రెండు హల్లుల పద్యం
సాహితీమిత్రులారా!
రూపగోస్వామి కూర్చిన చిత్రకవిత్వాని
అనే చిత్రకావ్యంలోని రెండు హల్లుల పద్యం
ఇందులో ర-స- అనే రెండు హల్లులు మాత్రమే
ఉపయోగించి పద్యం కూర్చారు గమనించండి-
రసాసారరసుసారోరురసురారిః ససార సః
సంసారసిరసౌ రాసే సురిరంసుః ససారసః
సాహితీమిత్రులారా!
రూపగోస్వామి కూర్చిన చిత్రకవిత్వాని
అనే చిత్రకావ్యంలోని రెండు హల్లుల పద్యం
ఇందులో ర-స- అనే రెండు హల్లులు మాత్రమే
ఉపయోగించి పద్యం కూర్చారు గమనించండి-
రసాసారరసుసారోరురసురారిః ససార సః
సంసారసిరసౌ రాసే సురిరంసుః ససారసః
సాహితీమిత్రులారా!
బుక్కపట్టణ రాఘవాచార్య కృత
శ్రీకువలాశ్వ విజయములోని
పంచమాశ్వాసమునుండి-
కేవలం రెండుహల్లులను
ఉపయోగించి కూర్చిన పద్యం
ల-వ అనే రెండు హల్లులతో కూర్చిన పద్యం గమనించండి-
లావు వోవు లేవ లేవెవలా వలి
వేల వోలె వాలవేవలేవ
వాలు వీలు వోల వాలు వీలీవేల
లేవ లీల వీవు లోవి వోలె (5-71)
సాహితీమిత్రులారా!
భారవి కిరాతార్జునీయం ను తెలుగులో అనేకులు కూర్చారు
భువనగిరి విజయరామయ్యగారు కూర్చిన ఆంధ్రకిరాతార్జునీయంలో
శివ అర్జునుల శరయుద్ధం సమయంలో కూర్చిన రెండుహల్లుల పద్యం
ఇక్కడ గమనిద్దాం-
చూచి చొచ్చి చేరి రేచి చిచ్చై చార
చారురుచి రచించి చీరి చీరి
రాచ చర్చ చెంచ! రారోరి రారంచు
రాచె రచ్చ చెచ్చరన్ జరించి
(ఆంధ్రకిరాతార్జునీయం - తృతీయభాగం- 15 సర్గ- 38)
ఇందులో కేవలం చ-ర అనే
రెండు హల్లు మాత్రం ఉపయోగించి
కూర్చడం జరిగింది.
సాహితీమిత్రులారా!
రెండు హల్లులు ఉపయోగించి కూర్చిన శ్లోకాన్ని ద్వ్యక్షరి అంటారు.
ఇక్కడ "క-ల" అనే రెండు హల్లులను ఉపయోగించి కూర్చిన శ్లోకం
గమనించండి.
ఇందులో హల్లులు రెండే
వాటికి అచ్చులు ఏవైనా ఉండవచ్చు.
కాలేకిలాలౌకికైక
కోలకాలాలకేలల
కలికాకోలకల్లోలా
కులలోకాలిలాలికా
దీని అర్థం-
అలౌకిక = లోకవిలక్షణమైన, ఏక = ముఖ్యమైన,
కోల = ఆదివరాహస్వామియొక్క, కాలాలకే = భార్యవైన,
ఓ లక్ష్మీ,(కాల = నల్లని, అలకే = ముంగురుగలదానా!)
కలి = కలికాలమనే, కాకోల = విషముయొక్క,
కల్లోల = అభివృద్ధిచే, ఆకుల = బాధపడుచున్న,
లోక + అలి = ప్రజాసమూహమును, లాలికా = రక్షించుచున్న,
(త్వమ్) నీవు, కాలేకిల = అపాయసమయమున మాత్రము,
లల = సాక్షాత్కరించి ప్రకాశింపుము.