Showing posts with label మిశ్రమ చిత్రము. Show all posts
Showing posts with label మిశ్రమ చిత్రము. Show all posts

Tuesday, February 25, 2020

తలకట్లు గల సర్వలఘు నిరోష్ఠ్య గీతము


తలకట్లు గల సర్వలఘు నిరోష్ఠ్య గీతము





సాహితీమిత్రులారా!

నంబెరుమాళ్ళ పురుషకారి కేశవయ్య గారి
నిరోష్ఠ్య ఉత్తర రామాయణము
దాశరథి చరిత్రలో నాలుగవ ఆశ్వాసంలో
ఖ, ఙ, ఞ, ట ణ అనే అక్షరాలు లేకుండా
అన్నీ తలకట్లు గల అక్షరాలతో అన్నీ లఘువులతో
సర్వలఘులు కలిగి పెదిమలతో పలుకకుండా కూర్చబడినది
ఈ గీతపద్యం  గమనించండి -

దయఁగనర ఘనదశరథతనయ! సనయ!
గగనచరరథ! దశశతకరశశధర
నయన! సతతసరస! నతనగచరచయ!
తతదరహరద! దశగళదళన సదయ!
                                                                (దాశరథి చరిత్ర - 4 - 15)

ఇందులో పై చెప్పిన ఖ, ఙ, ఞ, ట, ణ లను వాడలేదు
అన్నీ తలకట్లే ఉన్నాయి.
అన్నీ లఘువులే ఉన్నాయి.
ఇవేవీ పెదవితో పలుకబడవు గమనించండి.

Saturday, August 26, 2017

శార్ఙ్గ ధనుర్బంధము


శార్ఙ్గ ధనుర్బంధము




సాహితీమిత్రులారా!

వైద్యం వేంకటేశ్వరాచార్యుల సంపాదకత్వంలో
వెలువడిన తిరుమల బుక్కపట్టణం అణ్ణయదేశిక
విరచిత చిత్రబంధమాలికా లోని
శార్ఙ్గ ధనుర్బంధమును చూడండి-
ధనుర్బంధాలు అనేక విధాలు
అందులో ఈ శార్ఙ్గధనుర్బంధము
ఒక రకము.

సంభారసారస్థితి భూరిభాజం
జంభాతి కాంతిక్షతి దాన భావం
వం భానదాతి క్షితి కాంతి భాజం
జం భారిభూతి స్థిర సారభాసం

దీనిలోని శబ్దచిత్రం గమనిస్తే
దీనిలో
మొదటి రెండు పాదాలను
చివరనుండి చదివిన చివరి
3,4 పాదాలు ఏర్పడతాయి
కావున దీనిలో గతిచిత్రం
కూడ ఉన్నదని గమనించగలం.

దీన్ని బంధంలో వ్రాసిన
మొదటిరెండు పాదములు
బంధములో క్రిందినుండి
పైకి కూర్చబడినవి
అలాగే చివరి పాదములు
పైనుండి క్రిందికి చదివిన
సరిపోవును గమనించండి


Friday, May 26, 2017

కందద్వయగర్భిత భాస్కరవిలసితవృత్తము ముద్రాలంకారము


కందద్వయగర్భిత భాస్కరవిలసితవృత్తము ముద్రాలంకారము




సాహితీమిత్రులారా!



ఈ పద్యం శీర్షికే ఎంత పెద్దగా ఉందోకదా
ఇది ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము
లోనిది(825)-
ఇందులో భాస్కరవృత్తములో
రెండు కందపద్యాలు ఇమిడి ఉన్నాయి
మరియు ఈ పద్యం ముద్రాలంకారంలో ఉంది.

భాస్కరవిలసిత వృత్తము-
పంకజదళ నిభలోచన శంకాభావ మునిహృదయ సతత విహారా
కుంకుమమృగమద సాంకవ పంకోరస్థలకృతపద వననిధి కన్యా
లంకృత మణిగణభూషణయం కీకృత మృదుగతి మరుద సితశరీరా
వేంకటగిరివర రుచ్యకలంకా భాస్కరవిలసిత లగదరిహస్తా

ఇందులో గర్భితమైన మొదటికందము-

పంకజదళ నిభలోచన శంకాభావ మునిహృదయ సతత విహారా
కుంకుమమృగమద సాంకవ పంకోరస్థలకృతపద వననిధి కన్యా
లంకృత మణిగణభూషణయం కీకృత మృదుగతి మరుద సితశరీరా
వేంకటగిరివర రుచ్యకలంకా భాస్కరవిలసిత లగదరిహస్తా


పంకజదళ నిభలోచన 
శంకాభావ మునిహృదయ సతత విహారా
కుంకుమమృగమద సాంకవ 
పంకోరస్థలకృతపద వననిధి కన్యా

రెండవ గర్భిత కందము-
పంకజదళ నిభలోచన శంకాభావ మునిహృదయ సతత విహారా
కుంకుమమృగమద సాంకవ పంకోరస్థలకృతపద వననిధి కన్యా
లంకృత మణిగణభూషణయం కీకృత మృదుగతి మరుద సితశరీరా
వేంకటగిరివర రుచ్యకలంకా భాస్కరవిలసిత లగదరిహస్తా


లంకృత మణిగణభూషణ
యం కీకృత మృదుగతి మరుద సితశరీరా
వేంకటగిరివర రుచ్యక
లంకా భాస్కరవిలసిత లగదరిహస్తా

ఈ వృత్తముపేరు భాస్కరవిలసితము అని
పద్యంలో రావడం వల్ల ఇది
ముద్రాలంకారమౌతుంది.
పంకజదళ నిభలోచన శంకాభావ మునిహృదయ సతత విహారా
కుంకుమమృగమద సాంకవ పంకోరస్థలకృతపద వననిధి కన్యా
లంకృత మణిగణభూషణయం కీకృత మృదుగతి మరుద సితశరీరా
వేంకటగిరివర రుచ్యకలంకా భాస్కరవిలసిత లగదరిహస్తా

ఇందులో గర్భిత పద్యాలున్నాయి 
కావున ఇది గర్భచిత్రము.
మరియు శబ్దాలంకారమైన
ముద్రాలంకారమున్నందున
ఇది శబ్దాలంకార చిత్రము
అవుతున్నది.
రెండు చిత్రములిందులో ఉన్నందున

ఇది మిశ్రమ చిత్రమవుతుంది

Monday, May 22, 2017

శుద్ధాంధ్ర గోమూత్రికాబంధము


శుద్ధాంధ్ర గోమూత్రికాబంధము




సాహితీమిత్రులారా!

శుద్ధాంధ్రము ఒక చిత్రమైతే
అందులో బోమూత్రికాబంధము కావడంతో
ఇది మిశ్రమ చిత్రము అవుతుంది.

శేషధర్మలోని ఈ పద్యం చూడండి
ఇది పూర్తిగా ఆంధ్రములో వ్రాయబడినది-

పులితోలుం బలుమేలుం
దలపై విన్నేటిజాలుదగునలవేల్పా
తెలిడాలుం నలుగేలుం
దలమౌ విల్మేటివాలుదగునెలదాల్పా
                                                 (శేషధర్మము 5ఆశ్వాసము)

దీనికి గోమూత్రికాబంధమును చూడండి

పులితోలుంలుమేలుం పై విన్నేటిజాలుగువేల్పా
తెలిడాలుం లుగేలుం మౌ విల్మేటివాలుగునెదాల్పా


పు    తో       బ     మే       ద    పై       న్నే   జా  ద   న     వే
    ↘↗       ↘↗    ↘↗    ↘↗     ↘↗   ↘↗      ↘↗   ↘↗  ↘↗   ↘↗   ↘
   లి    లుం    లు   లుం    ల       వి      టి    లు  గు  ల      ల్పా
  ↗  ↘    ↗  ↘     ↗  ↘    ↗  ↘    ↗  ↘   ↗ ↘   ↗  ↘   ↗  ↘ ↗↘   ↗ 
తె    డా      న      గే         ద    మౌ     ల్మే  వా   ద    నె     దా



Thursday, May 11, 2017

ఏకస్వర - ద్వ్యక్షరి


ఏకస్వర - ద్వ్యక్షరి




సాహితీమిత్రులారా!


అ,ఆ-లు రెండిటిని అత్వము అంటాము.
ఈ స్వరములను మరియు
ప, ద - అనే రెండు వ్యంజనాలను
ఒకే శ్లోకంలో ఉపయోగించారు
వేదాంతదేశికులవారు
కావున దాన్ని మిశ్రమ చిత్రమంటారు.
ఆ శ్లోకం చూడండి-

పాదపా పాదపా పాదపా పాదపా
పాదపా పాదపా పాదపా పాదపా
పాదపా పాదపా పాదపా పాదపా
పాదపా పాదపా పాదపా పాదపా

స్థావర జంగమాలకు కలిగే దోషాలను
తొలగించే  అభిషేకతీర్థం కలది పాదుక.
పరమవ్యూహ విభవాదులందు భగవంతుడు
ధరించిన పాదుక సంచారం చేత ఇహలోకాలను
రక్షిస్తుంది. భగవన్నిష్ఠ నిగ్రహానుగ్రహజనకమైన
పాదుక అవశ్యంగా రక్షింపదగిన మాతాపిత్రాదులను
రక్షించే వారి పట్ల శుభాన్నీ, రక్షించే దక్షత కలిగి
ఉన్నా రక్షింపక ఉపేక్షించే వారి విషయమై
అఏశుభాన్నీ సంకల్పిస్తుంది. భగవదనుభవ శీలురైన
సాధుజనుల శమదమాది గుణాలను వృద్ధి పరచేది
ఇంద్రాది లోకపాలకులను రక్షించే భగవత్పాదుకయే.
స్వాశ్రితజనవిరోధులను శోషింపజేసే కిరణాలను కాపాడేదీ
పాదుకయే - అని భావం.
ఈ శ్లోకాన్ని మొదట బంధ-శబ్దచిత్రాల
మిశ్రమ చిత్రంగా విరించుకున్నాము

ఇక్కడ శబ్దచిత్రంలో మిశ్రమచిత్రంగా
తెలుసుకున్నాము.

Saturday, May 6, 2017

పాదపా పాదపా పాదపా పాదపా


పాదపా పాదపా పాదపా పాదపా




సాహితీమిత్రులారా!

వేదాంతదేశికులవారి
పాదుకా సహస్రములోని
ఈ శ్లోకం చూడండి-

పాదపా పాదపా పాదపా పాదపా
పాదపా పాదపా పాదపా పాదపా
పాదపా పాదపా పాదపా పాదపా
పాదపా పాదపా పాదపా పాదపా
                                                                        (939)

ఇందులో రెండు వ్యంజనములుమాత్రమే
ఉపయోగించబడ్డాయి. కావున ఇది ద్వ్యక్షరి
అనే శబ్దచిత్రమౌతుంది.

అలాగే మూడురకాల పద్మబంధాలలో
కూర్చ వచ్చు అందు వల్ల ఇది బంధచిత్రమౌతుంది.
శబ్దచిత్రము మరియు బంధచిత్రము రెండు ఉన్నందున
దీన్ని మిశ్రమ చిత్రంగా చెప్పవచ్చు.

బంధ చిత్రం చూడండి-

మొదటిది షోడశదళ పద్మ బంధము-
దీనిలో దళములోని పా-ను చదివి
కర్ణికలోని ద-ను చదవాలి ఈ విధంగా
పాదపా అని చదువుతూ పోవాలి
ఎక్కడనుండైనా ప్రారంభించ వచ్చు.


రెండవది అష్టదళ పద్మ బంధము-
దీన్ని కర్ణములోని పా - ను ప్రవేశ నిర్గమాలుగా చదవాలి.


మూడవది చతుర్దళ పద్మ బంధము-
దీనిలో ఒక్కొక దళములో ఐదేసి గదులలో పైనుంచి
పాదపా పాద - అనే అక్షరాలకు కర్ణికలోని పా-ను కలుపగా
పాదపాపాదపా అవుతుంది. ప్రవేశ నిర్గమాలతో
ప్రతి దళముమునకు ఒక పాదమౌతుంది
నాలుగు దళాలకు నాలుగు పాదాలు పూర్తవుతాయి.

Sunday, April 30, 2017

నిరోష్ఠ్య గీతోత్పల పాద గర్భ కందము


నిరోష్ఠ్య గీతోత్పల పాద గర్భ కందము




సాహితీమిత్రులారా!



నిరోష్ఠ్యము అంటే ఓష్ట్యముతో
పలుకబడని అక్షరములతో పద్యం కూర్చుట.
ఇది శబ్దచిత్రము
కందపద్యములో గీత ఉత్పలమాల పద్యముల
పాదములను కూర్చుట గర్భచిత్రము ఈ రెండింటిని
ఒకదానిలో కూర్చుట వలన ఇది మిశ్రమ చిత్రము
అనబడును. పద్యం చూడండి-

కనకాచ్ఛాదన! సదయా
దిననాయక తేజ! చక్రి! ధీరాధర! స
జ్జన రంజనా! సరసిజా
క్ష నయాధిక! సైన్య రక్షకా! ధరణీశా!

ఇది పెదిమలు తగలకుండా చదువవచ్చు
అందుకే దీనికి నిరోష్ఠ్యము అని పేరు.

ఇందులోని గీత పద్య పాదము-

కనకాచ్ఛాదన! సదయా
దిననాయక తేజ! చక్రి! ధీరాధర! స
జ్జన రంజనా! సరసిజా
క్ష నయాధిక! సైన్య రక్షకా! ధరణీశా!

సరసిజాక్ష! నయాధిక! సైన్య రక్ష!


ఉత్పలమాల పద్య పాదము -
కనకాచ్ఛాదన! సదయా
దిననాయక తేజ! చక్రి! ధీరాధర! 
జ్జన రంజనా! సరసిజా
క్ష నయాధిక! సైన్య రక్షకా! ధరణీశా!


జ్జన రంజనా!సరసిజాక్ష! నయాధిక! సైన్య రక్షకా!