Showing posts with label నాలుగు అచ్చుల పద్యం. Show all posts
Showing posts with label నాలుగు అచ్చుల పద్యం. Show all posts

Saturday, October 3, 2020

నాలుగు అచ్చుల పద్యం

 

నాలుగు అచ్చుల పద్యం






సాహితీమిత్రులారా!

పాదానికి ఒక అచ్చు చొప్పున నాలుగు పాదాలకు
నాలుగు అచ్చులతో కూర్చిన పద్యం ఇది
దండి కావ్యాదర్శం లోనిది.

అమ్నాయానా మాహాన్త్యావాగ్గీతీ రీతీ: ప్రీతీభీతీ:
భోగోలోగో మోదో మోహోధ్యేయే వేచ్ఛేద్ధేశేక్షేమే
                                                              (కావ్యాదర్శమ్ -3-84)
అర్థం -
అమ్నాయానాం - వేదాలలో, అన్త్యా - చివరిదైన ఉపనిషత్తు, గీతీ: - గానములను, ఈతీ: - ఈతిబాధలుగాను,  ప్రీతీ: - దారాపుత్రాదులందు ప్రేమలను, భీతీ: - భయస్వరూపములైనట్టివిగాను, అహ - చెప్పుచున్నది. భోగ: - విషయోపభోగము, రోగ: - రోగహేతువు, మోద: - సాంసారిక సుఖానుభవము, మోహ: - అవివేకరూపమైనది, అందుచే, క్షేమే - పరమాదరహితమైన, దేశే - ఏకాంత ప్రదేశంలో, ధ్యేయేవా - ధ్యేయమగు పరమాత్మస్వరూపంనందు, ఇచ్ఛేత్ - మనసును నిలుపుటకు కోరుకొనవలెను.

అమ్నాయానా మాహాన్త్యావా
గ్గీతీ రీతీ: ప్రీతీభీతీ:
భోగోలోగో మోదో మోహో
ధ్యేయే వేచ్ఛేద్ధేశేక్షేమే

మొదటిపాదంలో అకారము(అ,ఆ - అచ్చులు)
రెండవపాదంలో ఇకారము (ఇ,ఈ - అచ్చులు)
మూడవపాదంలో ఓ కారము(ఒ, ఓ - అచ్చులు)
నాలుగవపాదంలో ఏ కారము(ఎ,ఏ - అచ్చులు)
లతో కూర్చబడింది. గమనించగలరు.