు కదయ్యా..... " అన్నారంతా ముక్త కంఠంతో.

      "ముంచేవాడినైతే అసలు రాకే పోదును కదా......." అన్నాడాయన.

      "ఇంతకీ టిక్కెట్లెక్కడా......."

      "నోట మాట రావడం లేదు. కొంచెం స్తిమిత పడనీండి"

      జలసూత్రం వెనకాల, తరుముకు వస్తున్నట్టు - ఎర్రరంగు సేలం పట్టుపంచె, పైన నిండుగా ఉత్తరీయం కప్పుకుని ఓ నిండైన విగ్రహం కదలి వస్తూంది. ఆయన చేతిలో వెండి చెంబు - అందులో దర్భతో కట్టిన కూర్చ.. మధ్య మధ్య మనిషి తగిలినప్పుడల్లా ఆగి, చెంబులోంచి కూర్చోదకం నెత్తిన జల్లుకు ముందుకు సాగుతున్నాడు. కాలుతున్న ప్లాట్ఫాం మీద కాళ్లకి చెప్పులు కూడా లేవేమో మరీ వేగంగా నడుస్తున్నారు.

     "ఏమోయ్.... సఖుడా! కుశలమా?" అన్నారాయన కవులు అందర్నీ వుద్దేశించి.

      "తమరా మహాశయా......." అన్నారంతా

      ఆయన రాయప్రోలు సుబ్బారావుగారు అమలిన శృంగార చక్రవర్తి

      "కాళ్లకి జోళ్లు తగిలించుకో కూడదూ......." అన్నారు కాటూరివారు.

      "......ఈ అనంత భూతలిని

      మన భూమి వంటి చల్లని భూమి లేదు.
     
      ఏ దేశమేగినా, ఎందుకాలిడినా......."

                                  అన్నారాయన గాంభీర్యంగా

      "ఈ జీవుని వేదన ఈ జీవిది.... " అని విశ్వనాథ ప్రకాశంగా నిట్టూర్చారు.

       జలసూత్రంవారి రొప్పు తగ్గింది. అందరూ ఆయన వంక గుచ్చి గుచ్చి ముద్దాయిని చూసినట్టు చూస్తున్నారు.

       "అమలిన శృంగారం...శృంగారం అంటూ ఆయచన ఆడవాళ్ల పెట్టిలో కూర్చున్నారు. నేను పెట్టి పెట్టి తిరిగి తిరిగి చచ్చి చెడి వెదికి
తెచ్చాను......" అన్నారు జరుక్ కోపంగా.

      "అమలిన శృంగారానికి ఆడవాళ్ల పెట్టి దేనికి..." అప్పర్ బెర్త్ మీంచి కృష్ణశాస్త్రి ప్రశ్న.

      "స్త్రీ లేక శృంగారము వుండదు కదా! నా అమలిన శృంగారం ఆడవాళ్ల పెట్టిలోనే సాధ్యమోయి సఖుడా" అని రాయప్రోలు వారి జవాబు.

       "పైగా క్షణక్షణం ఈ నెత్తిని నీళ్లు జల్లుకోవడం... మీద పడ్డాయని కోపాసెంజెర్లతో ఘర్షణలూ - సర్ది చెప్పి తీసుకొచ్చేసరికి నా తలప్రాణం తోకకి వచ్చింది... మరో పులి మీద పుట్ర, ఆడవాళ్ల పెట్టెలో గుడిపాటి వెంకటాచలం నన్ను ముట్టుకున్నాడు స్నానం చేయాలంటూ వీరు నన్ను తింటున్నారు..." ఘాటుగా నిట్టూర్చారు జలసూత్రం.

       "సర్లే - టిక్కెట్లివ్వండి..."

       " నా దగ్గర అన్నీ లేవు - కొన్నే వున్నాయి."

        "అదేమిుటయ్యా - అనీ నీ దగ్గరేగా వుంటా...."

       " నిజమే. అది వేరే కథ. గుడుపాటి వెంకటాచలం మొదట్లోనే మనతో చీలిపోయి ఇంకో లేడీస్ కంపార్ట్ మెంట్లో ఎక్కాడు కదా! ఆ బోగీలో నిబడి అయిదారు స్టేషన్లదాకా వుమెన్స్ లిబ్ మీద వుపన్యాసం యిచ్చాడు..."

     "ఆ తర్వాత..." అడిగారెవరో ఆత్రంగా

     "తర్వాత..ఏదో స్టేషన్లో అయిదారు మంది స్త్రీప్యాసింజర్లతో దిగిపోయాడు. ఇప్పుడు నాదగ్గర టికెట్లలో అయిదు షార్టు...."అని కథ ముగించారు రుక్మిణీనాథం.

     "మరీ ఆశ్చర్యం.....పైగా అయిగారుగురివా...అమ్మో?" అని ఆశ్చర్యంతో ముణిగిపోయారు పిలకా గణపతిశాస్త్రిగారు. రాయప్రోలువారు అందరిమీదా కూర్చోదకం చల్లారు. కూతవేసి రైలు బయలుదేరింది- వైతాళికులతో-


(ఆంధ్రజ్యోతి వారపత్రికలో 1979లో ప్రచురించ బడింది.
  1994 అక్టోబరులో ఆహ్వానం మాసపత్రికలో పునర్ముద్రించబడింది.)

(శ్రీరమణ పేరడీలు నుండి..............)