Showing posts with label రామరాజభూషణుడు. Show all posts
Showing posts with label రామరాజభూషణుడు. Show all posts

Tuesday, November 9, 2021

శతలేఖినీపద్యసంధానధౌరేయు

శతలేఖినీపద్యసంధానధౌరేయు





సాహితీమిత్రులారా!



రామరాజభూషణుడనే పేరుగల

భట్టుమూర్తి తన ప్రతిభ ఏమిటో

ఈ పద్యంలో వివరించారు

గమనించండి-


శతలేఖినీపద్యసంధానధౌరేయు                    

                            ఘటికాశతగ్రంథకరణధుర్యు

నాశుప్రబంధబంధాభిజ్ఞు నోష్ఠ్యని

                          రోష్ఠ్యజ్ఞు నచలజిహ్వోక్తి నిపుణు

దత్సమభాషావితానజ్ఞు బహుపద్య

                          సాధిత వ్యస్తాక్షరీధురీణు

నేకసంధోదితశ్లోక భాషాకృత్య

                        చతురు నోష్ఠ్య నిరోష్ఠ్యసంకరజ్ఞు

నమితయమకాశుధీప్రబంధాంకసింగ

రాజసుతతిమ్మరాజపుత్రప్రసిద్ధ

సరసవేంకటరాయభూషణసుపుత్రు

నను బుధవిధేయు శుభమూర్తి నామధేయు

                                                                                                (నరస - 13)

ఈ పద్యం నరసభూపాలీయములోనిది.

ఇందులో కృతి భర్త భట్టుమూర్తిని పిలిచే సందర్భంలో కవి వర్ణించాడు-

ఇందులో తనకు పదిరకాల ప్రజ్ఞలున్నట్లు తెలుపుకున్నాడు కవి.

అవి

1. శతలేఖినీపద్య సంధానధౌరేయత -

నూరు ఘంటాలకు పద్యాలను చెప్పేనేర్పు (శతావధానం)

2. ఘటికాశతగ్రంథకరణశక్తి -

గడియకు నూరు అనుష్టుప్ శ్లోకాలను చెప్పగల ప్రజ్ఞ

3. ఆశుప్రబంధబంధాభిజ్ఞత-

ఆశువుగా ప్రబంధాలను, బంధకవిత్వాన్ని చెప్పగల నేర్పు

4. ఓష్ఠ్యనిరోష్ఠ్యజ్ఞత -

పెదవులు కలిపి, పెదవులు కలపని విధంగా ఉండేవిధంగా 

అచ్చులు హల్లులతోపద్యాలను కూర్చడం

5. అచలజిహ్వోక్తినైపుణ్యం-

నాలుక కదలకుండా ఉండే విధంగా అచ్చులు హల్లులతో పద్యాలను కూర్చడం

6. తత్సమభాషావితానజ్ఞత -

కేవలం తత్సమపదాలతోనే కవిత్వం చెప్పడం

7. బహుపద్యసాధిత వ్యస్తాక్షరీధురీణత-

ఏకకాలంలో అనేక వ్యస్తాక్షరి పద్యాలను జ్ఞాపకం పెట్టుకోగలగడం

8. ఏకసంబోధిత శ్లోకభాషాకృత్యచతురత -

ఒకసారి శ్లోకం వినగానే శ్లోకమంతా తిరిగి అప్పజెప్పడం

9. ఓష్ఠ్యనిరోష్ఠ్యసంకరజ్ఞత-

పెదవులు మూసుకున్నవెంటనే తెరచుకొనేటట్టు వీలుగా అక్షరాలను పేరుస్తూ

పద్యాలను చెప్పడం

10. అమితయమకాశుధీశక్తి -

అమితమైన యమకంతో ఆశువుగా పద్యాలను చెప్పడం

ఇంతటి ప్రజ్ఞతనకు కలదని చెప్పుకున్న ప్రజ్ఞావంతుడు

రామరాజభూషణుడు(భట్టుమూర్తి) 

Sunday, November 7, 2021

అరిగా బంచమ మేవగించిన

 అరిగా బంచమ మేవగించిన




సాహితీమిత్రులారా!


వసుచరిత్రలో రామరాజభూషణుడు

వసంతోత్సవం జరిగే సమయంలో స్త్రీపురుషులు

పాటలు పాడుతున్నారు ఎలాగని కవి వర్ణించారో

ఈ పద్యంలో తెలుస్తుంది గమనించండి-


అరిగా బంచమ మేవగించి నవలా లవ్వేళ హిందోళవై

ఖరి సూపం బికజాతి మాత్మరవభంగవ్యాకులంబైవనీ

ధర నాలంబితపల్లవ వ్రతవిధుల్దాల్పం దదీయధ్విన్

సరిగా గైకొనియెన్ వసంతము మహాసంపూర్ణభావోన్నతిన్

                                                                                                                (వసు-1-130)

ఈ పద్యంలో కవి తన సంగీతకళా రహస్యనిధులను విప్పాడు

స్త్రీలు హిందోళరాగం పాడితే కోయిలలు బాధపడ్డాయట.

ఆ రాగంలో తమ స్వరమైన పంచమం లేదని వ్యాకులత చెంది ఆకులూ అలములూ తింటూ చపస్సు చేశాయట. ఆ వ్రతవిధులను మెచ్చి వాసంతం మహాసంపూర్ణభావంతో పంచమస్వరాన్ని స్వీకరించిందట. 

కవికి పద్యకల్పనలో రెండు విషయాలు తోడ్పడ్డాయి. హిందోళరాగంలో పంచమమం అంటే రిషభం ఉండవు. (హిందోళంలో - సమగమదనిస - సనిదమగమస అని ఆరోహ అవరోహణలు) ఈ రెండు ఉన్న రాగం హిందోళవసంతం (సగమపదనిదస-సనిదమగరిగస -అని ఆరోహణ అవరోహణలు) ఈ వాస్తవిక లక్షణాలను తీసుకొని విశ్లేషించాడు కవిగారు. ఇది ఇలా ఉంటే అరిగా అనే చోట అరి అంటే శత్రువు అని,  అరి అంటే ''రి''లేని(పంచమం లేని) అర్థాలు ఉన్నాయి. దీని బట్టి ఇది చ్యుత చిత్రానికి సంబంధించినదిగా కూడ చెప్పవచ్చు.

Sunday, October 10, 2021

పద్యం పాటలా పాడటానికి వీలుగా

పద్యం పాటలా పాడటానికి వీలుగా




సాహితీమిత్రులారా!

రామరాజభూషణుని ఈ పద్యం ఆస్వాదించండి

పాటలాగా పాడటానికి వీలుగా ఉన్నది

ఈ వీడియోలో గమనించగలరు-