Showing posts with label ఏకాక్షర నిఘంటువు. Show all posts
Showing posts with label ఏకాక్షర నిఘంటువు. Show all posts

Thursday, February 2, 2017

ఏకాక్షర నిఘంటువు - 60


ఏకాక్షర నిఘంటువు - 60




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి......


బమ్ - కలహము, గర్వము

బంధ్ - కట్టు, చెఱబట్టు, సంకెలవేయు

బింద్ - చీల్చు, విభజించు

బుధ్ - ఎరుగుట, గమనించుట, ఆలోచించుట,
                 మేల్కొనుట, తెలివినొందుట

బృంహ్ - పెరుగుట, వృద్ధినొందుట, గర్జించుట

బ్రూ - చెప్పుట

రా - ఇచ్చుట


శీ - నిద్రించుట

హా - వెళ్ళుట

శో - తగ్గుట, కృశించుట

వ్యధ్ - కొట్టుట

హృష్ - హర్షించుట

సూ - స్రవించుట

******************************************************
ఇది 60వ రోజు ఏకాక్షర నిఘంటువు మొదలు పెట్టి.
ఇక్కడితో దీన్ని నిలిపి మిగిలినవి మరోమారు మీముందుంచగలను
దీనిని కూర్చుటకు నాకు ఉపయుక్తమైన నిఘంటువులు-

1. అమరకోశము
2. త్రికాండశేషము
3. మేదినీ కోశము
4. విశ్వకోశము
5. ధనంజయ నిఘంటువు
6. హారావళి
7. నానార్థరత్నమాల
8. శబ్దకల్పద్రుమమ్
9. పారమార్థిక పదకోశం
10. విద్యార్థి కల్పతరువు
11. సంస్కృతాంధ్ర నిఘంటువు- వెత్సా వెంకటశేషయ్య
12. సంస్కృతాంధ్ర నిఘంటువు - చెలమచెర్ల వేంకట శేషాచార్యులు
13. సంస్కృత వ్యాకరణమ్ - శ్రీకృష్ణానంద మఠం
14. Prin. V.S.Apte's The Practical  Sanskrit - English - Dictionary (3 parts)

******************************************************


Wednesday, February 1, 2017

ఏకాక్షర నిఘంటువు - 59


ఏకాక్షర నిఘంటువు - 59



సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


పూర్ - పట్టణం, నింపుట, సంతోష పెట్టుట,
                  గాలితో నింపుట, తృప్తిపరచు, పటిష్టము చేయు

పృ/ పౄ - కార్యనిమగ్నుడగుట, ఉంచు, నింపు,
                           బయటకు తెచ్చు, అవ్వలి దరిచేరు,
                           నిర్వహింపజాలు, కాపాడు

పృచ్ - కలియు, తాకు, తృప్తి పరచు, పెంచు

ప్రచ్ఛ్ - అడుగుట, వెదకుట

ప్రాచ్ - ముందున్న, తూర్పునందున్న, తూర్పుదేశమువాడు

ప్రాంచ్ - పూర్వికుడు

ప్రీ - సంతోషపెట్టు, తృప్తి పరచు, దయతో మాటలాడు,
            సంతోషించు

ప్రః - జడ

ప్రాక్ - గడచిన కాలము, తూర్పుదిక్కు,
                 తూర్పుదేశం, ముందు(మొదట)

ఫట్ - విఘ్నము

ఫల్ - కాచు, పండు, సఫలమగు, ఫలితమునిచ్చు

ఫా - కఠినోక్తి, ఆట, గుడిసె

ఫాట్ - ఓయి


Tuesday, January 31, 2017

ఏకాక్షర నిఘంటువు - 58


ఏకాక్షర నిఘంటువు - 58




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


పక్ష్ -  స్వీకరించుట

పచ్ - వండుట

పండ్ - పోవుట, ప్రోగగుట

పద్ - పోవు, పోవుట, పొందు, కదలు, చేరు, పొందు,
               సంపాదించు, పరిశీలించు, అభ్యసించు

పీ - త్రాగుట

పీడ్ - బాధించు, గాయపరచు, పీడించు,
               వ్యతిరేకించు, పిండు, నాశనంచేయు

పమ్ - వ్రతము, కూడు

పః - కొండ, ప్రకాశము, కౌస్తుభరత్నము,
           క్షణకాలము, శుభలగ్నము

పాట్ - సంబోధనార్థకము

పూః (పుర్) - వాయువు, పట్టణం, నిండించుట,
                                 శరీరము, బుద్ధి

పుష్ - పోషించుట, పెంచుట

పుష్ప్ - వికసించు, తెఱచుకొను

పూ - పవిత్రము చేయు, శుభ్రముచేయు

పూజ్ - గౌరవించు, ఆదరించు


Monday, January 30, 2017

ఏకాక్షర నిఘంటువు - 57


ఏకాక్షర నిఘంటువు - 57




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


ని - నిశ్చయము, నిషేధము, సంశయము, సామీప్యము

నిట్ - రాత్రి

నింద్ - నిందించు, తిట్టు, తప్పులు వెదకు

నీ - తీసుకొని పోవుట, తెచ్చుట, చేర్చుట

ను - ప్రశ్న, వికల్పము, ఈవిధంగా ఆవిధంగా అని ఊహించడం
            (ఈ రెండింటిలో ఒకవిధము), ప్రతిమాయ తెలుసుకొనగోరుట,
            పాదపూర్తి, దుఃఖము, కొంచెము

నుః - బాణము, ఓడ, కాలము, స్తుతి

నుద్ - ప్రేరణచేయు, ప్రోత్సహించు, తొలగించు

నృ - మనుష్యుడు

నృత్ - నాట్యము చేయుట, ఆడుట

నో - లేదు, కాదు

న్యంచ్ - క్రిందికి వంగిన, కుఱుచని



Sunday, January 29, 2017

ఏకాక్షర నిఘంటువు - 56


ఏకాక్షర నిఘంటువు - 56




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........



 - లేదు, కాదు, ఒద్దు

నమ్ - పారమార్థికగా ముక్తిని, లౌకికంగా భుక్తిని 
                 ప్రసాదించే శక్తిగల బీజాక్షరం, వంగు, నమస్కరించు

నద్ - ధ్వనించు, ప్రతిధ్వనించు, మాటలాడు, 
               అఱచు, గర్జించు

నంద్ - సంతోషించు, ఆనందించు, తృప్తిపడు

నయ్ - పోవు, కాపాడు

నర్ద్ - ఱంకెవేయు, అఱచు, గర్జించు, కదలు

నశ్ - నశించు, అగపడకుండు, చచ్చు

నహ్ - కట్టు, బంధించు, చుట్టు, ధరించు

నాథ్ - అడుగు, కోరు, అధిపతియగు, కష్టపెట్టు, ఆశీర్వదించు

న్యఙ్ - పొట్టివాడు

నఞ్ - లేదు కాదు అని అర్థాన్నిచ్చేది.

నా - లేదు,కాదు, మగవాడు, గండ్రగొడ్డలి, శంకరుడు

Saturday, January 28, 2017

ఏకాక్షర నిఘంటువు - 55


ఏకాక్షర నిఘంటువు - 55




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


ధు/ధూ  - కదల్చుట, దించుట, తొలగించుట, విసరివేయుట,
                         ఊదుట, నాశనముచేయుట, ప్రజ్వలింపచేయుట,
                         గాయపరచుట

ధుక్ష్ - ప్రజ్వలింపచేయుట, బ్రతుకుట, కష్టములనుభవించుట

ధుర్ - కాడి, బరువు, ఉచ్చస్థానము, అగ్రము

ధూః - వణకుట, కదలుట, కలతచెందుట

ధృ - అగుట, సంకల్పించుట, ఉండుట, జీవించుట,
              పట్టుకొను, సహించు, మోయు, ఆధారపడు,
               స్వాధీనుడై ఉండు, స్వీకరించు, ధరించు,
                నిలుపు, నిరోధించు, అప్పగించు, అప్పుపడు

ధృష్ - ఏకీభవించు, కలియు, గాయపరచు, కోపింపచేయుట,
                   అవమానించుట, తక్కువచేయుట, అతిశయించుట,
                   జయించుట, చెఱచుట, ధైర్యముగానుండుట,
                   విశ్వాసముతో నుండుట, గర్వించుట,
                  సహనముకోల్పోవుట, సాహసించుట, ముట్టడించుట

ధే - త్రాగుట, పీల్చుట, వెలికి తెచ్చుట, తీసుకొని పోవుట

ధోర్ - వేగముగాపోవు, నేర్పరియై ఉండు

ధ్మా - ఊదుట, నిశ్వాసించుట,
               నిప్పును మండునట్లుచేయుట,
                ధ్వనితో ఊదుట

ద్యై - ఆలోచించు, ఊహించు

ధ్వస్ - పతనమగు, వ్రయ్యలగు, ఇంకిపోవు, నశించు

ధ్వన్ - మ్రోయు, శబ్దముచేయు

Friday, January 27, 2017

ఏకాక్షర నిఘంటువు - 54



ఏకాక్షర నిఘంటువు - 54




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........



ద్యు - దినము, ఆకాశము, ప్రకాశము, స్వరము, అగ్ని

ద్యుత్ - ప్రకాశించు, వెలుగు

ద్యో - ఆకాశము, స్వర్గము

ద్వార్ - ద్వారము, వాకిలి, ఉపాయము

ద్విష్ - విరుద్ధమైన, ఇష్టపడని, శత్రుత్వముకల, శత్రువు
                    ఇష్టపడకుండుట, అసహ్యపడు

ద్విస్ -  రెండు సార్లు

ద్రుహ్ - కీడుచేయు

ద్రా - నిద్రించు, పరుగెత్తు, త్వరపడు

ద్రాక్ - శీఘ్రముగా, వెంటనే

ద్రుహ్ - కీడుచేయు

ధా - పెట్టుట, ఉంచుట, నింపుట, వేయుట, నిలుపుట,
            ప్రసరింపజేయుట, నిర్దేశించుట, ఇచ్చుట, పట్టుకొనుట,
             కట్టుకొనుట, పొందుట, తీసికొనుట, ప్రదర్శించుట,
            ఆధారమగుట, పుట్టించుట, కలుగజేయుట

ధావ్ - పరుగెత్తుట, ముందుకు సాగుట, ప్రవహించుట,
                 ఎగురుట, కడుగుట, శుభ్రముచేయుట,
                 మెఱయునట్లు చేయుట

ధి - సంతోష పెట్టుట, ఆనందింపచేయుట

ధీ - బుద్ధి, ఊహ, ఆశయము, ప్రయోజనము,
          సహజప్రవృత్తి, భక్తి, ప్రార్థన, యజ్ఞము

Thursday, January 26, 2017

ఏకాక్షర నిఘంటువు - 53


ఏకాక్షర నిఘంటువు - 53




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


దో - కోయు, నరకు, చీల్చు

దోస్ - ముంజేయి, భుజము

ధిక్ - అదరించుట, నింద

పౄ - పోషించుట, నింపుట

బ్రూ - మాట్లాడుట

భృ - పోషించుట

మా - కొలుచుట, ధ్వనించుట, 
             చంద్రుడు, శోభ, మేథ

ముహ్ - మోహముచెందుట

మిద్ - కరుగుట

వేం - పాపాలు

వ్య - ఇంద్రియాలు

మై - శరీరము

స్మృ - స్మరించుట

హృ   - తీసికొనిపోవుట, దొంగిలించుట,
                  నాశముచేయుట

Wednesday, January 25, 2017

ఏకాక్షర నిఘంటువు - 52


ఏకాక్షర నిఘంటువు - 52




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........



దభ్ / దంభ్ - గాయపరచుట, దెబ్బతీయుట, మోసగించుట 

దయ్ - దయచూపుట, ప్రేమించుట, రక్షించుట

దా - ఇచ్చుట, కోయు, నఱకు, సమర్పించు, విడిచిపెట్టు, 
            ఉంచు, నాటు, పెండ్లిచేయు

దివ్ - స్వర్గము, ఆకాశము, దినము, వెలుగు, ప్రకాశించుట, 
               విసరుట, జూదమాడుట, పాచికలు వేయుట, 
               పరిహాసమాడుట, పందెమువేయుట, అమ్ముట, పొగడుట, 
              సంతోషించుట, ఉన్మత్తుడగుట

దిశ్ - దిక్కు, పది, చూపుట, నిర్దేశించుట, ప్రదర్శించుట,  
              అప్పగించుట, ఇచ్చుట, అంగీకరించుట, ఆజ్ఞాపించుట, 
              అనుమతించుట

దిహ్ - పూయుట, రుద్దుట, వ్యాపించుట,
                అపవిత్రముచేయుట


దీక్ష్ - ఆచార నియమముకై పూనుకొనుట


దీప్ - ప్రకాశించుట, వెలుగుట, మండుట, కోపముచే 
                మండిపడుట, ప్రసిద్ధుడగుట

దుః - కాల్చుట, దహించుట, బాధించుట, పీడితుడగుట


దూ - బాధపడుట

దృ - ఆదరించుట, సమ్మానించుట, పూజించుట

దృప్ - ప్రకాశింపచేయు, వెలిగించు, ప్రజ్వలింపచేయు, 
                    గర్వించు, క్రూరుడగు

దే - రక్షించు, పెంచు

దేవ్ - ఆడు, జూదమాడు, దుఃఖించు, ప్రకాశించు

Tuesday, January 24, 2017

ఏకాక్షర నిఘంటువు - 51


ఏకాక్షర నిఘంటువు - 51




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


 - పోవుట, లేపుట, కదలుట, పొందుట, చేరుట,
              కలియుట, గాయపరచు, కొట్టి, ముట్టడించు,
     
ఋచ్ - పొగడుట, కప్పు, ప్రకాశించు, వేదమంత్రము,
                    ఋక్కు, ఋగ్వేదము, ప్రకాశము, స్తుతి, పూజ

ఋచ్ఛ్ - కఠినమగు, పోవు

ఋజ్ - పోవు, పొందుట, నిలచుట, దృఢముగానుండు,
                     సంపాదించు

ఏజ్ - వణకుట, కదలుట, ప్రకాశించుట

కా - మహి, దుర్గ, మాయ

దా - ఓరుపు, ఈవి

ద్రుః - చెట్టు

ద్యుః - ఆకాశము

థమ్ - శిరస్సు, పుణ్యప్రదమూ, నిర్మలమూ అయిన ఒక బీజాక్షరం,
                బ్రహ్మ సాక్షాత్కారం, మోక్షం, గాయత్రీ మంత్రాన్ని జపం
                 చేయడం

ఝీం/ఝీమ్ - బందీదేవి బీజాక్షరం

ధః - దైవతస్వరస్థానము, ఇంద్రుడు, ధ్వని,
            ధ్యానము, కుబేరుడు, ధన్వంతరి, కడవ

ధా / ధీ - బుద్ధి

ధాః - బ్రహ్మ, బృహస్పతి


Monday, January 23, 2017

ఏకాక్షర నిఘంటువు - 50



ఏకాక్షర నిఘంటువు - 50




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


తు - కాని, అయితేమాత్రము

తుద్ - బాధపెట్టు, గాయపరచు, బాదు, పీడించు

తుల్ - తూచు, ధరించు, ఆలోచించు, ఆధారపడు, పోల్చు,
                   జతచేయు, తక్కువచేయు, పరీక్షించు

తుష్ - సంతుష్టుడగు

తృప్ - తృప్తిపడు, సంతోషించు, సంతోష పెట్టు

తృష్ - దప్పికగొను, దప్పిక, అధికముగా కోరు, పేరాసపడు

త్యజ్ - విడిచి పెట్టు, వదిలించుకొను

త్రప్ - అగుపడు, అవమానపడు

త్రస్ - భయపడు, వణకు

త్రిన్ - ముమ్మారు

త్రుట్ - తెగుట, చిఱుగుట

త్రై - కాపాడు, రక్షించు

త్విష్ - కాంతి, సౌందర్యము

Sunday, January 22, 2017

ఏకాక్షర నిఘంటువు - 49


ఏకాక్షర నిఘంటువు - 49




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........




తడ్ - కొట్టు, బాదు, ఢీకొట్టు, దండరూపముగా కొట్టుట,
            మ్రోగించుట, వీణ మొదలైన వాద్యముల
             తీగల మీటుట

తద్ - అది, వాడు, ఆమె, ప్రసిద్ధమైన, అదియే

తన్ - చాచు, విస్తరించు, పొడిగించు, వ్యాపించు,
               మూయు, నింపు, ఉత్పత్తిచేయు, మూలమగు,
               చేయు, నిర్వహించు.

తంత్ర్ - పాలించు, అదుపులో పెట్టు, ఆధారమగు, నిర్వహించు

తత్ - మరియొకటి, హేతువు

తప్ - ప్రకాశించు, వెచ్చగానుండు, బాధను సహించు,
                శరీరమును కృశింపచేయు, తగులబడు

తమ్ - అలయు, బాధనొందు

తర్జ్ - భయపెట్టు, నిందించు

త్వక్ - లవంగచెక్క, జ్ఞానేంద్రియములలో ఒకటి

త్వః - మఱియొకటి

త్విట్ - కాంతి, అగ్ని, జ్వాల

తు - పాదపూరణము, అయ్యేవే, విశేషము, నిశ్చయము,
            మర్యాదచేయుట, కారణము, అభిప్రాయము, నిద్దుర,
            దూరమునుంచి పిలుచుట, వికారము, శుభము, పొర్లాడు

తే - నీచేతను అన్నమాట

తిఙ్ - సహించు, ధైర్యము వహించు



Saturday, January 21, 2017

ఏకాక్షర నిఘంటువు - 48


ఏకాక్షర నిఘంటువు - 48




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


టంక్ - కట్టు, ముడివేయు, కప్పు, కుట్టు

టీక్ - పోవు వెడలు, టీకా, వివరణ

ఠమ్ - పిల్లనగ్రోవినాదము

డమ్ - యుద్ధము, పోగూడనితావు, పల్లకి, డమరుకమను వాద్యము,
                  వాద్యముఖము, జ్ఞానము

డంబ్ - విసరు, పంపు, ఆజ్ఞాపించు, చూచు

డా - వాక్కు, లజ్జ

డీ - ఎగురు, ఆకాశమున పోవు

ఢౌక్ - పోవు

తక్ష్ - చెక్కు, నఱకు, చీల్చు, ముక్కలు చేయు,
              నిర్మించు,  గాయపఱచు

తంక్ - సహించు, నిరాశతో బ్రతుకు

తడ్ - కొట్టు, బాదు, ఢీకొట్టు, దండరూపముగ కొట్టుట,
               మ్రోగించుట,  వీణాదివాద్యముల తీగెలను మీటుట.

తౄ - ఈదుట, ఎగురుట

త్రప్ - సిగ్గుపడుట

తంక్ - సహించు, నవ్వు, నిరాశతో బ్రతుకు



Friday, January 20, 2017

ఏకాక్షర నిఘంటువు - 47


ఏకాక్షర నిఘంటువు - 47




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........



జౄ - వృద్ధుడగుట, శిధిలమగుట, శుష్కించుట,
                నశించుట, జీర్ణమగుట

జ్వర్ - జ్వరము, ఆవేశములచే వేడెక్కుట,
                  జ్వరితుడగుట, రోగియగుట

జ్వల్ - ప్రకాశముతో మండుట, ప్రకాశించుట, తగులబడుట,
                     తగులబెట్టుట, ప్రజ్వలింపచేయుట, వెలిగించుట

జమ్ - పెండ్లాము(ఆలు), మొలనూలు మొదలైన అలంకారము,
                 తేజస్సు, నీరు, పుట్టువు

జః - పరుల సంపదకు ఓర్వలేనివాడు, జయించు
            స్వభావముగల పురుషుడు
జ్ఞ - తెలిసినవాడు, బుద్ధిమంతుడు

జ్ఞః - బ్రహ్మ, పండితుడు, బుధగ్రహము


జ్ఞా - తెలిసికొను, పరిచయము, పొందు, పరిశీలించు, గుర్తించు,
            పరీక్షించు, గౌరవించు, ప్రేరణార్థమున(తెలుపుట, కోరుట,
            వెల్లడించుట, అడుగుట, తెలిసికొనగోరుట)

రుక్ - కాంతి, కిరణము, కోరిక

త్వక్ - చర్మము, నారపట్ట, లవంగపుచెట్టు

న్యఙ్ - నీచమైనది, పల్లమైనది, గుబిలి

ఝః - మదము, బృహస్పతి

ఞః - ఊర్థ్వముఖమైనది, మూఢస్వరూపమయినది,
                భయము, కీర్తి


Thursday, January 19, 2017

ఏకాక్షర నిఘంటువు - 46


ఏకాక్షర నిఘంటువు - 46




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........



ఛద్ - మూయుట, కప్పుట

ఛంద్ - సంతోషపెట్టుట, ఒప్పించు, కప్పివేయు

ఛర్ - క్రక్కు

ఛిద్ - నఱకు, ముక్కలుచేయు, నాశముచేయు, పోగొట్టుట,
               నఱకునది, వేఱుచేయునది, తొలగించునది,
               నశింపచేయునది

జః - జనించుట, పుట్టినది, శంకరుడు, విష్ణువు

జక్ష్ - తినుట, అనుభవించుట, నాశముచేయుట

జన్ - పుట్టుట

జప్ - మంద్రస్వరముతో ఉచ్ఛరించుట, మనసులోనే మాటిమాటికి
               ఉచ్ఛరించుట మంత్రోచ్ఛారణ చేయుట

జి - జయించుట, ఓడించుట

జీవ్ - జీవించుట, పునర్జీవించుట, ఉండుట, వృత్తి నిర్వహించుట

జుష్ - సంతుష్టుడగుట, అనుకూలుడగుట, మిక్కిలి ఇష్టపడుట,
                  అనుభవించుట, పోవుట, నివసించుట,
                 ప్రవేశించుట, ఎన్నుకొనుట, తర్కించు, ఆలోచించు,
                  పరీక్షించు, గాయపరచు, సంతోషించు

జూః -  ఆకాశము, సరస్వతి, పిశాచస్త్రీ, వేగము

జృ - వంచుట, వినీతునిచేయుట, అతిక్రమించుట

జృభ్ - ఆవలించు, తెఱచు, పెంచు, వ్యాపింపచేయు


Wednesday, January 18, 2017

ఏకాక్షర నిఘంటువు - 45


ఏకాక్షర నిఘంటువు - 45




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........




చః - శిక్షించువాడు

చక్ష్ - చూచు, పరిశీలించు, పలుకు, చెప్పు

చంచ్ - కదలు, చలించు

చట్ - విరుగుట, వేరగుట, పడుట

చంద్ - ప్రకాశించు, సంతోషించు, ఆనందించు

చయ్ - పోవుట

చర్ - తిరుగాడు, పోవు, నడచు,
               అభ్యసించు, తిను, మేయు

చర్చ్ - చదువు, అనుశీలించు, అధ్యయనముచేయు,
                  నిందించు, ధిక్కరించు, విచారణ చేయు

చర్వ్ - తినుట, నమలుట, కొరుకుట,
                    పీల్చుట, రుచిచూచుట

చల్ - కదలు, వడకు, అదరు, చెదరు,
                ఊగిలసలాడు, నిలకడలేకుండుట, భ్రమించు

చష్ - తినుట, చంపుట, కొట్టుట, గాయపరచు

చా - కాంతి, నెత్తురు, స్వచ్ఛము

చిత్ - తెలివి

చేత్ - అయితే, అట్లాయెనా, ఎలాగైతే అని అనడం


Tuesday, January 17, 2017

ఏకాక్షర నిఘంటువు - 44


ఏకాక్షర నిఘంటువు - 44




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


ఘః - శివుడు, ఎండ, మొలనూలు, దెబ్బ

ఘట్ - ఏదో ఒక కార్యములో నిమగ్నుడగుట,
                  ప్రయత్నముచేయుట, కలుపుట,
                  కూర్చుట, తెచ్చుట

ఘట్ట్ - కదల్చుట, ఊపుట,తాకుట, రుద్దుట

ఘస్ - తిను, మింగు

ఘృ - అంతటను చల్లుట, తడుపుట

ఘృష్ - పొడి చేయు, పోటీపడు

ఘ్రా - వాసన చూచు, ముద్దు పెట్టుకొను

న్యఙ్ - పొట్టిది, లోతైనది

ప్రాక్ - (తూర్పు)దిక్కును తెలిపేది, దేశాన్ని తెలిపేది,
                      కాలాన్ని తెలిపేది

రుక్ - కాంతి, ప్రకాశం, కోరిక

ఙమ్ - పిల్లనగ్రోవి శబ్దము, కాటుక, స్థిరము

ఙః - భైరవుడు, భయము, దేశము


 - అదియే, అదియు ఇదియు, అలాగైతే, నిశ్చయము,
          కారణము, తుల్యయోగము, మరల అనుట

చమ్ - నెత్తురు, త్రాగుట, ఆచమనము చేయుట, తినుట

Monday, January 16, 2017

ఏకాక్షర నిఘంటువు - 43


ఏకాక్షర నిఘంటువు - 43




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


గూః - మురికి

గృ - చల్లు, తడపు

గృజ్ - ధ్వనిచేయు

గృధ్ - కోరు, తీవ్రముగా కాంక్షించు

గౄ - పలుకుట, మాటలాడుట, మెచ్చుకొనుట,
               మ్రింగుట, తినుట, క్రక్కుట

గై - పాడుట, పాటపాడుట, చెప్పుట, వివరించుట


గోష్ - ప్రోగుచేయుట

గ్రథ్ - కూర్చుట, వంగుట

గ్రంథ్ - కట్టుట, క్రమముగా ఉంచుట, వ్రాయు,
                    రచించు, ఉత్పత్తిచేయు

గ్రస్ - తిను, మ్రింగు, జీర్ణించుకొను,
                పట్టుకొను, గ్రహము పట్టు, చెడగొట్టు

గ్రహ్ - పట్టుకొను, తీసుకొను, స్వీకరించు, అంగీకరించు,
                 బంధించు, నిలుపు, ఆకర్షించు, జయించు,
                 సంతోషపెట్టు, తెలిసికొను, అర్థము చేసికొను,
                  ఊహించు, నమ్ము, పలుకు, కొను, దొంగిలించు,
                  ధరించు, పరిశీలించు, గ్రహణము పట్టు

గౌః - గోమేధమనే యజ్ఞం


Sunday, January 15, 2017

ఏకాక్షర నిఘంటువు - 42


ఏకాక్షర నిఘంటువు - 42




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


గంధ్ - గాయపరచుట, అడుగుట, కదలుట, పోవుట

గమ్ - పోవు, కదలు, వెడలు, కదలు, తొలగు, చేరు, దాటు

గర్ - అరచుట, గర్జించుట, బొబ్బలిడుట

గర్వ్ -  గర్వించు

గల్ - పడు, జారు, అదృశ్యమగు

గాధ్ - నిలచు, వెడలు, ప్రవేశించు, వెదకు,
               అడిగి తెలుసుకొను, పేను, నేయు

గాహ్ - (నీటి)లోనికి చొచ్చుట, స్నానముచేయుట,
                  ప్రవేశించుట, కలతనొందుట, చిలుకుట,
                   దాగుట, నాశముచేయుట

గిర్ - వాక్కు, భాష, సరస్వతి

గిల్ - మ్రింగు

గుజ్ - ధ్వనిచేయు, రొదచేయు

గుంఠ్ - చుట్టు మూయు, కప్పివేయు, దాచు

గుప్ - కాపాడు, రక్షించు, పర్యవేక్షించు,
                ప్రకాశించు, దాచు

గుహ్ - కప్పిపెట్టు, దాచు, రహస్యముగానుంచు


Saturday, January 14, 2017

ఏకాక్షర నిఘంటువు - 41


ఏకాక్షర నిఘంటువు - 41




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


ఖం - అలంబు వృక్షము, లేకపోవుట

 - బుద్ధి

ఖచ్ - బయటకు వచ్చుట, అగపడుట, మరల పుట్టుట,
                పవిత్రముచేయుట, ముడివేయుట, కట్టుట

ఖజ్ - చిలుకుట, కలచుట

ఖండ్ - ముక్కలు చేయు, చీల్చు, పూర్తిగా ఓడించు,
                    నాశముచేయు, తొలగించు, నిరాశ కలిగించు,
                     విఘ్నము కలిగించు, మోసగించు

ఖన్ - త్రవ్వుట

ఖాత్ - తినుట, మ్రింగుట, కొఱకుట

ఖిద్ - దెబ్బతీయుట, లాగుట, కష్టము కలిగించుట,
              పీడింపబడుట, దుఃఖితుడగట, అలయుట

ఖేల్ - కదల్చుట, ఇటు అటు రాకపోకలు చేయుట,
                వణకుట, ఆడు

ఖ్యా - చెప్పు, వెల్లడించు

గం-   గణపతి, గణపతి బీజము,
             సర్వవిఘ్నాలను  అణచే శక్తిగల బీజము

గణ్ - లెక్కించు, పరిగణించు, కూడు, గౌరవించు, భావించు

గద్ - స్పష్టముగా పలుకుట, చెప్పుట, లెక్కించుట