మాతృకావిలాసంలోని ఏకాక్షరనిఘంటువు - 15
సాహితీమిత్రులారా!
మాతృకావిలాములోని ఏకాక్షరనిఘంటువు తరువాయి భాగం ..
లలాలిలీలులూలేలైలోలౌలంలః ॥ 28 ॥
అథ లాదేః । లశ్చౌరో లవణాధీశో లవకో లక్ష్మణస్తథా ॥ 84 ॥
లా శోభా లా చ లలనా దాత్రీ రాత్రీ వసుంధరా ।
లిః సర్పో లీ ధరా లుర్భూ రుద్రో గరుడోऽరుణః
॥ 85 ॥
లైలైప్టో లైః కుశో రామో లోర్మత్స్యో లోః ప్రజాపతిః ॥
లం లక్షణం సుఖం నామ రక్షః శ్రోత్రం వచో విషమ్ ॥ 86 ॥
లః ప్రాగుక్తోऽపి
లగుడో లలామాద్వ్యశ్చ లోలుపః ॥
·
ల: దొంగ (చౌరః), సముద్రుడు
(లవణాధీశుడు), కోసేవాడు (లవకః), లక్ష్మణుడు.
·
లా: శోభ (అందం), స్త్రీ
(లలనా), దాత్రి (ఇచ్చేది), రాత్రి, భూమి
(వసుంధర).
·
లి: పాము (సర్పో).
·
లీ: భూమి (ధరా).
·
లు: భూమి, శివుడు
(రుద్రుడు), గరుత్మంతుడు, సూర్యుని
సారథి (అరుణుడు).
·
లై: కుశుడు (రాముని కుమారుడు), రాముడు.
·
లో: చేప (మత్స్యః).
·
లౌ: బ్రహ్మ (ప్రజాపతి).
· లం: లక్షణము, సుఖము, పేరు (నామము), రాక్షసుడు (రక్షః),
చెవి
(శ్రోత్రము), మాట (వచో), విషము.
·
లః: గద (లగుడము), గుర్తింపు
చిహ్నము (లలామము), అత్యాశ కలవాడు
(లోలుపః).
వవావివీవువూవేవైవోవౌవంవః ॥ 29 ॥
అథ వాదేః । వో గ్రామో వాతకీ వాలో వారుణీపానతత్పరః ॥ 87 ॥
వనసేవ్యథ వః పంగుర్వా సఖీ త్రిదశప్రసూః ॥
విః పక్షీ గరుడః సూర్యో జలధిః సోమ ఉచ్యతే ॥ 88 ॥
వీర్విష్ణుర్యుః పదాతిః స్యాద్వః సంయోగజ ఉచ్యతే ॥
వేః పారిజాతో వైః సారో వోః కాలో వౌః సుఖావహః ॥ 89 ॥
వం సురం వసనం రక్తం వపుర్వచనమాసురమ్ ॥
వః ప్రాగుక్తోऽపి
బధిరో వణిక్పుంజో వనాలయ్యః ॥ 90 ॥
·
వో: గ్రామము, వాత
రోగము కలవాడు, బాలుడు, మద్యపానము
చేయువాడు.
·
వ: అడవిని సేవించేవాడు, కుంటివాడు
(పంగుః).
·
వా: స్నేహితురాలు (సఖీ), దేవతల
తల్లి (అదితి - త్రిదశప్రసూః).
·
వి: పక్షి, గరుత్మంతుడు, సూర్యుడు, సముద్రము
(జలధిః), చంద్రుడు (సోమః).
·
వీ: విష్ణువు.
·
వు: కాలిబంటు (పదాతిః).
·
వూ: కలయిక వల్ల పుట్టినది (సంయోగజము).
·
వే: పారిజాత వృక్షము.
·
వై: సారాంశము (సారము).
·
వో: కాలము.
·
వౌ: సుఖాన్ని ఇచ్చేవాడు.
·
వం: సుర (మద్యము), వస్త్రము
(వసనము), రక్తము, శరీరము
(వపుః), అసుర వాక్కు.
·
వః: చెవిటివాడు (బధిరః), వర్తకుల
సమూహము, అడవిలో నివసించేవాడు.
.jpg)
No comments:
Post a Comment