పాదాద్యక్షరక్రమ కవినామ గర్భితసీసం
సాహితీమిత్రులారా!
భీమశంకరంగారి రసశ్రువులోని
పాదాద్యక్షరక్రమ కవినామ గర్భితసీసం
ప్రతిపాదం మొదటి అక్షరం తీసుకుంటె
కవిపేరు వస్తుంది గమనించండి-
సాహితీమిత్రులారా!
భీమశంకరంగారి రసశ్రువులోని
పాదాద్యక్షరక్రమ కవినామ గర్భితసీసం
ప్రతిపాదం మొదటి అక్షరం తీసుకుంటె
కవిపేరు వస్తుంది గమనించండి-
సాహితీమిత్రులారా!
పొత్తపి వెంకటరమణ కూర్చిన
లక్షణశిరోమణిలోని పుష్పమాలికా బంధం
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
వేదులవారి లక్ష్మీసహస్త్రంలోని
షోడశదళ పద్మ బంధం
క్ష - మొదలు ప్రతి అక్షరం తర్వాత మా తీసుకుంటూ
చదవాలి -
సాహితీమిత్రులారా!
Dr. D.S.గణపతిరావుగారు కూర్చిన
పద్మవ్యూహం చిత్రకావ్యం
నుండి గజముఖుని స్తుతి
గజబంధంలో కూర్చారు
గమనించగలరు-
సాహితీమిత్రులారా!
పాదానికి ఒక అచ్చు చొప్పున నాలుగు పాదాలకు
నాలుగు అచ్చులతో కూర్చిన పద్యం ఇది
దండి కావ్యాదర్శం లోనిది.
అమ్నాయానా మాహాన్త్యావాగ్గీతీ రీతీ: ప్రీతీభీతీ:
భోగోలోగో మోదో మోహోధ్యేయే వేచ్ఛేద్ధేశేక్షేమే
(కావ్యాదర్శమ్ -3-84)
అర్థం -
అమ్నాయానాం - వేదాలలో, అన్త్యా - చివరిదైన ఉపనిషత్తు, గీతీ: - గానములను, ఈతీ: - ఈతిబాధలుగాను, ప్రీతీ: - దారాపుత్రాదులందు ప్రేమలను, భీతీ: - భయస్వరూపములైనట్టివిగాను, అహ - చెప్పుచున్నది. భోగ: - విషయోపభోగము, రోగ: - రోగహేతువు, మోద: - సాంసారిక సుఖానుభవము, మోహ: - అవివేకరూపమైనది, అందుచే, క్షేమే - పరమాదరహితమైన, దేశే - ఏకాంత ప్రదేశంలో, ధ్యేయేవా - ధ్యేయమగు పరమాత్మస్వరూపంనందు, ఇచ్ఛేత్ - మనసును నిలుపుటకు కోరుకొనవలెను.
అమ్నాయానా మాహాన్త్యావా
గ్గీతీ రీతీ: ప్రీతీభీతీ:
భోగోలోగో మోదో మోహో
ధ్యేయే వేచ్ఛేద్ధేశేక్షేమే
మొదటిపాదంలో అకారము(అ,ఆ - అచ్చులు)
రెండవపాదంలో ఇకారము (ఇ,ఈ - అచ్చులు)
మూడవపాదంలో ఓ కారము(ఒ, ఓ - అచ్చులు)
నాలుగవపాదంలో ఏ కారము(ఎ,ఏ - అచ్చులు)
లతో కూర్చబడింది. గమనించగలరు.
సాహితీమిత్రులారా!
విద్వాన్ కల్లూరి వెంకట సుబ్రమణ్య దీక్షితులు వారు కూర్చిన
శ్రీ భాగవత మహాత్మ్యము లోని ఖడ్గబంధం ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
ఆసూరి మఱింగంటి వేంకటనరసింహాచార్య
కృత
తాలాంకనందినీ పరిణయంలోని
పతాకబంధం చూడండి-
సాహితీమిత్రులారా!
కవికర్ణపూరుని అలంకారకౌస్తుభంలోని
శంఖబంధం గమనించండి
శ్లోకం -
బంధం-
సాహితీమిత్రులారా!
ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్య
ప్రణీతమైన తాలాంకనందినీ పరిణయము లోని
నిరోష్ఠ్య చిత్రం
నిరోష్ఠ్యం అంటే పెదవులతో పలకని లేదా పెదవులు తాకనిది
ఇది ప్రథమాశ్వాసం ఆశ్వాసాంతంలో కూర్చబడినది-
నలినజ శంకర త్రిదశనాధశరణ్య! దయాంతరంగ! స
జ్జలజశరాంగ! సారదరశార్ఙగదాసిజయాగ్రసాధనా!
కలితధగద్ధద్ధగితకాంచనగల! నిశాకరాయతా
స్యలలిత! శేషశైలశిఖరాగ్రనికేతన! తార్క్ష్యకేతనా!
ఇది పెదవులు తాకని అక్షరాలతో కూర్చబడినది.
గమనించగలరు.