ఆంగ్లంలో శార్దూలం, చతుర్భాషా కందం
సాహితీమిత్రులారా!
పుట్టపర్తిలో జరిగిన కవిసమ్మేళనంలో
జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు
బాబాగారి ముంగిట చెప్పిన
ఆంగ్లంలో శార్దూలం, చతుర్భాషా కందం
గమనించండి-
సాహితీమిత్రులారా!
పుట్టపర్తిలో జరిగిన కవిసమ్మేళనంలో
జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు
బాబాగారి ముంగిట చెప్పిన
ఆంగ్లంలో శార్దూలం, చతుర్భాషా కందం
గమనించండి-
సాహితీమిత్రులారా!
బండ్ల సుబ్రహ్మణ్య కవి గారి
ఆంధ్రాభ్యుదయం నుండి
ద్వినాగ బంధం - ఈశ్వర ప్రార్థన
గమనించండి-
సాహితీమిత్రులారా!
బండ్ల సుబ్రహ్మణ్య కవి గారి
ఆంధ్రాభ్యుదయం నుండి
పుష్పమాలికా బంధం
గమనించండి-
సాహితీమిత్రులారా!
విష్ణుసహస్రనామాలు మనకు మూడు విధాలైన విష్ణుసహస్రనామాలుఉన్నాయి.
అయితే-ఆ మూడింటిలో ఒకటి మాత్రమే
బహుళప్రచారప్రాచుర్యం పొందింది.
1.విష్ణుసహ్రనామస్తోత్రమ్:
శ్రీమహాభారతంలోని అనుశాసనిక పర్వంలోనిమోక్ష
ధర్మంలో భీష్మ యుధిష్ఠిర సంవాదంగా
ఉండే విష్ణుసహస్రనామస్తోత్రం బహుళ
ప్రచారం పొందినది.
2.విష్ణుసహస్రనామస్తోత్రమ్:
శ్రీపద్మ పురాణంలోని ఉత్తరఖండంలో ఉమాపతి నారదసంవాదంగ కూడ
విష్ణు సహస్రనామస్తోత్రం ఉంది.ఈ స్తోత్రం
మొదట పేర్కొన్న స్తోత్రంలా ప్రాచుర్యం
పొందలేదు.
3.విష్ణుసహస్రనామస్తోత్రమ్:
ఈ స్తోత్రం శ్రీగరుడపురాణంలోని పూర్వఖండంలో
ప్రథమాంశలోనిఆచారఖండంలోఉంది.
వైద్యంవేంకటేశ్వరాచార్యులు వారి సౌజన్యంతో
సాహితీమిత్రులారా!
గణపవరపు వేంకటకవి కృత
ప్రబంధరాజ వేంకటెశ్వర విజయవిలాసములోని
849వ పద్యం పాదభ్రమకము
ప్రతిపాదం ముందుకు వెనుకకు ఎలా చదివినా ఒకలాగే ఉండే పద్యం
గమనించగలరు -
మానుత ఘనౌఘ తనుమా
యానత సుజనావ భావ నాజ సుతనయా
దీనఖర పాద ఖన దీ
యాన విమదజయ విభావియజదమవినయా
సాహితీమిత్రులారా!
నాలుగక్షరాలతో కూర్చినది
చదివితే పెదాలు తగిలేది
నాలుక కదలని పద్యం ఇది-
దీనిలో ప,బ,భ,మ అనే వ్యంజనాలతో కూర్చబడిది
పోకూరి కాశీపతిగారి సారంగధరీయంలోనిది ఈ పద్యం
గమనించండి - ఆస్వాదించండి-
మామమామపాప భీమమౌ ముప్పాపి
పాపమేపు మాపి బాముఁ బాపి
భూమిఁ బబ్బ మబ్బఁ బేము మమ్మోమమి
మేము బోము భామ మేమి భీమ
(సారంగధరీయము - 2- 127)
దీన్ని పెదవులతో పలుకుతాము కావున సోష్ఠ్యములతో కూర్చినది అంటాం.
అలాగే నాలుగక్షరాలతో కూర్చినది కావున చతురక్షరి అంటాము
అలాగే చదివేప్పుడు నాలుక కదలదు కావున అచలజిహ్వ అంటాం
దీనిలో ఇన్ని ప్రత్యేకతలున్నాయి
దీన్ని కూర్చిన పోకూరి కాశీపతిగారికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి
సాహితీమిత్రులారా!
ఆత్మకూరు సంస్థాన విద్వత్పండితకవివర్యులు
బాలసరస్వతి తిరుమల బుక్కపట్టణం
శ్రీనివాసాచార్యస్వామివారు
(1863-1919)
****************************************
శ్రీనివాసాచార్యులవారు శా.శ.౧౭౮౫ దుందుభి,చైత్ర- బహుళ నవమి నాడు(క్రీ.శ.1863) జన్మించినారు. వీరి
తిరునక్షత్ర తనియన్:
శ్రీమద్దుందుభి చైత్రకృష్ణనవమీ పుచ్ఛే ధనిష్ఠర్షగే
క్ష్మాపుత్రే శశినాసమం మకరగే మేషంగతే పూషణి,
మందేచైవ తులాంశగే సతితులా లగ్నేవతీర్ణో౭జని
శ్రీమాన్ బాలసరస్వతీ బిరుదభాక్ శ్రీశ్రీనివాసో గురుః .
పరమపదం: శా.శ.౧౮౪౧ సిద్ధాద్రి ఫాల్గుణ శుద్ధ చతుర్దశి
( క్రీ.శ.1919)
శ్రీమద్రామానుజ సిద్ధాన్త నిర్ధారణ సార్వభౌమ, సర్వతంత్ర
స్వతంత్ర ,కవితార్కికకంఠీరవ, శ్రీమద్రాజాధిరాజగురుసార్వభౌ
మేత్యాది బిరుదవిభ్రాజితమగు శ్రేష్ఠమైన ఆచార్యపురుషవంశ
మున ఉద్భవించి,గజ తురగ ఛత్ర చామరాందోళికా దివా ప్రదీప శ్రీకాహళ గౌరవ
కాహళ మకరతోరణ మయూర చ్ఛత్రాది గౌరవభాక్కులు "శ్రీమాన్ బాలసరస్వతీ శ్రీనివాసాచా
ర్యులవారు. వీరు శఠమర్షణగోత్రీయులు.అపరవేదాన్తదేశిక శ్రీనివాసాచా ర్యులవారి(సురపురం)
వంశీయులు. వీరి జనని శేషాంబ, జనకుడు బుచ్చివేంకటాచార్యులు.వీరు ఆత్మకూరు సంస్థాన
ఆస్థాన ప్రధాన విద్వత్పండిత కవివర్యులుగ విరాజిల్లినారు.
వీరు తన పదకొండవ ఏట తండ్రిదగ్గర సాహిత్యాది
గ్రంథాలను పూర్తి చేసి సంస్కృతాంధ్రాలలో కవిత్వం చెప్పడా నికి ప్రారంభించినారు.పదహారవఏట మైసూరులో శ్రీరంగనాథ
బ్రహ్మతంత్రపరకాలస్వామివారి దగ్గర తర్కవేదాన్తాలను అభ్య
సించారు.అక్కడే సజ్జయంతాతాచార్యులవారిదగ్గర ప్రాకృతాది
భాషలను నేర్చుకున్నారు.మైసూరు మహారాజా చామరాజేం
ద్రులవారు ఆచార్యలవారి ప్రతిభా పాండిత్యాలకు అబ్బురపడి
"బాలసరస్వతి" బిరుదంతో సత్కరించారు.శ్రీనివాసాచార్యుల
వారు కాశీలో స్వామిశాస్త్రిగారి దగ్గర అద్వైతవేదాన్తాన్ని,కైలాస
చంద్రశిరోమణి భట్టాచార్యుల దగ్గర న్యాయశాస్త్ర క్రోడాలనూ
జగదీశవిరచిత జాగదీశినీఅభ్యసించినారు.ఆ తర్వాత నవద్వీ పాలలో మీమాంసాశాస్త్రాన్నీ ఆపోశనం పట్టారు. నవద్వీప
పండితమండలివారు ఆచార్యులవారికి "తర్కతీర్థ" బిరుద ప్రదానం చేసినారు.
శ్రీనివాసాచార్యులవారు దర్భాంగ,జోథ్పూర్,బుందీదత్తియా,
గ్వాలియర్,కోటాంజరీ,ఇందూరు,ధారానగర్,జమ్మూ,కాశ్మీర్,
మొదలయిన ఉత్తరభారత సంస్థానాలలోనూ, మైసూరు, బళ్లారి,కడప , పెనుగొండ ,తాడిపత్రి , ప్రొద్దుటూరు ,మద్రాసు,
బనగానిపల్లి మొదలయిన దక్షిణాది ప్రాంతాలలోనూ అనేక
శాస్త్రార్థవాదనలు,ఘంటాశత కవనాలు చేసి సరస్వతీ అవతా రులుగ కీర్తి గడించినారు. సమకాలీన సంస్కృత విద్వత్కవి
పండితులలో యావద్భారతదేశాన వీరి పేరు ఎరుగనివారు
ఆనాడు లేరనడంఅతిశయోక్తికాదని నాటిపండితుల రచనలు తెలియజేస్తున్నాయి.
ఆచార్య బిరుదురాజురామరాజుగారు శ్రీనివాసాచార్యుల వారిని గురించి(పాటిబండ మాధవరాయ షష్టిపూర్తిసన్మాన సంచికలోని) ఒకవ్యాసంలో "తిరుపతివేంకటకవులు ఆత్మ కూరు సంస్థానమునకు పోయి తదాస్థాన విద్వాంసులయిన
శ్రీనివాసాచార్యులతో తలపడి శాస్త్రవాదమున నోడిపోయిరి.
తిరుపతివేంకటకవులు తెలుగులో శ్రీనివాసాచార్యులకన్న
మిన్నలైనను,సంస్కృతమున నాశుకవిత్వమును చెప్పుట
యందును, సమస్త శాస్త్రవైదుష్యమునందును శ్రీనివాసా చార్యులవారే మిన్నలు. ఆ వాస్తవమెరుగని కొందరు ఇటీవల
పత్రికలందును గ్రంథములందును శ్రీనివాసాచార్యులే పరా భూతులైనట్లు వ్రాయుట సత్యదూరము.కీర్తిశేషులను గురిం చిన సత్యాసత్యములు తెలియక,తెలిసికొన ప్రయత్నించక
సాహసోక్తులకుఆధునికులుపూనుకొనరాదని సప్రశ్రయముగ
కోరుచున్నాను" అని తెలిపినారు.ఆచార్య బిరుదురాజు రామ రాజుగారు ఈ వ్యాసాన్ని "మరుగునపడినమాణిక్యాలు" ,
"చరిత్రకెక్కని చరితార్థులు" అనే తమ వ్యాస సంపుటాలలో
కూడా చేర్చడం స్మరణీయం.
రచనలు:శ్రీనివాసాచార్యులవారి ముద్రితాముద్రిత గ్రం థాలు అనేకం.వాటిలో అధికశాతం ఆత్మకూరు సీతారామ భూపాలుగారు ముద్రింపించారు, కాగా,అముద్రిత రచనల కాగితప్రతులు బాలసరస్వతిగారి మనుమడూ, నాకు గురుతుల్యులూ, ఆత్మీయులూ అయిన శ్రీమాన్ కవితార్కిక సింహాచార్యులవారి తిరుమాళిగలో భద్రముగాఉండేవి(ఇప్పటి పరిస్థితి తెలియదు).తెలియవచ్చినంతలో బాలసరస్వతిగారి
రచనలు-
వీరశైవ శిరస్తాడనం, దుర్విగ్రహనిగ్రహం,
నంజరాజచంపూకావ్యం, తత్త్వమార్తాండప్రభాపటలం,
కిరీటివేంకటాచార్యవిజయవైజయన్తీనాటకం,
రాజవంశరత్నావళి(ఆత్మకూరు రాజులు, తెలుగు)
రాజవంశరత్నావళీ( ,, ,సంస్కృతం)
లక్ష్మీసరస్వతీ దండకావళీ,
శ్రీ కురుమూర్తి శ్రీనివాస స్తోత్రావలీ,
లక్ష్మీధ్యానసోపానం ,శ్రీనివాసధ్యానసోపానం,
శ్రీనివాస పంచాశత్, లక్ష్మీ పంచాశత్
అష్టభాషలలోనూ కురుమూర్తిస్వామిస్తుతులు,
ముకుందమాలా - తొలితెలుగువ్యాఖ్యానం,
శ్రీకురుమూర్తి శ్రీనివాస సుప్రభాత స్తోత్రం
స్తోత్రజాలం మొదలయిన రచనలు చాలా ఉన్నవి.
శ్రీనివాసాచార్యులవారు ఘంటాశతగ్రంథాలను
అనర్గళంగా, అత్యాశువుగా, అష్టభాషలలో సమర్థవంతంగ
వివిధ సంస్థానాదులలో చెప్పినారు.తెలియవచ్చినంతలో
కాలానుక్రమంగా వారి ఘంటాశతగ్రంథకవనాలు-
మైథిలీకల్యాణం: మిథిలారాజధాని దర్భాంగ
సంస్థానంలో ప్రభువు లక్ష్మీధరసింహగారి కాలాన క్రీ.శ.
1866అక్టోబర్8వతేదీనాడు అష్టభాషలలో చెప్పిన ఘంటా
శతకం ఇది.ఇక్కడి సంస్థాన విద్వత్ప్రభువు,విద్వద్వర్యులు
ఆచార్యులవారికి "కవితార్కికసింహ" బిరుదప్రదానం చేశారు.
ఈ బిరుదనామమే ఆచార్యులవారి పౌత్రునకు'కవితార్కికసిం
హాచార్య' అని పెట్టారు.
రుక్మిణీకల్యాణం: దీనికి భైష్మీపరిణయం అని
కూడా నామాంతరం. ధారానగర సంస్థానంలో తత్ప్రభువు
రాజేంద్రసింహ మరియు విద్వత్పండితమండలి సమక్షాన
చెప్పిన ఘంటాశతకం ఇది. ఈ ఘంటాశతగ్రంథ కవనం
క్రీ.శ.1888జనవరి2వ తేదినాడు చెప్పబడింది. ఈ సంస్థానంలో పండితులు బాలసరస్వతిగారిని శ్లోకాలలో
"కువలయామోదకర ద్విజరాజ"అంటూ శ్లేషలో ప్రశంసించి
నారు.
దమయంతీస్వయంవరం:ఈ ఘంటాశతగ్రంథ
కవనం బళ్లారిలోచెప్పినారు.ధర్మవరంకృష్ణమాచార్యులవారు
ఈ ఘంటాశతావధాన సభకు అధ్యక్షులు. ఈ అవధానం 1895 డిశంబరు 31 నాడు జరిగింది.
లేఖినీ,గంగాభివర్ణనం:ఆత్మకూరు సంస్థానంలో
ఆచార్యులవారికీ తిరుపతివేంకటకవులకూ సాహితీభండనం
జరిగింది.ఆసందర్భాన ఘంటాశతగ్రంథంగా లేఖినినీ గంగాభి
వర్ణననూ చేయాలని పండితులు కోరగా ఘంటాశతగ్రంథ కవనంలో చొరవలేని తిరుపతికవులు మౌనం వహించగా
శ్రీనివాసాచార్యులవారు ఘటికాంతరాళంలో 15శ్లోకాలు
కలాన్నిగురించీ, 50 వసంత తిలకాలు గంగను గురించీ
చెప్పారు.ఈ. ఘంటాశతకం క్రీ.శ.1887 మార్చిలో ఆత్మకూరులో జరిగింది.
వజ్రనాభచరితం: ప్రొద్దుటూరు పురప్రముఖులు,
విద్వాంసుల సమక్షంలో 1901 సెప్టంబరు 8వ తేదీనాడు
చెప్పబడిన ఘంటాశత గ్రంథం ఇది. సభాధ్యక్షులుగా విద్వత్సంపన్నుడూ డిస్ట్రిక్ట్ మున్సిఫ్ అయిన బ్రహ్మశ్రీ
సి.సుబ్రహ్మణ్య అయ్యర్ గారు ఉన్నారు.
ధూమశకటం:కడప పట్టణంలో1902 మార్చి
5వ తేదీనాడు విద్వత్సభలోఈ ఘంటాశతావధానంజరిగింది.
పురాణాంశాలయితే అలవోకగా చెప్పగలడని ఈ అంశాన్ని
ఇచ్చినారు. అయినా బాలసరస్వతిగారు నిర్ణీతసమయానికి
ముందే తమ శతావధానాన్ని పూర్తి చేశారు.
సముద్రమథనం:1903మార్చి 20 తేదీనాడు
మద్రాసులోని పచ్చయ్యప్పకళాశాల సభాభవనంలో పుర ప్రముఖులు,సుప్రసిద్ధపండితుల సమక్షంలో జరిగిన
అవధానం ఇది. ఈ అవధానాల గురించి అలనాటి ప్రముఖ
ఆంధ్ర,ఆంగ్ల పత్రికలు విశేషంగా వార్తలను ప్రచురించాయి. అవన్నీ నేను (ఈ వ్యాసకర్తను) సేకరించాను.
బాలసరస్వతిగారి ఘంటాశతావధానాలను
ఆ నాటి సంప్రసిద్ధ ఆయుర్వేదవైద్యులు పండిత డి.గోపాలాచా ర్యులవారు 1903లో ఆనంద ముద్రణాలయం-మద్రాసులో
ముద్రింపించినారు.
బాలసరస్వతివారు తమ అవధానసభలలో
అవధానాన్ని నిర్ణీత వ్యవధికన్నా చాలాముందుగానే అత్యాశువుగ ముగించేవారట.సభలో ఉండిన ప్రముఖుల
కోరికమేరకు ఆధ్యాత్మి, విశిష్టాద్వైత, వేదాన్తాదులను గురించి
అనర్గళంగ ఉపన్యసించేవారు.సభలో వివిధరంగాలలో ఉద్దండ పండితులైనవారు తర్క,మీమాంసా,సాంఖ్య, వేదాం తాలలో కొ్న్ని సందేహా లను వెలిబుచ్చి ఆచార్యులవారి నుండి సముచిత సమాధానాలను రాబట్టి, బహువిధాలుగ
బాలసరస్వతిగారిని ప్రశంసించేవారు. ఇవన్నిటికీ ఆ నాటి
పత్రికలు సాక్ష్యం పలుకుతున్నాయి.
సమకాలీన సంస్కృతపండితులలో ఏనోట విన్నా
ఆచార్యులవారి ఘంటాశతావధానాల చర్చనే ఉండేదని నాడు కొందరు చెప్పిన మాటలు అక్షరంగా దర్శనమిస్తున్నాయి.
బ్రహ్మామృతవర్షిణీ సభ: శ్రీనివాసాచార్యులవారు
"బ్రహ్మామృతవర్షిణీసభ" అనే పేరున ఒక సంఘాన్ని స్థాపించి
నారు.దానికి బాలసరస్వతిగారు అధ్యక్షులుగ, వనపర్తి సంస్థాన ప్రధానవిద్వాంసులు ఆచార్యరంగాచార్యులవారు
ప్రధానకార్యదర్శిగ,గద్వాలసంస్థానం పేపలి చక్రవర్తి కొండమా
చార్యులుగారు నియత సభాకార్యదర్శిగ ఉన్నారు. "బ్రహ్మామృత వర్షిణి" పత్రిక శ్రీకురుమూర్తి శ్రీనివాస ముద్రాక్షర
శాల,శ్రీమదరచింతాత్మకూరుసంస్థానంలో ముద్రతమైనవి ఒకటి రెండు ప్రస్తుత వ్యాసకర్త దగ్గర ఉన్నవి.
బ్రహ్మామృతవర్షణి సభవారు ఆత్మకూరుసంస్థానంలోనే
గాక (పాత )పాలమూరుజిల్లాలోనేగాక, రాయలసీమ ప్రాంతంలో కూడ అనేక సభలు సమావేశాలు నిర్వహించి
విద్యార్థులకు పరీక్షలుకూడా జరిపి విశిష్టాద్వైతాన్ని, ధర్మ ప్రచారాన్ని చేసేవారు.ప్రథమకక్ష్యకు పాఠ్యగ్రంథాలుగా
సారావళీ సహిత శ్రీభాష్యం,పరమతభంగ సహిత శ్రీమద్రహస్య త్రయసారః అనేవాటిని పెట్టేవారు.ఉత్తీర్ణులయినవారికి25,
మధ్యములకు20,అధమస్థాయివారికి15రూపాయలు పారితోషికంగా ఇచ్చేవారు.ద్వితీయకక్ష్యకు పాఠ్యగ్రంథాలుగ
శ్రీభాష్యం-ప్రథమాధ్యాయం , జిజ్ఞాసాదర్పణః,షష్ఠీదర్పణః.
ప్రథమ,ద్వితీయ,తృతీయస్థానం పొందిన విద్యార్థులకు
రూ15/-,రూ12/-, రూ10/-పారితోషికం. తురీయకక్ష్యకు
పాఠ్యాంశం-నీళాస్తుతి,స్తోత్రజాలం,హరి,గుణదర్పణః,సిద్ధాన్త
చిన్తామణి. పారితోషికం-రూ5/-,రూ3/-,రూ2/-ఇచ్చేవారు.
నిర్దిష్టమైన ప్రణాలికతో శ్రీవైష్ణవాన్ని ప్రచారం చేసిన విద్వత్పండితులు బాలసరస్వతిగారు.
సంస్కృత భారతి కృతిరత్నహారంలో
చోటుచేసుకున్న విద్వద్రత్నం మ.న.జిల్లా సంస్థానసంజనిత
రత్నంకావడం మనందరకూ గర్వకారణం.
బాలసరస్వతిగారి మరుగునపడిన కృతిరత్నాలన్నీ ఒకచోటగుదిగుచ్చి హారంగా అందించవలసి ఉంది.
వైద్యం వేంకటేశ్వరాచార్యులు వారి సౌజన్యంతో
సాహితీమిత్రులారా!
రామసేతు. ఆనాడు రాముడు, అతని వానరసైన్యం శ్రీలంకకు నిర్మించిన రాతివంతెన. సీతమ్మ కోసం రావణుడిపై యుద్ధం చేసాడు, రాముడు. ఇప్పటి ధనుష్కోటి ప్రాంతానికి వచ్చాడు. అక్కడి నుంచి సముద్రమార్గంలో అతి దగ్గరలో ఉన్న లంక భూభాగంలోకి వెళ్లాలి. అప్పుడే వానర వీరుల్లో ఒకరు, నిర్మాణ శాస్త్రంలో ఆరితేరిన నలుడు వారధి కట్టాడు. నలుడి ఆధ్వర్యంలో నీటిలో తేలే రాళ్లతో వంతెనకట్టారు, వానర వీరులు. రామసేతు లేకపోతే లంకపై యుద్ధమే లేదు. ఆ సేతువు వల్లే రామ రావణ యుద్ధం జరిగింది. రావణ సంహారం జరిగింది. సీతారాములు కలిశారు. ఇప్పటికీ రామేశ్వరం దగ్గరలో ఉన్న ధనుష్కోటికి వెళితే, రామసేతు ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆనాడు సముద్రుడని శాంతించాలని రాముడు కోరాడు. ఇప్పటికీ ఆ శాంతి సముద్రం మనకు కనిపిస్తుంది. రామసేతు వైపు ఉన్న సముద్రంలో అసలు అలలే రావు. పక్కనే ఉన్న బంగాళాఖాతం మాత్రం ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. అసలు, రామసేతు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నాలుగైదు ఏళ్ల క్రితమే నాసా డిస్కవరీ ఛానల్ పరిశోధకులు రామసేతు మీద రీసెర్చ్ చేశారు. ఆ సేతు సహజసిద్ధంగా ఏర్పడినది కాదు, మనుషులు కట్టినదే అని వారు తేల్చారు. సేతువు ఉన్నచోట ఉన్న రాళ్లు ఏడు వేల కిందటివి అని చెప్పారు.. ఇవి డిస్కవరీ ఛానల్ చెప్పిన వివరాలు. ఇన్నాళ్లు ఆ వారధి మనుషులు కట్టినది అని కొందరు వాదించేవారు. కానీ, వాల్మీకి రామాయణంలో ఆ వారధి ఎలా కట్టారు, ఏ రాళ్లు వాడారు అన్న వివరాలన్నీ ఉన్నాయి. సైంటిస్టుల పరిశోధనలతో వాల్మీకిరామాయణంలో రామసేతు గురించి రాసిన ప్రతి అక్షరం నిజంగా జరిగినదేనని ఋజువయింది. తన లీలలకు సాక్ష్యాలుగా భగవంతుడు ఈ భూమి మీద కొన్ని రుజువులు వదిలే వెళ్తాడు. రామాయణం జరిగిందే అనడానికి రామసేతు ప్రత్యక్ష సాక్ష్యం. శ్రీకృష్ణుడు ఉన్నాడు అని చెప్పేందుకు ఇప్పటికీ ద్వారక సముద్రంలో మునిగి ఉన్న ద్వారక సాక్ష్యం. భారతదేశంలో ఎక్కడ వరకు అంటే, పూర్వకాలంలో పెద్దలు, ఆ సేతు హిమాచలం అని చెప్పేవారు. ఇందులో, సేతువు అంటే రామసేతువు, హిమాచలం అంటే హిమాలయాలు అని అర్థం. త్రేతాయుగంలో జరిగిన రామకథను వాల్మీకి రామాయణంగా వర్ణించారు. సీతను అపహరించిన రావణుని వధించి ఆమెను సురక్షితంగా తీసుకురావడానికి లంకకు వెళ్లాలి. ఆ లంకకు వెళ్లాలంటే సముద్రాన్ని దాటాలి. అలా దాటడానికి ఉన్న అన్ని అవకాశాలపై చర్చ జరిగాక, సముద్రంపై వంతెన కట్టాలని అనుకుంటాడు, రాముడు. విశ్వకర్మ అంశతో పుట్టిన నలుని సహాయంతో సముద్ర జలాలపై తెలియాడే ఒక వంతెనను నిర్మించాడు. లక్షల మంది వానరుల సహాయంతో కట్టిన వారధి, అది. అలా కట్టిన వారిని ఆ తర్వాత తరాలు కూడా భారత శ్రీలంకల రాకపోకలకు ఉపయోగించాయి. శ్రీలంకలో బౌద్ధ వ్యాప్తికి బౌద్ధభిక్షువులు ఈ వంతెనను ఉపయోగించినట్టు ఆధారాలు ఉన్నాయి.
విభీషణుడు కాలం నుంచి భారత శ్రీలంకల మధ్య ఉన్న స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. దీనికి రాముడే పునాది వేశాడు ఆ తర్వాత సముద్రమట్టాలు పెరిగి ఆ వంతెన క్రమంగా మునిగిపోయింది. విదేశీ పాలకుల సమయంలో ఆ వంతెనకు ఆడమ్స్ బ్రిడ్జి అని పేరు పెట్టారు. బ్రిటిష్ చరిత్రకారులు మహా మేధావులు అని మన దేశంలో ఉన్న మన ఎంతోమంది చరిత్రకారుల నమ్మకం కదా. అసలు వంతెనే లేకపోతే ఆడమ్స్ బ్రిడ్జ్ అనే పేరు ఎందుకు పెట్టాలి? అనే ఆలోచన మన హిస్టారియన్లకు ఎందుకు రాలేదో! రామసేతు అనే ఐడెంటిటీ చెడిపోవడానికి ఆడమ్స్ బ్రిడ్జి అని పేరు పెట్టారు, విదేశీ పాలకులు. కానీ, తరతరాలుగా రాముడు వేసిన దారిలో నడుస్తున్న భారతీయుల నోటి నుంచి ఏనాడూ ఆడమ్స్ బ్రిడ్జ్ అనే మాట రాలేదు. ఇప్పటికి, ఎప్పటికీ ఆ వంతెన రామసేతు గానే మనసులో నిలిచిపోయింది, నిలిచిపోతుంది కూడా.
నీటిలో మునిగిపోయి ఉన్న ఆ రాతి వంతెన ప్రస్తావన భారత పురాణాల, ఇతిహాసాల గ్రఃథాల్లో ఉంది. క్రీస్తుశకం 1480 వరకు ఆ వంతెనను అప్పటి తరాలు వాడుకున్నాయి ఆ తరువాత తుఫానులో సముద్ర అలలకు ఆ వంతెన దెబ్బతింది. సముద్రం క్రమక్రమంగా పెరిగింది. వంతెన నీటిలో మునిగింది. సునామీ లాంటి పెద్ద పెద్ద విపత్తులను ఆ సేతువు ఇప్పటికీ ఆపుతుంది. ఆ మధ్య సునామీ వచ్చి చెన్నై నష్టపోయింది. ధనుష్కోటి ప్రక్కన ఉన్న పల్లెలు మాత్రం సురక్షితంగా ఉన్నాయి. కారణం, రామసేతువు. అలాంటి సేతువును తొలగించి భారతదేశ నౌకాయాన మార్గం చేద్దామని అప్పటి ప్రభుత్వాలు ప్రయత్నించాయి. సేతుసముద్రం అనే ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేశాయి. కానీ, ఆ వంతెననించి ఒక రాయిని కూడా కదపలేకపోయారు. పెద్ద పెద్ద క్రేన్ లు కూడా విరిగిపోయాయి. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు కూడా మూలన పడింది
రామాయణం ప్రకారం త్రేతాయుగంలో ఈ రామసేతు నిర్మాణం జరిగింది. రామసేతు నిర్మాణ కాలం ఇప్పటికీ సరిగ్గా తెలియదు. తమిళనాడులో రామేశ్వరం కన్నా ముందు వచ్చే రైలుస్టేషన్ పంబన్ దీవి. అక్కడినుంచి శ్రీలంకలోని మన్నారుదీవి వరకు ఈ వంతెన ప్రస్తుతం కనిపిస్తోంది. విచిత్రమేమంటే, పాక్ జల సంధి, మన్నారు జలసంధులను ఈ రామసేతు విడదీస్తుంది. విచిత్రం ఏమంటే, ఈ రామసేతు ఉన్న ప్రాంతం అంతా సముద్రమట్టం మూడు నుంచి 30 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే అదే లోతు ఉండడం ఆశ్చర్యం.
దీని వెనుక రామాయణంలోనే కథ ఉంది రాముడు ఈ సేతును నిర్మించేటప్పుడు సముద్రుడు ఉగ్రరూపంలో ఉన్నాడు. సేతువును నిర్మించేందుకు అనువుగా సముద్రుడు శాంతించాలని రాముడు కోరాడు. కానీ సముద్రుడు స్పందించలేదు. అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఎక్కువపెడితే, సముద్రుడు భయపడి శాంతించాడని రామాయణంలో కథ. ఇప్పటికీ రామసేతు ఉన్న ప్రాంతంలో ఒకవైపు హిందూ మహాసముద్రం, మరోవైపు బంగాళాఖాతం ఉంటాయి. ఆ రెండు సముద్రాల అద్భుత సంగమాన్ని ధనుష్కోట్లో చూడవచ్చు. ఒకవైపు సముద్రం ఎటువంటి అలలు లేకుండా ప్రశాంతంగా ఉంటే, మరోవైపు సముద్రం ఊరిని మింగేస్తుందా! అన్నట్టు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. ధనుష్కోట్లో ఇప్పటికీ కనిపించే వింత అది. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ రామసేతు 50 కిలోమీటర్ల పొడవు ఉంది. ధనుష్కోటి నుంచి ఇప్పుడు కనిపిస్తున్న శ్రీలంకకు సముద్రపు దారి 50 కిలోమీటర్లు మాత్రమే. పడవల్లో ప్రయాణిస్తే, రెండు మూడు గంటల్లో చేరుకోవచ్చు ఆ దారిలో ఒకటి రెండు చోట్ల ఇప్పటికీ రామసేతు పైకి కనిపిస్తుందని అంటారు. ఈ వంతెన కోసం వాడిన రాళ్లు నీటిపై తేలుతూ ఉంటాయి. ఆ రాళ్ల అవశేషాలను ఇప్పటికీ ధనుష్కోటి ఒడ్డున చూడొచ్చు. రెండు చేతులతో ఎత్తడానికి వీల్లేనంతగా ఆ రాళ్లు బరువుగా ఉంటాయి. కానీ, నీటిలో వేస్తే మాత్రం, తేలుతూ ఉంటాయి ఆ రాళ్లలో ఉన్న కెమికల్ కాంపోనెంట్స్ వల్లే ఇలా జరిగినా, అలాంటి రాళ్ళను ఆ కాలంలో ఎలా కనిపెట్టారు అన్నది ఆశ్చర్యం. రామాయణంలో కూడా రామసేతుకు వాడిన రాళ్లు తేలుతాయని వాల్మీకి వర్ణించారు. నలుడు ఆ రాళ్ళను ఎంపిక చేశారు అని కూడా చెప్పారు. రామేశ్వరం, ధనుష్కోట్లో ఎక్కడపడితే అక్కడ ఈ రాళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ రాళ్ళను నీటిపై తేల్చి, మనకి అక్కడ ప్రజలు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు దొరుకుతున్న రాళ్లు మూడు నుంచి ఐదు కేజీల బరువు ఉంటున్నాయి. కానీ, రామాయణంలో వర్ణన చూస్తే ఆ కాలంలో పర్వతాల లాంటి రాళ్లను కూడా వాడినట్టు వివరణ ఉంది .
15వ శతాబ్దం వరకు రామసేతుని ప్రజలు వాడుకున్నారు. శ్రీలంకకు వెళ్లేందుకు అప్పటి వ్యాపారులకు ప్రధాన రహదారి ఈ వంతెనే. ఆ తర్వాత సముద్రాల్లో మార్పు వచ్చి, దారి నీటిలో కలిసిపోయింది. 1480లో వచ్చిన భారీ తుఫానుల వల్ల రామసేతు డ్యామేజ్ అయిందని రామేశ్వరంలో ఉన్న రామన్ కోవెల శాసనాలు చెప్తున్నాయి. ఈ సేతుకు ఉపయోగించిన రాళ్లు అగ్నిపర్వతాలు పేలినపుడు ఏర్పడిన రాళ్లు, లేదా, లైమ్ స్టోన్ అని సైంటిస్టులు నిర్ధారించారు. కానీ, అలాంటి రాళ్లు ఒక ధనుష్కోటి ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ కనిపించకపోవడం ఆశ్చర్యం. మొత్తానికి ఈ వంతెన ఏడువేల ఏళ్ళకు ముందు నుంచే ఉందని స్పష్టమైన ఆధారాలు లభించాయి. కార్బన్ డేటింగ్, ఇతర పరీక్షల్లో రామసేతు రామాయణం కాలం నాటిదే అని సైంటిస్టులు తేల్చారు. 1960లో నాసా ఒక సాటిలైట్ పిక్చర్ ని తీసింది. ధనుష్కోటి నుంచి శ్రీలంక మధ్య ఉన్న ఈ వారధి ఫోటో స్పష్టంగా కనిపించింది. ఈ వంతెనతో కూడిన శ్రీలంక ఒక కన్నీటి బిందువులా ఉందని కూడా నాసా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. 2000వ సంవత్సరంలో ఎన్డీవర్ షటిల్ రాడార్ మిషన్ లో భాగంగా తీసిన సాటిలైట్ ఫోటోలలో రామసేతు మరింత స్పష్టంగా కనిపించింది
రామసేతు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చారు. సముద్ర అలల తాకిడి, సునామీ వంటి ప్రమాదాల నుంచి దేశాన్ని, తీర ప్రాంతాన్ని తీరంలో ఖనిజ ప్రకృతి వనరులను ఆ సేతువు రక్షిస్తోంది. ప్రపంచంలో యురేనియంకి దీటుగా పనికొచ్చే అత్యంత విలువైన థోరియం నిలువలు అపారంగా ఉన్న మన సముద్ర తీరాన్ని ఇది కాపాడుతుంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే థోరియంలో 30% ఇక్కడే దొరుకుతుంది. అబ్దుల్ కలాంవంటివారు విద్యుత్ ఉత్పత్తికి యురేనియం బదులు థోరియం వాడాలనే సూచనలను చేసేవారు.
2017లో రామసేతుపై డిస్కవరీ సైన్స్ ఛానల్ లో వచ్చిన డాక్యుమెంటరీ వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారత శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు మానవ నిర్మితమేనని ఆ ఛానల్ రుజువు చేసింది. అలాగే, భారతీయదాసన్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ రిమోట్ సెన్సింగ్ ప్రొఫెసర్ ఎస్ఎం రామస్వామి నేతృత్వంలో 2003లో ఒక బృందం రామసేతుపై పరిశోధనలు చేసింది. రామనాథపురం పంబన్ లలో సేతువుపై వీరు పరిశోధనలు చేశారు. ఇక్కడ బీచ్ లో భూమి, సముద్రపు సుదీర్ఘ అలల తాకిడి వల్ల ఏర్పడ్డాయని, కార్బన్ డేటింగ్ పరీక్షల ద్వారా ఇక్కడ తీరప్రాంతాల వయస్సు రామాయణ కాలంతో సరిపోతుందని వారు తేల్చారు .కోరల్ వేవ్ స్ బదులుగా ఉండే ఇసుక మధ్య ఇలాంటి వంతెనలు సహజంగా ఏర్పడడం సాధ్యం కాదని కూడా వారు చెప్పారు.
మరి రామాయణంలో ఈ సేతు గురించి ఏముంది ? వానరవీరులలో ప్రముఖుడైన నలుడు విశ్వకర్మ కుమారుడు "నాపై సేతువు అని అతడే నిర్మించగలడు."ఆ సేతువుని నేను భరించగలను" అని సముద్రుడు రాముడికి చెప్పినట్టు రామాయణంలో శ్లోకాలు ఉంటాయి. సేతు నిర్మాణ కౌశలం నాకు తెలుసని, మన వానరసేనతో ఆ కార్యాన్ని నెరవేరుస్తానని అన్నాడు, నలుడు. శ్రీరాముడు సేతునిర్మాణనికి ఆజ్ఞాపిస్తే లక్షల మంది వానరవీరులు మహావృక్షాలను, పెద్దపెద్ద పొదళ్లను తీసుకొచ్చి, సముద్ర తీరానికి తెచ్చారు. ఏనుగులంత ఎత్తున బండరాళ్లను పర్వతాలను పెకలించి, యంత్ర సాయంతో సముద్రతీరానికి చేర్చారు, వానరులు. యంత్రం గురించి రామాయణంలో ఉంది. ఆ యంత్రం ఏంటో తెలియదు. నలుడు సముద్రంపై సేతు నిర్మాణం ప్రారంభించాడు. వానరులు అంతా సహకరిస్తున్నారు. కొందరు పర్వతాలను తీసుకువచ్చారు. ఇంకొందరు దారికి అటు ఇటు కర్రలు పాతి వాటిని వరుస క్రమంలో గడ్డి పోచలను పెనవేసి కడుతున్నారు. ఏ రోజు ఎంత ఎంత దూరం కట్టారో కూడా, రామాయణంలో ఉంది. ఐదు రోజుల్లో ఈ వంతెన నిర్మాణాన్ని ముగించారు. వానరులు. ఆరో రోజు సముద్రానికి అవతల ఉన్న లంకలో సువేల పర్వతానికి చేరుకున్నారని వాల్మీకి రామాయణం యుద్ధకాండలో 69 నుంచి 73 వరకు ఉన్న సర్గలు చెబుతున్నాయి. ఇలా రామాయణంలో విశ్వకర్మ అంశతో పుట్టిన నలుడు రామసేతును నిర్మించాడని యుద్ధకాండలో స్పష్టంగా ఉంది. ఈ సేతువు 10 యోజనాలు వెడల్పు, 100 యోజనాలు దూరం ఉందని రామాయణం చెప్తుంది. యోజనం అంటే సుమారు ఎనిమిది మైళ్ళు ఆ లెక్కన ఎనిమిది వందల మైళ్ల దూరం ఈ సేతువును నిర్మించారని రామాయణం చెప్తుంది. ఇప్పుడు మనకు ఆధారాలుగా కనిపిస్తున్న రామసేతు 50 కిలోమీటర్లు. ఆ లెక్కన, మనం ఇప్పుడు చూస్తున్నది అసలు శ్రీలంకలో ఒక భాగం మాత్రమేనా? అసలు లంక సముద్రంలో మునిగిందా? అన్నది కూడా పరిశోధించాలి. పురాణాల్లో చెప్పిన లంకలో కొన్ని ఆనవాళ్లు మాత్రమే ఇప్పుడు శ్రీలంకలో కనిపిస్తున్నాయి. ద్వారకలాగే అసలు లంక కూడా సముద్రంలో మునిగిందా? మునిగితే, ఎక్కడుంది? అన్నది పరిశోధించాలి. అలా లక్షల సంఖ్యలో వానరులు రామసేతుని నిర్మించారు. ఇంకా ఎన్నో మిస్టరీలు రామసేతులాగే సముద్రంలో మునిగిపోయాయి. మన భారతదేశ చరిత్రకు మూలమైన రెండు ప్రధాన సాక్ష్యాలు సముద్రంలో కలిసిపోయాయి. ఒకటి, తేతాయుగం నాటి రామసేతు. ఇంకొకటి, ద్వాపరయగంలోని శ్రీకృష్ణుడు నడిచిన నేల ద్వారక. ఈ రెండిటిని లోతుగా అధ్యయనం చేస్తే, ఇప్పుడున్న చరిత్ర పుస్తకాలను అన్నిటిని మార్చాల్సి వస్తుంది.రామసేతువు
రామసేతు. ఆనాడు రాముడు, అతని వానరసైన్యం శ్రీలంకకు నిర్మించిన రాతివంతెన. సీతమ్మ కోసం రావణుడిపై యుద్ధం చేసాడు, రాముడు. ఇప్పటి ధనుష్కోటి ప్రాంతానికి వచ్చాడు. అక్కడి నుంచి సముద్రమార్గంలో అతి దగ్గరలో ఉన్న లంక భూభాగంలోకి వెళ్లాలి. అప్పుడే వానర వీరుల్లో ఒకరు, నిర్మాణ శాస్త్రంలో ఆరితేరిన నలుడు వారధి కట్టాడు. నలుడి ఆధ్వర్యంలో నీటిలో తేలే రాళ్లతో వంతెనకట్టారు, వానర వీరులు. రామసేతు లేకపోతే లంకపై యుద్ధమే లేదు. ఆ సేతువు వల్లే రామ రావణ యుద్ధం జరిగింది. రావణ సంహారం జరిగింది. సీతారాములు కలిశారు. ఇప్పటికీ రామేశ్వరం దగ్గరలో ఉన్న ధనుష్కోటికి వెళితే, రామసేతు ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆనాడు సముద్రుడని శాంతించాలని రాముడు కోరాడు. ఇప్పటికీ ఆ శాంతి సముద్రం మనకు కనిపిస్తుంది. రామసేతు వైపు ఉన్న సముద్రంలో అసలు అలలే రావు. పక్కనే ఉన్న బంగాళాఖాతం మాత్రం ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. అసలు, రామసేతు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నాలుగైదు ఏళ్ల క్రితమే నాసా డిస్కవరీ ఛానల్ పరిశోధకులు రామసేతు మీద రీసెర్చ్ చేశారు. ఆ సేతు సహజసిద్ధంగా ఏర్పడినది కాదు, మనుషులు కట్టినదే అని వారు తేల్చారు. సేతువు ఉన్నచోట ఉన్న రాళ్లు ఏడు వేల కిందటివి అని చెప్పారు.. ఇవి డిస్కవరీ ఛానల్ చెప్పిన వివరాలు. ఇన్నాళ్లు ఆ వారధి మనుషులు కట్టినది అని కొందరు వాదించేవారు. కానీ, వాల్మీకి రామాయణంలో ఆ వారధి ఎలా కట్టారు, ఏ రాళ్లు వాడారు అన్న వివరాలన్నీ ఉన్నాయి. సైంటిస్టుల పరిశోధనలతో వాల్మీకిరామాయణంలో రామసేతు గురించి రాసిన ప్రతి అక్షరం నిజంగా జరిగినదేనని ఋజువయింది. తన లీలలకు సాక్ష్యాలుగా భగవంతుడు ఈ భూమి మీద కొన్ని రుజువులు వదిలే వెళ్తాడు. రామాయణం జరిగిందే అనడానికి రామసేతు ప్రత్యక్ష సాక్ష్యం. శ్రీకృష్ణుడు ఉన్నాడు అని చెప్పేందుకు ఇప్పటికీ ద్వారక సముద్రంలో మునిగి ఉన్న ద్వారక సాక్ష్యం. భారతదేశంలో ఎక్కడ వరకు అంటే, పూర్వకాలంలో పెద్దలు, ఆ సేతు హిమాచలం అని చెప్పేవారు. ఇందులో, సేతువు అంటే రామసేతువు, హిమాచలం అంటే హిమాలయాలు అని అర్థం. త్రేతాయుగంలో జరిగిన రామకథను వాల్మీకి రామాయణంగా వర్ణించారు. సీతను అపహరించిన రావణుని వధించి ఆమెను సురక్షితంగా తీసుకురావడానికి లంకకు వెళ్లాలి. ఆ లంకకు వెళ్లాలంటే సముద్రాన్ని దాటాలి. అలా దాటడానికి ఉన్న అన్ని అవకాశాలపై చర్చ జరిగాక, సముద్రంపై వంతెన కట్టాలని అనుకుంటాడు, రాముడు. విశ్వకర్మ అంశతో పుట్టిన నలుని సహాయంతో సముద్ర జలాలపై తెలియాడే ఒక వంతెనను నిర్మించాడు. లక్షల మంది వానరుల సహాయంతో కట్టిన వారధి, అది. అలా కట్టిన వారిని ఆ తర్వాత తరాలు కూడా భారత శ్రీలంకల రాకపోకలకు ఉపయోగించాయి. శ్రీలంకలో బౌద్ధ వ్యాప్తికి బౌద్ధభిక్షువులు ఈ వంతెనను ఉపయోగించినట్టు ఆధారాలు ఉన్నాయి.
విభీషణుడు కాలం నుంచి భారత శ్రీలంకల మధ్య ఉన్న స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. దీనికి రాముడే పునాది వేశాడు ఆ తర్వాత సముద్రమట్టాలు పెరిగి ఆ వంతెన క్రమంగా మునిగిపోయింది. విదేశీ పాలకుల సమయంలో ఆ వంతెనకు ఆడమ్స్ బ్రిడ్జి అని పేరు పెట్టారు. బ్రిటిష్ చరిత్రకారులు మహా మేధావులు అని మన దేశంలో ఉన్న మన ఎంతోమంది చరిత్రకారుల నమ్మకం కదా. అసలు వంతెనే లేకపోతే ఆడమ్స్ బ్రిడ్జ్ అనే పేరు ఎందుకు పెట్టాలి? అనే ఆలోచన మన హిస్టారియన్లకు ఎందుకు రాలేదో! రామసేతు అనే ఐడెంటిటీ చెడిపోవడానికి ఆడమ్స్ బ్రిడ్జి అని పేరు పెట్టారు, విదేశీ పాలకులు. కానీ, తరతరాలుగా రాముడు వేసిన దారిలో నడుస్తున్న భారతీయుల నోటి నుంచి ఏనాడూ ఆడమ్స్ బ్రిడ్జ్ అనే మాట రాలేదు. ఇప్పటికి, ఎప్పటికీ ఆ వంతెన రామసేతు గానే మనసులో నిలిచిపోయింది, నిలిచిపోతుంది కూడా.
నీటిలో మునిగిపోయి ఉన్న ఆ రాతి వంతెన ప్రస్తావన భారత పురాణాల, ఇతిహాసాల గ్రఃథాల్లో ఉంది. క్రీస్తుశకం 1480 వరకు ఆ వంతెనను అప్పటి తరాలు వాడుకున్నాయి ఆ తరువాత తుఫానులో సముద్ర అలలకు ఆ వంతెన దెబ్బతింది. సముద్రం క్రమక్రమంగా పెరిగింది. వంతెన నీటిలో మునిగింది. సునామీ లాంటి పెద్ద పెద్ద విపత్తులను ఆ సేతువు ఇప్పటికీ ఆపుతుంది. ఆ మధ్య సునామీ వచ్చి చెన్నై నష్టపోయింది. ధనుష్కోటి ప్రక్కన ఉన్న పల్లెలు మాత్రం సురక్షితంగా ఉన్నాయి. కారణం, రామసేతువు. అలాంటి సేతువును తొలగించి భారతదేశ నౌకాయాన మార్గం చేద్దామని అప్పటి ప్రభుత్వాలు ప్రయత్నించాయి. సేతుసముద్రం అనే ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేశాయి. కానీ, ఆ వంతెననించి ఒక రాయిని కూడా కదపలేకపోయారు. పెద్ద పెద్ద క్రేన్ లు కూడా విరిగిపోయాయి. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు కూడా మూలన పడింది
రామాయణం ప్రకారం త్రేతాయుగంలో ఈ రామసేతు నిర్మాణం జరిగింది. రామసేతు నిర్మాణ కాలం ఇప్పటికీ సరిగ్గా తెలియదు. తమిళనాడులో రామేశ్వరం కన్నా ముందు వచ్చే రైలుస్టేషన్ పంబన్ దీవి. అక్కడినుంచి శ్రీలంకలోని మన్నారుదీవి వరకు ఈ వంతెన ప్రస్తుతం కనిపిస్తోంది. విచిత్రమేమంటే, పాక్ జల సంధి, మన్నారు జలసంధులను ఈ రామసేతు విడదీస్తుంది. విచిత్రం ఏమంటే, ఈ రామసేతు ఉన్న ప్రాంతం అంతా సముద్రమట్టం మూడు నుంచి 30 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే అదే లోతు ఉండడం ఆశ్చర్యం.
దీని వెనుక రామాయణంలోనే కథ ఉంది రాముడు ఈ సేతును నిర్మించేటప్పుడు సముద్రుడు ఉగ్రరూపంలో ఉన్నాడు. సేతువును నిర్మించేందుకు అనువుగా సముద్రుడు శాంతించాలని రాముడు కోరాడు. కానీ సముద్రుడు స్పందించలేదు. అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఎక్కువపెడితే, సముద్రుడు భయపడి శాంతించాడని రామాయణంలో కథ. ఇప్పటికీ రామసేతు ఉన్న ప్రాంతంలో ఒకవైపు హిందూ మహాసముద్రం, మరోవైపు బంగాళాఖాతం ఉంటాయి. ఆ రెండు సముద్రాల అద్భుత సంగమాన్ని ధనుష్కోట్లో చూడవచ్చు. ఒకవైపు సముద్రం ఎటువంటి అలలు లేకుండా ప్రశాంతంగా ఉంటే, మరోవైపు సముద్రం ఊరిని మింగేస్తుందా! అన్నట్టు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. ధనుష్కోట్లో ఇప్పటికీ కనిపించే వింత అది. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ రామసేతు 50 కిలోమీటర్ల పొడవు ఉంది. ధనుష్కోటి నుంచి ఇప్పుడు కనిపిస్తున్న శ్రీలంకకు సముద్రపు దారి 50 కిలోమీటర్లు మాత్రమే. పడవల్లో ప్రయాణిస్తే, రెండు మూడు గంటల్లో చేరుకోవచ్చు ఆ దారిలో ఒకటి రెండు చోట్ల ఇప్పటికీ రామసేతు పైకి కనిపిస్తుందని అంటారు. ఈ వంతెన కోసం వాడిన రాళ్లు నీటిపై తేలుతూ ఉంటాయి. ఆ రాళ్ల అవశేషాలను ఇప్పటికీ ధనుష్కోటి ఒడ్డున చూడొచ్చు. రెండు చేతులతో ఎత్తడానికి వీల్లేనంతగా ఆ రాళ్లు బరువుగా ఉంటాయి. కానీ, నీటిలో వేస్తే మాత్రం, తేలుతూ ఉంటాయి ఆ రాళ్లలో ఉన్న కెమికల్ కాంపోనెంట్స్ వల్లే ఇలా జరిగినా, అలాంటి రాళ్ళను ఆ కాలంలో ఎలా కనిపెట్టారు అన్నది ఆశ్చర్యం. రామాయణంలో కూడా రామసేతుకు వాడిన రాళ్లు తేలుతాయని వాల్మీకి వర్ణించారు. నలుడు ఆ రాళ్ళను ఎంపిక చేశారు అని కూడా చెప్పారు. రామేశ్వరం, ధనుష్కోట్లో ఎక్కడపడితే అక్కడ ఈ రాళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ రాళ్ళను నీటిపై తేల్చి, మనకి అక్కడ ప్రజలు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు దొరుకుతున్న రాళ్లు మూడు నుంచి ఐదు కేజీల బరువు ఉంటున్నాయి. కానీ, రామాయణంలో వర్ణన చూస్తే ఆ కాలంలో పర్వతాల లాంటి రాళ్లను కూడా వాడినట్టు వివరణ ఉంది .
15వ శతాబ్దం వరకు రామసేతుని ప్రజలు వాడుకున్నారు. శ్రీలంకకు వెళ్లేందుకు అప్పటి వ్యాపారులకు ప్రధాన రహదారి ఈ వంతెనే. ఆ తర్వాత సముద్రాల్లో మార్పు వచ్చి, దారి నీటిలో కలిసిపోయింది. 1480లో వచ్చిన భారీ తుఫానుల వల్ల రామసేతు డ్యామేజ్ అయిందని రామేశ్వరంలో ఉన్న రామన్ కోవెల శాసనాలు చెప్తున్నాయి. ఈ సేతుకు ఉపయోగించిన రాళ్లు అగ్నిపర్వతాలు పేలినపుడు ఏర్పడిన రాళ్లు, లేదా, లైమ్ స్టోన్ అని సైంటిస్టులు నిర్ధారించారు. కానీ, అలాంటి రాళ్లు ఒక ధనుష్కోటి ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ కనిపించకపోవడం ఆశ్చర్యం. మొత్తానికి ఈ వంతెన ఏడువేల ఏళ్ళకు ముందు నుంచే ఉందని స్పష్టమైన ఆధారాలు లభించాయి. కార్బన్ డేటింగ్, ఇతర పరీక్షల్లో రామసేతు రామాయణం కాలం నాటిదే అని సైంటిస్టులు తేల్చారు. 1960లో నాసా ఒక సాటిలైట్ పిక్చర్ ని తీసింది. ధనుష్కోటి నుంచి శ్రీలంక మధ్య ఉన్న ఈ వారధి ఫోటో స్పష్టంగా కనిపించింది. ఈ వంతెనతో కూడిన శ్రీలంక ఒక కన్నీటి బిందువులా ఉందని కూడా నాసా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. 2000వ సంవత్సరంలో ఎన్డీవర్ షటిల్ రాడార్ మిషన్ లో భాగంగా తీసిన సాటిలైట్ ఫోటోలలో రామసేతు మరింత స్పష్టంగా కనిపించింది
రామసేతు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చారు. సముద్ర అలల తాకిడి, సునామీ వంటి ప్రమాదాల నుంచి దేశాన్ని, తీర ప్రాంతాన్ని తీరంలో ఖనిజ ప్రకృతి వనరులను ఆ సేతువు రక్షిస్తోంది. ప్రపంచంలో యురేనియంకి దీటుగా పనికొచ్చే అత్యంత విలువైన థోరియం నిలువలు అపారంగా ఉన్న మన సముద్ర తీరాన్ని ఇది కాపాడుతుంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే థోరియంలో 30% ఇక్కడే దొరుకుతుంది. అబ్దుల్ కలాంవంటివారు విద్యుత్ ఉత్పత్తికి యురేనియం బదులు థోరియం వాడాలనే సూచనలను చేసేవారు.
2017లో రామసేతుపై డిస్కవరీ సైన్స్ ఛానల్ లో వచ్చిన డాక్యుమెంటరీ వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారత శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు మానవ నిర్మితమేనని ఆ ఛానల్ రుజువు చేసింది. అలాగే, భారతీయదాసన్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ రిమోట్ సెన్సింగ్ ప్రొఫెసర్ ఎస్ఎం రామస్వామి నేతృత్వంలో 2003లో ఒక బృందం రామసేతుపై పరిశోధనలు చేసింది. రామనాథపురం పంబన్ లలో సేతువుపై వీరు పరిశోధనలు చేశారు. ఇక్కడ బీచ్ లో భూమి, సముద్రపు సుదీర్ఘ అలల తాకిడి వల్ల ఏర్పడ్డాయని, కార్బన్ డేటింగ్ పరీక్షల ద్వారా ఇక్కడ తీరప్రాంతాల వయస్సు రామాయణ కాలంతో సరిపోతుందని వారు తేల్చారు .కోరల్ వేవ్ స్ బదులుగా ఉండే ఇసుక మధ్య ఇలాంటి వంతెనలు సహజంగా ఏర్పడడం సాధ్యం కాదని కూడా వారు చెప్పారు.
మరి రామాయణంలో ఈ సేతు గురించి ఏముంది ? వానరవీరులలో ప్రముఖుడైన నలుడు విశ్వకర్మ కుమారుడు "నాపై సేతువు అని అతడే నిర్మించగలడు."ఆ సేతువుని నేను భరించగలను" అని సముద్రుడు రాముడికి చెప్పినట్టు రామాయణంలో శ్లోకాలు ఉంటాయి. సేతు నిర్మాణ కౌశలం నాకు తెలుసని, మన వానరసేనతో ఆ కార్యాన్ని నెరవేరుస్తానని అన్నాడు, నలుడు. శ్రీరాముడు సేతునిర్మాణనికి ఆజ్ఞాపిస్తే లక్షల మంది వానరవీరులు మహావృక్షాలను, పెద్దపెద్ద పొదళ్లను తీసుకొచ్చి, సముద్ర తీరానికి తెచ్చారు. ఏనుగులంత ఎత్తున బండరాళ్లను పర్వతాలను పెకలించి, యంత్ర సాయంతో సముద్రతీరానికి చేర్చారు, వానరులు. యంత్రం గురించి రామాయణంలో ఉంది. ఆ యంత్రం ఏంటో తెలియదు. నలుడు సముద్రంపై సేతు నిర్మాణం ప్రారంభించాడు. వానరులు అంతా సహకరిస్తున్నారు. కొందరు పర్వతాలను తీసుకువచ్చారు. ఇంకొందరు దారికి అటు ఇటు కర్రలు పాతి వాటిని వరుస క్రమంలో గడ్డి పోచలను పెనవేసి కడుతున్నారు. ఏ రోజు ఎంత ఎంత దూరం కట్టారో కూడా, రామాయణంలో ఉంది. ఐదు రోజుల్లో ఈ వంతెన నిర్మాణాన్ని ముగించారు. వానరులు. ఆరో రోజు సముద్రానికి అవతల ఉన్న లంకలో సువేల పర్వతానికి చేరుకున్నారని వాల్మీకి రామాయణం యుద్ధకాండలో 69 నుంచి 73 వరకు ఉన్న సర్గలు చెబుతున్నాయి. ఇలా రామాయణంలో విశ్వకర్మ అంశతో పుట్టిన నలుడు రామసేతును నిర్మించాడని యుద్ధకాండలో స్పష్టంగా ఉంది. ఈ సేతువు 10 యోజనాలు వెడల్పు, 100 యోజనాలు దూరం ఉందని రామాయణం చెప్తుంది. యోజనం అంటే సుమారు ఎనిమిది మైళ్ళు ఆ లెక్కన ఎనిమిది వందల మైళ్ల దూరం ఈ సేతువును నిర్మించారని రామాయణం చెప్తుంది. ఇప్పుడు మనకు ఆధారాలుగా కనిపిస్తున్న రామసేతు 50 కిలోమీటర్లు. ఆ లెక్కన, మనం ఇప్పుడు చూస్తున్నది అసలు శ్రీలంకలో ఒక భాగం మాత్రమేనా? అసలు లంక సముద్రంలో మునిగిందా? అన్నది కూడా పరిశోధించాలి. పురాణాల్లో చెప్పిన లంకలో కొన్ని ఆనవాళ్లు మాత్రమే ఇప్పుడు శ్రీలంకలో కనిపిస్తున్నాయి. ద్వారకలాగే అసలు లంక కూడా సముద్రంలో మునిగిందా? మునిగితే, ఎక్కడుంది? అన్నది పరిశోధించాలి. అలా లక్షల సంఖ్యలో వానరులు రామసేతుని నిర్మించారు. ఇంకా ఎన్నో మిస్టరీలు రామసేతులాగే సముద్రంలో మునిగిపోయాయి. మన భారతదేశ చరిత్రకు మూలమైన రెండు ప్రధాన సాక్ష్యాలు సముద్రంలో కలిసిపోయాయి. ఒకటి, తేతాయుగం నాటి రామసేతు. ఇంకొకటి, ద్వాపరయగంలోని శ్రీకృష్ణుడు నడిచిన నేల ద్వారక. ఈ రెండిటిని లోతుగా అధ్యయనం చేస్తే, ఇప్పుడున్న చరిత్ర పుస్తకాలను అన్నిటిని మార్చాల్సి వస్తుంది.
వైద్యం వేంకటెశ్వరాచార్యులవారి సౌజన్యంతో
సాహితీమిత్రులారా!
"త". ఇది సీతాదేవియొక్క నామంలో ఒక అక్షరం. అటువంటి నామాక్షరమైనటువంటి, బీజాక్షరమైనటువంటి సంపుటితో మొత్తం 68 సర్గలలో, సుమారు 50 సర్గలను, స, త అనే ఈ రెండక్షరాలతోనే వాల్మీకి ప్రారంభిస్తాడు. మీరు గమనించండి. ఈ 50 సర్గల ప్రారంభం స అనే అక్షరంతో కానీ, త అనే అక్షరంతో కానీ అవుతుంది. వాల్మీకి మహర్షి దివ్యడైనటువంటి మహాపురుషుడు కనుక, అతని నోటి నుండి వెలువడినది కనుక, ఈ విధంగా అవతరించింది కానీ, ఇది సామాన్యమైన గ్రంథం కాదు. అందుచేత మనవారంతా సుందరకాండను పారాయణ చేస్తూ ఉంటారు .
మెదటి శ్లోకంలో ఆయన౼ సాక్షాత్తు భగవానునినుండి మనమందరం కలిసి ఉండి, విడువడకుండా ఉండవలసిన వాళ్ళం మనం అందరం. జీవులందరం. ఎప్పుడూ కలసి ఉండే ఈ జీవతత్వం భగవంతుని నుండి ఎందుకు దూరం అయినది?,
"తతో రావణనీతాయాః"౼ . " తతః" అంటే౼ తరువాత అని ఒక అర్థం.. కథ ప్రారంభం చేస్తూ "తరువాత" అనే కథను ప్రారంభం చేస్తారు. ఆ విధంగానే అందంగా కథ ప్రారంభించాడు. ఇది ఒక పద్ధతి. కథ చెప్పే పద్ధతిలో చెబుతాడు? కాదు. ఇది కావ్యం. కావ్యం కనుక ధ్వన్యర్ధంలో తతః అంటే౼ "పరమాత్మ నుండి" అని అర్థం. తత్ అంటే పరమాత్మ అని అర్థం. సంస్కృతంలో, ఉపనిషత్ భాషలో, తత్ అంటే పరమాత్మ. తత్ అని పరమాత్మకు పేరని ఛాందోగ్యపనిషత్తులో " తదైక్షత, బహుస్యాం ప్రజాయేతి" అని అంటుంది. "తత్ ఐక్షత"౼ అది సంకల్పించినది. అది అంటే ఏది? సృష్టికి ముందు సకల జగత్తును తనలో చేర్చుకుని, తనకంటే వేరుగా ఉండే రెండవ పదార్థం ఏది లేదు, తాను ఒక్కడే ఉన్నట్లుగా, ఉన్నదని మాత్రమే చెప్పడానికి తగిన స్థితిలో ఉండే సత్ అనే పదార్థమునకు తత్ అని పేరు. తత్ అనే దేనిని అంటారు? దూరముగా ఉండే, కనపడని వస్తువును "తత్" అది అని అంటారు. ఎదురుగా, దగ్గరగా ఉండి కనపడేదానిని ఇది అని అంటారు. సంస్కృతంలో దగ్గరగా ఉండేదానిని "ఇదమ్" అంటారు. దూరంగా ఉండే దానిని తత్ అంటారు. ఈ విధంగా దూరంగా, దగ్గరగా ఉండేవి ఏవి? దగ్గరగా ఉండేది ఇదమ్, ఈ కనపడుతున్న జగత్తు. తత్౼ అది. కనబడనిది. ఎవరికి, ఎక్కడ, ఎప్పుడు చూడడానికి వీలుకాక, నామరూపములు లేని, ఉన్నదని మాత్రమే చెప్పదగినట్లుగా ఉండది అని తెలుసుకొనేటట్లు ఉండే ఒక పదార్థము సత్. దాని పేరే తత్.
ఈ తత్ అనే దానినుండి విడివడి వచ్చింది తత్వం.? ఏ తత్వం జీవతత్వం. ఎక్కడికి వచ్చింది? లంకలోకి. ఎవరు తీసుకుని వచ్చారు? "రావణనీతాయాః"౼ రావణుని చేత తీసుకొని రాబడినది. రావణుడు ఎవరు ? మన లోపల ఉండే మనస్సే రావణుడు. ఈ రావణుని యొక్క ప్రకోపంచేత, మనము అజ్ఞానావృతమైనటువంటి అవిద్య కామ, కర్మ కర్మల చేత బంధింపబడినటువంటి, సంకుచితమైనటువంటి మనఃప్రవృత్తి చేత మనం ఈ సంసార బంధంలోకి వచ్చాము.
అందుచేత, "తతః రావణనీతాయాః," ఎవరీమె సీత. సీత అంటే ఏమి? భూమిలోనుంచి వెలువడినది. జన్మలేనిది." న జాయతే న మ్రియతే వా కదాచిత్" అని . కఠోపనిషత్తు చెబుతోంది. పుట్టలేదు, ఆత్మ. చనిపోదు ఆత్మ అగ్ని వేస్తే కాలదు ఆత్మ, గాలికి ఎండదు ఆత్మ. ఇలా చెప్పింది ఇవన్నీ చూపిస్తాడు మనకి. లంకంతా కాలిపోతే, "న చ దగ్ధా". సీతమ్మ కాలిపోలేదు. దహింపబడలేదు. ఎంత ఆశ్చర్యం! ఊరంతా కాలిపోయింది. "చతురంగుల మాత్రోపి నావకాశః స విద్యతే. ". నాలుగు అంగుళాల మేర కూడా కాలని చోటు లేని, కాలని ఊరు లేని చోట, కాలకుండా సీతమ్మ ఉన్నది అంటే, ఎవరా తల్లి? దానికి కారణం ఆమె పాతివ్రత్య మహిమ. భారతీయులమైన మనమంతా బాహ్యముగా తెలుసుకోవలసినది, మన జాతికి నేర్పిన మూల సిద్ధాంతం తల్లి పాతివ్రత్యం. మన దేశాన్ని రక్షించినవారు పతివ్రతలు మన దేశాన్ని రక్షించినవారు మహర్షులు. మన దేశాన్ని రక్షించినటువంటివారు మహాపురుషులు. వారు లేకపోతే మనమీనాటికి, మన భారతదేశం ఈనాటికీ నిలిచి ఉండదు. అటువంటి భారతదేశంలో పతివ్రత అయిన తల్లి, తన పాతివ్రత్యం మహిమ చేత, అగ్నిహోత్రుడు ఆంజనేయుని తోకకు అంటుకుంటే, "అగ్నిదేవా! మా ఆంజనేయుని తోకకు అంటుకోకు. చల్లబడు" అంటే, చందన పంకంవలె చల్లనిది అయిపోయింది, అగ్ని. ఇంత చందనం ముద్ద తోకకు పెట్టారా !అన్నట్లు అయినది. మంట మండుతుంది అగ్ని ఆరిపోయిందేమో! అని అనుకున్నాడు మన హనుమన్న. వెనుకకు తిరిగి చూశాడు. అరెరే! "జ్వలతి!. కరోతి న చ మే రుజమ్!". మండుతోంది నాకు బాధ కలిగించలేదు. ఏమి? ఓహో! సముద్రంలో కొండ లేచిందే. అగ్ని చల్లబడదా! మా రాముని అనుగ్రహం, మా సీతమ్మ తల్లి అనుగ్రహం." అని అన్నాడు, ఆయన. అటువంటి అగ్నిహోత్రాన్ని చల్లార్చగలిగిన శక్తి కలిగినటువంటి తల్లి మన సీతమ్మ . దేని చేత? తన పాతివ్రత్య మహిమ చేత. అంతటి గొప్ప మహిమ కరిగినది కనుక, ఆమె జన్మించలేదు. ఆమె పేరేమి? సీత. సీత అంటే భూమి. దున్నుతుంటే, మన్ను నాగటి చాలు వల్ల ఈ పక్కకు, ఆ పక్కకు వెళుతుంది. ఆ నాగటి చాలునుంచి పుట్టింది సీత నాగటి చాలునుంచి పుట్టింది కనుక ఆమెకు ఆమె తండ్రి ఏమి పేరు పెట్టాడు? నాగటి చాలు . అనే పేరు పెట్టుకున్నాడు, జనకుడు. నాగటి చాలు అని మనం తెలుగులో అంటాం. కానీ, సంస్కృతంలో సీత అంటారు. సీత అంటే నాగటి చాలు అని అర్థం. సీత అని ఆమెకు పేరు పెట్టాడు, జనకుడు. అంటే అర్థమేమి? క్షేత్రంలో దాగి ఉండి, క్షేత్రమును జ్ఞానమనే నాగలిచేత దున్నితే, వెలుపలికి వచ్చి, దర్శనం ఇచ్చే తల్లి, సీత. అదే మన ఆత్మ. ఇది రావణ నీత. ఎక్కడ నుండి? తతః ౼పరమాత్మ నుండి. తతో రావణనీతాయాః సీతాయాః, ఆమె యొక్క, "పదం అన్వేష్టుమ్"౼ ఆమె ఉండే జాడను కనిపెట్టడానికి, వెతకడానికి బయలుదేరాడు. ఎవడు? శత్రుకర్శనః. ఎవడు వెళ్లాలి? ఎవడికంటేవాడికి కంటికి కనిపించదు శత్రుకర్శనుడే వెళ్ళాలి. ఎవడు శత్రుకర్శనుడు. మన హనుమ.
వైద్యంవారి సౌజన్యంతో
సాహితీమిత్రులారా!
పద్యంలోని ఏ రెండుపాదాలు సమానంగా ఉన్నా దాన్ని ద్విపాది అంటారు
రెండు పాదాలు ఒకేలా ఉన్నా అర్థం మాత్రం ఒకేలా ఉండదు. అలాంటిది
ఒకటి కాశీపత్యవధానిగారి ద్విపాది గమనించండి-
రాజిత నగాగ్రమున విహారంబు సల్పు
నీలకంఠా తిశయము రాణిలుట కంటె
రాజిత నగాగ్రమున విహారంబు సల్పు
నీలకంఠా తిశయము రాణిలుట కంటె
ప్రకాశించే పర్వత శిఖరాగ్రాన వేడుకగా తిరిగే ఈశ్వరుని గొప్పతనం
కంటె అని ఒకటి,రెండు పాదాల అర్థం.
విరాజిల్లుచున్న చెట్టు చివర సంచరించే నెమళ్ళఅతిశయం చూశావా?
అని మూడు,నాలుగు పాదాల అర్థం.ఈశ్వరుని కంటె కూడా నెమళ్ళు ఒప్పారుచున్నవి
అని వర్ణించిన భావం ఎంతో రమణీయంగా వుంది కదా!
సాహితీమిత్రులారా!
ఒక పద్యం లేక శ్లోకంలో అన్ని పాదాలు ఒకటిగా ఉంటే
దాన్ని ఏకపాది అంటారు.
ఇందులోని నాలుగు పాదాలూ ఒకే విధంగా ఉంటాయి
కానీ అర్థాలు మాత్రం వేరుగా ఉంటుంది.
కాశీపత్యవధానులు వారి హరిశ్చంద్రోపాఖ్యానము -
ద్వితీయాశ్వాసము -59 వ పద్యం ఏకపాది గమనించండి-
ఉత్సాహా వృత్తము -
నాడు దాని గాననేర నా తుటారి జోడుగా
నాడుదాని గాననేర నా తుటారి జోడుగా
నాడుదాని గాననేర నా తుటారి జోడుగా
నాడు దాని గాననేర నా తుటారి జోడుగా
నాఁడు దాని గాన నేరనా?=పూర్వము దీన్ని ఎప్పుడూ చూడలేక పోయానా? అని ఆశ్చర్యం వెల్లడించడం ఒక అర్థం.
ఈ ప్రదేశం లో ఉంటున్నప్పటికీ తెలుసుకో లేక పోతినే అని తెలివితక్కువ తనాన్ని వెల్లడించడము.
రెండవ అర్థము.
కాననేరన్ +ఆ +తుటారి
జోడుగా నాఁడు దాని విడదీస్తే కాన నేరను అని మొదటి అర్థానికి చెల్లగా ఆ తుటారి అని ముందు పదానికి అన్వయించడానికి వీలు వుంది.
అప్పుడు ఆ గడుసు దానితో
సమానంగా ఆడేదాన్నికాన నేరను అని అన్వయం కుదురుతుంది
సాహితీమిత్రులారా!
వ్యాఖ్యానము లేని తెలుగుకావ్యాల సూచిక
పండితులైనవారు పరిశీలించి వ్యాఖ్యలు ఉంటె తెలుపగలరు
1. సమీరకుమార విజయము - పుష్పగిరి తిమ్మన
2.శిశుపాల వధ - (ఆంధ్ర మాఘము) - గోపీనాథం వెంకటకవి
3.అనిరుద్ధ చరిత్రము - కనుపర్తి అబ్బయామాత్యుడు
4.తారా శశాంక విజయము - శేషము వెంకటపతి
5.వైజయంతీ విలాసము - సారంగు తమ్మయ కవి
6.అహల్యా సంక్రందనము - సముఖము వేంకట కృష్ణప్ప నాయకుడు
7.బిల్హణీయము - చిత్రకవి సింగరాచార్యులు
8.శృంగార శాకుంతలము - పిల్లలమర్రి పిన వీరభద్ర కవి
9.శశిరేఖా పరిణయము - అప్పప్ప కవి
10.హంసవింశతి - అయ్యలరాజు నారాయణామాత్యుడు
11.దశకుమార చరిత్రము - కేతన
12.మార్కండేయ పురాణము - మారన
13.చిత్ర భారతము - చరిగొండ ధర్మన్న
14.ముకుంద విలాసము- కాణాదం పెద్దన సోమయాజి
15.ఉషా పరిణయము- రంగాజమ్మ
16.సత్యభామా సాంత్వనము - లింగనముఖి కామేశ్వర కవి
17.సింహాసనద్వాత్రింశిక - కొరవి గోపరాజు
18.భోజరాజీయము - అనంతామాత్యుడు
19.శుకసప్తతి - పాలవేకరి కదిరీపతి
20.రాజవాహన విజయము - కాకమాని మూర్తి కవి
21.ధనాభిరామము - నూతన కవి సూరన
22.బసవ పురాణము - పాల్కురికి సోమనాథుడు
23.పండితారాధ్య చరిత్రము - పాల్కురికి సోమనాథుడు
24.దశరధరాజ నందన చరిత్ర ( నిరోష్ఠ్య రామాయణము)
25.భాస్కర రామాయణము - హుళక్కి భాస్కరుడు
26.నవనాథ చరిత్ర - గౌరన
27. సుదక్షిణా పరిణయము - తెనాలి అన్నయ కవి
28.కువలయాశ్వ చరిత్రము - సవరము చిన నారాయణ నాయకుడు
29.తపతీ సంవరణోపాఖ్యానము - అద్దంకి గంగాధర కవి
30.మృత్యుంజయ విలాసము - గోగులపాటి కూర్మనాథ కవి
31. రాజశేఖర విలాసము- కూచిమంచి తిమ్మ కవి
32. శివలీలా విలాసము - కూచిమంచి తిమ్మ కవి
33. చంద్రరేఖా విలాపము - కూచిమంచి జగ్గ కవి
34. అష్ట మహిషీ కళ్యాణము - తాళ్ళపాక తిరువేంగళ నాథుడు
35. ఇందుమతీ పరిణయము - కుమార ధూర్జటి
36. కకుత్థ్స విజయము - మట్ల అనంత భూపాలుడు
37.చంద్రభాను చరిత్రము - తరిగొప్పుల మల్లన మంత్రి
38.తాలాంక నందినీ పరిణయము - మరింగంటి సింగరాచార్యులు
39. నాసికేతూపాఖ్యానము - దగ్గుపల్లి దుగ్గ కవి
40.పాంచాలీ పరిణయము - కాకమాని మూర్తి కవి
41.ప్రబోధ చంద్రోదయము - నంది మల్లన, ఘంట సింగన
42.రాఘవ పాండవ యాదవీయము - అయ్యగారి వీరభద్ర కవి
43.రుక్మిణీ పరిణయము - కూచిమంచి తిమ్మ కవి
44. వల్లవీ పల్లవోల్లాసము - మాడభూషి నరసింహాచార్యులు
45. వాల్మీకి చరిత్రము - రఘునాథ భూపాలుడు
46. విష్ణుమాయా విలాసము - రోసనూరి వేంకట పతి
47. శ్రీ రంగ మహాత్మ్యము - భైరవ కవి
48. సుభద్రా పరిణయము - కూచిమంచి జగ్గ కవి
49. హరిశ్చంద్రోపాఖ్యానము - శంకర కవి
50. శకుంతలా పరిణయము - కృష్ణ కవి
51. విక్రమార్క చరిత్రము - జక్కన కవి
52. రుక్మాంగద చరిత్రము - ప్రౌఢ కవి మల్లనార్యుడు
53. రాధామాధవ సంవాదము - వెలిదండ్ల వేంకట పతి
54. మైరావణ చరిత్రము - మాదయ కవి
55. కృష్ణాభ్యుదయము - మండపాక పార్వతీశ్వర కవి
56. కాళింది కన్యా పరిణయము - అహోబల పండితుడు
57.ఉద్భటారాధ్య చరిత్రము - తెనాలి రామకృష్ణ కవి.
58. కృష్ణ రాయ విజయము - కుమార ధూర్జటి
59. పద్మ పురాణము - మడికి సింగన
60.తారక బ్రహ్మ రాజము - రాధామాధవ కవి.
61.వల్లభాభ్యుదయము - కోదండరామ కవి.
62. జానకీ రాఘవము - బేతపూడి కృష్ణయ్య
63.ప్రబంధరాజవేంకటేశ్వరవిజయవిలాసము,గణపవరపు వేంకటకవి
సాహితీమిత్రులారా!
కాశీపత్యవధానులవారి చ్యుతచిత్రం
చ్యుతం అంటె జారినది లేదా తీసివేయబడినది
చ్యుతాక్షరం అంటె తీసివేయబడిన అక్షరం
గమనించండి-
ఇది సారంగధరీయం ద్వితీయాశ్వాసం 41 పద్యం
కుధర సమా కృతి లాభ
మ్మధికముగా గొనె గుచద్వయం బొండొండా
కుధ ముఖ లిపులు సనినగ
ట్యధర దృగం గోక్తి నాసికాస్య నఖముల్
కుధర సమాకృతి లాభము = పర్వతమునకు సమానమైన ఆకృతిని,(కుచములు)
ధర సమాకృతీ లాభము=భూమికి సమానమైన ఆకృతి (పిరుదులు)
రసమాకృతి లాభము=అమృత సంపదవంటి రూప ప్రాప్తిని (ఆధరము )
సమాకృతి లాభము= ఎగుడు దిగుడుగాని రూప ప్రాప్తిని (దృక్కులు)
మాకృతి లాభము=లక్ష్మీదేవి వంటి ఆకార ప్రాప్తిని,(అంగములు)
కృతి లాభము=కావ్యరచనా రూపాన్ని అంటే చమత్కారాన్ని(ఉక్తులు)
తి =నువ్వుపువ్వు వంటి దీప్తిని (నాసిక)
లాభము= చంద్రుని (లః) వంటి కాంతిని (అస్యము)
భము =నక్షత్రాతిశయమును (నఖములు)
'కుధర సమాకృతి లాభము' అనే దానిలో ఒక్కొక్క అక్షరాన్ని తీసి వేస్తూ పోతే
అవి వరుసగా -
కటి,
ఆధరము,
దృక్కులు,
శరీరం,
ఉక్తి,
నాసిక,
ఆస్యము,
నఖములు
అనే వాటితో సరిపోతాయని దీని అర్థం.
సాహితీమిత్రులారా!
What if you had to write something but you were not allowed to use a certain letter? That would be quite a challenge, right? Well, some writers have challenged themselves to write entire books which completely leave out a particular letter. Writing like this, prose or poetry, which deliberately leaves out one or more letters is called a lipogram. Of course, it doesn’t have to be as long as an entire book. It could be a short poem, a paragraph or a sentence. If you want to discover some great examples of lipograms, keep watching.
సాహితీమిత్రులారా!
'E' is the most common letter in the English language. In fact, in the previous sentence it appeared seven time in just 10 words.
That's what made Gadsby, so remarkable; a 50,000 word novel that doesn't use the letter 'E' at all. In this video I explore this type of writing, and take the challenge of putting together a (hopefully) coherent video with the same limitation.
with the courtesy of Julian O'Shea
సాహితీమిత్రులారా!
సత్యదూరం కాదు. ప్రస్తుతం అలాటి రచనలలో చిత్రకావ్యాలను నామమాత్రంగ స్మరిద్దాం-
శ్రీ మద్వాల్మీకి రామాయణం యుద్ధకాండలో-----
శ్లో.మండలాని విచిత్రణి స్థానానివివిధానిచ,
గోమూత్రికాదిచిత్రాణి గతప్రత్యాగతాని చ.
- వా.రా.యుద్ధకాం,౪౦-౨౮
అనే శ్లోకంలో గోమూత్రికాబంధచిత్రవిశే షంవలె సైన్యం యుద్ధం చేసినారని
కొందరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.
వివిధకవిపండితులురామాయణాన్ని
సంస్కృతంలో చిత్రకవనంలో రచించి నారు. ఆ పేర్లు ----
కవిపేరు చిత్రరచనపేరు
వేంకటేశ్వర --రామయమకార్ణవః
వేంకటేశ --రామచంద్రోదయం
గోపాలార్య --రామచంద్రోదయం
కృష్ణమోహన --రామలీలామృతం
శ్రీకాంత --రఘూదయం
చిదంబరకవి -శబ్దార్థచింతామణిః
వేంకటాధ్వరి --రాఘవయాదవీయం
దైవజ్ఞసూరి --రామకృష్ణవిలోమకావ్యం
శ్రీకాంత --రఘూదయం
నారాణభట్ట --నిరనునాసికచమ్పూః
మల్లికార్జున --నిరోష్ఠ్యరామాయణం
వేంకటార్య--శ్లేషచమ్పూరామాయణ
ధనంజయ-రాఘవయాదవపాణ్డవీయ
చిదమ్బరకవి -పంచకల్యాణచమ్పూః
సన్ధ్యాకరనన్దినః --రామచరితం
సన్ధ్యాకరనన్దినః - రాఘవయాదవపాణ్డవీయం
వేంకటాచార్య-శ్లేషచమ్పూరామాయణ
వేంకటేశ్వర-- చిత్రబన్ధరామాయణం
వేంకటాచార్య-కంకణబన్ధరామాయణ
కృష్ణకవి --క్రియాగోపనరామాయణం
కృష్ణరాయ --ఆర్యాలంకారశతకం
వీరరాఘవ --విశేషణరామాయణం
రామభద్ర --రామస్తవప్రాసః
నిట్టలఉపమాక}
వేంకటేశ్వర } -రామాయణసంగ్రహః
భాస్కరసూరి. --సీతారామీయం
సుబ్రహ్మణ్యసూరి --రామావతారః
సుబ్రహ్మణ్యసూరి --సీతాకల్యాణం
సుబ్రహ్మణ్యసూరి - రామాయణడోలగీత
సుబ్రహ్మణ్యసూరి - ఆసేచనకరామాయణం
వేంకటేశవామన --రామచన్ద్రోదయం
ముడుమ్బై వేంకట }రామచన్ద్ర-
రామనరసింహాచార్య} కథామృతం
డా.కే.ఎస్.రామానుజాచార్య--శ్రీరామబాణస్తవః
ఇవి సంస్కృతంలో ప్రసిద్ధమైనవి.
తెలుగుచిత్రకవనం-రామాయణం:
దశరథరాజనందనచరిత్ర(నిరోష్ఠ్యం)-- మరింగంటిసింగరాచార్య
శుద్ధాన్ధ్రనిరోష్ఠ్యసీతాకల్యాణం--మరింగంటి సింగరాచార్యులు
నిరోష్ఠ్యసీతాకల్యాణం --పిడుపర్తి బసప్ప
నిరోష్ఠ్యరామాయణం--సురపురంకేశవయ్య
నిరోష్ఠ్యజానకీకల్యాణం--పోడూరి రామన
శివరామాభ్యుదయద్వ్యర్థికావ్యం-- పోడూరి పెదరామామాత్య
నిరోష్ఠ్యదాశరథిశతకం--మండపాక పేరయకవి
నిరోష్ఠ్యదశరథతనయశతకం--వేదుల నారాయణకవి
అచ్ఛాంధ్రనిరోష్ఠ్యనిర్గద్యదాశరథిచరిత్ర -- హనుమంతరాయశర్మ
నిర్వచనభారతగర్భరామాయణం-- రావిపాటిలక్ష్మీనారాయణ
గాదె పాపరాజు - చతుర్ముఖ రామాయణం
నాదెళ్ల పురుషోత్తమకవి - చతుర్ముఖ కంద రామాయణం
మొదలయినవి ప్రసిద్ధమైనవి
వైద్యంవేంకటేశ్వరాచార్యులవారి సౌజన్యంతో
సాహితీమిత్రులారా!
కందపద్యంలోనే ద్విపద గుప్తంగ ఉండే రచనను ద్విపదకందగుప్తం
అంటారు.అంటే కందపద్యం ద్విపద లక్షణంకూడ కలిగిఉంటుంది.
ఈ కింది కంద ద్విపద గణాది
లక్షణాలను నిశితంగ పరిశీలిస్తే ద్విపద
కందగుప్త రచనలో ఉండే కిటుకు తెలుస్తుంది.
క.కలువలదొర మానికముల
దళంపు తలపుల నెపుడును-దగలోగొనగన్
గల తరగల పాలకడలి
చెలంగు చెలువుని నిను గొలి-చెద లోకమునన్.
పై కందంలో గుప్తమైన
ద్విపద:
కలువలదొరమాని-కములదళంపు
తళుకులనెపుడును-దగ లో గొనగను
గల తరగల పాల-కడలి చెలంగు
చెలువుని నిను గొలి-చెదలోకమునన
పై పద్యం గణపవరం వేంకటకవి
రచించిన "ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసం"(143)లో ఉంది.
వైద్యంవేంకటేశ్వరాచార్యులు గారికి ధన్యవాదాలు
సాహితీమిత్రులారా!
ఒక సాహితీమిత్రునికి శ్రీనాథ మహాకవి అంటే వీరాభిమానం.
నాకేమో బమ్మెరపోతన అంటే భక్తి, అభిమానం.
అతడొకపర్యాయం నాతో ఇలా అన్నాడు-
మరుశాపంకాశీ, ధనంపహశిక్రీడా, శృంగారభీమ. - అంటే ఏమిటీ అని అడిగినాడు.
ఇదేదో సాంకేతికాక్షర సముదాయంలా ఉంది అన్నాను.
కరెక్ట్ రూట్ లోనేఉన్నావ్,ప్రయత్నించు
అన్నా డతడు.
నాకు స్ఫురించలేదు.
అతడు ఇలా చెప్పినాడు--
'మరు' - మరుత్తరాట్చరిత్ర
'శా' - శాలివాహనసప్తశతి
'పం' - పండితారాధ్యచరిత్ర
'కాశీ' - కాశీఖండం
'ధ' - ధనంజయవిజయం
'నం' - నందనందనచరిత్ర
'ప' - పల్నాటి వీరచరిత్ర
'హ' -హరవిలాసం
'శి' - శివరాత్రి మాహాత్మ్యం
'క్రీడా' - క్రీడాభిరామం
'శృంగార' - శృంగారనైషధం
'భీమ' - భీమఖండం
ఇంతేనా! ఇంకాకొంచెం ఆలోచించి
ఉంటే తప్పక గుర్తించేవాణ్ణి, అంటూ నేను *భోవీనామ* అంటే ఏమిటీ!
అన్నాను,ఇదేదో రాజీనామా మాదిర ఉంది అంటూ నవ్వులు రువ్వినాడు.
ఒరేయ్ నీ బాటలోనే నడిచినాను,
నీవు చెప్పినదే నిన్ను మార్పుచేసి అడుగుతున్నాను.
మా మహాకవి బమ్మెరపోతన గ్రంథాల
పేర్లు అంటూ---
భో ---భోగినీదండకం
వీ ---వీరభద్రవిజయం
నా---నారాయణశతకం
మ---మహాభాగవతం
అన్నాను.
ఇద్దరం నవ్వుకున్నాం.
జరిగిన సంఘటన
వైద్యం వారి సౌజన్యంతో
సాహితీమిత్రులారా!
కవిసింహ పోకూరి కాశీపతి
జననం:ఫిబ్రవరి-1893,బోదెలవీడు,పల్నాడుతా.
కీ.శే:తే27-12-1974, మాచర్ల
ప్రథమ అష్టావధానం:నరసరావుపేట1916
అనేక అవధానాలు వివిధప్రాంతాలలో.
నరసరావుపేట,ఉయ్యూరు,గద్వాల
రచనలు:అరవై చేసినట్లు తెలుస్తోంది.
లభ్యరచనలు:
1.నిరోష్ఠ్య నిర్వచన శుద్దాంంధ్రహరిశ్చంద్రోపాఖ్యానం
2.సారంగధరీయం-త్య్రర్థికావ్యం
3.సిద్ధయోగి చరిత్ర
4.శౌరిశైశవలీల , పంచవర్గాక్షర రహిత రచన
5.అలివేలుమంగా వేంకటేశ్వరసంవాదం
6.వీరతిమ్మమాంబచరిత్రం
7.సుజ్ఞానప్రబోధిని
8.సునీతిశతకం
9.కేశవేంద్రశతకం
10.మన్నెముకొండవేంకటేశ్వరశతకం(ఏకప్రాస)
11.హనుమత్ప్రభుశతకం(హలహర్వి హనుమంత రెడ్డిని గురించినశతకం)
12.నారసింహప్రభుశతకం
13.శ్రీమల్లేశ్వరశతకం
14.నరసింహనిరసనస్తుతి
15.సత్యనారాయణ వ్రతకల్పం
16.త్రింశదర్థపద్యరత్నం
17.కాశీపతి చమత్కృతి
18.వివిధ సందర్భాలలో చెప్పిన చాటుపద్యరత్నాలు
19.కాఫీదండకం (ఆశువు)
మిగత రచనలనుగురించి అన్వేషణ చేయవలసిఉంది.
బిరుదాలు:
కవిసింహ, కవిజటిల, కవిశోరోమణి, కవితాప్రవీణ,
ఆశువికోకిల, ఆశుకవిపుంగవ, కవిశిఖామణి, అవధానప్రవీణ,
చిత్రకవిత్వపంచానన, కళాపరిపూర్ణ, మహాకవిశేఖర
సన్మానాదులు:
కనకాభిషేకం గండపెండేరసన్మానం
గజారోహణం రథోత్సవం
స్వర్ణకంకణప్రదానాలు
ద్రవ్యబహూకరణలు
రాష్ట్రపతి డా.రాధాకృష్ణన్ చే సన్మానం
వీరినిగురించి కొంత పరిశోధన జరిగింది.
విద్వద్గద్వాలసంస్థానకవివర్యులుగా
ఉండినారు.మరెన్నో సంస్థానాలలో
సదస్సులలో స్వీయ కవితా ప్రదర్శనంచేసి సత్కారాలు పొందినారు
ఇంకా ఎంతో పరిశోధనజరుగవలసిఉంది
కవిసింహగారి రచనలన్నీ విడివిడిగానూ,
ఒకే బృహత్సంపుటంగాను ప్రచురితం కావలసి ఉంది.
దీనికోసం ఎవరైన కంకణబద్ధులై కార్యోన్ముఖులుకావలసి ఉంది
రచన:వైద్యంవేంకటేశ్వరాచార్యులు
సాహితీమిత్రులారా!
వారికి అంకిత మిచ్చినాడు. నందితిమ్మన ముక్కును గురించి ఒక
పద్యాన్ని రచించినందుకు ఆయనకు ముక్కుతిమ్మనఅనే వ్యవహారం కలిగిందని
అంటారు.ముక్కును గురించిన ఆ పద్యాన్నితిమ్మనదగ్గర రామరాజభూషణుడు కొంత
ద్రవ్యంఇచ్చి కొని తన వసుచరిత్రయందుఉపయోగించుకున్నా డంటారు.ఆ పద్యం---
నానాసూనవితానవాసనల నా-నందించు సారంగ మే
లా నన్నొల్లదటంచు గంధఫలి బ-ల్కాకం దపంబంది యో
షా నాసాకృతి దాల్చి సర్వసుమన-స్సౌరభ్య సంవాసియై
పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ - పుంజంబులిర్వంకలన్.
పద్యం రామరాజభూషణకృతమే,ఐతే
కొన్ని అపప్రచారాలు ఇలా ప్రచారమౌ తుంటాయి.
అయితే----
ఈ పద్యానికిమూలమనదగినశ్లోకం పద్నాలుగవశతాబ్దంలోని
అగస్త్యుని 'నలకీర్తికౌముది' అనే కావ్యంలో ఉంది.
ఆ శ్లోకం-----
"భృంగా నవాప్తి ప్రతిపన్న భేదా
కృత్వా వనే గంధఫలీ తపోలం,
తన్నాసికాభః దనుభూత గంధా
స్వపార్శ్వ నేత్రీ కృత భృంగ సేవ్యా"
వైద్యంవేంకటేశ్వరాచార్యులుగారి సౌజన్యంతో
సాహితీమిత్రులారా!
తెలుగువెలుగులో రామన మాస్టర్, బెంగుళూరు వారు కూర్చిన
గీతకందగర్భ ఉత్పలమాల గమనించండి-
ఉ. మా తెలుగే కదా వరము మాకిల తీయని భాషయన్న, యీ
మా తెలుగే సదా పలుకు మాటల తేనెల పాలవెల్లి కా
గా,తెలుగందు మా ఘనత కైతల కన్నియ కాంతులెన్నొ, తా
నే తలపై యికన్ తెలుగు నేలల మానుడి తేజరిల్లునే
ఈ ఉత్పలమాలనుండి ఒక తేటగీతిని విడదీస్తే.
మా తెలుగే కదా వరము మాకిల తీయని భాషయన్న, యీ
మా తెలుగే సదా పలుకు మాటల తేనెల పాలవెల్లి కా
గా,తెలుగందు మా ఘనత కైతల కన్నియ కాంతులెన్నొ, తా
నే తలపై యికన్ తెలుగు నేలల మానుడి తేజరిల్లునే
తే. వరము మాకిల తీయని భాష యన్న
పలుకు మాటలు తేనెల పాలవెల్లి
ఘనత కైతల కన్నియ కాంతులెన్నొ
తెలుగు నేలల మానుడి తేజరిల్లు
ఆ ఉత్పలమాలలో ఒక కందము కూడా దాగుంది
మా తెలుగే కదా వరము మాకిల తీయని భాషయన్న, యీ
మా తెలుగే సదా పలుకు మాటల తేనెల పాలవెల్లి కా
గా,తెలుగందు మా ఘనత కైతల కన్నియ కాంతులెన్నొ, తా
నే తలపై యికన్ తెలుగు నేలల మానుడి తేజరిల్లునే.
కం. తెలుగే కదా వరము మా
కిల తీయని భాషయన్న యీ మా తెలుగే
తెలుగందు మా ఘనత కై
తల కన్నియ కాంతులెన్నొ తానె తలపై
సాహితీమిత్రులారా!
గణపవరపు వేంకటకవి కృత
శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము
లోని షడర చక్రబంధం ఇది -
శార్దూలవిక్రీడితవృత్తం
సత్యాకల్పక ప్రస్ఫుటా శరభిదాచారా విశంక క్రమా
మత్యావిష్కృత బంధురాదరణ భూమాజన్తు కూటాశ్రితా
దిత్యావేంధన ధర్మసారతరమూర్తీముత్కరాద్రిక్షమా
మాత్యుల్లాసపదా మహావిదితధామా సాధుతారక్షమా-861
అర్థం:-
సత్యాకల్పక=సత్యభామపాలిటి కల్పవృక్షమా!(సత్యకు పారిజాతకల్పవృక్షాన్ని తెచ్చిఇచ్చిన కల్పవృక్షం), శరభిదాచార=బాణాలతో భేదిల్లజేయడం అనే విద్యలో, విశంకక్రమా=నిశ్శంకం,నిరాటంకంఅయిన పరాక్రమం/విజృంభణం కలిగినవాడా!,మతి+ఆవిష్కృత=అంతరంగం(మది)లోఆవిష్కృతం అయినవాడా!, బంధురాదరణభూమా=అపారంగా ఆదరించేబుద్ధి కలవాడా!, జంతుకూట+ఆశ్రిత=ప్రాణి(పశు)సమూహంచేత ఆశ్రయించబడినవాడా!, దిత్యావేంధన=దితి కుమారులయిన రాక్షసదుర్మార్గులను అగ్నిలా దహించేవాడా!, ధర్మ సార రత మూర్తీ=వేదధర్మంపట్లగాఢాభినివేశంకలవాడా (ధర్మస్వరూపా!), ముత్+కర=ఆనందదాయకమూ,అద్రి=పర్వతంలా నిశ్చలమూఐన,క్షమా=తాలిమికలవాడా!,మా=లక్ష్మీదేవికి, అత్యుల్లాస=బాగా ఉల్లాసం కలిగించేవాడా, మహావిదిత=బాగ గొప్పగా ప్రసిద్ధికెక్కినవాడా!, ధామా=నివాసం/కాంతికలవాడా!(శ్రీహరిధామంగాతిరుమల సుప్రసిద్ధం), సాధుతారక్షమా=సజ్జనులను తరింపచేయడంలో సమర్థుడా!
భావం:-
సత్యభామపాలిటికల్పవృక్షమా!బాణవిద్యలో ఆరితేరినవాడా! తలచేవారి మదిలో మెదిలేవాడా!అపారదయామయా!ప్రాణులచేత ఆశ్రయించబడినవాడా!దుష్టంలయిన రాక్షసులను దహించేవాడా!ధర్మస్వరూపా!ఆనంద దాయకా! కొండన్నా! సిరికి ఉల్లాసం కలిగించేవాడా!సంప్రసిద్ధమైన తిరుమలవాసా! సజ్జన సంరక్షకా!
*విశేషాలు:-* నరశార్దూలస్మరణశార్దూలవృత్తంలోచేయడం సముచితం.చక్రధారిస్తుతి షడరచక్రబంధంలోచేయడం బాగు.
ఈ బంధచిత్రంలో వెలుపలనుంచి మూడవవలయంలో- *కవి వేంకటాద్రి అనీ, ఆరవవలయంలో ప్రబంధరాజము*
అనీ కవిపేరూ కావ్యంపేరూ ఉంది.
ఈ పద్యానికి ఇదివరలో అర్థతాత్పర్యాలు లేవు. వేదంవారి సంపాదకత్వ1977ప్రతిలో పద్యం మొదటిపాదంలో ప్రస్ఫుట బదులు 'పస్పుట' అని అచ్చుతప్పు.బంధచిత్రంలో
ఆరవ వలయంలో కావ్యంపేరులోని మొదటి అక్షరం *ప* అని ముద్రితం కావడం సంపాదకుల నిర్లక్ష్యానికి పతాక. మిగతా చోట్ల అచ్చుతప్పులు కొల్లలు.కనీసం కావ్యంపేరైనా
సరిగా పరిశీలించని సంపాదకత్వం. పద్యంలోని మూడవపాదం ప్రారంభంలో *దిత్యావేంధన*
అనే పాఠాన్ని *దిత్యౌఘేంధక* వ్యాకరణ పండితులు సవ రించినారు. అలా సవరించడంవల్ల బంధచిత్రం మూడవ వలయంలో *కవిఘేంకటాద్రి* అని ఏర్పడి కవిపేరుకు
భంగం వాటిల్లుతుంది. అది పరిశీలించక వ్యాకరణపండితులు రసజ్ఞతను వదలి వస్త్రమూల్య విచారణ చేసినారని తెలుపడా నికి బాధగా ఉంది. పద్యంలోని మూడవపాదంలో *జంతు* అనే పదం ఉంది.ఆ పదంలోని *జ* అక్షరంబంధ చిత్రంలో కావ్య నామాన్నిసూచించే ఆరవవలయంలోని *ప్రబంధరాజము* లో *జ* . కనుక జంతు పదాన్ని జన్తు అని రాయడం జరిగింది.
వేంకటాద్రీశా!గోవిందా!గోవింద!
వైద్యంవేంకటేశ్వరాచార్యులు వారి సౌజన్యంత
సాహితీమిత్రులారా!
శ్రీమన్నారాయణుడి సర్వసైన్యాధిపతి విష్వక్సేనులవారు. విష్ణువు ద్వారపాలకులు లో ఒకరైన చండుడు అనే అతడు విష్ణు నియమనాన్ననుసరించి రాక్షస సంహారం చేసి దేవతలను రక్షించాడు. అందుకు మెచ్చిన విష్ణువు అతనికి సర్వసైన్యాధిపత్యాన్ని అనుగ్రహించారు. ఆయనకు నాలుగు చేతుల్లో శంఖం,చక్రం,వేత్రము(బెత్తము) తర్జని ముద్రతో(చూపుడువేలితో బెదిరిస్తూ) వుంటారు. ఆయన భార్యలు సూత్రవతి, జయా, పద్మధరా అని ముగ్గురు చెప్పబడతారు. ఆయన - విష్ణు అవతారాలను సైతం ఎప్పుడు ఎక్కడ ఏకాలానికి జరగాలో నిర్ణయిస్తారని అంటారు. వీరు మహాలక్ష్మి కి ప్రధాన శిష్యులు, నమ్మాழ்వార్ కి ఆచార్యులు. కనుక మనం ఆచార్య పరంపరలో మనకు ఆచార్యులుగా పూజింపబడతారు. వీరికి విష్ణు ఆలయాల్లో జయవిజయులు దాటాక ఉత్తరానికీ ఈశాన్యానికీ మధ్యలో దక్షిణాభిముఖంగా ఒక సన్నిధి ప్రత్యేకంగా వుంటుంది. వీరికి విష్ణు నివేదితమైన పదార్థాన్నే నైవేద్యంగా సమర్పించాలి. వేరేదీ వీరు స్వీకరించరు.
*శ్రీశభుక్తశేషైకభోజనాయ నమః*
అని వీరికి ఒక నామమున్నది. విష్ణు నివేదిత పదార్థంలో నాలుగో వంతు వీరికి నివేదించాలి. వీరి సన్నిధి తిరుమల ఆలయం లో హుండీ పక్కన ఉత్తరద్వారం ప్రాకారం లో చిన్నగా బయటకు కనిపించకుండా వుంటుంది. తిరుచానూరులో లో స్పష్టంగా కనబడుతుంది.
విష్వక్సేనులు నిత్యసూరి. అయినప్పటికీ వారు భూమిపై అవతరించినప్పుడు సువర్చలా వరుణుల సంతానంగా తులామాసం, శుక్లపక్షంలో పూర్వాషాఢానక్షత్రంలో అవతరించారు.
2. *కుంతల* అనే అప్సరస, దూర్వాసుడి శాపం వలన కిరాత జన్మ పొందింది. ఆమెను వీరబాహువనేవాడు వివాహం చేసుకున్నాడు. వారి కుమార్తె *సువర్చల* అనే కన్య.
ఆమెను *వరుణుడు* వివాహమాడాడు. వారి సంతానమే
*విష్వక్సేనుడు* --
ఆవిధంగా భూమిపై అవతరించారు విష్వక్సేనుడు. ఆయన తిరుమల పై విష్వక్సేన తీర్థం వద్ద తపస్సు చేసి శ్రీనివాసుని అనుగ్రహం తో వారికి సైన్యాధిపతి అయినారు.
*సువర్చలాసుతన్యస్త సేనాపత్య ప్రదాయనమః*
అని శ్రీనివాసునికి అష్టోత్తరశత నామస్తోత్రంలో ఒక పేరున్నది. అలాగే వేంకటేశ సహస్రనామం లో
*సౌవర్చలేయవిన్యస్త రాజ్యకః*
అని ఇంకొక నామం వున్నది. ఇది అవతారం విశేషం.
3. *కుముదాక్షుడు* అనేవాడు విష్ణుగణాధ్యక్షులలో ఒకడు. అతనికి సింహాద సంహారం సమయంలో సైన్యాధిపత్యాన్నిచ్చి అతని ద్వారా సింహాదుని సంహరించారు శ్రీనివాసుడు. అందుచేత *కుముదాక్షగణశ్రేష్ట సేనాపత్య ప్రదాత* అనే నామం శ్రీనివాసునికి కలిగింది.:
*🌟తిరునక్షత్ర తనియన్:*
*తులాయాం గతే దినకరే పూర్వాషాఢా సముద్భవమ్ |*
*పద్మా పదాంబుజాసక్త చిత్తం విష్వక్సేనం తమాశ్రయే||*
*🌅నిత్యం తనియన్ 😘
*శ్రీరంగచంద్రమస మిందిరయా విహర్తుం విన్యస్యవిశ్వచిదచిన్నయనాధికారమ్ |*
*యోనిర్వహత్య మనిశ మంగుళిముద్రయైవ*
*సేనాన్యమన్య విముఖః తమిహాశ్రయామహ||*
శ్రీరంగనాథుని శ్రీరంగనాయకితోపాటుగా దేవనందనోద్యానమునందు యువరాజువలే విహరించుటకు వీలు కల్పించి లోకముల ఆలనాపాలనలు అత్యంత అద్భుతముగా శ్రీరంగనాథుని ముఖోల్లాసార్థమై నిర్వహించు విష్వక్సేనుడను విష్ణుసైన్యాధిపతిని అన్యులనాశ్రయింపనివాడనై సేవింతును.
(R P ఆచార్యుల వారు అనుగ్రహించిన విషయం)
వైద్యం వేంకటెశ్వరాచార్యులవారి సౌజన్యంతో
సాహితీమిత్రులారా!
సందేహాలెన్నో(10.1723) ఆమె మనసును తుమ్మెదల గుంపులాముసురుకున్నాయి.
ఆమెకు దైవచింతనకూడా మొదలయింది(10.1724).ఆ తర్వాత
పద్యపంచకం(10.1726నుండి1729,1731)లో వితర్క విషాదౌత్సుక్య దైన్య త్రాసాది భావాలు
అయోగ విప్రలంబ శృంగార రస పుష్టికి దోహదించాయి.ఆమె మనస్సా గరం
అల్లకల్లోలమయింది.ఆ విషాదంలో జాగరం అరతి అన్నీ
శ్రీకృష్ణ నిరీక్షణానికే లక్షింపబడినాయి.కందర్ప పరీకల్పితో
ద్వేగ జన్యమైన చింతా విశ్వాస దైన్య స్తంభాది భావాలతో
రుక్మిణి విరహతప్త(10.1727)అయింది.ఈ మనః కంపం
వల్లనే ఆమెకు అశ్రుపాతం కృశతాదులు కలిగాయి.
అందు వల్లనే పరితప్త హృదయంతో ఆమె సర్వశృంగార కళల్నీ
పరిత్యజించింది. ఎడబాటును సహించలేక ఆమె చలించి
పోయింది.సుకుమారంగా ,మెల్లగా వీస్తున్న చల్లగాలికి ఆమె
దూరంగా తొలగిపోయింది.మత్తెక్కిన తుమ్మెదలు ఝంకా
రాలతో తిరుగుతూ ఉంటే,పక్కకు వెళ్లిపోయింది.కోయిల
కూతకు కోపగించుకుంటుంది.రామచిలుకలనుంచి ముద్దు
మాటలు పుట్టుకొస్తూంటే మదనవేదనతో ఉలికి పడింది. వెన్నెల వేడికి
అలసిపోతుంది.చిరుమామిడికొమ్మల లేత నీడలకు దూరంగా పోతుంది.
ఇలా సర్వజన సంతోష సంధాయకాలైన ప్రకృతి ప్రణయగీతాలూ ప్రకృతిగత రసరమ్య దృశ్యాలూ అన్నీ
రసానంద దాయకాలయినాయి.అయోగ శృంగార పుష్టికి
పోతన చేసిన రసవత్కల్పనం రుక్మిణీ విరహవర్ణనం.
రుక్మిణీ ప్రథమ వీక్షణంలోని శ్రీకృష్ణ సౌందర్య వర్ణనంవల్ల
అయోగశృంగారం సంభోగశృంగారంగా ధ్వన్యమాన మయింది
మూలంలో *దదృశేచ్యుతం* (10.53-55)అనే వాక్య లేశం పోతన అనువాదంలో పూర్తిగా
ఈ కింది రసరమ్య పద్యంగా వృద్ధిచెంది విభావముఖంగా శృంగార రస సూచితం
కావటం పరమౌచిత్యం-
కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్ కంఠీరవేంద్రావ ల
గ్ను నవాంభోజ దళాక్షు జారుతర వక్షున్ మేఘ సంకాశ దే
హు నగారాతి గజేంద్రహస్త నిభ బాహున్ జక్రి బీతాంబరున్
ఘన భూషాన్వితు గంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్
రుక్మణీ సౌందర్యం విభావంకాగా వీరులైన రాజులు ఏక
పక్షంగా వేగంగా విభ్రాంతులుకావడం అనుభావం.
అది రసాభాసం.వారి విభ్రాంతి మూలంగా
వారు దర్శించిన రుక్మీణీ స్వరూపం స్మరణీయం.
ఆమె వీరమోహిని.వారు విభ్రాంతాత్ములు.
రస నిర్వహణలోని రహస్యాలు ఇలాంటివి
పోతనలో ప్రత్యేకించించి గుర్తించవలసి ఉంటుంది.
ఇలా శృంగార రసోజ్జీవంలో తాండవమాడుతూ రుక్మిణీ
కల్యాణ కథ పోతన్న శృంగార రసనిర్వహణ చాతురికి నికషో
పలమై నిలిచింది.
కల్యాణ హృద్యపద్యం-
ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతో హారిణిన్ మాన వై
భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం
ధవ సత్కారిణి బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్
సువిభూషాంబర ధారిణిన్ గుణవతీచూడామణిన్ రుక్మిణిన్
-భాగవ 10.1784
కమ్మని పద్యాలందించిన బమ్మెరవారి పాదారవిందాలకు వందనాలతో
సమర్పణ-వైద్యంవేంకటేశ్వరాచార్యులు
సాహితీమిత్రులారా!
పంచ పాషాణా లలో ఇది మరొక పద్యం
భండనభీమ నిన్నెదిరి పారక నిల్చిన శాత్రవుల్ బృహ
న్మండలపుండరీక హరి,నాకనివాసులు పారియున్ బృహ
న్మండల పుండరీక హరినాక నివాసులు చచ్చియున్ బృహ
న్మండల పుండరీక హరినాక నివాసులు చిత్ర మెన్నగన్
అర్థము:--భండనభీమ =యుద్ధమునందు శత్రువులకు భయము గలిగించు వాడా!,
నిన్ను,ఎదిరి =ఎదిరించి
పారక=వెన్నిచ్చి పరుగెత్తక, నిల్చిన శాత్రవుల్ =పగవారు
బృహ=గొప్పవైన, మండల =గుండ్రములైన,
పుండరీక=వెల్లగొడుగుల తోడ, హరి=గుఱ్ఱము మీద,
నాక=సుఖముగా, ని-మిగుల వా=తిరుగుటకు
ఆస=స్థానమైన,పారియున్ =పారిపోయియు,
బృహత్ = గొప్ప, మండల=ఒక రకమైన పాములకు,
పుండరీక=పులులకు, నాక =అడవి నేలలందు,
ని=పోయిన, వాసులు =కట్టుబట్టలు గలవారై యుందురు.
చచ్చియున్=చనిపోతే,బృహ=విశాలమైన, మండల=ఎర్రనైన,
పుండరీక=కమలముల వంటి. హరి=సూర్యుని యందు
నాక=వైకుంఠ మందును నివాసులు=ఉండువారు.
ఓ! భండనభీమా!యుద్ధములో నిన్నెదిరించి పరిగెత్తి పోక నిలిచి పోరాడి తాళలేక గుర్రాలమీద పరిగెత్తి పోయి పుట్టగొడుగులు, పాములు,పులులు గల అడవిలో కట్టు బట్టలతో తిరుగుచుందురు.యుద్ధములో చనిపోయిన వారు సూర్యమండలము లేక వైకుంఠమునందు చేరుదురు.ఎలా చనిపోయినా వీరమరణం పొంది స్వర్గలోకాన్ని చేరుతారు.అని భావము
( బృహన్మండల పుండరీక-దగ్గరే నానార్ధకమైన శ్లేష!1అడవులపాలవుతారు 2 పారిపోక యెదిరిస్తే వీరమరణంపొంది సూర్యమండలాన్ని అధిగమించి నాకలోక సుఖాలననుభవిస్తారని భావం! ఇదోగమ్మత్తు!)
సాహితీమిత్రులారా!
క- గుణితక్రమ పద్యం పద్యంలోని పదాలు/సమాసాలు
వరుసగా తలకట్టు, దీర్ఘం, గుడుసు, గుడు సుదీర్ఘం ఇలా
గుణితక్రమంలో రచించడం ఒక చిత్రరచన.
గద్వాల విద్వత్కవి కాణాదం పెద్దన
సోమయాజి అధ్యాత్మరామాయణంలో
చంద్రోదయవర్ణనం " -క- గుణితంలో "
రచించినాడు.
ఆ పద్యం-----
చ.'క'మలవిరోధి, 'కా'మజయ- కారి, 'కి'రద్యుతి, 'కీ'ర్తనీయుడున్
'కు'ముదహితుండు, 'కూ'టమృగ- గోప్త, 'కృ'తాంతుడు, 'క్లు'ప్తసత్కళా
క్రముడును, 'కే'శవేక్షణము- 'కై'రవణీశుడు,'కో'కభేదనా
గమనుడు,'కౌ'ముదీకరుడు,- 'కం'ధిభవుండుదయించెతూర్పునన్
---సుందరకాండ,31పద్యం
వైద్యం వేంకటెశ్వరాచార్యులవారి సౌజన్యంతో
సాహితీమిత్రులారా!
ప్రబంధరాజంలో ముద్రాలంకార చమత్కారవిశేషాలు వివిధ పద్యాలలో
దర్శనమిస్తాయి. ప్రస్తుతార్థాన్ని ఇచ్చే పదంచేత సూచ్యార్థ సూచనం ఉంటే ముద్రాలం కారం.
సూచ్యార్థం అంటే సూచింప దలచిన అర్థం.
1.అర్ణవ దండకం: ప్ర.రా.వేం.వి.విలాసంలో 148వ పద్యం
అర్ణవదండకం.ఈదండకంలో శ్రీవేంకటే శ్వర స్వామివారు
"సంసార ఘోరార్ణవో త్తారణా" అని స్తుతించబడినాడు.
ఈ దండకం పేరు _అర్ణవ_దండకం.దండక భేదం పేరును సూచ్యార్థంగా ప్రయోగిం
చినాడుకవిగారు,కనుక ఇది ముద్రాలంకారం.
2.మత్తేభవిక్రీడిత: జలక్రీడాభివర్ణన సందర్భంగ కవిగారు--
మ.వనజాతాక్షియురోజకుంభములతో వర్తించురోమావళీ
ఘన హస్తస్థితిలో గన న్మకరికల్ ఘర్మాంబులన్ దోcగ జా
ఱిన గస్తూరిమదంబుతోcదళుకుమీ ఱెన్ హార పద్మాభతో
మనముప్పొంగcగడిగ్గెcదత్సరసికిన్ మత్తేభవిక్రీడితన్
మత్తేభవిక్రీడిత పద్యంలో హృద్యంగాసూచ్యార్థం చేయడం ముద్రాలంకారం.
3.వనమయూర:
అబలలకు తలవెంట్రుకలు జారి కటిసీమను కప్పివేసినవి జలకేళిలో
వనమయూరాల వలె తాండవం చేస్తున్నారని ముద్రాలంకారంగా 'వనమయూర' వృత్తంలో వర్ణించినారు కవిగారు, కవిగారు----
వనమయూర వృత్తం:
చండగతి పెన్నెఱులు- జారి కటిసీమన్
మెండుకొని గప్ప కడు- మీఱి జలకేళిన్
దాండవము సల్పెడు వి-ధంబునను నీటై
యుండి రబలల్ వనమయూరముల రీతిన్
4.ఉత్పలమాల:
ఉ.ఏమని యెంచవచ్చుc బ్రస- వేషు శరాసన తాపవేదనన్
వేమఱుcగుందుచో సఖులు-వేగ బ్రఫుల్ల సరోజమాలికా
స్తోమము మేనcదాల్ప నవి- తోడనె కంది విచిత్ర భంగియై
భామ యురోజసీమc గను- పట్టెను నుత్పలమాలికా కృతిన్
భామలపై మన్మథుడు పూల బాణాలు వేసినాడు. అవి సరోజమాలి కలవలె ఆమె మేన ఉన్నాయి. అయితే అవి కందిపోయి "ఉత్పలమాల" ఆకృ కృతిలో కనిపించినవి. ఉత్పలమాలిక
పద్యంలో ఉత్పలమాలాకృతి చెప్పడం సూచ్యార్థం,కనుక ఇదిముద్రాలంకారం.
5.మానినీ
నిబ్బరమైనది నెక్కొను వేదన- నిల్పదలంపుచు నేర్పులచే
నబ్బురమంద రయానకొనర్చిన- వన్నియు నిష్ఫల మౌచును బో
నుబ్బిన కాcకకు నోర్వక ఱెప్పల- బొయ్యన వ్రాల్చుచు నుస్సురనన్
గబ్బి సఖుల్ తటకాపడి మానిని గన్గొని పల్కిరి కర్జముగాన్
ఒక మానిని వేదనను నిల్పుచేయాలని ఆమె సఖులు ప్రయత్నించినారు. ఈ
విషయాన్ని _మానిని_ వృత్తంలో చెప్పడం ముద్రాలంకారం.
6.మత్తకోకిల:
కాంతలు శోభనగాథలను మత్తకోకిల రీతులుగా అందరూ జతగూడి పాడి నారని మత్తకోకిల పద్యంలో చెప్పట
ముద్రాలంకారం.ఆ పద్యం -----
మత్తకోకిల
గానవైఖరినందు కొందరు- కాంత లయ్యెడc జేరి సో
బానయంచొక పాటcబాడగ- బాడినంతనె వింతయై
గానుపింపcగc బూర్వశోభన గాథలెల్లను మీఱcగా
మానినుల్ కవగూడి పాడిరి- మత్తకోకిల రీతులన్
7.ఆటవెలది
వింగళించి"యాటవెలcది" చందంబున
కోపులందుమీఱి యేపుతోన
మిత్రగణములతి విచిత్రతంబై కొన
దైవగణము లెదురcదారసించె.
ఆటవెలది అని పద్యం పేరునుపేర్కొన డమే కాక మిత్రగణాలు,దైవగణాలూ
పేర్కోవడం చిత్రం.
8.భాస్కరవిలసిత :
పంకజదళనిభలోచన- శంకాభావమునిహృదయ- సతతవిహారా
కుంకుమ మృగమద సాంకవ- పంకోరస్థలకృతపద- వననిధి కన్యా
లంకృత మణిగణభూషణ- యం కీకృతమృదుగతిమరు- దసితశరీరా
వేంకటగిరివర రుచ్య క- లంకా భాస్కరవిలసితలగదరి హస్తా
పై పద్యంలోరెండు కందపద్యాలుకూడ గర్భితం.పద్యనామం నాలుగవపాదం
చివరన ఉంది,ముద్రాలంకారం. చమత్కారంగ పద్యనామం కూడ వర్ణిత భావంలో పొదగడం
ముద్రాలంకారం.ఇదొక చిత్రకవితా విశేషంగ కూడ పండితవర్య కథనం.
ప్ర.రా.వేం.వి.విలాసంలో ఎనిమిది ముద్రాలంకారాలు ఉన్నాయి.
వైద్యంవేంకటేశ్వరాచార్యులు సౌజన్యంతో