యజుర్వేదంలోని ప్రశ్నోత్తర చిత్రం-2
సాహితీమిత్రులారా!
చిత్రకవిత్వంలో ప్రశ్నోత్తరచిత్రం ఒకటి
ఇక్కడ యజుర్వేద మంత్రాలలోని
ప్రశ్నోత్తరచిత్రాన్ని చూద్దాం.
ప్రశ్నలు ఒక శ్లోకంలో సమాధానాలు మరో శ్లోకంలో
ఇవ్వబడ్డాయి గమనించండి-
కిం స్మిత్ సూర్య సమం జ్యోతిః?
కిం సముద్రం సమం సరః?
కిం స్మిత్ పృథివ్యై వర్షీయః?
కస్య మాత్రా నవిద్యతే?(యజుర్వేదం 23-47)
ఈ ప్రశ్నలకు సమాధానాలు తరువాతి మంత్రంలో చెప్పబడ్డాయి ఈ విధంగా
బ్రహ్మ సూర్య సమం జ్యోతిః
ద్యౌః సముద్ర సమం సరః
ఇంద్ర పృథివ్యై వర్షేయాన్ థి
గోస్తు మాత్రా నవిద్యతే (యజుర్వేదం 23-48)
1. సూర్యుని వంటి స్వప్రకాశంగల పెద్ద వస్తువేది?
2. సముద్రం వంటి జలముగల మరొక స్థానమేది?
3. పృథివి వంటి విశాలమైన పెద్దగోళమేది?
4. దేని మాత్ర అనగా లాభముల పరిధి లెక్కించలేము?
ఈ ప్రశ్నలకు సమాధానాలు-
1. సూర్యుని వంటి పెద్దప్రకాశవస్తువు పరమేశ్వరుడు
2. సముద్రంవంటి జలస్థానం అంతరిక్షము(దీనిలో జలము నీటిఆవిరిగా,
తేమగా, మేఘాలుగా ఉంటుంది.)
3. పృథివి వంటి విశాలమైన గోళం సూర్యుడు
4. దేని లాభాలను గణించలేమో అది గోవు