Showing posts with label మూడు హల్లుల పద్యం. Show all posts
Showing posts with label మూడు హల్లుల పద్యం. Show all posts

Sunday, July 4, 2021

తెలుగులో మూడు హల్లుల పద్యం

 తెలుగులో మూడు హల్లుల పద్యం




సాహితీమిత్రులారా!



మధురవాణీవిలాసమును రచించిన
చింతపల్లి వీరరాఘవయ్యగారు క్రీ.శ.1660
ప్రాంతంలో మహబూబునగర్ జిల్లా,
వట్టెం గ్రామంలో నివసించారు.
ఈ కావ్యం అయిదు ఆశ్వాసాలు గలది
దీనిలో మధురవాణీ కార్తవీర్యుల కథ కూర్చబడినది.
ద్వితీయాశ్వాసంలోని చిత్రకవిత్వంలోని
ఏకాక్షర , ద్వ్యక్షర,  త్య్రక్షర - పద్యాలున్నాయి
వాటిలో త్య్రక్షర కందం చూడండి-
ద,,- అనే మూడు హల్లులను
ఉపయోగించి కూర్చిన
కందపద్యం ఇది

దావవవవదా
నానావిద్వన్నవీ నిదానా
దీనానాదీదా
నానుదు నె నీదువాదు నావినోదా (2-14)