Showing posts with label వీటికి అర్థం చెప్పగలరు. Show all posts
Showing posts with label వీటికి అర్థం చెప్పగలరు. Show all posts

Friday, November 26, 2021

వీటి అర్థం చెప్పగలరు

 వీటి అర్థం చెప్పగలరు




సాహితీమిత్రులారా!



ఈ పద్యాలకు అర్థాలను

చెప్పండి


గ్రుడ్డు బిడ్డన్న దొరఁగన్న కొడుకుకన్న

పిన్నయాతని పినతండ్రి పెద్దకొడుకు

ప్రభువు తమ్మునిచే నాజిఁబడినవాని

తండ్రితమ్ముని పురమును స్థలము చెపుమ


వాసవి రవి సోమాదులు

వాసవి రవి సోమరవులు వాసవిరవులున్

వాసవులు రవులు సోములు

వాసవి రవిసోమనాథు వాకిటభృత్యుల్


వీటి అర్థాలను కామెంట్స్ లో పెట్టగలరు.

Monday, November 22, 2021

వీటికి అర్థం వివరించండి

 వీటికి అర్థం వివరించండి




సాహితీమిత్రులారా!



ఈ పద్యాలకు అర్థం వివరించండి-


వనచరు కూరిమి తమ్ముని

వెనుకాతని యాలిసుతుని వేడుక మామన్

గనుఁగొన్నతండ్రి తాతను

విను మామ్రొక్కించుకొన్న వీరుండితఁడే


ఖగవైరి వైరి వాహను

ఖగ సుతునకు మిత్రవైరి ఖగపత్రేశున్

ఖగ సూనుమేన మామయు

ఖగధారుఁడు వినగదమ్మ కంజదళాక్షీ


వీటి అర్థం కామెంట్స్ లో తెలుపగలరని మనవి

Saturday, November 13, 2021

వీటికి అర్థం చెప్పగలరు

 వీటికి అర్థం చెప్పగలరు




సాహితీమిత్రులారా!



ఈ క్రింది పద్యాలకు అర్థం చెప్పగలరని మనవి-


మగని దిగనాడి వగలాడి తగులుకొన్న

యతని పట్టపుదేవి, దానబ్బడాలు

దాని మిండడి కొడుకైన వానితల్లి

సిరులు మాకిచ్చు నెప్పట్ల కరుణవెలయ


గ్రుడ్డికొమరుని దునిమిన దొడ్డవాని

కన్న తండ్రికి తండ్రినకెగన్నదోయి

కొమ్మకోడలు పెనిమిటి తమ్మునణచె

గిత్తుకంటియు మిమ్ము, రక్షించుగాక


పతిసుతుకుం బ్రతిగాఁగొను

నతిసుతుఁ జెఱఁకొన్న జెట్టి జనకుని జనకున్

క్షితిగన్న దాని గను దు

ర్మతి కరు, యా కోమలాంగి రక్షించు మిమున్


వీటికి అర్థాలు చెప్పగలవారు కామెంట్స్ లో

తెలుపగలరు