Showing posts with label భాషాచిత్రం. Show all posts
Showing posts with label భాషాచిత్రం. Show all posts

Friday, July 2, 2021

అంబలిద్వేషిణం వందే

 అంబలిద్వేషిణం వందే




సాహితీమిత్రులారా!



ఈ శ్లోకం చూడండి చమత్కారం గమనించండి.

అంబలిద్వేషిణం వందే చింతకాయశుభప్రదమ్ 
                               (ఊరుపిండీ కృతాసురం)   - పాఠాంతరం
కూరగాయకృతత్రాసం పాలనేతిగవాంప్రియమ్

ఈ శ్లోకంలో 
అంబలిచింతకాయ - కూరగాయ - పాలనేతి - ఊరుపిండీ -అనే పదాలు
చూడగానే మన తెలుగు పదాలనిపిస్తాయి.
కాని కాదు
అందుకే దీన్ని ఆంధ్రభాషాభాసం అనే భాషాచిత్రంగా చెబుతారు.
మరి దీని అర్థం చూద్దాం-

బలిద్వేషిణం - బలిని ద్వేషించిన, అం - విష్ణువును,
వందే - నమస్కరిస్తాను,
చింతకాయ - తనను ధ్యానించువారికి, శుభప్రదమ్ - శుభములు ఇచ్చువాడు,
(ఊరు - తొడలపై, పిండీకృత - నాశనం చేయబడిన, అసురం - మధుకైటభ -
హిరణ్యకశ్యప మొదలైన రాక్షసులు కలవాడు)
కు - ఉరగాయ - చెడ్డ సర్పమునకు (కాళీయునికి),
కృతత్రాస - భయము కలిగించిన, గవాం పాలనే - గోరక్షణలో,
అతిప్రియం - ఎక్కువ మక్కువ ఉన్నవాడు.

మరి ఇవి తెలుగుపదాలు కాదని తెలిసిందికదా!

Saturday, June 12, 2021

ఇవి తెలుగు పదాలేనా?

 ఇవి తెలుగు పదాలేనా?




సాహితీమిత్రులారా!



ఈ శ్లోకం అపభ్రంశ శ్లోకం

కవిత్వంలోని సాంప్రదాయాలు,
కవిసమయాలను గుర్తించి రచనలు చేయాలి
అలా చేయకపోతే ఏలా ఉంటుందో!
ఈ కవి చమత్కరిస్తూ చెప్పిన
శ్లోకం ఇది 

చూడండి-


అస్థివత్ బకవచ్చైవ
చల్లవత్ తెల్లకుక్కవత్
రాజతే భోజ తే కీర్తి
పునస్సన్యాసిదంతవత్


(ఓ భోజమహారాజా!  నీ కీర్తి ఎముకలలా, కొంగలా,
మజ్జిగలా, తెల్లకుక్కలా, మళ్ళీ మాట్లాడితే సన్యాసి
పండ్లలా రాజిల్లుతున్నది - అని భావం.)

దీనిలోని ఉపమానాలన్నీ  హీనోపమానాలే.
ఇటువంటివి వాడకూడదు.
స్త్రీ ముఖం గుండ్రంగా ఉంటే చంద్రబింబంతో పాల్చాలికాని
బండి చక్రంతో పోల్చకూడదుకదా!
అనటానికి ఉదాహరణగా ఈ శ్లోకం చెప్పుకోవచ్చు.

ఆ విషయాలను పక్కనపెడితే
ఇందులోని పదాలు చాలావరకు
మన తెలుగు పదాల్లా ఉన్నాయి.
కావున ఇది భాషాచిత్రంగా చెప్పవచ్చు.


Tuesday, June 8, 2021

రెండిటికి ఒకే సమాధానం

 రెండిటికి ఒకే సమాధానం




సాహితీమిత్రులారా!



ఈ శ్లోకం చూడండి.
ఇందులోని రెండు ప్రశ్నలకు రెండు భాషలలో
ఒకే పదంగా సమాధానం చెప్పాలి.
చూడండి.

రాణస్యకియ ద్వక్త్రం నూపుర: కుత్ర వర్తతే
ఆంధ్రగీర్వాణభాషాభ్యా మేకమేవోత్తరం వద

1. రావణస్యకియ ద్వక్త్రం?
   (రావణునికి ముఖాలెన్ని?)
    - పది (తెలుగు సంఖ్యావాచకము)

2. నూపుర: కుత్ర వర్తతే?
   (అందె ఎక్కడుంటుంది?)
   - పది(పదమునందు)
     (పద్ అనే సంస్కృత పదానికి
      సప్తమీవిభక్తిలో ఏకవచనం - పది)


Sunday, June 6, 2021

అధర మధరమంటే ఆశకాదా విటానామ్

 అధర మధరమంటే ఆశకాదా విటానామ్




సాహితీమిత్రులారా!



సంస్కృత తెలుగు భాషల మిశ్రమంతో చెప్పిన
మణిప్రవాళ పద్యాలు చూడండి-

అమర మమర మంటే ఆశకాదా కవీనాం
అశన మశనమంటే ఆశకాదా ద్విజానామ్
అమృత మమృతమంటే ఆశకాదా సురాణాం
అధర మధరమంటే ఆశకాదా విటానామ్


అమరమంటే కవులకు,
అశన(భోజన)మంటే బ్రాహ్మణులకు,
అమృతమంటే దేవతలకు,
అధరం అంటే విటులకు ఆశకాదా - అని భావం.

ముయ్యవే తలుపు సమ్యగి దానీం
తియ్యవే కుచత టో పరి వస్త్రమ్
ఇయ్యవే మధురబింబమివౌష్ఠం
చెయ్యవే రతిసుఖం మమ బాలే


క్రిందిపదాలకు అర్థాలు చూస్తే
వివరణ అవసరంలేదు చూడండి-

సమ్యక్ - బాగుగా, ఇదానీం - ఇప్పుడు,
కుచతటోపరి - స్తనాలపై భాగాన,
మధురబింబం - తియ్యని దొండపండు,
ఓష్ఠం - పెదవి, మమ - నాకు,
బాలే - బాలికా.


Wednesday, June 2, 2021

సంస్కృతాంధ్రములలో ఒకేమాట సమాధానం

 సంస్కృతాంధ్రములలో ఒకేమాట సమాధానం




సాహితీమిత్రులారా!



ఈ శ్లోకంలోని రెండు ప్రశ్నలను గమనించి
సంస్కృతాంధ్రములలో ఒకేమాట సమాధానం చెప్పండి

ప్రభాతే కీదృశం వ్యోమ?  ప్రమాణే కీదృశం వచ:?
ఆంధ్రగీర్వాణ భాషాభ్యా మేక మేవోత్తరం వద


ప్రశ్నలు -
1. ప్రభాతే కీదృశం వ్యోమ?
    ( ప్రాత కాలంలో ఆకాశం ఎలా ఉంటుంది?)
      - నీతోడు (నీత + ఉడు - తొలగిన నక్షత్రాలు కలది
                      ఇది సంస్కృతపదం)

2.  ప్రమాణే కీదృశం వచ:?

      (ప్రమాణం చేయటానికి ఎటువంటి మాట వాడుతారు?)

        - నీతోడు (ఇది తెలుగుమాట)

రెండు భాషల్లోను
ఒకే పదం నీతోడు అని ఉపయోగించి
సమాధానం చెప్పడం ఎంత చిత్రం
ఇది భాషాచిత్రం నకు చెందినది


Saturday, July 21, 2018

మాయమ్మాన సు నీవే (భాషాచిత్రం)


మాయమ్మాన సు నీవే (భాషాచిత్రం)



సాహితీమిత్రులారా!

నలుగురు కవులు ఓ రాజుని చూట్టానికి వెళ్తే ఒక మంత్రి వాళ్ళకి అడ్డు తగుల్తుంటాడు. ఇలా కాదని వాళ్ళు పల్లెటూరి వాళ్ళ వేషాల్లో ఆ రాజు దగ్గరికెళ్ళి ఓ పద్యం చెప్తారు

మాయమ్మాన సు నీవే
రాయలవై కావ దేవరా జేజేజే
మాయాతుమ లానిన యది
పాయక సంతోసమున్న ఫల మిలసామీ

చదువేమీ రాని వాళ్ళ మాటల్లా అనిపించే ఈ పద్యం నిజానికి తెలుగు పద్యం గానూ, సంస్కృత శ్లోకం గానూ కూడా చదువుకోవచ్చు. ముందుగా, తెలుగు పద్యానికి అన్వయం ఇది దేవరా, జేజేజే, ఇలసామీ (భూమిని పాలించే వాడా), నీవే రాయలవై కావ, సంతోసము, పాయక (విడవకుండా), మాయాతుమలు (మా ఆత్మలు), ఆనినయది (తాకింది), ఉన్నఫలము, మాయమ్మ, ఆన, సు!

ఇదే పద్యం సంస్కృతంలో ఐతే
హే, సునీవే (శుభప్రదమైన మూలధనము కలవాడా), ఆయమ్‌ (రాబడిని), మామాన (లెక్కపెట్టుకో వద్దు), అలవా (ముక్కలు కాని), రాః (ధనము), ఏకైవ (ఒక్కటే), అవత్‌ (కష్టాల్లో రక్షించేది);  అజేజే (యజ్ఞం చేసే), రాజే (రాజు కోసం), మా (లక్ష్మి), ఆయాతు (వస్తుంది), మలాని న (పాపాలు అంటవు); పాయక (ఓ రక్షకుడా), సః (మంచివాళ్ళు), యది (దర్శనానికొస్తే), అసముత్‌ (సంతోషం లేకుండా), నఫల (వాళ్ళని చూడకుండా ఉండొద్దు), మిల (వాళ్ళతో కలువు), అమీ (వచ్చిన మేము), సా (ఆ లక్ష్మీ దేవే అనుకో) ఇంత వ్యవహారం ఉంది ఆ చిన్ని కందంలో!

పింగళి సూరన ” కళాపూర్ణోదయం” లోనిది ఈ భాషాచిత్రం

Sunday, May 27, 2018

భాషాచిత్రం


భాషాచిత్రం




సాహితీమిత్రులారా!

కాళ్ళకూరి నారాయణరావు గారి
పద్యం
మార్నింగు కాగానె మంచమ్ములీవింగు
మొగము వాషింగు చక్కగ సిటింగు

గరికపాటివారి వ్యాఖ్లలో వినండి-

Thursday, April 19, 2018

శ్రీశ్రీగారి - రుబాయత్


శ్రీశ్రీగారి - రుబాయత్




సాహితీమిత్రులారా!



ఒక భాషాపదాలనే కాకుండా అనేక భాషాపదాలను
ఉపయోగిస్తూ వ్రాయడాన్ని మణిప్రవాళ భాష అనడం
జరుగుతున్నన్నది అదే దాన్ని చిత్రకవిత్వంలో
భాషాచిత్రంగా చెప్పుకుంటాం.
ఇక్కడ శ్రీశ్రీగారి ఈ రుబాయత్ చూస్తే
భాషాచిత్రం అర్థమౌతుంది. ఇందులో
పైకి భాషాచిత్రంలా వున్నా భావం వేరేగా
ఉంటుందని గుర్తించాలి.

Charlie Chaplin, Joseph Stalin
Walt Disney, Georges Hunnet
Greta Garbo, Pirandello
ఇటీవల మా inspiration.

Sigmund Freud, Harold Lloyd
Albert Einstein, Jacob Epstein
హరీస్ చట్టో, గిరాం మూర్తీ.
ఇటీవల మా inspiration.

కథాకాలీ కూచిపూడీ
జావా నాట్యం, Russian Ballet
Jazz, Rumba, Carioca
హుషారిస్తాయ్, నిషా చేస్తాయ్.

Don Bradman Mohan Bagan
Walter Lindrum, Vines, Cochet
కొంచె carroms, కాస్త Pin-pong
ఒక cupకాఫీ, ఒక పఫ్ cigarette
తమాంషుద్


- ప్రతిభ త్రైమాసిక, గిడుగు రామూర్తి స్మారక సంచిక - సంపుటి 4 - 1940

Monday, February 26, 2018

పూతమెఱుంగులుం


పూతమెఱుంగులుం



సాహితీమిత్రులారా!



భువన విజయ సభలో ఒకమారు కృష్ణదేవరాయలు
కవితాకళగురించి ఆశువుగా చెప్పినవారికి గండపెండెరము
తొడుగుతానని ప్రకటించాడు దానికి ఎవరు స్పందించక
పోవడంతో కృష్ణదేవరాయలు ఈ విధంగా చెప్పాడు-

ముద్దుగ గండపెండెరమున్ గొనుఁడంచు బహూకరింపఁగా
నొద్దిక నాకొసంగుమని యొక్కరు గోరగలేరు లేరకో

దీనికి అల్లసానిపెద్దన లేచి -
పెద్దనబోలు సత్కవులు పృథ్విని లేరని నీవెరుంగవే
పెద్దనకీదలంచినను బేరిమి నాకిడు కృష్ణరాణ్ణృపా

అని మిగిలిన పద్యం పూరించి ఈ విధంగా
రాయలువారు అడిగిన విధంగా కవితాకళను గురించి
ఆశువుగా చెప్పిన ఉత్పలమాలిక(29 పాదాలు)

  1. పూతమెఱుంగులుం బసరుపూపబెడంగులుఁ జూపునట్టి నా
  2. కైతలు జగ్గునిగ్గునెనగావలెఁ గమ్మునగమ్మనన్వలెన్
  3. రాతిరియుంబవల్ మఱపురాని హొయల్ చెలియారజంపు ని
  4. ద్దాతరితీపులంబలెను దారసిలన్వఁలె లోఁదలంచినన్
  5. బ్రాతిగఁబైకొనన్వలెను బైదలికుత్తుకలోని వల్లటీ
  6. కూతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్
  7. జేతికొలందిఁ గౌఁగిటను జేర్చిన గన్నియచిన్నిపొన్నిమే
  8. ల్మూతల చన్నుదోయివలె ముచ్చటగావలె బట్టిచూచినన్
  9. డాతొడనున్నమన్నులమిటారపు ముద్దుగుమ్మకమ్మనౌ
  10. వాతెఱ దొండపండువలె వాచవిగావలెఁ బంటనూదినన్
  11. గాతలదమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపు
  12. న్మేతెలియబ్బురంపుజిగినిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బపొం
  13. బూతల నున్నకాయ సరిపోడిమి కిన్నెరమెట్లబంతి సం
  14. గాతపు సన్నబంతి బయకారపుఁగన్నడ గౌళవంతుకా
  15. సాతతతానతానల వసం దివుటాడెడు కోటమీటుబల్
  16. మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చతెన్గు లీ
  17. రీతిగ, సంస్కృతంబు పచరించినపట్టున భారతీవధూ
  18. టీ తపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ
  19. భౌతికనాటకప్రకరభారతభారతసమ్మతప్రభా
  20. పాతసుధాప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
  21. జాతకతాళయుగ్మలయసంగతిచుంచువిపంచికామృదం
  22. గాతతతేహిత త్తహితహాదితదంధణుదాణుధింధిమి
  23. వ్రాతలయానుకూలపదవారకహూద్వహహారికింకిణీ
  24. నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝాళఝళీమరంద సం
  25. ఘాతవియద్దునీచకచకద్వికచోత్పలసాసంగ్రహా
  26. యాతకుమారగంధవహహారిసుగంధవిలాసయుక్తమై
  27. చేతము చల్లఁజేయ వలెఁజిల్లునఁజల్లవలె న్మనోహర
  28. ద్యోతక గోస్తనీఫలమధుద్రవగోఘృతపాయసప్రసా
  29. రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున్


దీనిలో ఉన్న ప్రత్యేకత మొదటంతా అచ్చతెనుగు పదాలతో కూర్చి
చివరికి సంస్కృతపదాలతో కూర్చారు పెద్దనగారు. కావున దీన్ని
భాషాచిత్రంగా చెప్పవచ్చు

  1. పూతమెఱుంగులుం బసరుపూపబెడంగులుఁ జూపునట్టి నా
  2. కైతలు జగ్గునిగ్గునెనగావలెఁ గమ్మునగమ్మనన్వలెన్
  3. రాతిరియుంబవల్ మఱపురాని హొయల్ చెలియారజంపు ని
  4. ద్దాతరితీపులంబలెను దారసిలన్వఁలె లోఁదలంచినన్
  5. బ్రాతిగఁబైకొనన్వలెను బైదలికుత్తుకలోని వల్లటీ
  6. కూతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్
  7. జేతికొలందిఁ గౌఁగిటను జేర్చిన గన్నియచిన్నిపొన్నిమే
  8. ల్మూతల చన్నుదోయివలె ముచ్చటగావలె బట్టిచూచినన్
  9. డాతొడనున్నమన్నులమిటారపు ముద్దుగుమ్మకమ్మనౌ
  10. వాతెఱ దొండపండువలె వాచవిగావలెఁ బంటనూదినన్
  11. గాతలదమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపు
  12. న్మేతెలియబ్బురంపుజిగినిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బపొం
  13. బూతల నున్నకాయ సరిపోడిమి కిన్నెరమెట్లబంతి సం
  14. గాతపు సన్నబంతి బయకారపుఁగన్నడ గౌళవంతుకా
  15. సాతతతానతానల వసం దివుటాడెడు కోటమీటుబల్
  16. మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చతెన్గు లీ
  17. రీతిగ, సంస్కృతంబు పచరించినపట్టున 


ఇక్కడి (17 పాదాలు)వరకు అచ్చతెనుగు

ఈ దిగువ నుండి సంస్కృతం ( 12 పాదాలు)

  1.                                                                                భారతీవధూ
  2. టీ తపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ
  3. భౌతికనాటకప్రకరభారతభారతసమ్మతప్రభా
  4. పాతసుధాప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
  5. జాతకతాళయుగ్మలయసంగతిచుంచువిపంచికామృదం
  6. గాతతతేహిత త్తహితహాదితదంధణుదాణుధింధిమి
  7. వ్రాతలయానుకూలపదవారకహూద్వహహారికింకిణీ
  8. నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝాళఝళీమరంద సం
  9. ఘాతవియద్దునీచకచకద్వికచోత్పలసాసంగ్రహా
  10. యాతకుమారగంధవహహారిసుగంధవిలాసయుక్తమై
  11. చేతము చల్లఁజేయ వలెఁజిల్లునఁజల్లవలె న్మనోహర
  12. ద్యోతక గోస్తనీఫలమధుద్రవగోఘృతపాయసప్రసా
  13. రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున్


Saturday, March 4, 2017

వాలెంటైన్స్ డే ఐ నో !


వాలెంటైన్స్ డే ఐ నో !



సాహితీమిత్రులారా!


పువులూరి సుప్రభగారి
భాషాచిత్రం చూడండి
ఆంగ్లంలో కందపద్యాలు కూర్చారు
వేలంటైన్స్ డే సందర్భముగా ఫేస్ బుక్ లో
ఉంచిన పద్యాలు ఇవి చూడండి

Valentines day treats ( English kamdams )
వాలెంటైన్‌ డే ట్రీట్స్‌ ( ఆంగ్ల కందములు )
---------------------------------------------------------
valentines day, I know !
Following the tradition, abiding thy wish
baalaa! proving my love
Holy blessings galore to you , I give now
వాలెంటైన్స్ డే ఐ నో !
ఫాలోయింగ్ ది ట్రెడిషన్‌, ఎబైడింగ్ దై విష్
బాలా! ప్రూవింగ్ మై లవ్,
హోలీ బ్లెస్సింగ్స్ గలోర్ టు యూ ఐ గివ్‌ నౌ

Happy valentine's day
Proper this gift, believe me, finding right one
Topping mine, truly hard !
Super, can't lose, yours - to show to the whole world

హాపీ వాలెంటైన్స్ డే
ప్రాపర్ దిస్ గిఫ్ట్, బిలీవ్ మి, ఫైండింగ్ రైట్ వన్‌,
టాపింగ్ మైన్‌, ట్రూలీ హార్డ్ !
సూపర్, కాన్ట్ లూజ్ , యు వర్స్- టు షో టు ది హోల్ వర్ల్డ్

Sweet as those treats, lovely
Too as the flowers, To think the true love I have
So apt to give you this day
Why ask for transient, the fun that won't last

స్వీట్ యాజ్ దోజ్ ట్రీట్స్, లవ్లీ
టూ యాజ్ ది ఫ్లవర్స్- టు థింక్ ది ట్రూ లవ్ ఐ హావ్‌ !
సో యాప్ట్ టు గివ్‌ యు దిస్ డే
వై యాస్క్‌ ఫర్ ట్రాన్సియెంట్. ది ఫన్‌ దట్ వోంట్ లాస్ట్.


Saturday, December 10, 2016

చెయ్యవే రతిసుఖం మమ బాలే


చెయ్యవే రతిసుఖం మమ బాలే




సాహితీమిత్రులారా!


సంస్కృత తెలుగు భాషల మిశ్రమంతో చెప్పిన
మణిప్రవాళ పద్యాలు చూడండి-

అమర మమర మంటే ఆశకాదా కవీనాం
అశన మశనమంటే ఆశకాదా ద్విజానామ్
అమృత మమృతమంటే ఆశకాదా సురాణాం
అధర మధరమంటే ఆశకాదా విటానామ్

అమరమంటే కవులకు,
అశన(భోజన)మంటే బ్రాహ్మణులకు,
అమృతమంటే దేవతలకు,
అధరం అంటే విటులకు ఆశకాదా - అని భావం.

ముయ్యవే తలుపు సమ్యగి దానీం
తియ్యవే కుచత టో పరి వస్త్రమ్
ఇయ్యవే మధురబింబమివౌష్ఠం
చెయ్యవే రతిసుఖం మమ బాలే

క్రిందిపదాలకు అర్థాలు చూస్తే
వివరణ అవసరంలేదు చూడండి-

సమ్యక్ - బాగుగా, ఇదానీం - ఇప్పుడు,
కుచతటోపరి - స్తనాలపై భాగాన,
మధురబింబం - తియ్యని దొండపండు,
ఓష్ఠం - పెదవి, మమ - నాకు,
బాలే - బాలికా.

Monday, November 7, 2016

కిం వద త్యాతుతో వైద్యం?


కిం వద త్యాతుతో వైద్యం?




సాహితీమిత్రులారా!






ఈ శ్లోకం చూడండి-

కిం వద త్యాతుతో వైద్యం? వాజిశాలా చ కీ దృశీ?
ఆంధ్రగీర్వాణ భాషాభ్యాం ఏకమేవోత్తరం వద


ఇందులో రెండు ప్రశ్నలు ఉన్నాయి.
వాటిలోని ప్రశ్నలకు
తెలుగు, సంస్కృతభాషలలో
సమాధానం ఒకటే పదంగా ఉండాలి-
ఆలోచించండి-

1. కి వద త్యాతుతో వైద్యం?
   (రోగి వైద్యుని ఏమని కోరతాడు?)
2. వాజిశాలా చ కీ దృశీ?
  (గుఱ్ఱపుశాలను ఏమంటారు)

రెండింటికి సమాధానం - మందురా

1. కి వద త్యాతుతో వైద్యం?
   (రోగి వైద్యుని ఏమని కోరతాడు?)
    రోగి వైద్యుని మందురా
    (మందుతీసుకొనిరారా) అంటాడు(ఇది తెలుగు)

2. వాజిశాలా చ కీ దృశీ?
    (గుఱ్ఱపుశాలను ఏమంటారు?)
     గుఱ్ఱాలచావిడిని సంస్కృతంలో మందురా అంటారు

Sunday, September 25, 2016

ప్రమాణం చేయటానికి ఏమాట వాడుతారు?


ప్రమాణం చేయటానికి ఏమాట వాడుతారు?


సాహితీమిత్రులారా!


ఈ శ్లోకంలోని రెండు ప్రశ్నలను గమనించి
సంస్కృతాంధ్రములలో ఒకేమాట సమాధానం చెప్పండి

ప్రభాతే కీదృశం వ్యోమ?  ప్రమాణే కీదృశం వచ:?
ఆంధ్రగీర్వాణ భాషాభ్యా మేక మేవోత్తరం వద

ప్రశ్నలు -
1. ప్రభాతే కీదృశం వ్యోమ?
    ( ప్రాత కాలంలో ఆకాశం ఎలా ఉంటుంది?)
      - నీతోడు (నీత + ఉడు - తొలగిన నక్షత్రాలు కలది
                      ఇది సంస్కృతపదం)

2.  ప్రమాణే కీదృశం వచ:?
      (ప్రమాణం చేయటానికి ఎటువంటి మాట వాడుతారు?)
        - నీతోడు (ఇది తెలుగుమాట)

రెండు భాషల్లోను
ఒకే పదం నీతోడు అని ఉపయోగించి
సమాధానం చెప్పడం ఎంత చిత్రం
ఇది భాషాచిత్రం నకు చెందినది

Friday, September 23, 2016

నూపుర: కుత్ర వర్తతే?


నూపుర: కుత్ర వర్తతే?


సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి.
ఇందులోని రెండు ప్రశ్నలకు రెండు భాషలలో
ఒకే పదంగా సమాధానం చెప్పాలి.
చూడండి.

రాణస్యకియ ద్వక్త్రం నూపుర: కుత్ర వర్తతే
ఆంధ్రగీర్వాణభాషాభ్యా మేకమేవోత్తరం వద

1. రావణస్యకియ ద్వక్త్రం?
   (రావణునికి ముఖాలెన్ని?)
    - పది (తెలుగు సంఖ్యావాచకము)

2. నూపుర: కుత్ర వర్తతే?
   (అందె ఎక్కడుంటుంది?)
   - పది(పదమునందు)
     (పద్ అనే సంస్కృత పదానికి
      సప్తమీవిభక్తిలో ఏకవచనం - పది)

Wednesday, September 21, 2016

మణిప్రవాళ శైలి

మణిప్రవాళ శైలి


సాహితీమిత్రులారా!


అనేక భాషల మిశ్రమంతో వ్రాసిన అంశాన్ని
మణిప్రవాళ శైలిలో ఉంది  అంటాము.
ఇది మన గురజాడవారి కన్యాశుల్కంలోని
కొన్ని విషయాలను చూచి గమనిద్దాం.


కన్యాశుల్కము ప్రథమాంకంలో
గిరీశం - యీ వ్యవహార మొహటి ఫైసలైంది.
            ఈ రాత్రికి మధురవాణికి సార్టింగ్
            విజిట్ యివ్వంది పోకూడదు.
      నీ సైటు నాడిలైటు
      నిన్ను మిన్న
       కానకున్న
       క్వైటు రెచడ్ ఫ్లైటు
       మూనులేని నైటు

బంట్రోతు -
ఫుల్లుమూను లైటటా
జాసమిన్ను వైటటా
మూను కన్న
మొల్ల కన్న
నీదు మోము బ్రైటటా
టా! టా!  టా!
పంచమాంకంలో
పూజారి - మా మధురవాణిమీద ఆశుకవిత్వం చెబుతాను
       రాణా, డైమండ్ రాణీ
       రాణా, యిస్పేటు రాణి రాణికళావ
       ఱ్ఱాణా, ఆఠీన్రాణీ
       రాణియనన్మధురవాణె, రాజులరాణి

దీనిలో ఎక్కువభాగం ఇంగ్లీషు పదాలను
తక్కువగా తెలుగు పదాలను వాడాడు.

Thursday, September 15, 2016

కస్మై ప్రసీదతే విష్ణు:?


కస్మై ప్రసీదతే విష్ణు:?



సాహితీమిత్రులారా!



ఈ శ్లోకంలో రెండు ప్రశ్నలున్నాయి వాటి
సమాధానం (రెండిటికి) ఒకే పదంలో చెప్పాలి
అదీ మొదటిదానికి సంస్కృతంలోను,
రెండవదానికి ఆంధ్రం(తెలుగు)లోను సమాధానం
అయి ఉండాలి. ఆ శ్లోకం -

కస్మై ప్రసీదతే విష్ణు:? కిమాంధ్రాణా మతిప్రియమ్?
ఆంధ్రగీర్వాణ భాషాభ్యామేక మేవోత్తరం వద

1. కస్మై ప్రసీదతే విష్ణు:?
     విష్ణువు ఎవరికి ప్రసన్నుడౌతాడు?
   - చింతకాయ(తనను గూర్చి ధ్యానించు వానికి)
    ఇది సంస్కృతపదం, చతుర్ధీ విభక్తి.

2.   కిమాంధ్రాణా మతిప్రియమ్?
      తెలుగువారికి ఏది ఎక్కువ ప్రియమైనది?
   - చింతకాయ (తెలుగు పదం)

Wednesday, August 31, 2016

దేవవరా తుమ్హీచ గురుదేవ


దేవవరా తుమ్హీచ గురుదేవ


సాహితీమిత్రులారా!

వృషాధిపశతకంలోని
భాషాచిత్ర పద్యం చూడండి.
ఇది మహారాష్ట్రభాషా పదాలతో
ఉత్పలమాల పద్యం కూర్చబడినది.

దేవవరా తుమ్హీచ గురుదేవ మ్హణూనుతరీ తుమ్హీచ గో
సావతురాతుమ్హీచ తుమసాచప్రసాద అమీకృపాకరా
యీవగదా యటంచు నుతించెద నిన్నును నారెభాష దే
వా వినుతార్యలీల బసవా బసవా బసవా వృషాధిపా
                                                                  (వృషాధిప శతకం - 58)

దేవవరాతుమ్హీచ - నీవే దేవోత్తముడవు,
గురుదేవ - గురుదేవుడవని,
మ్హణూనుతరీతుమ్హీచ - నిన్ను చెప్పెదను,
గోసావతురాతుమ్హీచ - నీవు వృభేశ్వరుడవు,
తుమసాచ ప్రసాద - నీయొక్క అనుగ్రహముతో,
అమీకృపాకరా - నన్ను దయజూచువాడవు,
ఈవగదా - నీవేకదా, అటంచు - అంటూ,
నుతియించెద - కీర్తంచెదను, నిన్నును,
ఆరెభాషన్ - మహారాష్ట్రభాషలో, దేవా - ప్రభువా,
వినుత +ఆర్యలీల - పొగడబడిన పూజ్యవిలాసము కలవాడా!

Sunday, August 28, 2016

పరమపురుషా నా దైవమా!


పరమపురుషా నా దైవమా!


సాహితీమిత్రులారా!


ఈ పద్యం వృషాధిపశతకం లోనిది ఇది
తమిళ తెలుగు భాషలతో బసవేశ్వరుని స్తుతించినది ఈ పద్యం
దీన్ని భాషాచిత్రంగా చెప్పవచ్చు.
తమిళ-తెలుగు పదాలతో చంపకమాల పద్యం కూర్చటం
దీనిలోని ప్రత్యేకత.

పరమనె యన్నెయాండవనె పన్నగతానె యనాథనాథనే
పెరియవనే పుళిందవనె పేరుయానె పిరానె యప్పనే
తరిమురియయ్యనే యనుచు ద్రావిడభాష నుతింతు మన్మనో
వర కరణావిధేయ బసవా! బసవా! బసవా! వృషాధిపా!
                                                                        (వృషాధిప శతకము - 56)

పరమనె = పరమపురుషా, అన్నెయాండవనె = నా దైవమా,
పన్నగ తానె = నాగ(భూషణ)ధరా,
అనాథనాథనే = దిక్కులేని వారికి దిక్కైన వాడా,
పెరియవనే = పెద్దయ్యా,
పుళిందవనె = పవిత్రము చేయువాడా,
పేరుడయానె = ప్రఖ్యాతుడా,
పిరానె = దేవా, అప్పనే = తండ్రీ,
తరిమురియయ్యనే = ప్రియమైన తండ్రీ,
అనుచు, ద్రావిడభాష నుతింతు = తమిళంభాషలో  పొగడెదను,
మనమనోవర = నా మనోనాథుడా!,
కరుణావిధేయ = కరుణకు స్థానమైనవాడా!

Wednesday, August 10, 2016

ముండలా: కొడుకులెల్ల హసంతి


ముండలా: కొడుకులెల్ల హసంతి


సాహితీమిత్రులారా!

పెద్దిభట్టు (కోలాచలం మల్లినాథసూరి) భార్యను
ఒకప్పుడు అతిథులకు అన్నం పెట్టమనికోరగా
ఆమె ఆయనతో ఈ విధంగా చెప్పిందట చూడండి.

తిండికై తె బహుమంది వసంతి
తండులాలు సుతరాము న సంతి 
కుండలెల్ల నడుమింట లుఠంతి
ముండలా: కొడుకులెల్ల హసంతి


అని చెప్పిందట.

Monday, August 8, 2016

వైదుష్య మేకం విదుషాం సహాయమ్


వైదుష్య మేకం విదుషాం సహాయమ్


సాహితీమిత్రులారా!

మల్లినాథసూరి అను నామాంతరము గల పెద్దిభట్టు
ఒకరోజు సింగభూపాలుని సభకు రాజదర్శనార్థం పోతుండగా,
చీఁకిరి బాఁకరి  చినిగిన పాతబట్టలతో వంకర టింకర కర్రచేత పట్టుకొని ఉన్న
ఆయనను కొందరు "తాతా ఏమిటి ఇలాంటి వేషంలో వెళుతున్నావే?" అని
అడగ్గా ఆయన చెప్పిన శ్లోకం -

కిం వాససా చీకిరి బాకిరేణ 
కిం దారుణా వంరకటింకరేణ 
శ్రీసింగభూపాల విలోకనార్థం 
వైదుష్య మేకం విదుషాం సహాయమ్

(పల్లకీలు లేకపోతేనేమి పల్లకీకి చీకిరి బాకిరి కుచ్చులు
వంకరటింకర బొంగు ఉంటుంది సింగభూపాలుని దర్శనానికి
గణాధిపతి ప్రసాదంకలిగినవాడిని
నాకు వేరే సహాయం అక్కరలేదు - అని భావం)
ఇందులో చీకిరి బాకిరి, వంకర టింకర
లాంటివి తెలుగు పదాలుగా అనిపిస్తున్నాయి కదా!