మాతృకావిలాసంలోని ఏకాక్షరనిఘంటువు - 13
సాహితీమిత్రులారా!
మాతృకావిలాములోని ఏకాక్షరనిఘంటువు తరువాయి భాగం ..
భభాభిభీభుభూభేభైభోభౌభంభః ॥ 24 ॥
అథ భాదేః । భో భయానక ఇష్టఘ్నో భటః సోమో భయాతురః ॥ 72 ॥
భా దీప్తిః ప్రతిభా వాణీ కాంతిశ్శాలా సముద్మనా ॥
భిః పక్షీ భీ చ భీతిరస్యాద్ భుర్భుజంగోऽథ
భూర్మహీ ॥ 73 ॥
జాతాజాతశ్చ భేః కాంతిర్బ్రహ్మా వరుణో యమః ॥
భైః ప్రహారోऽథ
భీరుః స్యాద్ భోః కంసో భౌ రమాపతిః ॥ 74 ॥
భం నక్షత్రం భయం బ్రహ్మ భరణం ధరణం యమః ॥
భః ప్రాగుక్తో భరాక్రాంతో భవభీతో భవానుగః ॥ 75 ॥
·
భ: భయంకరుడు, సైనికుడు
(భటుడు), చంద్రుడు (సోమః).
·
భా: కాంతి (దీప్తి), తెలివితేటలు
(ప్రతిభ), వాక్కు, ఇల్లు
(శాలా).
·
భి: పక్షి.
·
భీ: భయము.
·
భు: పాము (భుజంగము).
·
భూ: భూమి.
·
భే: కాంతి, బ్రహ్మ, వరుణుడు, యముడు.
·
భై: దెబ్బ (ప్రహారము), పిరికివాడు
(భీరువు).
·
భో: కంసుడు.
·
భౌ: విష్ణువు (రమాపతి).
·
భం: నక్షత్రము, భయము, పరబ్రహ్మము, భరించడం, ధరించడం, యముడు.
·
భః: శివ భక్తుడు (భవానుగుడు).
మమామిమీముమూమేమైమోమౌమంమః ॥ 25 ॥
అథ మాదేః । మో మహేశోऽథ మః
స్తోమః సోమో రామో రణో గజః ॥
మా జాలంధ్రీ వ్యథా లక్ష్మీర్మాతా మా మాస ఈరితః ॥ 76 ॥
మిః కర్ణో మీర్మహాబాహుర్ముర్మాతా మూర్మహాబలః ॥
మేః సారంగోऽథ
మైః పూషా సారథిః ప్రణతోవరః ॥ 77 ॥
మోః పత్నీ మౌః సురావాసో మంగళం మలినం ఫలమ్ ॥
మః ప్రాగుక్తోऽపి
మతిమాన్ మణివేధకరః పుమాన్ ॥ 78 ॥
·
మ: శివుడు (మహేశుడు), సమూహము
(స్తోమః), చంద్రుడు, రాముడు, యుద్ధము, ఏనుగు.
·
మా: లక్ష్మి, తల్లి, నెలను
(మాసము), బాధ (వ్యథ).
·
మి: చెవి (కర్ణము).
·
మీ: గొప్ప బాహువులు కలవాడు.
·
ము: తల్లి.
·
మూ: గొప్ప బలవంతుడు.
·
మే: చాపము (సారంగము).
·
మై: సూర్యుడు, సారథి.
·
మో: భార్య (పత్నీ).
·
మౌ: దేవతల నివాసం.
·
మం: మంగళము, మురికి
(మలినము), ఫలము.
·
మః: బుద్ధిమంతుడు.
.jpg)
No comments:
Post a Comment