Thursday, August 13, 2026

 

మాతృకావిలాసంలోని ఏకాక్షరనిఘంటువు - 8


సాహితీమిత్రులారా!

మాతృకావిలాములోని ఏకాక్షరనిఘంటువు తరువాయి భాగం ..



ఠఠాఠిఠీఠుఠూఠేఠైఠోఠౌఠంఠః ॥ 12

ఠో ధ్వంసో నందనశ్చైవ జ్ఞానీ మధ్వరిరేవ చ ॥ 37

వాచాలః శూన్య ఆసారష్టా శూన్యా మాసికేత్యపి ॥

ఠిః కుమారోమరారాతిష్ఠీ కుటుంబ్యథ పుత్రవాన్ ॥ 38

ఠుః కదంబో యమస్త్వష్టా ఠూః ప్రజా ధృతిరేవ చ ॥

ఠేః సమాసోపి ఠైర్వ్యాసష్టోః సమష్టౌ చ గౌతమః ॥ 39

ఠం జ్ఞానం వివరం శూన్యమమృతం శారదం పయః ॥

ఠః ప్రాగుక్తోపి గోప్యో నిర్నిశస్త్ర ధ్వనిస్తథా ॥ 40

·         ఠ: నాశనము (ధ్వంసము), నందనుడు (కుమారుడు), జ్ఞాని, విష్ణువు (మధ్వరి).

·         ఠా: వాచాలుడు, శూన్యము, వర్షము (ఆసారము), నెలకు ఒకసారి వచ్చేది.

·         ఠి: కుమారస్వామి, దేవతల శత్రువు (రాక్షసుడు).

·         ఠీ: సంసారి (కుటుంబి), కుమారుడు కలవాడు.

·         ఠు: కదంబ వృక్షము, యముడు, దేవశిల్పి (త్వష్ట).

·         ఠూ: ప్రజలు, ధైర్యము (ధృతి).

·         ఠే: సమాసము.

·         ఠై: వ్యాస మహర్షి.

·         ఠో: సమష్టి.

·         ఠౌ: గౌతమ మహర్షి.

·         ఠం: జ్ఞానము, రంధ్రము (వివరము), శూన్యము, అమృతము, శరదృతువు నీరు.

·         ఠః: రహస్యము (గోప్యము), నిరంతర శబ్దము.


డడాడిడీడుడూడేడైడోడౌడంటః ॥ 13

అథ డాదేః డః పూజ్యో బహుమూల్యోర్థో డా క్ష్మా చ సరమా రమా ॥

డిగౌరీ డీః శివా ధాత్రీ చంద్రో డూః కలాపవాన్ ॥ 41

డేర్దమో డైర్వృషః కర్ణో డోః పాపీ పురుషాదకః ॥

డౌర్ధేనుశ్చ కరో జారో డంచ నేత్రం పయస్తథా ॥ 42

డః ప్రాగుక్తోపి డయనే భయే చైవ భయానకే ॥


·         డ: పూజ్యుడు, చాలా విలువైన వస్తువు.

·         డా: భూమి (క్ష్మా), కుక్క (సరమ), లక్ష్మి (రమ).

·         డి: గౌరీ దేవి.

·         డీ: పార్వతి (శివ), ధాత్రి (భూమి లేదా దాది).

·         డు: చంద్రుడు.

·         డూ: నెమలి (కలాపవాన్).

·         డే: ఇంద్రియ నిగ్రహం (దమము).

·         డై: ఎద్దు (వృషభం), చెవి (కర్ణం).

·         డో: పాపాత్ముడు, రాక్షసుడు (పురుషాదకః - మనుషులను తినేవాడు).

·         డౌ: ఆవు (ధేనువు), చెయ్యి (కరః), విటుడు (జారుడు).

·         డం: కన్ను (నేత్రం), నీరు లేదా పాలు (పయస్).

·         డః: ఎగరడం (డయనము), భయము, భయంకరమైనది. 

No comments: