Monday, May 30, 2022

భారవి - ద్వ్యక్షరి

 భారవి - ద్వ్యక్షరి




సాహితీమిత్రులారా!



భారవి కృత కిరాతార్జునీయంలోని

ద్వ్యక్షరి - ఇది 15వ సర్గలో38వ శ్లోకం


చారు చుంచుశ్చిరారేచీ చంచచ్చీరుచా రుచః

చచార రుచిరశ్చారు చారైరాచార చుంచురః


దీనిలో రెండు హల్లులనే ఉపయోగించారు

చ, - అనే రెండు హల్లులు. దీనిలో 

శ - హల్లు రెండుపాలలో కనిపిస్తుంది

కానీ అది సంధుల వల్ల వచ్చించే అది

లెక్కలోకి రాదు.

చారచుంచుః - గతి విశేషాలు తెలిసినవాడు, చిరారేచీ - శత్రువులను

చాలసేపు విఫలంచేసేవాడు, చంచచ్చీరుచా - వదిలే ఉత్తరీయంతో అందమైనవాడు, 

రుచః - ప్రకాశిస్తున్నవాడు, రుచిరః - అందమైనవాడు,

ఆచారచుచగరః - యుద్ధనియమాలు బాగా పాటించే(ముని), 

చారుచారైః - చక్రబంధగతులతో, చచార - తిరిగాడు.

Saturday, May 28, 2022

అసలు పదమేదో తెలపండి

 అసలు పదమేదో తెలపండి




సాహితీమిత్రులారా!



పొడుపుపద్యం విప్పండి-

పదము చెెలునొందు నక్షరపంచకమున

మొదలు వదలిన "ముంగిస" పొదలు, దాని

తలనరికి వేయ "వంశంబు" నిలిచి యుండు

అసలు పదమేదొ తెలియుడీ రసికులార


సమాధానం - ఇనకులము

దీనిలో మొదటి అక్షరం తీసివేసిన - నకులము (ముంగిస)

నకులంలో మొదటి అక్షరం తీసివేసిన - కులము(వంశము)

Tuesday, May 24, 2022

దీనీ భావమేమి? ధీవరేణ్య!

 దీనీ భావమేమి? ధీవరేణ్య!




సాహితీమిత్రులారా!



పొడుపు పద్యం విప్పండి-


ఉదయసంధ్య నవ్వులొలికించు కొన్నాళ్ళు

కొసరి అసుర సంధ్య కొన్నినాళ్లు

హైందవులకు పురుషు డప్రాచ్యులకు కాంత

దీని భావమేమి? ధీవరేణ్య!


ఉదయంపూట  కొన్నాళ్లు, సాయంకాలపూట కొన్నాళ్లు

కనిపిస్తాడు. హిందువులు మగవాడుగా 

పశ్చిమదేశాలవాళ్లు స్త్రీగా భావిస్తారు - ఎవరో కనుగొనాలి


సమాధానం - శుక్రగ్రహం

Saturday, May 21, 2022

వర్ణచ్యుతచిత్రం (హిందీ)

 వర్ణచ్యుతచిత్రం (హిందీ)




సాహితీమిత్రులారా!



అమీర్ ఖస్రూ -  వర్ణచ్యుతకం(హిందీ) చూడండి-

ఆది కటే తే సబకో సాలై - మధ్య కటే తే సబకో శాలై

అన్త కటేతే సబకో మీఠా - సో ఖుసరోగై ఆంఖేఁదీఠా 


ఆదివర్ణం తొలగిస్తే అది అందరిని రక్షిస్తుంది

మధ్యాక్షరం తొలగిస్తే అది కాలాన్ని చెబుతుంది

చివరి అక్షరం తొలగిస్తే అది తియ్యదనాన్ని చెబుతుంది

ఆ పదం ఏదో చెప్పండి-


సమాధానం - కాజల

దీనిలో మొదటి అక్షరం తీసివేస్తే - జల  ఇది అందరినీ రక్షిస్తుంది

మధ్య అక్షరం తీసివేస్తే - కాల ఇది సమయం, యముడు మొదలైనవి

చివరి అక్షరం తీసివేస్తే - కాజ ఇది ఒక తీపి పదార్థం ఇంకావేరే అర్థాలున్నాయి


Thursday, May 19, 2022

వీటికి సమాధానాలు చెప్పండి?

 వీటికి సమాధానాలు చెప్పండి?




సాహితీమిత్రులారా!



ఈ పద్యాన్ని చదివి వాటిలోని ప్రశ్నలకు 

సమాధానాలు చెప్పండి-


అర్థి నెవ్వడు పోషించు ననవరతము?

సోముదల దాల్చు సద్గుణస్తోముడెవడు?

రాము గర్వంబడంచిన రాజెవండు?

ఉన్నయవియాదులనె వీని యుత్తరములు


ఈ పద్యంలో మూడు ప్రశ్నలున్నాయి

వాటికి సమాధానాలు కూడ ప్రశ్నల్లోనే ఉన్నాయని

పద్యం చెబుతోంది 

వాటి మొదట్లోనే సమాధానాలున్నాయట

గమనించండి

అర్థి నెవ్వడు పోషించు ననవరతము - దీనిలో మొదటి పదం అర్థి

సోముదల దాల్చు సద్గుణస్తోముడెవడు - దీనిలో మొదటి పదం సోము

రాము గర్వంబడంచిన రాజెవండు - దీనిలో మొదటి పదం - రాము

సమాధానాలు


Tuesday, May 17, 2022

ఇవేమిటో చెప్పండి?

 ఇవేమిటో చెప్పండి?




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు విప్పండి

లోనతీపి ఒకటి

పైన తీపి ఒకటి

అంతా తీపి ఒకటి

ఇవేమిటో చెప్పండి?



సమాధానం - లోనతీపి - అరటి

                  పైత తీపి - ఖర్జూరం

                  అంతా తీపి - బెల్లం

Sunday, May 15, 2022

పరాయిదాని మొగుణ్ణి పక్కనేసుకొని............

 పరాయిదాని మొగుణ్ణి పక్కనేసుకొని............




సాహితీమిత్రులారా!



పొడుపుకథను విప్పండి-


అరలోపల తెరగట్టుకొని

తెరలోపల మంచమేసుకొని

పరాయిగాని మొగుణ్ణి

పక్కలో వేసుకొని

తన మొగునికి తాంబూల మిచ్చె



సమాధానం - బాలింత

                 అన్వయించుకొని గమనించండి


Friday, May 13, 2022

ఎక్కేదేందిరా కారేదేందిరా

 ఎక్కేదేందిరా కారేదేందిరా




సాహితీమిత్రులారా!



పొడుపుకథను విప్పండి-


ఏసేదేందిరా ఎక్కేదేందిరా కారేదేందిరా

కట్టేదేందిరా ఏసేది నిచ్చెనా - ఎక్కేది మనిషిరా,

కారేది కల్లురా - కట్టేది లొట్టిరా,

నిలబడ్డదేందిరా - కూసున్న దేందిరా

కాళ్ళసందుందేందిరా కారేది యేదిరా

నిలబడ్డది బర్రెరా - కూసుంది మనిషిరా,

కాళ్ల సందుంది చెంబురా - కారేది పాలురా


సమాధానం - అన్నిటికి పొడుపులోనే ఉన్నయి సమాధానాలు

Wednesday, May 11, 2022

ఈ పద్యానికి అర్థం చెప్పండి

 ఈ  పద్యానికి అర్థం చెప్పండి




సాహితీమిత్రులారా!



ఈ పద్యం అర్థం చెప్పండి



Monday, May 9, 2022

వేంకటాద్రి గుణరత్నావళి - చిత్రవిజ్ఞాపనమ్

 వేంకటాద్రి గుణరత్నావళి - చిత్రవిజ్ఞాపనమ్




సాహితీమిత్రులారా!



అలంకారిక శేఖర, సాహిత్యరత్నాకర, వ్యాకర్తా

చర్ల వేంకటశాస్త్రి మహాకవిగారు వేంకటాద్రి గుణరత్నావళి

అనే సంస్కృత అలంకార శాస్త్రం కూర్చారు. ఈ అలంకార లక్షణాలకు

రాజావాసిరెడ్డి వెంకటాద్రి ప్రభువుగుణాలను లక్ష్యాలుగా కూర్చారు.

ఈ గ్రంథంలో ఒక చిత్రవిజ్ఞాపనం ఉంది అదేమంటే

ఈ విజ్ఞాపనమ్ లో 32 అక్షరాలు వరుసగాను క్రిందికి 32 వరుసలు శ్లోకాలు కూర్చబడినవి. 

ఇందులో అంకెలగుర్తులున్న గళ్లను వరుసగా పైనుండి దిగువకు చదివిన 

రాజాగారికి విజ్ఞాపనమ్ వస్తుంది. అడ్డంగా చదివిన వినాయకుని కథ వస్తుంది.

దీనిలో ఇదిగాక ఒక పుష్పమాలికా బంధం కూర్చబడింది.



Saturday, May 7, 2022

సుష్మాస్వరాజ్ - సంస్కృతం గొప్పదనం

 సుష్మాస్వరాజ్ - సంస్కృతం గొప్పదనం




సాహితీమిత్రులారా!

స్వర్గీయ సుష్మాస్వారాజ్ గారు ఒక సభలో

సంస్కృతభాష గొప్పదనాన్ని చెబుతూ

చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరు వినదగ్గవి

ఆస్వాదించండి-



Thursday, May 5, 2022

మూడుకాళ్ల ముసలిదంట

 మూడుకాళ్ల ముసలిదంట




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు విప్పండి-

మూడుకాళ్ల ముసలిదంట, వీపు మీద

నోరంట, కవలమెత్తి చేతికిస్తే కమ్మగా దిగమింగునంట,

దాని అర్థం తెలీదు, దాని భోగం తెలీదు, అన్నపేరు

సిద్ధు గురువుని అడిగి తెలుసుకో


సమాధానం-   గానుగ


Tuesday, May 3, 2022

ఒక్కొక్క గుడిలో పెట్టిన పూలెన్ని?

 ఒక్కొక్క గుడిలో పెట్టిన పూలెన్ని?




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు కథకు సమాధానం చెప్పండి-


మూడు గుళ్లు, గుళ్లముందు గుడాలు

గుండంలో ముంచితే ఉన్నపూలు రెట్టింపవుతాయి

వాటిని సమానంగా ఉంచగా మిగులుండవు

మొదట తెచ్చిన పూలెన్ని

ఒక్కొక్క గుడిలో పెట్టిన పూలెన్ని?


సమాధానం -

భక్తుడు 7 పూలతో వట్తాడు. మొదటి గుండంలో మునుగుతాడు

అవి 14 పూలవుతాయి. అందులో 8 పూలను ఆ గుడిలోని దేవుని సమర్పిస్తాడు. 

మిగిలిన 6 పూలతో రెండవ గుడి ముందున్న గుండంలో 

మునుగుతాడు. పూలు 12 అవుతాయి. రెండవ గుడిలో దేవునికి 8 పూలను సమర్పిస్తాడు. 

ఇంక నాలుగు పూలతో మూడవ గుడి ముందున్న గుండంలో మునిగితే నాలుగు పూలు 8

 పూలవుతాయి. ఆ 8 పూలను మూడవగుడిలోని దేవునికి సమర్పించి వెళ్లిపోతాడు.


Sunday, May 1, 2022

శివకర్ణామృతంలోని ఏకాక్షరి

 శివకర్ణామృతంలోని ఏకాక్షరి




సాహితీమిత్రులారా!

భరద్వాజమునికృత శివకర్ణామృతంలోని

మూడవభాగంలో 32వ శ్లోకం 

ఏకాక్షరి - త అనే హల్లుతో కూర్చబడింది


తతాతీతి తతాతైత తాతతాత - తతోతతిః

తాతితాం తాంత తుత్తాతాం తాం తాం తత్తా తతే తతాత్


వాయువును అతిక్రమించు ఆకాశస్వరూపం కలవాడా

నీ వాద్యం నుండి తాతతాత తతోతతి తాతితాంతాం 

తతుత్తా తాతాం అను మృదంగాది ధ్వనులు 

విస్తృతములై ఒప్పుచున్నవి - అని భావం