Thursday, July 30, 2020

య,ర,ల,వ,శ,ష,హ - లతో కందం

య,ర,ల,వ,శ,ష,హ - లతో కందం




సాహితీమిత్రులారా!

చిత్రమంజరి పేరుతో శ్రీబోడి వాసుదేవరావుగారు
ఒక పుస్తకాన్ని కూర్చారు. ఇందులో
బంధ - గర్భ - చిత్ర కవిత్వాలున్నాయని
చెప్పుకున్నాడు ఇందులోని చిత్రకవిత్వ విభాగంలోనిదే
ఈ అంతస్థోష్మకందపద్యం
మనకు హల్లులలో
స్పర్శముల(క నుండి మ వరకు ఉన్న హల్లులు)ని,
అంతస్థముల(య,ర,ల,వ - అనే నాలుగక్షరాలు)ని,
ఊష్మముల(శ,ష,స,హ - అనే నాలుగక్షరాలు)ని
విభాగాలున్నాయి
ఇపుడు య,ర,ల,వ అనే అంతస్థములు
       శ,ష,స,హ అనే ఊష్మములు
       (జిహ్వామూలీయము(కకార ఖకారములకు
         ముందున్న విసర్గ),
        అనుస్వారములు కూడ ఊష్మములే)
ఈ అక్షరముల తోటే కందపద్యం కూర్చబడినది కావున దీనికి
అంతస్థోష్మకందమని పేరు

వరహారవార! సువిహయ!
సరసరసా! శ్రీవిహార! సాహాయ! రరా!
సురహరి! సారసశరసా!
హరశర! సారవర! సారహరి! హరిశాయీ!

వరహారవార - శ్రేష్ఠమైన హార సమూహములు  గలవాడా
సువిహయ - (సు-వి-హయ) - చక్కని పక్షివాహనము
           (గరుడవాహనము) గలవాడా
సరసరసా - (స-రస-రసా) - అనురాగముతో కూడిన
                          భూదేవి గలవాడా
శ్రీవిహార - లక్ష్మీదేవియొక్క విహారము గలవాడా
సాహాయ (సా - హా - య) కాంతికిని, ఈవికిని నిలయమైనవాడా
ర రా - (ర - ర - అ) - మనోహరుడైన మన్మథునికి హేతువైనవాడా
సురహరి - అమరులునింద్రుడు గలవాడా
సారసశరసా(సారసశర - సా) మన్మథుని వంటి దేహకాంతి కలవాడా
హరశర - హరునికి బాణమైనవాడా
సారవర - (సార-వర) న్యాైయముచేత శ్రేష్ఠమైనవాడా
సారహరి - స్థిరాంశము గలిగిన విష్ణువా
హరిశాయీ - శేషుని(సర్పము)పై శయనించువాడా

Monday, July 27, 2020

రమణమ్ - మరణమ్ - చరణమ్


రమణమ్ - మరణమ్ - చరణమ్




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకంలోని చమత్కారం చూడండి.

రామచంద్రే "రణ" ప్రాప్తే మధ్య "మం" నాక యోషిత
ఆది "మం" లేభిరే వీరా భీరమశ్చ ఆది "చం" రణమ్


రామచంద్రుడు "రణమ్" (యుద్ధము) నకు వెళ్ళినాడు.
నాకయోషిత (దేవతా స్త్రీలు)
(రణ మధ్య "మ" ను పొందిరి) "రమణ" రమణులను పొందిరి.
వీరులు ఆది "మ" ను పొందిరి - "మరణ" - మును పొందిరి.
భీరువులు (పిరికివారు) ఆది "చ" ను పొందిరి
అనగా చరణములను పొందిరి.

Friday, July 24, 2020

రామాయణంలోని సంఖ్యామానం


రామాయణంలోని సంఖ్యామానం





సాహితీమిత్రులారా!

మన సంఖ్యామానంలో మనం కోటి వరకు లేదా
వందకోట్లవరకు లెక్కిస్తాం. కానీ రామాయణంలో ఉన్న
సంఖ్యామానం చూస్తే మనకు అంతుపట్టదు.
ఇక్కడ ఆ సంఖ్యామానం చూద్దాం-

శతం శత సహస్త్రాణాం కోటిమాహుర్మనీషిణః
శతం కోటి సహస్త్రాణాం శంఖ ఇత్యభిధీయతే
శతం శంఖ సహస్త్రాణాం మహాశంఖ ఇతిస్మృతమ్
మహాశంఖ సహస్త్రాణాం శతం బృందమిహోచ్యతే
శతం బృంద సహస్త్రాణాం శతం పద్మమిహోచ్యతే
శతం పద్మ సహస్త్రాణాం మహాపద్మమితి స్మృతమ్
మహాపద్మ సహస్త్రాణాం శతం ఖర్వమిహోచ్యతే
శతఖర్వ సహస్త్రాణాం మహాఖర్వ మిహోచ్యతే
మహాఖర్వ సహస్త్రాణాం శతం సముద్రమఖిదీయతే
శతం సముద్ర సాహస్ర మోఘ ఇత్యభిధీయతే
శతమోఘ సహస్త్రాణాం మహౌఘ ఇతివిశ్రుతః
                                                                          (వాల్మీకి రామాయణం యుద్ధకాండ)
నూరులక్షలు - కోటి (7 సున్నలు)
నూరువేల కోట్లు - 1 శంఖం (12 సున్నలు)
నూరువేల శంఖములు - 1 మహాశంఖము (17 సున్నలు)
నూరువేల మహాశంఖములు - 1 బృందము (22సున్నలు)
నూరువేల బృందములు - 1 మహాబృందము (27 సున్నలు)
నూరువేల మహాబృందములు - 1 పద్మము (32 సున్నలు)
నూరువేల పద్మములు - 1 మహాపద్మము (37 సున్నలు)
నూరువేల మహాపద్మములు - 1 ఖర్వము (42 సున్నలు)
నూరువేల ఖర్వములు - 1 మహాఖర్వము (47 సున్నలు)
నూరువేల మహాఖర్వములు - 1 సముద్రము (52 సున్నలు)
నూరువేల సముద్రములు - 1 ఓఘము (57 సున్నలు)
నూరువేల  ఓఘములు - 1 మహా ఓఘము(మహౌఘము)(62 సున్నలు)

ఇప్పుడు ఒకటిపక్కన 7 సున్నలుంటే పలకగలము కాని 62 సున్నలుంటే
దీన్ని బట్టి పలకగలం కదా

Wednesday, July 22, 2020

విశ్వనాథవారి - విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు - 6


విశ్వనాథవారి - విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు - 6






సాహితీమిత్రులారా!

విశ్వనాథవారి విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు 
దూరదర్శన్ వారు సీరియల్ గా తీసి ఉన్నారు
వారి సీరియల్ లో  6వ భాగం వీక్షించండి-


Monday, July 20, 2020

విశ్వనాథవారి-విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు


విశ్వనాథవారి - విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు - 5






సాహితీమిత్రులారా!

విశ్వనాథవారి విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు 
దూరదర్శన్ వారు సీరియల్ గా తీసి ఉన్నారు
వారి సీరియల్ లో  5వ భాగం వీక్షించండి-

Saturday, July 18, 2020

విశ్వనాథవారి - విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు - 4


విశ్వనాథవారి - విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు - 4






సాహితీమిత్రులారా!

విశ్వనాథవారి విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు 
దూరదర్శన్ వారు సీరియల్ గా తీసి ఉన్నారు
వారి సీరియల్ లో  4 వ భాగం వీక్షించండి-

Wednesday, July 15, 2020

షోడశదళ పద్మ బంధం


షోడశదళ పద్మ బంధం




సాహితీమిత్రులారా!

ఈ వీడియో చూడండి
షోడశపద్మదళ బంధం గురించిన కథ


Tuesday, July 14, 2020

విశ్వనాథవారి - విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు - 3


విశ్వనాథవారి - విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు - 3






సాహితీమిత్రులారా!

విశ్వనాథవారి విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు 
దూరదర్శన్ వారు సీరియల్ గా తీసి ఉన్నారు
వారి సీరియల్ లో  3 వ భాగం వీక్షించండి-

Saturday, July 11, 2020

విశ్వనాథవారి - విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు - 2


విశ్వనాథవారి - విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు - 2






సాహితీమిత్రులారా!

విశ్వనాథవారి విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు 
దూరదర్శన్ వారు సీరియల్ గా తీసి ఉన్నారు
వారి సీరియల్ లో 2వ భాగం వీక్షించండి-

Thursday, July 9, 2020

విశ్వనాథవారి - విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు - 1


విశ్వనాథవారి - విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు - 1






సాహితీమిత్రులారా!

విశ్వనాథవారి విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు 
దూరదర్శన్ వారు సీరియల్ గా తీసి ఉన్నారు
వారి సీరియల్ లో 1వ భాగం వీక్షించండి-

Tuesday, July 7, 2020

తిక్కన సోమయాజి - 2


తిక్కన సోమయాజి - 2 




సాహితీమిత్రులారా!

తిక్కన సోమయాజి కవిత్వాన్ని గురించి భాగం - 2
డా. జంధ్యాల జయకృష్ణ బాపూజి గారి
ఉపన్యాసం ఆకర్ణించండి...........


Saturday, July 4, 2020

తిక్కన సోమయాజి - 1


తిక్కన సోమయాజి - 1 




సాహితీమిత్రులారా!

తిక్కన సోమయాజి కవిత్వాన్ని గురించి
డా. జంధ్యాల జయకృష్ణ బాపూజి గారి
ఉపన్యాసం ఆకర్ణించండి...........


Friday, July 3, 2020

ఆదికవి నన్నయభట్టారకుడు


ఆదికవి నన్నయభట్టారకుడు





సాహితీమిత్రులారా!

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజి గారు
వివరించిన నన్నయ భట్టారకుని సాహిత్యవిషయాలు
వీక్షించండి -

Wednesday, July 1, 2020

మహాకవి నన్నెచోడుడు


మహాకవి నన్నెచోడుడు





సాహితీమిత్రులారా!

నన్నచోడమహాకవి కవితను గురించి
డా. జంధ్యాల జయకృష్ణ బాపూజి గారి
ప్రసంగం ఈ వీడియో ద్వారా ఆస్వాదించండి