Showing posts with label ముక్తపదగ్రస్తం. Show all posts
Showing posts with label ముక్తపదగ్రస్తం. Show all posts

Friday, April 15, 2022

ముక్తపదగ్రస్తము అంటే వినిపించే పద్యం

 ముక్తపదగ్రస్తము అంటే వినిపించే పద్యం




సాహితీమిత్రులారా!



ముక్తపదగ్రస్తమంటే వెంటనే వినిపించే

పద్యం సుదతీ నూతన మదనా

ఈ పద్యం నరసభూపాలీయంలోనిది


సుదతీ నూతన మదనా!

మదనాగతురంగ మణిమయ సదనా!

సదనామయగజరద నా

రదనాగేంద్ర నిభ కీర్తిరస! నరసింహా!

                                                                 (నరసభూపాలీయము - 4-82)

దీని పాదాంతాల్లోని పదాలు విడిచి మళ్ళీ గ్రహించడం వల్ల దీనికి

పాదాంత ముక్తపదగ్రస్తమంటారు

సుదతీ - సుందరమణులపాలిటి

నూతన మదనా - కొత్త మన్మథుడా

మదనాగ - మదించిన ఏనుగులతో

తురంగ - గుర్రాలతో

పూర్ణ మణిమయ - రత్నాలతో మణులతో నిర్మితమైన

సదనా - రాజసౌధంకలవాడా

సత్ - నక్షత్రాలు

అనామయ గజ - దేవతల ఏనుగైన ఐరావతము

రద - దంతాలు

నారద - దేవర్షి నారదడూ

నాగేంద్ర - ఆదిశేషుడూ

నిభ - వీటితో సరివచ్చే

కీర్తిరస - యశస్సు కలవాడా

నరసింహా - ఓ నరసింహభూపతీ

Sunday, May 28, 2017

ముక్తపదగ్రస్తఘటిత మధ్యవృత్తము


ముక్తపదగ్రస్తఘటిత మధ్యవృత్తము




సాహితీమిత్రులారా!



శబ్దాలంకారాలలో ముక్తపదగ్రస్తము ఒకటి.
విడిచినపదమును మళ్ళీ తీసుకోవడం
అనే దాన్ని ముక్తపదగ్రస్తము అంటాము
ఉదాహరణ చూడండి-

పద్యం మధ్యలో ముక్తపదగ్రస్తము రావడం
ఈ ఉదాహరణలో చూడవచ్చు-

దులదులమించు కన్దొగలతోఁ గల తోరపుచందుమోముతో
దుల ఫణిగాఁగ మించు జడతోజడతో రుప క్రమంబుతోఁ
దొలఁకెడు వీక్షణాంచ దళితో దళతోడు నఖప్రభాళితో
తొలగకఁ గొల్చు కోపనలతో నలతొయ్యలి చాల లోలయై
                                                       (ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము - 446)

ఇందులో ముక్తపదగ్రస్తము మధ్యలో కలదు గమనించండి-

దులదులమించు కన్దొగలతోఁ గల తోరపుచందుమోముతో
దుల ఫణిగాఁగ మించు జడతోజడతో రుప క్రమంబుతోఁ
దొలఁకెడు వీక్షణాంచ దళితో దళతోడు నఖప్రభాళితో
తొలగకఁ గొల్చు కోపనలతో నలతొయ్యలి చాల లోలయై

Monday, October 10, 2016

శరము నాభికనున్న శతవృద్ధు సారథి


శరము నాభికనున్న శతవృద్ధు సారథి


సాహితీమిత్రులారా!


ముక్తపదగ్రస్తంలో శివస్తుతి అందులోను
త్రిపురాసుర వృత్తాంతమైనదీ పద్యం
చూడండి-

సర్వసర్వం సహాసముద యంబు రథంబు
          రథమధ్యమున నున్న రాయి విల్లు
విల్లువెంబడిఁదిర్గు వెలుఁగులు చక్రాలు
          చక్రాలకు వైరి చారు నారి
నారిఁబట్టుక తిర్గు నాగరకుఁడు గఱి
          గఱి మీఁద విహరించు ఘనుఁడు శరము
శరము నాభికనున్న శతవృద్ధు సారథి
          సారథి మాయలు సైంధవములు
గాఁగ నేగుదెంచి కణఁకణతోఁబురములు
గెలచినట్టి ఘనుఁడు గిరిజ తోడఁ
గలసియుండునట్టి కరుణా సముద్రుండు
నిష్ట సిద్ధులొసఁగు నెలమి మనకు

ఇందులో సీసపద్యం మాత్రం
ముక్తపదగ్రస్తాలంకారంలో ఉంది.

సర్వసర్వం సహాసముదయంబు రథంబు - భూమి,
రథమధ్యమున నున్న రాయి విల్లు -
భూమి మధ్యనగల మేరుపర్వతం విల్లు,
విల్లువెంబడిఁదిర్గు వెలుఁగులు -
మేరుపర్వంతం చుట్టుతిరుగు
సూర్యచంద్రులు, చక్రాలు,
చక్రాలకు వైరి - (సూర్యచంద్రులకు వైరి
 -రాహుకేతులు)- సర్పము,
చారు నారి - చక్కనైన అల్లెత్రాడు,
నారిఁబట్టుక(పామును) తిర్గు నాగరకుడు -
గరుత్మంతుడు, గఱి- ఈక,
గఱిమీఁద(గరుత్మంతునిమీద) విహరించు ఘనుడు
 - విష్ణువు, శరము - బాణము,
శరమునాభికనున్న(విష్ణువు నాభిలో ఉన్న)
శతవృద్ధు - బ్రహ్మ,
సారథి - రధాన్ని నడుపువాడు,
సారథి(బ్రహ్మ)మాటలు - వేదాలు,
సైంధవములు - గుఱ్ఱాలుగ -
త్రిపురాసుర సంహారం చేసిన శివుడు
పార్వతితోడ కలిసి ఉండే కరుణాసముద్రుడు
ఈప్సితార్థాన్ని మనకు ఇచ్చుగాక- అని ప్రార్థన