Showing posts with label అధ్యాత్మ రామాయణము. Show all posts
Showing posts with label అధ్యాత్మ రామాయణము. Show all posts

Tuesday, December 6, 2016

అధ్యాత్మ రామాయణము - ఆవిష్కరణ - వివరాలు


అధ్యాత్మ రామాయణము - ఆవిష్కరణ - వివరాలు




సాహితీమిత్రులారా!

శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారి
సంపాదకీయంలో వారి పీఠికతో
చిత్రకవితా విశేషాలతోకూర్చబడిన
కాణాదం పెద్దన సోమయాజి ప్రణీతమైన
అధ్యాత్మరామాయణమును
తిరుమల తిరుపతి దేవస్థానంవారు ముద్రించినారు.
దీన్ని తిరుచానూరులో 29-11-2016న
శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా
వాహన మండపంలో
తి.తి.దే. ఈ.ఓ. శ్రీ డి. సాంబశివరావు ఐ.ఏ.యస్. గారు
అధ్యాత్మరామాయణము చంపూకావ్యాన్ని ఆవిష్కరించి,
శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులను సన్మానించారు.
జె.ఇ.ఓ. శ్రీపోలా భాస్కర్ ఐ.ఏ.యస్. గారు శ్రీవారి ప్రసాదాన్ని
అందిచగా ప్రచురణల విభాగం
ప్రత్యేక అధికారి శ్రీ ప్రయాగ రామకృష్ణగారు,
ఉపసంపాదకులు డా. యన్. నరసింహాచార్యగారు
దేవస్థాన ఇతర అధికారులు ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు.
ఆ పుస్తక ప్రత్యేకతలు మళ్ళీ తెలుసుకుందాము.
ఇక్కడ ఆవిష్కరణ ఛాయాచిత్రాలను చూద్దాం-