Showing posts with label శ్రీ కొడవలూరు రామచంద్రరాజు. Show all posts
Showing posts with label శ్రీ కొడవలూరు రామచంద్రరాజు. Show all posts

Wednesday, April 5, 2017

మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 8


మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 8




సాహితీమిత్రులారా!


మహాసేనోదయములోని
ఈ పుష్పమాలికాబంధము చూడండి-

జనకనరేనజాస్య జలజన్మజగద్దృశ కాశభేశచం
దనవనఫేనకీర్తి నగనన్దనసేవ్యపదాపదాపహా
వినయనదీనతుల్య విలువిద్యవిభాసిత పాతకాంతకా
బ్జనయన దానశౌండ పరిపన్దిపలాశన కానవానలా

ఈ మాలలో 12 పుష్పాలున్నాయు.
ఒక్కొక పుష్పంలో 7 అక్షరాలున్నాయి
మొదటి పుష్పంలో ఈ లాగున్నాలిచూడండి-
                          జ
               రేనక
                  జా
దీనిలో 5 అక్షరాలే కనిపిస్తాయి
కాని చదవడంలో 7 అక్షరాలోస్తాయి
జనకనరేనజా - ఇందులో 7 అక్షరాలున్నాయి కదా
ఇలాగే ఏడు రెండ్ల 14 అక్షరాలు
తగ్గిపోతాయి ఈ బంధరచనవల్ల
పద్యం చూస్తూ బంధచిత్రాన్ని చదవండి
అంతా తెలిసిపోతుంది.




Tuesday, March 28, 2017

మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 7


మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 7




సాహితీమిత్రులారా!

శ్రీకొడవలూరు రామచంద్రరాజు కృత
మహాసేనోదయము నందు గల
గిరిబంధము పద్యం చూడండి-

గిరిబంధములో మొదట 1 అక్షరము,
తరువాత 3 అక్షరములు, 5 అక్షరములు,
7 అక్షరములు, 9 అక్షరములు, 11 అక్షరములు,
11 అక్షరములు ఉండునట్లు కూర్చబడిన చిత్రములో
చూపిన విధంగా వ్రాసిన గిరిబంధము ఏర్పడును.
ఈ విధంగా వ్రాయడం వలన పైనుండి మధ్యలో
కవి పేరుగాని, ఇష్టదేవత పేరుగాని కవి కూర్చును
ఈ పద్యంలో కొడవలూరి రామచంద్రరాజు గారు
తన ఇష్టదైవమైన శ్రీరామలింగేశ్వరుని
నమస్కరించిన విధంగా కూర్చారు.

శ్రీహీరాన్గద కమలద
వాహ నిలింపార్చితాంఘ్రి వనజాగసుత 
స్నేహ మునినిచయవంద్యా
దేహజగర్వాద్రికులిశ దేవసుచరితా



శ్రీ
హీరాన్గ
ద కలద
     వాహ నిలింపార్చితాం
ఘ్రి వనజాసుతస్నేహ 
మునినిచయవంద్యాదేహజగ
              ర్వాద్రికులిశ దేవసుచరితా



Sunday, March 26, 2017

మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 6


మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 6




సాహితీమిత్రులారా!


మహాసేనోదయములోని ప్రథమాశ్వాసములోని
ఈ పద్యం ఖడ్గంధములో కూర్చబడినది-
చూడండి-

పురహరసురనుతపాదా
కరిదై తేయాసుహర్త కంధినిషంగా
గిరిజాహృదయరంజన
సరసీరుహనాభమిత్ర సమ్మనిసంగా


చిత్రము చదవడం సులభతరం చేయడం కోసం
కవిగారు చిత్రములో పాదము సంఖ్యలు చూపడం
జరిగింది సులువుగా చదువవచ్చు.
పద్యాన్ని చూస్తూ బంధచిత్రం చూచి చదవండి
కవి ఎలా బంధాన్ని రచించారో అవగతమౌతుంది.



Tuesday, March 7, 2017

మహాసేనోదయములోని చిత్రకవిత్వం - 5


మహాసేనోదయములోని చిత్రకవిత్వం - 5




సాహితీమిత్రులారా!

శ్రీకొడవలూరు రామచంద్రరాజు గారి ఛాయాచిత్రం


శ్రీకొడవలూరు రామచంద్రరాజు గారి
మహాసేనోదయములోని
తృతీయాశ్వాసాంతంలోని
మాలికాచతుర్విధకందం చూడండి-

చతుర్విధకందం అంటే కందపద్యంలో
నాలుగు కందపద్యాలను కూర్చడం
ఇది గర్భకవిత్వానికి చెందినది.

మాలికాచతుర్విధకందం అంటే
కందపద్యంలోని మొదటి పాదంలోని
మొదటి అక్షరంతో ప్రారంభమవుతుంది ఒక పద్యం.
రెండవ అక్షరంతో రెండవ కందం, మూవ అక్షరంతో
మూడవ కందం, నాలుగవ అక్షరంతో నాలుగవ కందం
ప్రాంభమయ్యే విధంగా కందపద్యం కూర్చడం.

అలాగే మొదటి కందంలోని మొదటి అక్షరం
రెండవ కందంలో చివరి అక్షరంగా మారుతుంది
రెండవ కందంలోని మొదటి అక్షరం మూడవ
కందంలోని చివరి అక్షరమౌతుంది అందువల్ల
దీన్ని కవిగారు మాలికా కందం అని పేరు పెట్టాడు.


శ్రీగోపావన భవహర 
భోగా పావనినుతపద మునిగణభయవా
ర్యాగోపావనతాంఘ్రియు
గా గోపావనజదృశ యుగళగురుప్రతిభా



శ్రీగోపావన భవహర భోగా పావనినుతపద మునిగణభయవా
ర్యాగోపావనతాంఘ్రియుగా గోపావనజదృశ యుగళగురుప్రతిభా

ఈ పద్యంలో ఇమిడ్చిన మిగిలిన పద్యాలు-

రెండవ కందపద్యం-

గోపావన భవహర భోగా పావనినుతపద మునిగణభయవార్యా
గోపావనతాంఘ్రియుగా గోపావనజదృశ యుగళగురుప్రతిభాశ్రీ

మూడవ కంద పద్యం-

పావన భవహర భోగా పావనినుతపద మునిగణభయవార్యాగో
పావనతాంఘ్రియుగా గోపావనజదృశ యుగళగురుప్రతిభాశ్రీగో


నాలుగవ కందపద్యం-

వన భవహర భోగా పావనినుతపద మునిగణభయవార్యాగోపా
వనతాంఘ్రియుగా గోపావనజదృశ యుగళగురుప్రతిభాశ్రీగోపా




Saturday, January 21, 2017

మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 3


మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 3




సాహితీమిత్రులారా!

మహాసేనోదయములోని రెండవ ఆశ్వాసములోని
చిత్రకవిత్వము మరికొన్ని అంశాలు -


శబ్దచిత్రము-
అచల జిహ్వ శుద్ధౌష్ఠ్యము - (2- 252)
ఇది పెదిమలు మాత్రమే తగులుతూ నాలుక కదలని పద్యం
ప,ఫ,బ,భ,మ,వ - అనేవి ఓష్ఠ్యములు వీటినిమాత్రమే ఉపయోగించి
పద్యం కూర్చారు

భావభవోపమవామా
భావిభవాబభవభావపాపావిపవీ
భూవిభుబోమావాపా
భావామవిభోపభవప భభవప్రభువా

దీన్ని ఒకసారి పలికి చూడండి
నాలుక కదులుతుందేమో
కదలుదుకదా
అలాగే పెదిమలు తగలకుండా
పలుకగలమేమో చూడండి
పలుకలేము కదా!

ఆకార చిత్రం(బంధకవిత్వం) -

గోమూత్రికాబంధం (2- 253)


సురనరవరపరిపాలా
శరనిధిగర్వాపవిజిత శౌర్యవిధానా
మరపరహర భరితైలా
హర విధిశర్వాణివినుత యార్యనిధానా

దీనిలో పూర్వర్థము పొడవుగా వ్రాసి
దానిక్రింద ఉత్తరార్థం వ్రాయగా
ఈ విధంగా వస్తుంది-

సురనరవరపరిపాలా శరనిధిగర్వాపవిజిత శౌర్యవిధానా

మరపరహర భరితైలా హర విధిశర్వాణివినుత యార్యనిధానా


ఇపుడు ప్రతి పాదములో 2,4,6,8,10,12,14 అక్షరాలను
అంటే సరిసంఖ్యలోని అక్షరాలను గమనిస్తే
రెండింటిలోనూ ఒకే వర్ణం ఉన్నట్లు గమనించగలం.

సురిపాలా   నిధిర్వావిజి శౌర్యవిధానా

రితైలా విధిర్వాణివిను యార్యనిధానా



దీన్ని ఈ క్రిందివిధంగా వ్రాయడం వలన 
గోమూత్రికా బంధమవుతుంది -






Thursday, January 19, 2017

మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 3


మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 3



సాహితీమిత్రులారా!


గర్భకవిత్వము (పద్యగూఢము) -
దేవతలు కైలాసమునకు పోయి శివుని పొగడు
సందర్భములోనిది ఈ గర్భకవిత



ద్విపదమత్తకోకిల దుష్కరప్రసపదనియమ కంద
గర్భితసీసము(2-79)


దాసకామితదాయి దానవదండి వాసుకిభూషణా వరశుభ్రదేహ
వాసరాధిపతేజ వాక్పతిసంధ్య వాసకృతాచలాభవ శార్ఙ్గిరోప
కాసరాశ్వ మదోరగద్విజకాంత భాసురవైభవా పరసూదనోగ్ర
దోససంఘవిదూర తోయధితూణ కేసరివిక్రమా గిరిచాపభృత వి
రతివిధుత నుతిలోల నరరుదితఘన
చండపవన రాజత్కీర్తి శైలజేశ
శంబరారాతిదోర్గర్వ సాగరౌర్వ 
భువనరక్షణసర్వేశ భూతనాధ

ఈ సీసపద్యంలో
ద్విపద, మత్తకోకిల,
దుష్కరప్రాస పదనియమ కందము అనే మూడు
వేరువేరు ఛందస్సులు
ఈ సీసములో ఇమిడ్చడం జరిగింది
చూడండి-

పై పద్యంలోని గర్భిత పద్యాలు-
ద్విపద-

సీసపద్యానికి 6 సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు
ప్రతిపాదానికి ఉంటాయి
అదే ద్విపదకు ప్రతిపాదానికి
3 సూర్యగణాలు 1 ఇంద్రగణం ఉంటాయి
అంటే సీసపద్యపాదంలో సగం -
3 సూర్యగణాలు 1 ఇంద్రగణం
పై పద్యాన్ని అలా చేస్తే ద్విపదగా
మారుతుంది చూడండి -

గర్భిత ద్విపద-
దాసకామితదాయి దానవదండి 
వాసుకిభూషణా వరశుభ్రదేహ

వాసరాధిపతేజ వాక్పతిసంధ్య 
వాసకృతాచలాభవ శార్ఙ్గిరోప

కాసరాశ్వ మదోరగద్విజకాంత 
భాసురవైభవా పరసూదనోగ్ర

దోససంఘవిదూర తోయధితూణ 
కేసరివిక్రమా గిరిచాపభృత వి


ఇక  మత్తకోకిల -
సీసపద్యంలోని మొదటి మూడు పాదాలలో
చివరి 6 అక్షరాలను తొలగించాలి
చివరి పాదంలో 7 అక్షరాలను  తొలగించాలి
అపుడు.మత్తకోకిల అవుతుంది- చూడండి -
-

దాసకామితదాయి దానవదండి వాసుకిభూషణా వరశుభ్రదేహ
వాసరాధిపతేజ వాక్పతిసంధ్య వాసకృతాచలాభవ శార్ఙ్గిరోప
కాసరాశ్వ మదోరగద్విజకాంత భాసురవైభవా పరసూదనోగ్ర
దోససంఘవిదూర తోయధితూణ కేసరివిక్రమా గిరిచాపభృత వి

గర్భిత మత్తకోకిల-

దాసకామితదాయి దానవదండి వాసుకిభూషణా 
వాసరాధిపతేజ వాక్పతిసంధ్య వాసకృతాచలా
కాసరాశ్వ మదోరగద్విజకాంత భాసురవైభవా 
దోససంఘవిదూర తోయధితూణ కేసరివిక్రమా 


కందపద్యం -
సీసపద్యంలో మొదటి మూడు పాదాలలోని
ఆరు ఆరు అక్షరాలు, చివరిపాదంలోని 7 అక్షరాలు,
ఎత్తుగీతి(తేటగీతి)లోనిరెండవ పాదంలోని చివరి
4 అక్షరాలు మినహాయించి తీసుకుంటే సరిపోతుంది.
చూడండి-
మరొకవిషయం అవసరమైన చోట
లఘువులు గురువులుగాను

గురువులు లఘువులుగాను
పరిగణించటం చిత్రకవిత్వంలోని
సంప్రదాయం కావున కందపద్యం
చివర లఘువుగాక గురువుగా తీసుకోవాలి.


దాసకామితదాయి దానవదండి వాసుకిభూషణా వరశుభ్రదేహ
వాసరాధిపతేజ వాక్పతిసంధ్య వాసకృతాచలాభవ శార్ఙ్గిరోప
కాసరాశ్వ మదోరగద్విజకాంత భాసురవైభవా పరసూదనోగ్ర
దోససంఘవిదూర తోయధితూణ కేసరివిక్రమా గిరిచాపభృత వి
రతివిధుత నుతిలోల నరరుదితఘన
చండపవన రాజత్కీర్తి శైలజేశ
శంబరారాతిదోర్గర్వ సాగరౌర్వ 
భువనరక్షణసర్వేశ భూతనాధ

 గర్భిత కందపద్యం -

వరశుభ్రదేహ భవ శా
ర్ఙ్గిరోప పరసూదనోగ్ర గిరిచాపభృతా 
వి రతివిధుత నుతిలోల న
రరుదితఘన చండపవన రాజత్కీర్తీ




Wednesday, January 18, 2017

మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 2


మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 2




సాహితీమిత్రులారా!

మహాసేనోదయములోని
రెండవ ఆశ్వాసములోని చిత్రకవిత్వం
ఇక్కడ చూద్దాం -

ఇందులో ఆశ్వాసాంతమున
గర్భకవిత్వం -
ఒకవృత్తములో మరొకవృత్తమును
లేక జాత్యుపజాతుల పద్యములను
ఇమిడించు ప్రక్రియను గర్భకవిత్వము అంటారు.
ఇక్కడ ఒక కందపద్యంనుండి
నాలుగు కందపద్యాలు పొందవచ్చు
అంటే
మొదటి కందపద్యంనుండి
మూడు కందపద్యాలను
మొత్తం నాలుగు కందపద్యాలను
ఒకే కందంలో ఇమిడ్చి వ్రాసినట్లు.
ఇది మన తెలుగులో నన్నెచోడుని
కుమారసంభవము నుండి ప్రారంభమైంది.

చతుర్విధ కందముము- (2-251)

నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

ఈ పద్యంలో ఇమిడిన కందపద్యాలు
మొదటిది-

నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

ఈ పద్యంలోని రంగుల ఆధారంగా 
మొదటి గర్భిత కందం గమనించవచ్చు
ఈ విధంగా అమర్చిన పూర్తి కందమవుతుంది


భవహరణ మధుర భాషణ
నివహా శైలధరశత్రు నిచయవి ఫాలా
నవకమలనేత్ర పాలిత
సవనా నీలాభ్రదేహ సజ్జన పాలా

ఇది పూర్తి కందము

భవహరణ మధురభాషణ
నివహా శైలధరశత్రు నిచయవిఫాలా
నవకమలనేత్ర పాలిత
సవనా నీలాభ్రదేహ సజ్జనపాలా

రెండవ కందము -


నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

ఈ మొదటి కందంలో పూర్వార్థము,  ఉత్తరార్థముములలో 
ఉత్తరార్థము పూర్వార్థంగా పూర్వార్థము ఉత్తార్థంగా మార్చిన 
రెండవ గర్భిత కందమగును.

శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా
నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణమధురభాషణనివహా

మూడవ కందము -


నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

ఈ పద్యాన్ని ఈ విధంగా రంగులలో చూపినట్లు 
తీసుకుంటే మూడవ పద్యం వస్తుంది

నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

నవకమలనేత్ర పాలిత
సవనా నీలాభ్రదేహ సజ్జన పాలా
భవహరణ మధుర భాషణ
నివహా శైలధరశత్రు నిచయవి ఫాలా

ఇది మూడవ గర్భితకందము -

నవకమలనేత్ర పాలిత
సవనా నీలాభ్రదేహ సజ్జనపాలా
భవహరణ మధుర భాషణ
నివహా శైలధరశత్రు నిచయవిఫాలా


Sunday, January 15, 2017

మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 1


మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 1




సాహితీమిత్రులారా!


సంస్కృతంలో కాళిదాసు కుమారసంభవము వ్రాయగా
తెలుగున నన్నెచోడకవిరాజు కుమారసంభవము వ్రాశారు.
ఆధునికకాలంలో శ్రీ కొడవలూరు రామచంద్రరాజు గారు
కుమారసంభవాన్ని మహాసేనోదయ ప్రబంధమనుపేర
మహాకావ్యాన్ని వ్రాశారు. ఇది చిత్రకవిత్వ భరితమైన
కావ్యం దీనిలోని చిత్రకవిత్వాన్ని ఇక్కడ చూద్దాము-

చిత్రకవిత్వంలో పాదగోపనము
గూఢచిత్రం క్రిందికి వస్తుంది
ఇది మహాసేనోదయము
ప్రధమాశ్వాసములో 219వ పద్యంగా ఉంది.
చూడండి-

పాదగోపనము అంటే ఇందులో చాలరకాలు ఉన్నాయి.
ప్రథమపాగూఢము, ద్వితీయపాదగూఢము,
తృతీయపాదగూఢము, చతుర్థపాదగూఢము లేక
గూఢచతుర్థి అనేవికాక మరికొన్ని రకాలున్నాయి.
ఇందలోని పాదగూఢము గూఢచతుర్థి.
అంటే మొదటి మూడు పాదాలలో గోపన
పరచిన అక్షరాలను కలుపగా నాగువపాదము వస్తుంది.
అంటే నాలుగవ పాదము గోపనము లేక గూఢపరచినది.

వనజసమాననేత్రక కృపాజలధీశ సరస్తవ క్షమా
హననదురాసదార్ధిప్రణతా సమరోన్నత సాదరాశయా
మునిమహనీయలాలసవిభూత్యభిసేవన ధూర్తభంజనా

ఈ మూడు పాదాలలో చివరిదైన
నాలుగవ పాదం గూఢంగా ఉంది
అతి ఎలా తెలుసుకోవాలంటే
మొదటి పాదంనుండి ప్రతి మూడవ
అక్షరం తీసుకుంటే 4వపాదం వస్తుంది

వనసమానేత్ర కృపాలధీ సరస్తవ క్షమా
హనదురాదార్ధిప్రణతా మరోన్నత సారాశయా
మునిహనీలాలవిభూత్యభిసేన ధూర్తభంజనా

ఆ అక్షరాలన్నీ కలుపగా
జనకజశస్తమానసప్రసన్న దయామయ సత్యవర్తనా -
అని ఏర్పడుతుంది.
పూర్తి పద్యం క్రింద చూడండి-

వనసమానేత్ర కృపాలధీ సరస్తవ క్షమా
హనదురాదార్ధిప్రణతా మరోన్నత సారాశయా
మునిహనీలాలవిభూత్యభిసేన ధూర్తభంజనా
జనకజశస్తమానసప్రసన్న దయామయ సత్యవర్తనా


ప్రథమాశ్వాసంలో
శబ్దచిత్రంలో భాగమైన ప్రాసచిత్రం సంబంధమైనవి-
ప్రాస అంటే రెండవ అక్షరం
అది రెండవఅక్షరం కాక ఎక్కువగా కూర్చడం
ప్రాసచిత్రంగా చెబుతారు
ఇక్కడ అలా కూర్చబడిన పద్యాలు రెండున్నాయి చూడండి -

శూద్రవర్ణనము - ద్విప్రాసలో కలదు.
రెండు అక్షరాలను ప్రాసగా కూర్చడం ద్విప్రాసము.

రుద్రులు జన్యంబున బల
ద్రులుదోర్బలమునందు బలువితరుణలే
ద్రులు సుగుణసముద్రులు
ద్రులుఁబృధుధైర్యమహిమ నచ్చి శూద్రుల్
                                                                                             (1-202)

రథ వర్ణనమున చతుష్ప్రాసము కలదు-
నాలుగక్షరాలను ప్రాసగా కూర్చడం చతుష్ప్రాసము.

రదంబులు రిపుసేనా
రదంబులు గేతుపవనదారితశుంభ
చ్ఛరదంబులుదగ్రతమం
దరదంబులు మెఱయు నచటఁదతమణిదీప్తిన్
                                                                                         (1-205)

శబ్దాలంకార చిత్రంలో -
ఆశ్వాసాంతమున ముక్తపదగ్రస్తము కూర్చబడింది-
ముక్త పద అంటే విడువ బడిన పదము,
గ్రస్త అంటే తీసుకోబడిన - అని అర్థం.
అంటే ఒకపదాన్ని విడిచి మళ్ళీ తీసుకోవడం
ఇది శబ్దాలంకారాలలోని. ఈ పద్యలో గమనించండి-

అనుపమసత్యవైభవ భవాంబుధితారక తారకాధిరా
డినయనద్వయాద్వయమునీంద్రమనోంబుజవాల వాలవా
వన వనజాసనాద్యమరవంద్యపదా పదజిద్ఘనాఘనా
ఘననమవిగ్రహా గ్రహనికాయ వరాభిజనాభివర్ధనా!

                                                                                                       (1-217)


ముక్తపదగ్రస్తములో ఆంజనేయ స్తుతి(1-8) మరియు
విష్ణుబ్రహ్మేద్రాదులు శూరపద్మాసురుని వధించటానికి
కుమారునిమ్మని ఈశ్వరుని ప్రార్థించే
 సందర్భంలోని పద్యం(1-75)
ఇవి రెండు సీసపద్యాలలో కూర్చబడిన ముక్తపదగ్రస్తాలు


అంత్యప్రాసాలంకారంలో కూర్చబడినది-
బ్రహ్మ స్తోత్రము (1-3)మరియు
ఉమాసమేతుడై శివుడు వృషభారోహణం
చేసి వెళ్ళే సమయంలో కూర్చబడినది.

అసమానకృపాపాంగన్
రసితబకక్రౌంచహంస రాజతే భృంగన్
లసదమలమంగళాంగన్
రసధిమనోవికసనాంతరంగన్ గంగన్
                                                                                  (1-129)

ఆకారచిత్రంలో(బంధకవిత్వం) కూర్చబడినవి-

1. చక్రబంధం (1-76)

2. ఖడ్గబంధం (1-119)

భాషాచిత్రం-
లక్ష్మీదేవి స్తుతి - శుద్ధాంధ్రసీసము(1-2)

ఇవన్నీ ప్రధమాశ్వాసంలోనివే