Showing posts with label పొడుపు కతలు. Show all posts
Showing posts with label పొడుపు కతలు. Show all posts

Saturday, June 11, 2022

అన్నపానాలతో అంతమైండు

 అన్నపానాలతో అంతమైండు




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు విప్పండి-

జడల మహాముని భూమ్మీద ఆరునెల్లు తబస్సు పట్టెండు

తబుసు పట్టిన కొన్ని దినాలకు భూచక్రగొడుగుతో భూమ్మీద పడ్డ

కొన్ని దినాలకు మొండి కత్తితో పైకి లేచిండు, 

పైకి లేచిన కొన్ని దినాలకు నందివాహనమ్మీద నాల్గు బజార్లు తిరిగిండు, 

నాల్గు బజార్లూ తిరిగిన కొన్ని దినాలకు 

తులాభారంతో తూగిండు, 

తులతూగిన కొన్ని దినాలకు, 

కూరపాటి వీరులతో 

కూని యుద్ధం చేసిండు, 

యుద్ధం చేసిన కొన్ని దినాలకు కారంపూడి వీరులతో యుద్ధం చేసిండు, 

యుద్ధం చేసిన కొన్ని దినాలకు అన్నపానాలతో అంతమైండు


సమాధానం - ఉల్లిగడ్డ

(ఉల్లిగడ్డ పొలంలో వేసిన దగ్గరనుండి కూరలతో అన్నంతో కలిసి మనం తినేదాకా ఈ కత)


Wednesday, June 1, 2022

నీచే దెబ్బలు తిన్నాను

 నీచే దెబ్బలు తిన్నాను




సాహితీమిత్రులారా!


ఈ పొడుపును విప్పండి-

అమ్మా! నీ కడుపున పడ్డానూ, అంత సుఖాన వున్నానూ

చుచ్చో మళ్ళీ వచ్చాను. సోలీ ఇంట్లో పడ్డాను,

నీచే దెబ్బలు తిన్నానూ, నిలువు యెండీ పోయినాను

నిప్పుల గుండం దొక్కాను, నీరై మారీ పొయ్యాను


సమాధానం -

నీ కడుపున పడ్డానూ, అంత సుఖాన వున్నానూ - గడ్డి

చుచ్చో మళ్ళీ వచ్చాను. సోలీ ఇంట్లో పడ్డాను, - పేడ

నీచే దెబ్బలు తిన్నానూ, నిలువు యెండీ పోయినాను - పిడక

నిప్పుల గుండం దొక్కాను, నీరై మారీ పొయ్యాను  - బూడిద

Thursday, June 15, 2017

పొడుపు కతలు


పొడుపు కతలు




సాహితీమిత్రులారా!


పద్యంగాని శ్లోకంగాని కాని
ప్రక్రియలో చెప్పినవి
పొడుపు కతలు

అంతా బేలుకోసం, ఎదురు చూస్తున్నారు
దీనిలో దాగున్నదేది?

ఆ ఉత్తరం నీకా నాకా-
దీనిలో దాగున్నదేది?

పైవాని సమాధానాలు


అంతా బేలుకోసం, ఎదురు చూస్తున్నారు
దీనిలో దాగున్నదేది?

తాబేలు

ఆ ఉత్తరం నీకా నాకా-
దీనిలో దాగున్నదేది?

ఆవు