Sunday, August 30, 2020

రఘువీరగద్యం

 రఘువీరగద్యం
సాహితీమిత్రులారా!

వేదాంతదేశికులవారి

రఘువీరగద్యంను ఈ గాయిని

ఎంత చక్కగా ఆలపించారో వీక్షించండి-
Friday, August 28, 2020

విషమంటే లక్ష్మియా?


 విషమంటే లక్ష్మియా?
సాహితీమిత్రులారా!

Sri Maha Vishnu - YouTube

ఒక్కొక్కసారి మనకు ఎవరు ప్రశ్నించకపోయినా

మనకుమనమే ప్రశ్నించుకొని సమాధానం చేసుకుంటాం

అలాసమాధానం చెందడాన్ని అపహ్ననం చేయడం అంటారు.

ఈ శ్లోకం చూడండి-

హాలాహలోనైవ విషం రమా

జనాః పరం వ్యత్యయ మత్ర మన్వతే

నిపీయ జాగర్తి సుఖేన తం శివః

స్పృశ న్నిమాం ముహ్యతి నిద్రయా హరిః


పూర్వం దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు పుట్టిన ఈ హాలాహలం అను విషం సంగతి తెలియక ప్రజలు దాన్ని ఘోరకాకోల విషమన్నారు . వాస్తవానికి అది నిజం కాదు అసలైన విషం ఏందంటే అది లక్ష్మి(సంపద). ఎందుచేతనంటే దాన్ని త్రాగిన శివుడు ఏ ఇబ్బందీ లేకుండా చావకుండా హాయిగా, సుఖంగా మేలుకొనే ఉన్నాడు. కాని సముద్రంలో పుట్టిన అసలు విషమైన ఈ లక్ష్మిని(సంపదను) తాకినంత మాత్రాన్నే తన్మయం చెందిన విష్ణువు మాత్రం మూర్ఛితుడైనట్లు నిద్రాముద్రితుడై ఉన్నాడు కదా కనుక అసలు విషమంటే లక్ష్మి(సంపద)యే అని భావం.

ఇందులో ప్రశ్న ఎవరు వేశారు  ఎవరూ వేయలేదు అనే ప్రశ్నించుకున్నాడు తనే సమాధానం చెప్పుకున్నాడు

దీన్నే అపహ్ననం చేయడం అంటారు.

ఇదొక సంవాద చిత్రం.

Sunday, August 23, 2020

అప్పు, నిప్పు, మెప్పు, చెప్పు(దత్తపది)

 అప్పు, నిప్పు, మెప్పు, చెప్పు(దత్తపది)
సాహితీమిత్రులారా!


కుమ్మరి మొల్ల సినిమాలో మొల్లను పరీక్షించటానికి 

తెనాలిరామకృష్ణుడు ఇచ్చిన దత్తపది - 

అప్పు, నిప్పు, మెప్పు, చెప్పు

దీన్ని తెరవెనుక పూరించి ఇచ్చింది శ్రీశ్రీగారు


అప్పుడు మిధిలకు జని నే

నిప్పుడు కాంచు వింత నిచ్చటి ప్రజ తా

మెప్పుడును కాంచబోరని

చెప్పుచు రాఘవుడు విరిచె శివకార్ముకమున్


--------------------------------------

ఇంతవరకే సినిమాలో ఉన్నది 

కానీ వారు ఇంకా వ్రాసుకొని ఉన్నారట స్క్రిప్టు ఇలా.........

చాలతేలికగా కందం చెప్పావు

ఇదే అర్థం భావం చెడకుండా ఉత్పలమాలలో చెప్పు అమ్మాయీ

అని తెనాలిరామకృష్ణుడు అడగ్గా మొల్ల(శ్రీశ్రీ) ఈ విధంగా 

ఇచ్చిదట

అప్పుడు ఖ్యాతిగన్న మిథిలాఖ్యపురంబును చేరనేగి, నే

నిప్పుడు చేయు వింత నెవరేనియు జీవితకాలమందు తా

మెప్పుడుగాని చూడరని యెంతయు సంతసమార, ధీరుడై

చెప్పుచు  రాఘవుండు విరిచెన్  శివకార్ముక మద్భుతంబు

గాన్


 

Saturday, August 22, 2020

భువనవిజయంరూపకం - 1

 భువనవిజయంరూపకం - 1
సాహితీమిత్రులారా!


భువనవిజయం అనేది శ్రీకృష్ణదేవరాయలవారి కవితానిలయం

అందులో ఎల్లపుడు సాహిత్యగోష్ఠి జరుగుతూవుండేది

దానిలో ఆకాలంలో ఎలాంటి సాహిత్యచర్చలు జరిగేవో

ఈ భువనవిజయం నమూనాగా తీసుకోవచ్చు

2013లో బెంగళూరులో మహామహులచే 

నిర్వహింపబడినది

 ఈ అపూర్వ సాహిత్య రూపకం భువనవిజయం రూపకం

మొదటిభాగాన్ని ఇక్కడ ఆస్వాదించగలరు-Thursday, August 20, 2020

కందగర్భ చంపకమాల

కందగర్భ చంపకమాల


సాహితీమిత్రులారా!


ఒక పద్యంలో మరోపద్యం ఇమడ్చడాన్ని గర్భకవిత్వం అంటారు.

కవి శక్తినిబట్టి రెండు మూడు అంతకుమించీ పద్యాలను 

ఒకేపద్యం ఇమడ్చడం చేసి ఉన్నారు.

ఇక్కడ మనం మచ్చ వెంకటకవి కృత కుశ చరిత్ర అనే 

అచ్చతెలుగు కావ్యం నుండి ఒక ఉదాహరణ చూద్దాం-

ఇక్కడ మరో విశేషం కూడా గమనించాలి అదేమిటంటే

కుశచరిత్ర పూర్తిగా అచ్చతెలుగులో వ్రాయబడిన కావ్యం.

దీనికి  పెట్టిన పేరు  శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన కుశచరిత్రం


అల సిరినేల నీలల హొయ,ల్గురి యంగడు గూడు ఱేఁడగో
టల ర జగా లనన్నిఁటిని నాడఁగ జేసెడు గారడీఁ డ ని
చ్చలు సరిలేనిఁ క్రొన్నెనరుజ, క్కరహిం గనులందు హెచ్చుఁ గాఁ
గల యతఁడా యనింగడిఁదిఁ గ్రాలిన సోఁకులఁ గూల్చురా యడా!

                                                        (కుశచరిత్రము - 2 - 130)

ఇందులో మనకు చంపకమాల మాత్రం కనిపిస్తున్నది

దీనిలో కందము-  ఇమిడి ఉన్నది

వాటిని గమనిద్దాం-

అల (సిరినేల నీలల హొయ,ల్గురి యంగడు గూడు ఱేఁడగో

టల ర జగా) లనన్నిఁటిని నాడఁగ జేసెడు గారడీఁ డ ని

చ్చలు (సరిలేనిఁ క్రొన్నెనరుజ, క్కరహిం గనులందు హెచ్చుఁగాఁ

గల యతఁడా) యనింగడిఁదిఁ గ్రాలిన సోఁకులఁ గూల్చురాయడా!


విడిగా కందం వ్రాస్తే-

సిరినేల నీలల హొయ,

ల్గురి యంగడు గూడు ఱేఁడగోటల ర జగా

సరిలేనిఁ క్రొన్నెనరుజ 

క్కరహిం గనులందు హెచ్చుఁగాఁగల యతఁడా

ఇదీ కవి ప్రతిభ


Monday, August 17, 2020

రెండు దీర్ఖాచ్చులతో పద్యం

 రెండు దీర్ఖాచ్చులతో పద్యం
సాహితీమిత్రులారా!


రెండు దీర్ఘాచ్చులతో కూర్చిన పద్యం

లేక శ్లోకంను దీర్ఘ ద్వి స్వరచిత్రం అంటాం

దండి కావ్యాదర్శంలోనిది


శ్రీ దీప్తీ హ్రీ కీర్తీ ధీనీతీ గీ ప్రీతీ

ఏధేతే ద్వే ద్వే తేయే నేమే దేవేశే

                                                            (కావ్యాదర్శము- 3- 86)

(దేవేంద్రుని యందుకూడ లేని శోభాదీప్తులు,

లజ్జాకీర్తులు, బుద్ధినీతులు, వాక్ప్రేమలు

రెండు రెండు నీకు వృద్ధినొందుచున్నవి.)

దీనిలో మొదటి అర్థము అనగా శ్లోకము పూర్వభాగము అంతా ఈ - స్వరంతోను,

రెండవ భాగము అనగా ఉత్తరార్థశ్లోకం అంతా ఏ - స్వరం తోను కూర్చబడినది.

ఈ రెండును దీర్ఘ స్వరములే కాబట్టి దీన్ని  దీర్ఘ ద్వి స్వరచిత్రం 

అనికూడ అనవచ్చు


Saturday, August 15, 2020

కాఫీ దండకం

 కాఫీ దండకం
సాహితీమిత్రులారా!


కాఫీ మీద పాతదండకాలు ఉన్నాయి

కానీ ఇది క్రొత్త దండకం జొన్నవిత్తులవారు

వ్రాశారు మరియు ఆలపించారు మిథునం చిత్రంలో

దాన్ని మీరు ఇక్కడ ఆస్వాదించండి-


Thursday, August 13, 2020

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ................అక్షరాల పాద సీసము

 ఒకటి రెండు మూడు నాలుగు ఐదు .........అక్షరాల పాద సీసముసాహితీమిత్రులారా!


ఏకాక్షరి, ద్వ్యక్షరి, త్య్రక్షరి ఇలా చూసి ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సీసంలో ఒక అక్షంతో ఒక పాదం,

రెండక్షరాలతో రెండవపాదం, మూడక్షరాలతో మూడవ పాదం, నాలుగక్షరాలతో నాలుగపాదం,

ఐదక్షరాలతో ఐదవపాదం, ఇలా కూర్చటం జరిగింది గమనించండి


రారార రారర రూరూర రేరార

         రేరార రీరర రూరరార 

భాభీరు భీభ భాభేరీరేభి

         భూరిభాభాభీ భూభూ భరా

లినీ నివనైక నాకళానూన

         లాలలోలా ళంలీల 

దారి దాదోద

         దాకారోదాద 

గోబా పా పాపలో 

సా విలా వేంశైవా

వ్యభా వాకాదివ్యరూ

రాధికాస్పుదిక్కరి కారాం

                                (ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము - 878)1వ పాదము-       1- అక్షరం- ర

రెండవపాదం- రెండక్షరాలు - భ,ర

మూడవపాదం - 3 అక్షరాలు-క,న,ల

నాలుగవ పాదం- 4 అక్షరాలు - క,ద,ర,వ

ఐదవపాదం-  5 అక్షరాలు - క,గ,ప,బ,ల

ఆరవపాదం -  6 అక్షరాలు - క,ట,ల,వ,శ.స

ఏడవపాదం-  7 అక్షరాలు - క,వ,భ,ర,ప,ద,య

ఎనిమిదవపాదం- 8 అక్షరములు - క,గ,ట,ద,ధ,ప,స,ర

ఈ విధంగా కూర్చబడినది


Tuesday, August 11, 2020

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు

 శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు

సాహితీమిత్రులకు

శ్రేయోభిలాషులకు

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు


Saturday, August 8, 2020

తామసి - తాజెడి

 తామసి - తాజెడి

సాహితీమిత్రులారా!


కపిలవాయి లింగమూర్తిగారి

ఆర్యా శతకంలోని పద్యం చూడండి


తాజెడిమసియగు తామసి

యేజగమున నున్నగాని ఇది నిక్కము సు

మ్మీ జనుడు దీనినెరిగిన

వేజన్మములైన జెడడు వినుమా యార్యా!


తామసగుణం కలవాడు తాను చెడిపోతాడు మసి అయిపోతాడు.

ఇది కనుక్కున్నవాడు ఎన్ని జన్మలెత్తినా చెడడు అంటున్నారు లింగమూర్తిగారు.


ఇందులో మరో చమత్కారం చూపించాడు కవిగారు. అదేమంటే

తామసిలోని - 'తా' జెడి - త అనే అక్షరం చెడిపోతే మసిమిగులపుతుంది

 - అని శబ్దచిత్రాన్ని చూపించాడు.

Thursday, August 6, 2020

మేడసాని - మాడుగుల-గరికపాటి పద్యనీరాజనం

మేడసాని - మాడుగుల-గరికపాటి పద్యనీరాజనం
సాహితీమిత్రులారా!

కొప్పరపు కవుల పాండిత్యాన్ని అవధానకౌశలాన్ని కీర్తిస్తూ
అవధానులు సర్వశ్రీ
మేడసాని మోహన్ గారు
మాడుగుల నాగఫణిశర్మగారు
గరికపాటి నరసింహారావుగారు
ఒక వేదికపై చేసిన పద్యనీరాజనం
వీడియో వీక్షించండి -

Wednesday, August 5, 2020

ఆయన పై ఎవరిప్రభావం ఎక్కువ?

ఆయన పై  ఎవరిప్రభావం ఎక్కువ?

సాహితీమిత్రులారా!


కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి పై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంది
అనే అంశంపై జంధ్యాలగారిని డా. ప్రసాదరాయకులపతి గారు ఇంటర్వ్యూ
వీడియో వీక్షించండి-

Tuesday, August 4, 2020

ముందు వెనుక రక్షణగా ఉండేవాడే పతి

ముందు వెనుక రక్షణగా ఉండేవాడే పతి


సాహితీమిత్రులారా!

కపిలవాయి లింగమూర్తిగారు తన ఆర్యా శతకంలో 
అనేక శబ్దచిత్రాలను కూర్చారు  వాటిలోనిదే ఈ పద్యం 
చూడండి-

పడతి కుభయ పక్షములను
పుడమి నేడుగడగ నిలిచి పొలుచునెవడునా
తడె పతియటు గాకున్నను
వెడగుసుమీ జగతియందు వినుమా యార్యా!

ఉభయపక్షములు - ఇహపరాలు, రెండువైపులు.
ఏడుగడ - ఆధారం
పడతికి ఇహపరాలలో రెండువైపులా అనగా
ఇహంలోనూ పరంలోనూ అండగా ఉండేవాడే భర్త
అలాకానివాడు అవివేకి క్రిందనే లెక్క - అని భావం.

ఇందులోని శబ్దచిత్రం-
పడతి - అనే పదంలో మొదటి చివరి అక్షరాలను కలిపిన పతి అవుతుంది.
దీన్నే కవిగారు ముందు వెనుక అంటే పతి అయినవాడు ఇదేవిధంగా
ముందు వెనుక రక్షణగా ఉండేవాడే పతి లేనివాడు అవివేకి అని చెబుతున్నాడు.

Sunday, August 2, 2020

భార్య-దారా-కళత్రం

భార్య-దారా-కళత్రంసాహితీమిత్రులారా!

భార్యకు గల పర్యాయపదాలు దార, కళత్రం ఈ పదాలతో
కపిలవాయి లింగమూర్తిగారు ఆర్యా శతకంలో కూర్చిన శబ్దచిత్రం
గమనించండి-

ప్రకృతి త్రయస్వరూపిణి
సకియ యనం బురుషుడెట్టి జనుడైననుదా
రకళత్రము భార్యగ యో
పికచే దగినట్లు నడుచు వినుమా యార్యా!


ప్రకృతి త్రయస్వరూపిణి - మూడువిధాలైన
ప్రకృతులు అనగా సాత్విక రాజస తామసాలు మూడు గలది.

దార-కళత్రం- భార్య అనే మూడు విధాలైన
పుం, నపుంసక, స్త్రీలింగాలు మూడు గలది.

ఇందులోని శబ్దచమత్కారం-

స్త్రీ మూడు విధాలైన ప్రకృతులు కలది.
కాబట్టి తన భర్త త్రిగుణాలలో ఎలాంటి గుణం
గలవాడైనా అతనికి తగినట్లు నడచుకోగలదు.

దారా అనే శబ్దం పుంలింగం-
పురుషుని భయపెట్టునది, భయపడునది అని వీని అర్థం.
పురుషుడు అపమార్గంలో ఉంటే వాణ్ని భయపెట్టి దారికి
తెచ్చుకుంటుంది. లేదా అనుకూలుడా తానే అతనికి
భయపడుతుంది.

కళత్రం - నపుంసకలింగం.
పురుషుని కళంకంనుండి రక్షించేది.
అతని కళలు కాపాడేది అని అర్థం.
ఇల్లాలు మంచిదైనపుడు తన భర్తకు
ఏమచ్చారాకుండా కాపాడుతుంది.

భార్యా అంటే భరింపబడేది అని అర్థం.
సంసారంలో ఆమె పురుషునిచే భరింపబడుతుంది.
అతడు పెట్టే కష్టాలనన్నిటిని భరిస్తుంది.
ఈ విధంగా ప్రకృతి మూడురకాలు.