Showing posts with label యమకాలంకారము. Show all posts
Showing posts with label యమకాలంకారము. Show all posts

Sunday, December 4, 2016

రణముండున్ వ్యాకరణంబున


రణముండున్ వ్యాకరణంబున




సాహితీమిత్రులారా!


ఆర్యాశతకంలోని ఈ పద్యం చూడండి-
కపిలవాయి లింగమూర్తిగారి కృతం.

రణముండున్ వ్యాకరణం
బున సాధువనుచు వటువులందుచే
తనే సుధ్యుపాస్యనుండియె
చిన చిన్నగ జారుచుండ్రు చెప్పగ నార్యా!

వ్యాకరణం- అనే పదంలో రణం ఉన్నట్లే
వ్యాకరణశాస్త్రంలో గూడ పదం సాధువు.
ఇది అసాధువని వానిపై పెద్దయుద్ధమే ఉంటుంది.
అందువల్లనే వ్యాకరణం అంటే కొందరికి భయం,
మరికొందరికి తలనొప్పి.

దీనిలో రణం పాదం మొదట్లో
రణం అని పాదం చివర్లో రావడం
వలన యమకాలంకారం అవుతుంది.

Thursday, December 1, 2016

మతాం ధునానారమతామకామతా


మతాం ధునానారమతామకామతా




సాహితీమిత్రులారా!


ఈ యమకభేదం చూడండి-

మతాం ధునానారమతామకామతా
మతాపలబ్ధాగ్రి మతానుమలోమతా
మతావయత్యుత్తమతా విలోమతా
మతామ్యత స్తే సమతా న వామతా

దీని పదవిభాగము-
మతాం, ధునానా, ఆరమతాం, అకారమతాం, అతాపలబ్ధా,
అగ్రిమతానులోమతా, మతౌ, అయతీ, ఉత్తమతా విలోమతాం,
అతామ్యత:, తే, సమతా, న, వామతా.

(ఆత్మారాములైన యోగులయొక్క అనభిలాషిత్వమును
చెదరగొట్టినదియు, అనాయాసముగా లభించినదియు,
శ్రేష్ఠత్వమునకు అనుకూలమైనదియు,
ఉత్తమత్వముయొక్క విలోమత్వమును
బుద్ధియందు చేరనీయనిదియునైన
సమతయే అతామ్యుడనైన(చిత్తగ్లాని ఎరుగని)
నీకు సమ్మతము. విషమత్వము(వామత) సమ్మతముకాదు)


మతాం ధునానారమతామకామతా
మతాపలబ్ధాగ్రి మతానుమలోమతా
మతావయత్యుత్తమతా విలోమతా
మతామ్యత స్తే సమతా న వామతా

దీనిలో వ్యపేతానుచ్ఛేదనముచేతనే పాదసంధులయందు
అవ్యపేతము పుట్టుచున్నది. కావున ఇది సూక్ష్మావృత్తి యొక్క
అస్థానయమకము. దీన్ని సంధి సూక్ష్మావ్యపేత యమకము అంటారు.

దీనిలో మతా - అనే రెండక్షరముల గుచ్ఛము
ప్రతి పాదమునందు ఆది, మధ్య, అంతములందు
వచ్చుచున్నది. నడుమ ఇతర అక్షరముల వ్యవధానము కలదు.
ఇందులో ఆది మధ్య అంతములందు వ్యవధానము కలదు.
అదే విధంగా పాదాంత పాదాదులందు వ్యవధానము లేదు
ఈ విధంగా ఇది అవ్యపేతము. నిజానికి ఇది వ్యపేతమైన
అక్షరగుచ్ఛములచేతనే అవ్యపేతయమకము సంభవిస్తున్నది.
ఇందులో వ్యపేతము అవ్యపేతము రెండును అంగీకరించబడుచున్నవి.
అందువల్ల దీన్ని అస్థానయమకంగా పరిగణింప బడుచున్నది కావున దాన్ని అన్యభేదానుచ్ఛేదనముతోడి సూక్ష్మమునకు ఉదాహరణ అగుచున్నది ఈ శ్లోకము.

Saturday, November 26, 2016

ఉపోఢ రాగాప్యబలా మదేన సా


ఉపోఢ రాగాప్యబలా మదేన సా



సాహితీమిత్రులారా!



యమకాలంకారంలో కొన్ని రకాలు చూశాము-
ఇక్కడ సంధిస్థూలావ్యపేత యమకాన్ని
గురించి చూద్దాం-

ఈ ఉదాహరణశ్లోకం చూడండి
ఇది దండికావ్యాదర్శంలోనిది

ఉపోఢ రాగాప్యబలా మదేన సా
మదేన సా మన్యురసేన యోజితా
నయోజితాత్మాన మనంగ తాపితాం
గతాపి తాపాయ మమాస నేయతే
                                                                     (కావ్యాదర్శ:  - 3-52)

(ఆమె(నాయిక) అబల అయికూడ,
తారుణ్యమదముచేత భరింపబడిన
అనురాగము కలదయికూడ, తనను
తాను నిగ్రహించుకొన్నదయి,
నా పాపముచేత క్రోధరసముతో
కూడుకొన్నదయి మన్మథునికే తాపము
కలిగించిన దైననూ నాకు తానింత తాపము
కలిగించునది కాలేదు (ఇంతని చెప్పటానికి
వీలులేనంత తాపము కలిగించెనని భావము))

ఉపోఢ రాగాప్యబలా మదేన సా
మదేన సా మన్యురసేన యోజితా
నయోజితాత్మాన మనంగ తాపితాం
గతాపి తాపాయ మమాస నేయతే

దీనిలో అక్షరసముదాయం పాదము చివరలందు
పాదం మొదటిలోను వ్యవధానంలేకుండా
ఆవృత్తమవుచున్నది. అదీను నాలుగు అక్షరముల
సముదాయం కావున ఇది సూక్ష్మముకాక
స్థూలమైనదిగా గమనించాలి.
మరియు పాదముల సంధినందు ఆవృత్తం
కావడం వల్ల ఇది సంధిస్థూలావ్యపేత యమకంగా
చెప్పబడుచున్నది
దీనికే సందష్టక యమకమనేపేరు కూడ ఉంది.
దాన్నిగురించి తరువాత  తెలుసుకుందాం..


Wednesday, November 23, 2016

పర్వతం మాల్యవంతమ్


పర్వతం మాల్యవంతమ్



సాహితీమిత్రులారా!



వ్యపేత పాదచతుష్ట మధ్యమాంత 
యమకమును గురించి తెలుసుకుందాము-
దీనికి ఉదాహరణ
భట్టికృత రావణవధ కావ్యం నుండి చూడండి-

మిత మవద దుదారం తాం హనూమాన్ముదారం
రఘు వృషభ సకాశం దేవి యామి ప్రకాశమ్
తవ విదితవిషాదో దృష్టకృత్స్నామిషాద:
శ్రియ మనిశ మవంతం పర్వతం మాల్యవంతమ్

(హనుమంతుడు సంతోషంతో వేగముతో మితము
నర్థవంతమునైన యూ వాక్యములను ఆమెకు(సీతకు)చెప్పెను.
ఓ దేవీ! నీ విషాదమును తెలిసికొంటిని. రాక్షసుల నందరను చూచితిని.
ఎల్లపుడును మాంగల్యమును గలిగించు మాల్యవంతముమీదుగా
ప్రకాశముగా రఘువృషభుడయిన రాముని చెంతకు వెళ్ళుదును.)

మిత మవద దుదారం తాం హనూమాన్ముదారం
రఘు వృషభ సకాశం దేవి యామి ప్రకాశమ్
తవ విదితవిషాదో దృష్టకృత్స్నామిషాద:
శ్రియ మనిశ మవంతం పర్వతం మాల్యవంతమ్

దీనిలో
మొదటిపాదం 7,8 అక్షరాలు కలుపగా "దారం" అయినది
అలాగే పాదాంతమున "దారం" అని ఉంది.
రెండవపాదంలో 7,8 అక్షరాలు కలపగా "కాశం" అని అగును
అలాగే పాదాంతమున "కాశం" పునరుక్తమైనది.
మూడవ పాదంలో 7,8 అక్షరాలు కలుపగా "షాద:" అగును
అదే విధంగా పాదాంతమున పునరావృతమైనది.
నాలుగవపాదం 7,8 అక్షరములు కలుపగా "వంతం" అగుచున్నది
అదేవిధంగా పాదాంతమున "వంతం" పునరావృతమైనది
కావున దీనిలో ప్రతీపాదంనందు యమకము వచ్చింది
కాని ప్రతిదానికి మధ్య అంతరము ఉండటం వలన వ్యపేతమగుచున్నది
కావున ఇది వ్యపేత పాదచతుష్ట మధ్యాంతయమకమునకు
ఉదాహరణ అగుచున్నది.

Tuesday, November 22, 2016

పవనశ్చ ధూతనవనీపవన:


పవనశ్చ ధూతనవనీపవన:




సాహితీమిత్రులారా!



వ్యపేత చతుష్టపాద ఆద్యంత 
యమకమును గురించి తెలుసుకుందాము-

దీనికి ఉదాహరణ మాఘశిశుపాలవధనుండి-

విహగా: కదంబ సురభావిహ గా:
కలయం త్యనుక్షణ మనేకలయమ్
భ్రమయన్నుపైతి ముహు రభ్రమయం
పవనశ్చ ధూతనవనీపవన:

(విహంగములు కడిమిపూల సువాసనలు
నిండిన యీ పర్వతమునందు ప్రతి క్షణం
బహులయాత్మకములయిన కూజితములను
చేయుచున్నవి. కడిమితోటలను కదలించిన
పవనము మేఘమును భ్రమింపచేయుచున్నది.)

విహగా: కదంబ సురభావిహ గా:
కలయం త్యనుక్షణ మనేకలయమ్
భ్రమయన్నుపైతి ముహు రభ్రమయం
పవనశ్చ ధూతనవనీపవన:

దీనిలో మొదటిపాదము మొదటిలో విహగా: - చివరలో విహగా:
రెంవపాదం మొదటిలో కలయం - చివరలో కలయం
మూడవపాదం మొదటిలో భ్రమయం - చివరలో భ్రమయం
నాలుగవపాదం మొదటిలో పవన: - చివరలో పవన:
అని రావడం వలన
ఆది అంత్య యమకం అగుచున్నది
మరియు ఒక అక్షరగుచ్ఛానికి మరో అక్షరగుచ్ఛానికి మధ్య
అంతరమూ ఎక్కువగా ఉండటంవలన వ్యపేతమగుచున్నది.
కావున ఇది ప్యపేత చతుష్టపాద ఆద్యంత యమకమునకు
ఉదాహరణ అగుచున్నది.

Monday, November 21, 2016

ఘనగిరీంద్ర విలంఘన శాలినా


ఘనగిరీంద్ర విలంఘన శాలినా




సాహితీమిత్రులారా!


వ్యపేత చతుష్టపాద ఆదిమధ్య
యమకమును గురించి తెలుసుకుందాము-

దీనికి ఉదాహరణ
భట్టి కృత రావణవధ కావ్యంనుండి-

ఘనగిరీంద్ర విలంఘన శాలినా
వనగతా వనజద్యుతిలోచనా
జనమతా దదృశే జనకాత్మజా
తరు మృగేణ తరుస్థలశాయినీ

(పద్మముల కాంతివంటి కాంతిగల లోచనములు గలది,
వనమునందున్నదియు, జనముల గౌరవమునకు ఆశ్రయైనదియు,
వృక్షచ్ఛాయయందు పరుండియున్నదియు అయిన జానకిని మహాపర్వతలంఘన స్వభావముగల శాఖామృగమైన హనుంతుడు దర్శించెను.)


ఘనగిరీంద్ర విలంఘన శాలినా
వనగతా వనజద్యుతిలోచనా
జనమతా దదృశే జనకాత్మజా
తరు మృగేణ తరుస్థలశాయినీ

దీనిలో మొదటిపాదం మొదట ఘన - మధ్యలో  లంఘన
రెండవపాదం మొదట వన - మధ్యలో వనజ
మూడవపాదం మొదట జన - మధ్యలో జనకా
నాలుగవపాదం మొదట తరు - మధ్యలో తరుస్థల
రావడం జరిగింది.

పాదమునకు మొదట మరియు మధ్య ఒకేవిధమైన
అక్షరగుచ్ఛము నాలుగుపాదములందు ప్రయుక్తమైనది.
అదియు ఒకదానికి మరొకదానికి అంతరము ఉన్నందున
ఇది వ్యపేత చతుష్టపాద ఆదిమధ్య యమకము అగుచున్నది.

Saturday, November 12, 2016

రజతోత్సవామోద విశేషమత్తయా


రజతోత్సవామోద విశేషమత్తయా




సాహితీమిత్రులారా!



వ్యపేతయమకంలోని
చతుష్టయపాద అంత యమకం
గురించి చూద్దాం-

నాలుగు పాదాలలో పాదాంతములందు
ఎడమ ఎడమగా ఒకేపదగుచ్ఛము వచ్చిన
అలాంటి దాన్ని
వ్యపేతచతుష్టపాదాంతయమకం అంటాము.
దానికి ఉదాహరణ-

తవ ప్రియా సచ్చరితాప్రమత్త యా
విభూషణం ధార్యమిహాంశుమత్తయా
రజతోత్సవామోద విశేషమ త్తయా
ప్రయోజనం నాస్తి హి కాన్తిమత్తయా
                                                                          (కావ్యాదర్శం -3-41)

(ఒక ఖండితనాయిక తనను
అనుయించడానికి వచ్చిన
నాయకునితో
పలికిన మాటలు ఇవి-
ఓయీ అప్రమత్తుడా!  నీ ప్రియురాలు
సౌశీల్యవంతురాలు.
రజతోత్సవ సంతోషవిశేషములచేత మదించిన
ఆమె చంద్రకాంత మణిభూషణమును ధరించవలెను.
నేను కాంతిని పొంది ఉండుటవల్ల
నాకేవీ ధరించవలసిన పనిలేదు.
కావున మణిభూషణములతో పనిలేదు)


తవ ప్రియా సచ్చరితాప్రమత్త యా
విభూషణం ధార్యమిహాంశుమత్తయా
రజతోత్సవామోద విశేషమ త్తయా
ప్రయోజనం నాస్తి హి కాన్తిమత్తయా

దీనిలో ప్రతిపాదాంతము నందు
మత్తయా అనే పదగుచ్ఛము కలదు
మరియు మొదటి దానికి, రెండవదానికి,
మూడవదానికి, నాలుగవదానికి
మధ్యదూరము చాలకలదు కావున
ఇది వ్యపేత చతుష్టయపాదాంత
యమకమునకు ఉదాహరణ అగుచున్నది.


Thursday, November 10, 2016

మదన దారుణ ఉద్ధిత ఉచ్ఛిఖో


మదన దారుణ ఉద్ధిత ఉచ్ఛిఖో




సాహితీమిత్రులారా!



వ్యపేతయమకంలో
మధ్యయమకం ఉదాహరణ చూడండి-

మదన దారుణ ఉద్ధిత ఉచ్ఛిఖో
మధుమదారుణ హూణముఖచ్ఛవి:
తరణి దారుణ ఏష దిశ: సమం
మమ హృదారుణదామ్రవణానల:
                                                         (సరస్వతీకంఠాభరణమ్ - 2-109)

(ఓ తరుణీ మామిడితోట అనెడి అగ్ని
మదనుడన్న దారువు(కట్టె) నుండి పుట్టినదై
ఉన్నతమయిన శిఖలను(చిగుళ్ళు, జ్వాలలు)
గలదై మద్యమదము చేత మిక్కిలి ఎఱ్ఱనైన
హూణజాతీయుని ముఖముయొక్క కాంతివంటి
కాంతిగలదై మిక్కిలి దారుణమై నాహృదయముతో
సమముగా దిక్కులను బంధించెను.)


మదన దారుణ ఉద్ధిత ఉచ్ఛిఖో
మధుమదారుణ హూణముఖచ్ఛవి:
తరణి దారుణ ఏష దిశ: సమం
మమ హృదారుణదామ్రవణానల:

ఈ శ్లోకంలో ప్రతిపాదంలో దారుణ అనే
అక్షరగుచ్ఛము అదీ పాదము మధ్యభాగంలో
రావడం జరిగింది. అలాగే మొదటిపాదంలోని దారుణ-
రెండవపాదంలోని దారుణ - కు మధ్య మిక్కిలి ఎడమ
ఉండటంజరిగింది అలాగే 3,4 పాదాల్లోనూ రావడం వలన ఇది
వ్యపేతచతు పాద మధ్యయమకంగా చెప్పబడుచున్నది.

Thursday, November 3, 2016

కాంచిల్లునీతే సురతశ్రమార్తిమ్


కాంచిల్లునీతే సురతశ్రమార్తిమ్



సాహితీమిత్రులారా!



యమకము ప్రధానంగా
అవ్యపేత వ్యపేత యమకములని
వీటిలో అవ్యపేత యమకమునుగురించి
కొన్నిటిని తెలుసుకున్నాము. ఇక్కడ
వ్యపేతయమకం గురించి తెలుసుకుందాము.

వ్యపేతం అనగా దూరదూరంగా ఉంచబడినది అని అర్థం.
నాలుగుపాదాలలోనూ యమకం దూరదూరంగా పాదం
మొదటిలో ఉంటే దాన్ని చతుర్పాద వ్యపేత ఆదియమకం
అంటారు. దానికి ఉదాహరణ-


కాంచిప్రతోలీ మనుకామినీనాం తాం
కాంచి స్రవంతీవనమాతరిశ్వా
కాంచి ప్రభృత్వాభరణోజ్ఝితానాం
కాంచిల్లునీతే సురతశ్రమార్తిమ్
                                          (సరస్వతీకంఠాభరణమ్ - 2-108)



కాంచీనగరపురాచబాటను
అనుసరించెడి మొలనూలు
మొదలయిన ఆభరణములను
విడిచిపెట్టిన కామినులయొక్క
సురతశ్రమార్తిని జలములచే
నొప్పుచున్న ప్రవాహముగల
వనమందలి వాయువు పోగొట్టుచున్నది - అని భావం.

కాంచిప్రతోలీ మనుకామినీనాం తాం
కాంచి స్రవంతీవనమాతరిశ్వా
కాంచి ప్రభృత్వాభరణోజ్ఝితానాం
కాంచిల్లునీతే సురతశ్రమార్తిమ్


దీనిలో "కాంచి" అనే అక్షరగుచ్ఛము
ప్రతి పాదంలో వచ్చింది.
అదీ ప్రతిపాదం మొదట్లోనే ఉంది.
 కావున ఇది ఆదియమకం అవుతుంది.
అలాగే మొదటి కాంచి- కి,
రెండవ కాంచి-కి నడుమ చాల
ఎడమ ఉన్నందున
ఇది వ్యపేతయమకం అగుచున్నది.

Friday, October 21, 2016

సీమాసీ మానభూమి:


సీమాసీ మానభూమి:


సాహితీమిత్రులారా!

ఇక్కడ అవ్యపేత చతుష్పాద
ఆదిమధ్యాంత యమకం గురించి చూద్దాం.
శ్లోకం లేక పద్యంలోని నాలుగు పాదాలలో
మొదట్లో, మధ్యలో, చివర్లో మూడు చోట్ల
వ్యవధానంలేకుండా అర్థభేదంతో మళ్ళీమళ్ళీ
వచ్చే వర్ణసముదాయాన్ని
అవ్యపేత చతుష్పాద ఆదిమధ్యాంత యమకం అంటారు.
ఉదాహరణ -
సీమాసీ మానభూమి: ఫణిబలవలనోద్భావిరాజీ విరాజీ
హారీ హారీతవద్భి: పరిసరసరణావ స్తమాలై స్తమాలై:
దేవాదేవా ప్తరక్ష: కృతభవ భవతోऽగ్రేన దీనో నదీనో
ముక్తాముక్తాచ్ఛరత్న: సితరుచిరుచిరోల్లాసముద్ర: సముద్ర:
                                                                      (సరస్వతీకంఠాభరణమ్ - 2-98)
హద్దులయందు నిలిచేవాడు, గౌరవస్థానమైనవాడు,
పాముల సమూహాలు ప్రాకటం చేత ఏర్పడిన
చాలుచేత విరాజిల్లువాడు, హరీతములనే పక్షులచేత
పరిసరమార్గములందు విసరబడిన మాలా సన్నివివేశములు
గలిగిన తమాలవృక్షములచేత మనోహరమైనవాడు,
దేవతలకు రాక్షసులకు రక్షణను గలిగించినవాడు,
ముత్యాలుగాక మిగిలిన స్వచ్ఛ రత్నములను గలిగినవాడు,
చంద్రుని కాంతిచేత ఉల్లాసముద్ర కలవాడు అయిన సముద్రుడు
నదీపతి నీ యెదుట దీనుడుకాడు. -  అని భావం.

సీమాసీ మానభూమి: ఫణిబలవలనోద్భావిరాజీ విరాజీ
హారీ హారీతవద్భి: పరిసరసరణావ స్తమాలై స్తమాలై:
దేవాదేవా ప్తరక్ష: కృతభవ భవతోऽగ్రేన దీనో నదీనో
ముక్తాముక్తాచ్ఛరత్న: సితరుచిరుచిరోల్లాసముద్ర: సముద్ర:

ఈ శ్లోకంలో
1వ పాదంలో మొదట సీమా, మధ్యలో బల, చివరలో విరాజీ
2వ పాదంలో మొదట హారీ, మధ్యలో సర, చివరలో స్తమాలై
3వ పాదంలో మొదట దేవా, మధ్యలో భవ, చివరలో నదీనో
4వ పాదం మొదట ముక్తా, మధ్యలో రుచి, చివరలో సముద్ర:
అనే వర్ణసముదాయాలు ఆవృత్తమైనవి. మొదట, మధ్యన రెండ
అక్షరముల గుచ్ఛము రాగా చివరలో మూడక్షరముల గుచ్ఛము
ఆవృత్తమైనది. అలాగే చిత్రకావ్యాలలో బ - కును, వ - కును
భేదములేదు అన్నవిషయం గమనించాలి మొదటి పాదం మధ్యలో
బల అన్నది ఆవృత్తిలో వల అని ఆవృత్తమైనది ఇది ఇందులో సరైనదే.

Thursday, October 13, 2016

స్తనవతీ నవతీర్థ తను స్తను:


స్తనవతీ నవతీర్థ తను స్తను:



సాహితీమిత్రులారా!


యమకాలంకారమున అవ్యపేత
యమకమునందు వివిధములైన
వాటిని తెలుసుకొనుచున్నాముకదా
ఇపుడు మధ్యాంతయమకం తెలుసుకుందాం.

అవ్యపేత చతుష్పాదయమకమునందు
పాదమధ్యమునందు, పాదాంతమునందు
రెండు చోట్ల యమకము వచ్చుటను
మధ్యాంత యమకం అనేపేరుతో పిలుస్తున్నాము.
దానికి ఉదాహరణ-

ఉదయితే దయితే జఘనం ఘనం
స్తనవతీ నవతీర్థ తను స్తను:
సుమనసా మనసా సదృశౌ దృశౌ
ద్యుకురు మే కురు మేऽభిముఖం ముఖమ్
                                                (సరస్వతీకంఠాభరణమ్ - 4-97)

ఓ ప్రియురాలా అభ్యుదయసంపన్నమయిన
నీ జఘనము ఘనము, నీ తనువు స్తనవతీ
నవతీర్థముల చేత పలుచబడినది.
నీ చూపులు పువ్వుతోను మనస్సుతోను సాటియైనవి.
స్వర్లోక భూలోక సౌంద్యావధీ నీముఖమును నాకు
అభిముఖము గావింపుము - అని భావం.

ఉదయితే దయితే జఘనం ఘనం
స్తనవతీ నవతీర్థ తను స్తను:
సుమనసా మనసా సదృశౌ దృశౌ
ద్యుకురు మే కురు మేऽభిముఖం ముఖమ్

ఇందులో ప్రతిపాదంలో మూడు వర్ణములు మధ్యలోను,
రెండు వర్ణములు చివరలోను ఆవృత్తమైనవి.
మొదటిపాదం మొదట దయితే, చివర ఘనం,
రెండవపాదం మొదట నవతీ. చివర తను:,
మూడవ పాదం మొదట మనసా, చివర దృశౌ,
నాలుగవపాదం మొదట కురుమే, చివర ముఖం
అనే వర్ణసముదాయాలు ఆవృత్తమైనవి
వర్ణములలోనే ఏకత్వం కాని అర్థంలో ఏకత్వం లేదు.
కావున ఇది అవ్యపేత చతుష్పాదయమకంలో మధ్యాంత
యమకమునకు ఉదాహరణగా సరిపోవుచున్నది.

Tuesday, October 11, 2016

సమం సమంతా దపగోపురం పురం


సమం సమంతా దపగోపురం పురం


సాహితీమిత్రులారా!


యమకాలంకారంలో ఆద్యంత
యమకం గురించి ఇక్కడ చూద్దాం-
శ్లోకంలోని పాదం మొదటిలోను, చివరలలోను
వర్ణసముదాయము ఆవృత్తమైన అది
ఆద్యంత యమకము.
కాని ఇందులో వ్యవధానంలేకుండా ఉన్న
అవ్యపేత ఆద్యంతయమకమౌతుంది.
వ్యవధానంతో ఆవృత్తి జరిగిన వ్యపేత
ఆద్యంతయమకంగా చెప్పబడుతున్నది.

ఈ ఉదాహరణ గమనించండి-

ద్రుతం ద్రుతం వహ్నిసమాగతం గతం
మహీ మహీనద్యుతిరోచితం చితమ్
సమం సమంతా దపగోపురం పురం
పరై: పరై రప్యనిరాకృతం కృతమ్
                                                          (భట్టికావ్యం)

అగ్నితోడి సంబంధము వల్ల కరగింపబడినది.
వేగంగా భూమియందు వ్యాపించినది.
అంతటను సమముగా నిబిడముగా అధికమైన
కాంతి శోభతో స్థాపంపబడినది. శత్రువులచేత
పురద్వారములు తెరువబడినవి. శ్రేష్ఠులచేత
సైతము నిరాకారముగా చేయబడలేదు - అని భావం.


ద్రుతం ద్రుతం వహ్నిసమాగతం గతం
మహీ మహీనద్యుతిరోచితం చితమ్
సమం సమంతా దపగోపురం పురం
పరై: పరై రప్యనిరాకృతం కృతమ్

ఈ శ్లోకం
మొదటి పాదం మొదటిలో ద్రుతం, చివరలో గతం,
రెండవపాదం మొదటిలో మహీ, చివరలో చితం,
మూడవపాదం మొదటిలో సమం, చివరలో పురం,
నాలుగవపాదం మొదటిలో పరై , చివరలో కృతం  -
అని వర్ణసమూహాలు ఆవృత్తమైనవి.
అదీ వ్యవధానంలేకుండా కావున
ఇది అవ్యపేతయమకమున
ఆద్యంత యమకమునకు ఉదాహరణ
అని చెప్పవచ్చును.

Saturday, October 8, 2016

ఘనాఘనా భస్య మహీమహీయస:


ఘనాఘనా భస్య మహీమహీయస:


సాహితీమిత్రులారా!

నాలుగు పాదములందు మొదటిలోను,
మధ్యలోను, చివరలోను వర్ణసముదాయము
ఆవృత్తమైన యమకాలంకార ఉదాహరణలు చూచి ఉన్నాము.
ఇపుడు ఆది, మధ్య యమకమునకు ఉదాహరణ చూద్దాము.
అంటే మొదటిలోను మధ్యలోను వర్ణసముదాయము ఆవృత్తవుతుంది.

ఘనాఘనాభస్య మహీమహీయస:
సురాసురాణాం దయితస్య తస్య సా
ధరాధరాకారగృహా గృహార్థి నో
బభూవ భూమేర్నగరీ గరీయసీ
(సరస్వతీకంఠాభరణమ్ -4-95)

మేఘము యొక్క కాంతి గలిగి,
లోకమునందు మహత్తరుడై, దేవతలకు రాక్షసులకు
విష్టుడైన ఆ గృహార్థియొక్క పర్వతాకార గృహములు గల
నగరము భూమికి గొప్పదిగా అయినది - అని భావం.

దీనిలో వ్యవభానములేకుండా అవ్యపేతముగా యమకము ఉంది
కావున ఇది అవ్యపేతయమకము అగుచున్నది.
 ప్రతి పాదమునందు రెండు చోట్ల ఆదిలోను మధ్యలోను
యమకము ఉండుటవల్ల
ఇది ఆదిమధ్యయమకము అగుచున్నది.

ఘనాఘనాభస్య మహీమహీయస:
సురాసురాణాం దయితస్య తస్య సా
ధరాధరాకారగృహా గృహార్థి నో
బభూవ భూమేర్నగరీ గరీయసీ

ఇందులో చివరి పాదము మొదటిలో బభూవభూ అని ఉన్నందున
వర్ణము వేరుగా కనిపించుచున్నది
 కాని ఇక్కడ "వబయో రభేద" - అనే సూత్రాన్నను
సరించి అది సరైనదే'వ'కును 'బ'కును భేదములేదు.

Friday, October 7, 2016

రమ్యలతా వకులై: కులై:


రమ్యలతా వకులై: కులై:


సాహితీమిత్రులారా!



యమకాలంకారంలో
అంత్యయమకమును
గురించి ఇక్కడ చూద్దాం.

వ్యవథిత సింధుమనీరశనై: శనై:
రమరలోకవధూజఘనై ర్ఘనై:
ఫణవతా మభితో వితతం తతం
దయిత రమ్యలతా వకులై: కులై:
                          (కిరార్జునీయమ్ - 5-11)

అనీ రశనై: -మొలత్రాళ్లతో, ఘనై: - దట్టమైన,
అమరలోక వధూజఘనై: - స్వర్గంలోని స్త్రీల పిరుదులతో,
శనై: - మెల్లగా, వ్యథితసింధుం - అడ్డుకోబడిననదులుగలది,
దయిత రమ్యలతా వకులై: - ప్రియము- అందము గల తీగలు పొగడలు గల్గి,
ఫణభృతాం - సర్పాల, కులై: - సమూహాలతో, అభిత: - అంతట,
తతం - మిక్కిలి, వితతం - విస్తరించినది.


ఆహిమాలయం అందమైన మొలత్రాళ్లతో కూడిన
చేవాంగనల పిరుదులతో అడ్డుకోబడిన మందగతిని
పొందిన నదులతోను, మనోహరాలైన తీగలు పొగడలు
ఆకర్షించగా చేరిన సర్పాలు అంతటా వ్యాపించి అందంగా ఉంది
మరో స్వర్గంగా భాసించిందని భావం.


వ్యవథిత సింధుమనీరశనై: శనై:
రమరలోకవధూజఘనై ర్ఘనై:
ఫణవతా మభితో వితతం తతం
దయిత రమ్యలతా వకులై: కులై:

ఇందులోనూ నాలుగుపాదాలలో యమకం ఉంది
మరియు అవ్యపేతమును. ప్రతిపాదం అంత్యంలో
అక్షరసముదాయం ఆవృతమైనందున
ఇది అంత్యయమకంగా చెప్పబడుచున్నది.
మొదటి పాదంనందు శనై:, రెండవపాదంనందు ఘనై:,
మూడవపాదంనందు తతం, నాలుగవపాదంనందు కులై :
పాదాంతములందు ఆవృత్తి పొందినవి.

Thursday, October 6, 2016

సరోజవనా జవనా నదీ:


సరోజవనా జవనా నదీ:


సాహితీమిత్రులారా!

యమకాలంకారం వ్యవధానంతోకూడినది,
వ్యవధానంతోకూడనిది రెండురకాలు
ప్రతిపాదంలో అది వచ్చే స్థలాన్నిబట్టి అంటే
ఆది(మొదట్లో), మధ్య, అంత్య(చివర్లో)
ఆవృత్తమయేవి అని మూడురకాలు.
అవి ఒక పాదంలోనా, రెండుపాదాలలోనా,
మూడు పాదాలలోనా, నాలుగుపాదాలలోనా
అని నాలుగురకాలు.
నాలుగుపాలలో ఆదిలోనా మధ్యలోనా అంత్యంలోనా
ఇలా మరికొన్నిరకాలు. సరే ఇక్కడ మనం నాలుగుపాదాలలో
వ్యవధానంలేకుండా మధ్యలో యమకం వచ్చే దాన్నిగురించి చూద్దాం.

దధత మాకరిభి: కరిభి: క్షతై:
సమనతారసమై రసమై స్తటై:
వివిధకామహితా మహితాంభస:
స్ఫుట సరోజవనా జవనా నదీ:
                          (కిరాతార్జునీయమ్ -5-7)
అర్జునుడు హిమాలయాలకు చేరిన సమయంలో
కవి హిమాలయ వర్ణన చేసిన 15 శ్లోకాలలో ఇది ఒకటి.


ఆకరిభి: = గనులతో కూడిన, కరిభి: = ఏనుగులతో,
క్షతై: = పొడవబడినవై, సమవతార సమై: = దిగుటకు
ఎత్తు పల్లాలు లేని, అసమై: = సాటిలేని, తటై: = తీరాలున్న
(రేవులు), మహితాంభస: = కావలసినంత నీరుగలవి,
వివిధ కామహితా: = స్నానం మొదలైన కోరికలకు
అనుకూలమైనవి, జవనా: = వేగంగా పరుగెత్తు,
నదీ: = నదులను, దధతం = పొంది ఉంది.

ఆ పర్వతంలో ఏనుగులు దంతాలతో పర్వతసానువులను
పొడవగా స్వచ్ఛమైన నీరు వెడలి చెరువులుగా ఏర్పడ్డాయి.
స్నానాదులకు అనుకూలమైన నిండుగా నీరున్న నదులు
వేగంగా పరుగెత్తుతున్నాయి- అని భావం.

దధత మాకరిభి: కరిభి: క్షతై:
సమనతారసమై రసమై స్తటై:
వివిధకామహితా మహితాంభస:
స్ఫుట సరోజవనా జవనా నదీ:

ఇందులో పాదం మధ్యభాగంలో వ్యవధానంలేకుండా
వర్ణసముదాయములు ఆవృత్తమైనవి.
మొదటి పాదంలో కరిభి: ఆవృత్తమైనది.
రెంవపాదంలో రసమై, మూడవపాదంలో మహితా,
నాలుగవపాదంలో జవనా అనే వర్ణసముదాయాలు ఆవృత్తమైనవి
కావున ఇది అవ్యపేత మధ్యయమకమునకు సరైన ఉదాహరణ.

Tuesday, October 4, 2016

నానా నన స్వస్వ నానా


నానా నన స్వస్వ నానా


సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం గమనించండి

వివి ధధ వవ నానా గగ ర్ధర్ధ నానా
వివి తత గగ నానా మమ జ్జజ్జ నానా
రురు శశ లల నానా వవం ధుధుం నానా
మమ హిహి తత నానా నన స్వస్వ నానా
( వామనుని కావ్యాలంకార సూత్రవృత్తిలోనిది.)


దీనిలో వచ్చిన అక్షరం వెంట
వెంటనే రెండుమార్లు వచ్చాయి.
వ్యవధానంలేకుండా వచ్చిన
అక్షరమే వస్తూ 28 పర్యాయాలు
ఆవృత్తమై శ్లోకమంతా నిండి ఉంది.
దీన్ని సరస్వతీకంఠాభరణంలో
సూక్ష్మవ్యపేత యమకానికి
ఉదాహరణగా ఇచ్చారు.
దీన్ని ఆవలి అనే శబ్దచిత్రంగా
కూడ తీసుకోవచ్చు.

ఇది శ్రీకృష్ణుడు బలరామునికి
సముద్రతీరభూమిని
వర్ణిస్తున్న ప్రసంగమునందలి
ఉదాహరణ పద్యం.

వివిధములైన అర్జున వృక్షములతోడి వనములు కలది.
ఏనుగులను(సర్పములను)కాంక్షించుచు అభివృద్ధములైన
నానా పక్షులతో విస్తృతమైన ఆకాశము కలది. వంగకయే
మునుగుచున్న జనములను గలది(విష్ణువు నామాలము
అంటూ మునుకలు వేస్తున్న జనములను కలది). లేళ్ళ యొక్క
కుందేళ్ళ యొక్క క్రీడలను గలది. మనయొక్క శత్రువులను
సంతాపింపజేయునది, నాకు హితమును కలుగజేయునది,
ముఖము లేకున్నను స్వకీయ నిస్వనములచేతనే ప్రాణములు
నిలుపుచున్నది, స్త్రీరూపమున ఉన్నది
(ఈ సముద్రతీరమునందలి ప్రదేశము) - అని భావం.

Sunday, October 2, 2016

రాజీవ రాజీవశలోల భృంగం


రాజీవ రాజీవశలోల భృంగం


సాహితీమిత్రులారా!


యమకాలంకారము అంటే విభిన్నమైన
అర్థం కలిగి ఒకేవిధమైన రూపంగల వర్ణసమూహం.
వర్ణసమూహం యొక్క ఆవృత్తి అవ్యపేత(వ్యవధానంలేకుండా),
వ్యపేతము(వ్యవధానముతోటి) అయిన యమకము అని పిలువబడును.

ఇది అనేకరకములు అందులో
అవ్యపేత యమకమునకు ఉదాహరణ-

రాజీవ రాజీవశలోల భృంగం
ముష్ణంత ముష్ణం తతిభి స్తరూణామ్
కాంతాలకాంతా లలనా: సురాణాం
రక్షోభి రక్షోభిత ముద్వహన్తమ్
                               (మాఘ శిశుపాలవధ)

శిశుపాలవధలో రైవతకాద్రి వర్ణన సందర్భంలోనిది ఈ శ్లోకం
(రాజీవముల సమూహమునకు వశమై చలించుచున్న
తుమ్మెదలను గలది వృక్షముల సమూహములచేత
ఎండవేడిమిని హరించుచున్నది అందమైన
ముంగురులుగల దేవతాస్త్రీలను రాక్షసులచేత
క్షోభనొందకుండా భరించుచున్నది.)


అవ్యపేత అంటే వ్యవధానంలేకుండా వర్ణసమూహము
ఆవృత్తమైన అది అవ్యపేత యమకము అంటాము.
ఈ యమకము నాలుగు పాదాలలో ఉంటే
చతుష్పాదయమకము అని,
ప్రతిపాదము మొదటిలో ఉన్న
ఆదియమకము అని చెప్పబడుతుంది.

1. మొదటి పాదంలో రాజీవ - (పద్మము), రాజీ - (సమూహము).
2. రెండవపాదంలో ముష్ణంత, ముష్ణం
3. మూడవపాదంలో కాంతాలకాంతాల - కాంత+ అలక + అంతా(:) + ల అనునవి
4. నాలుగవ పాదంలో రక్షోభి: +  అక్షోభి(త) అనునవి అవ్యవహితంగా ఆవృత్తి చెందాయి.