Thursday, November 30, 2017

తలలోపలనున్న కల్లుద్రావి రనేకుల్


తలలోపలనున్న కల్లుద్రావి రనేకుల్
సాహితీమిత్రులారా!సమస్య-
తలలోపలనున్న కల్లుద్రావి రనేకుల్


కొప్పరపు సోదరుల పూరణ-

బలు వేసవి దినములలో
గలగిన తాపంబు దీఱగా నుత్సాహం
బొలయగ గడుజల్లని ముం
తలలోపలనున్న కల్లుద్రావి రనేకుల్

తలలోని కల్లు త్రాగటం విరుద్ధార్థం కదా
దాన్ని కవి ముంతలలోని కల్లు అని మార్చారు
దీనితో సమంజసమైనది

Tuesday, November 28, 2017

చుక్కలు పుట్టికన్పడెను సూర్యునితోడ విహాయసంబునన్


చుక్కలు పుట్టికన్పడెను సూర్యునితోడ విహాయసంబునన్
సాహితీమిత్రులారా!


సమస్య- 
చుక్కలు పుట్టికన్పడెను సూర్యునితోడ విహాయసంబునన్


కొప్పరపు సీతారామ ప్రసాదరావు గారి పూరణ-

ఇక్కగ వేదసంహిత గణింపగ మూవురు వేల్పు పెద్ద లీ
యొక్కెడనన్ సమస్తమున కోపిన వేయివెలుంగు ఱేడు త
న్నుక్కి నలార్ప రాహుగ్రహణోద్ధతి పట్టపవల్ వెలుంగు మై
చుక్కలు పుట్టికన్పడెను సూర్యునితోడ విహాయసంబునన్


ఇందులో చుక్కలు సూర్యుడు ఆకాశంలో కనిపించాయనే విరుద్ధార్థం
కనిపిస్తున్నది దీన్ని కవిగారు మైచుక్కలు అనడంతో సవ్యమైంది.

Sunday, November 26, 2017

దత్తపది


దత్తపదిసాహితీమిత్రులారా!

మాడుగుల నాగఫణిశర్మగారి
అవధానం నుండి చూడండి-Saturday, November 25, 2017

చరణముతోడ నాథునకు సాధ్వి యొనర్చు సపర్య భక్తిమై


చరణముతోడ నాథునకు సాధ్వి యొనర్చు సపర్య భక్తిమై 
సాహితీమిత్రులారా!సమస్య -
చరణముతోడ నాథునకు సాధ్వి యొనర్చు సపర్య భక్తిమై 
(ఇది 1961 సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్ పత్రికలో
సమస్యాపూరణం క్రింద ఇచ్చినది.)

ధవళేశ్వరం వాసి అనూరాధగారి పూరణ-

సురుచిరకౌముదీనిశను సోగపు కన్నులచిద్విలాస బం
ధుర వికచోత్పలప్రభలు తూగగ ముగ్ధ మనోనురాగ మా
ధురులొలికించి "నావలపుతోటకు నామనివంచు" ధార్మికా
చరణముతోడ నాథునకు సాధ్వి యొనర్చు సపర్య భక్తిమై 

ఇందులో చరణంతో నాథునికి సపర్యలు చేసినట్లనిపించినా
పూరణలో ధార్మికాచరణ - గా మార్చటం వలన ఇందులోని
సందేహం విడిపోయింది.

Thursday, November 23, 2017

8 కాళ్ళతో ఉన్న 800 సంవత్సరాల శిల్పం


8 కాళ్ళతో ఉన్న 800 సంవత్సరాల శిల్పం
సాహితీమిత్రులారా!

నాలుగు శిల్పాలను ఒక శిల్పంగా
మలచిన శిల్పం ఇందులో
నలుగురు యువతులుగా
ఉన్న ఒకేయువతి. దాని వివరణతేకూడిన
వీడియో ఇక్కడ చూడండి-
ఇది గర్భచిత్రం క్రిందికి వస్తుంది


Wednesday, November 22, 2017

గాంధిః, జేతుం, ఈశః, పాయాత్


గాంధిః, జేతుం, ఈశః, పాయాత్
సాహితీమిత్రులారా!


గాంధిః, జేతుం, ఈశః, పాయాత్
అనే పదాలలోని అక్షరాలు
పాదమునకు మొదట, చివర వచ్చేట్లు
గాంధీకి దీవనగా పద్యం పూరించాలి.

గరికపాటి మల్లావధాని గారి పూరణ-

గాంధి ర్మహౌజసాం కంధిః
జేతాయేన యదార్జి తుం
హాంగతోద్య సర్వేశః
పాయాత్ప్రాపయ్యనః ప్రియాత్

దీనిలో మొట చూపిన పదాలలోని అక్షరాలు
మొదట్లోను చివరల గాంధీకి దీవనగా కూర్చారుTuesday, November 21, 2017

కుందేలులు రెండు వచ్చి కుచములు కరచెన్


కుందేలులు రెండు వచ్చి కుచములు కరచెన్
సాహితీమిత్రులారా!

సమస్య-
కుందేలులు రెండు వచ్చి కుచములు కరచెన్

నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులవారి పూరణ-

కొందలము గొలుపు గ్రీష్మము
నందారిద్య్రము చేత పతిని నట్టింటన్ కూ
డం దై ము చేత మదిత
కుందేలులు రెండు వచ్చి కుచములు కరచెన్


దీనిలో కుందేలలు కుచములను కరవడం సాధ్యమైనదికాదు
దీన్ని కవిగారు ముదితకుందేలులు రెండు వచ్చి కుచములు కరచెన్
అని పూరించడం వల్ల తేళ్ళు కరవడంగా మారి అర్థవంతమైంది.


Monday, November 20, 2017

ఎనిమిది కాళ్ళ జంతువును చూశారా?


ఎనిమిది కాళ్ళ జంతువును చూశారా?
సాహితీమిత్రులారా!

కొన్ని చోట్లవున్న ప్రతిమలను
చూస్తే కొన్ని విషయాలు వెంటనే
అవగాహనకు రావు వాటిని
గురించి మళ్ళీ చూస్తే అర్థమౌతాయి
రెండు జంతువులు కలిపి ఒక జంతువుగా
చెక్కిన ఈ శిల్పం చూడండి
ఇది గర్భచిత్రం మాదిరి ఉంది.


Sunday, November 19, 2017

భారతీయ స్పినక్స్


భారతీయ స్పినక్స్ 
సాహితీమిత్రులారా!

మనదేశ శిల్పాలలో
ఈజిప్టులోని స్పినిక్స్ కు సంబంధించిన
చిత్రం ఒకటుంది మహాబలిపురంలోని
శిల్పాలలో ఈ శిల్పం ఉంది
ఈ శిల్పంలో క్రింద సింహం ఆకారం
తల నరసింహవర్మ మహారాజు
కూర్చారు శిల్పులు చూడండి
ఈ వీడియో మరికోంత సమాచారం
తెలుస్తుంది-Saturday, November 18, 2017

కాకిని మానవేశ్వరుడు కౌగిట బట్టి రమించె నద్దిరా


కాకిని మానవేశ్వరుడు కౌగిట బట్టి రమించె నద్దిరా
సాహితీమిత్రులారా!

సమస్య-
కాకిని మానవేశ్వరుడు కౌగిట బట్టి రమించె నద్దిరా


మేడూరి ఉమామహేశ్వరంగారి పూరణ-

నాకవనమ్ములో నెనయనందగు జక్కనిపూలతోట రా
కా కమనీయ చంద్రికలు కాయుచునుండ నికుంజసీమ ల
జ్ఞా కమనీయగాత్ర నభిసారిక నాయిక సానురాగ నే
కాకిని మానవేశ్వరుడు కౌగిట బట్టి రమించె నద్దిరా

ఇందులో కాకిని కౌగిలించి నట్లు కనిపిస్తున్న సమస్యను
కవి నాయికను ఏకాకిగా వున్నతరుణంలో కౌగిలించాడని
పూరించి చక్కగా పరిష్కరించారు


Friday, November 17, 2017

ఖడ్గ బంధం


ఖడ్గ బంధం
సాహితీమిత్రులారా!

ఖడ్గబంధం గురించి గతంలో తెలుసుకొని వున్నాము.
ఇక్కడ మరోమారు గుర్తు చేసుకుందాం.
ఇక్కడ మనం
మరింగంటి సింగరాచార్యు ప్రణీతమైన
దశరథరాజనందన చరిత్ర(నిరోష్ఠ్య రామాయణం)
నుండి చూద్దాం-
ఇది ఉత్సహ వృత్తంలో కూర్చబడింది

శౌరిశౌరిసూరివంద్యశాపతాపకోపనా
సూరి భూరివైరి హంససోమసోమ లోచనా
నారిదుర్విచారికర్ణ నాసికా విఖండనా
వారితోగ్రదైత్యగర్వ వన కృశానుపావనా
(దశరథరాజనందన చరిత్ర - 5-309)

బంధాన్ని పిడినుండి చదవడం మొదలు పెట్టాలి
పద్యాన్ని చూస్తూ బంధాన్ని చదివిన అది ఎలా
నడుస్తున్నది అవగతమౌతుంది ఇక చూడండి-Tuesday, November 14, 2017

రివర్స్ పాటలు(విలోమంగా పాడే పాటలు)


రివర్స్ పాటలు(విలోమంగా పాడే పాటలు)
సాహితీమిత్రులారా!

అనులోమంగా పాడటం అంటే మామూలుగా పాడటం
విలోమంగా పాడటం అంటే ఆ పాటను ప్రతిపదం
వెనుక నుండి అంటే కుడినుండి ఎడమకు పాడటం
దీన్నే రివర్స్ గేర్ అని అంటారు ఇలాంటివానికూడ
మనం గతిచిత్రంలో చూశాము అలాంటి పాటలు
గురుమూర్తిగారు ప్రతిపాటను రివర్స్ చేసి పాడటం
అతనికి మేథాశక్తి చిత్రకవిత్వపు ధోరణికి తార్కాణం-
ఇక్కడ అతని పాటలు వినండి-Monday, November 13, 2017

రాట్నబంధం


రాట్నబంధం
సాహితీమిత్రులారా!
రాట్నబంధం కూడ అనేక రకాలు
వానిలో చిత్రమంజరిలోని రాట్నబంధం
ఇది కందపద్యంలో కూర్చబడినది

శ్రీరమణా! నాగశయన!
నారాయణ! వరద! కంజనయనా! కృష్ణా!
వీరవర! వీనతురగా!
సారసనాభా! హరీ! వెసన్ నను గనుమా!

ఈ బంధం రాట్నచక్రం మధ్యనుండి ప్రారంభించి చదవాలి
చక్రం మధ్య చక్రంనుండి క్రిందికి వచ్చి వృత్తంగా చదివి
పట్టె క్రిందికిరావాలి దాని ద్వారా క్రింది పట్టెకు వచ్చిన
చివరికి పూర్తవుతుంది. పద్యం చూస్తూ బంధం చదివిన
పూర్తిగా అవగతమౌతుంది. ఇక చదవండి-


Sunday, November 12, 2017

పాటలు పేరడీగా వ్రాయడమే కాదు


పాటలు పేరడీగా వ్రాయడమే కాదు
సాహితీమిత్రులారా!

పాటలు పేరడీగా వ్రాయడమే కాదు
ఒక పాటను ఒక్కొకరు ఎలాపాడతారో
పాడటం కూడ పేరడీనే అవుతుంది
ఇక్కడ పేరడీ గురుస్వామిగారు
పాడిన
నెల్లూరి నెరజాణ నేకుంకుమల్లె మారిపోనా - 
అనే పాటను విందాం-


Saturday, November 11, 2017

అష్టదళపద్మబంధ గర్భ గుచ్ఛబంధము

అష్టదళపద్మబంధ గర్భ గుచ్ఛబంధము
సాహితీమిత్రులారా!

ఒక బంధములో మరో బంధం ఇమిడ్చిన
బంధచిత్రం ఇక్కడ చూద్దాం-
చిత్రమంజరిలోని ఈ పద్యం చూడండి-

మాణవకములో కూర్చబడినది.
సారవిచార! సరసా!
సారసనా! రాసరసా
సార! సదావాసరసా
సార! సమంథావిరసా!

సారసనా-(సారస-నా) - పద్మము నాభియందుగలవాడా(పద్మనాభా)
రాసరసాసార (రాస-రస-ఆసార)-
                       రాసక్రీడానంద వృష్టిగలవాడా
సదావాసరసాసార-(సదా-ఆవాస-రసా-సార)-
               ఎల్లప్పుడు నివసించు భూధనంగలవాడా
సమంథావిరసా-(స-మంథ-అవి-రసా)-
             మందర పర్వతమునందనురాగముతో కూడినవాడా

బంధాన్ని  పద్యాన్ని చూస్తూ చదివితే
విషయం అవగతం అవుతుంది
గుచ్ఛబంధాన్ని చూస్తే అందులో
అష్టదళపద్మబంధము కనిపిస్తుంది చూడండి-Friday, November 10, 2017

ధనుర్బంధం


ధనుర్బంధం
సాహితీమిత్రులారా!


ధనుర్బంధాలు అనేకం ఉన్నాయి.
వాటిలో ఇక్కడ కపిలవాయి లింగమూర్తి కృత
శ్రీమత్ప్రతాపగిరిఖండములోనిది.

దీన్ని తేటగీతిలో కూర్చబడినది

మఘవ నుతగుణ మహిమ నామప్రశస్త
దేవ భవభయ భంజన దితిజ తిమిర
నాశ గురుగుణ పూజిత నతవితరణ
గోత్రధర నరవరరూప గుణవిశేష
(శ్రీమత్ప్రతాగిరిఖండము - 3- 101)

ఈ బంధాన్ని పద్యం చూస్తూ
చదివిన విషయం విదితమౌతుందిThursday, November 9, 2017

నాగబంధము


నాగబంధము
సాహితీమిత్రులారా!


నాగబంధం అనేక రకాలున్నాయి. వాటిలో ఇక్కడ
మరింగంటి సింగరాచార్య ప్రణీత
దశరథరాజనందన చరిత్రలోనిది
ఈ గ్రంథం పేరును ఒకమారు చదివి గమనించండి
మీ పెదవులు కలుస్తున్నాయేమో
ఇది తెలుగులో కూర్చిన
మొదటి నిరోష్ఠ్య కావ్యం
ఇది రాముని కథ తెలిపే నిరోష్ఠ్య రామాయణము.

ఈ బంధము చంపకమాలావృత్తములో కూర్చబడినది.

నరహరి ధీర సూరి వర నారద వర్ణిత గానలోల శ్రీ
వర కరుణా విచార కరివైరిహర స్థిర భోగపావనా
నిరత నవీన హార ధర నీరజ సద్మవిహా భూరతా
హరినగజాత సారసుత యాతత లంఘన చారువాససా
                                                                              (దశరథరాజనందన చరిత్ర - 5- 308)

ఇందులో నాగము తలనుండి తోకవరకు
చదువగా పై పద్యం కనిపిస్తుంది
ఇక చదవండి-Wednesday, November 8, 2017

ఆందోళికా బంధం


ఆందోళికా బంధం
సాహితీమిత్రులారా!

ఆందోళిక అంటే పల్లకి
ఆందోళికా బంధం అనేకరకాలు ఉన్నాయి
వాటిలో ఇక్కడ చూడబోతున్న బంధం
బోడి వాసుదేవరావు కృత చిత్రమంజరిలోనిది.
ఇది కందపద్యంలో కూర్చబడింది

సారసనేత్రా! ధీరో
దారా! యరిదర! వరగిరిధర! మురహరణా!
సారరసాబ్ధీ! సారర
సారమణా! నిన్ బొగడ వశమె? నే సరసా!

సారరసాబ్ధీ - శ్రేష్ఠమైన కరుణారసమునకు సముద్రమువంటివాడా
సారరసా రమణా - యోగ్యయైన భూదేవికి భర్తయైనవాడా
సరసా (స-రస-అ)-
అమృత సమేతు(పాను)లైన దేవతల యందు గౌరవము గలవాడా

పద్యాన్ని చూస్తూ బంధాన్ని చదివితే
విషయం సులువుగా అర్థమౌతుంది
ఇక చదవండి-


Tuesday, November 7, 2017

క్షురికా బంధము


క్షురికా బంధము
సాహితీమిత్రులారా!

ఖడ్గ బంధాలలో ఇది ఒక రకము
క్షురిక అనే పదానికి శబ్దరత్నాకరంలో
మంగలికత్తి అనే అర్ఖం చెప్పబడింది.

బోడివాసుదేవరావు కృత చిత్రమంజరిలోని
క్షురికా బంధము ఇది.

సరోజ వృత్తం-
సారవీరకరప్రియా
మారమాదర మారసా
సారధీర సభారసా
సారభా సరధీరసా

సారవారకరప్రియా -
బలముగల వీరుల యొక్క కప్పమందు ప్రీతిగలవాడా
మారమాదర(మార-మా-ఆదర) -
మన్మథుని యొక్కయు లక్ష్మీదేవి యొక్కయు గౌరవముగలవాడా
మారసా(మార-సా)-
మన్మథుని వంటి దేహకాంతి గలవాడా
సారధీర - అనుత్తమమైన ధీరుడా
సభారసా(స-భా-సరా)-
కాంతితోడను భూదేవితోడను కూడినవాడా
సారభా(సార-భా)శ్రేష్ఠమైన స్వభావం కలవాడా
సరధీరసా(స-ర-ధీ-రసా)-
సమర్థమైన బుధ్యనురాగములతో కూడినవాడాఈ బంధము ఎడమ నుండి కుడికి పద్యములోని పూర్వార్థము సరిపోవును
కుడి నుండి ఎడమకు మిగిలిన ఉత్తరార్థము సరిపోవును గమనించగలరు.

Monday, November 6, 2017

మయూర బంధం


మయూర బంధం
సాహితీమిత్రులారా!


మయూర బంధాలు అనేక విధాలుగా ఉన్నాయి
కపిలవాయి లింగమూర్తిగారి
శ్రీమత్ప్రతాపగిరిఖండములోనిది
ఇక్కడ మనం చూడబోతున్న బంధం
ఇది ప్రమాణీ వృత్తంలో కూర్చబడినది.

పరాపరా పరంపరా!
సురాసురా సుఖాసుఖా!
చరాచరా చణంచణా!
జరాజరా జరంజనా!
(శ్రీమత్ప్రతాపగిరిఖండము -4-69)

ఈ బంధాన్ని పద్యం చూస్తూ(గమనిస్తూ)
చదివిన సులువుగా చదవగలరు
ప్రయత్నించండి-


Sunday, November 5, 2017

శంఖబంధం


శంఖబంధం
సాహితీమిత్రులారా!

కపిలవాయి లింగమూర్తిగారి
శ్రీమత్ప్రతాపగిరిఖండము లోని
శంఖబంధం చూడండి-
ఈ పద్యం ఆటవెలదిలో కూర్చబడినది.

శ్రీరమాధినాథ! పావన భావన!
భక్తలోకవరద! పరమపురుష!
విమలకమలనాభ! విభవామరస్తుత్య!
సరసిజాక్ష దేవ! సకలభావ!
                                               (శ్రీమత్ప్రతాపగిరిఖండము - 2- 90)

ఇందులో శ్రీతో ప్రారంభమై భావ తో అంతమవుతుంది
బంధం పద్యం గమనిస్తూ చదివితే సులువుగా చదవగలరు
చదవడం ప్రారంభించండి-


Saturday, November 4, 2017

ద్విచతుష్కచక్రబంధం


ద్విచతుష్కచక్రబంధం
సాహితీమిత్రులారా!

ద్విచతుష్కచక్రబంధం అంటే ఇందులో
రెండు చతురస్రాలు, ఒక వృత్తము ఉన్నాయి
వీనిలో పద్యం కూర్చబడింది. దీనిలో కూర్చిన
పద్యం సరోజవృత్తం. బోడివాసుదేవరావు కృత
చిత్రమంజరిలోనిది ఈ బంధం-

సరోజ వృత్తము-
శ్రీకరా! వరభూవరా!
భీకరారికులాపహా!
శ్రీక! రామరమావరా
భీక! రాజకుభృత్ పవీ!

బంధాన్ని మొదట వృత్తంలోని అక్షరాలను చదవాలి
అవి అన్నీ కలిసి రెండు పాదములకు సరిపోవును
ఇందులో. మిగిలిన పాదాలు చతరురస్రముల కలయికతో
ఏర్పడిన త్రిభుజములోని ఒక అక్షరము దానిక్రిందే ఉన్న
చతురస్రములోని అక్షరమును తీసుకుంటూ వృత్తాకారంలో వెళితే
మిగిలిన రెండు పాదాలు పూర్తవుతాయి.
ఇక చదవండి-


Friday, November 3, 2017

జొన్నవిత్తులవారి చిత్రకవిత్వం


జొన్నవిత్తులవారి చిత్రకవిత్వం
సాహితీమిత్రులారా!

శబ్దచిత్ర పద్యాలను శ్రీరామలింగశతకం నుండి
జొన్నవిత్తులవారి స్వరంలో వినండి-Thursday, November 2, 2017

పద్యభ్రమకము(అనులోమ విలోమము)


పద్యభ్రమకము(అనులోమ విలోమము)
సాహితీమిత్రులారా!


పద్యభ్రమకమంటే పద్యం పైనుండి క్రిందికి
క్రిందినుండి పైకి ఎలా చదివినా పద్యం ఒకలాగే
మారకుండా ఉండడటం. దీన్నే అనులోమ పద్యం
(పైనుండి క్రిందికి చదివే పద్యం), విలోమ పద్యం
(క్రిందినుండి పైకి చదివే పద్యం)
రెండు ఒకలాగే ఉంటే దాన్ని
అనులోమ విలోమ పద్యం అంటారు.
ఇక్కడ బోడి వాసుదేవరావుగారి చిత్రమంజరి
నుండి ఈ రకపు పద్యం చూద్దాం-

సరోజ వృత్తం -
మార! ధీర! రధీరమా!
సారధీరసభారసా!
సారభాసరధీరసా!
మా! రధీర! రధీరమా!

మార(మా - ర) - లక్ష్మీదేవియు, మన్మథుడును గలవాడా
ధీర - స్వతంత్రుడా
రధీరమా - (ర-ధీ-రమా) - చురుకైన బుద్ధికలవాడా
సారధీరసభారసా - శ్రేష్ఠులైన రసజ్ఞులుగల సభాస్థలి గలవాడా
సారభాసరధీరసా - సార-భాస-ర-ధీర-సా)న్యాయముతో ప్రకాశించుచున్న
                 నిపుణులైన విద్వాంసుల యొక్క ధ్యానముగలవాడా
మా - (మ-అ) - బ్రహ్మకు హేతువైనవాడా
రధీర (ర-ధి-ఇర) - త్యాగమునకు స్థానమైన వాక్కులు గలవాడా
రధీరమా(ర-ధీర-మా)- మనోహరుడు, సాహసికుడుఅయిన చంద్రుడు కలవాడా

Wednesday, November 1, 2017

అంతస్థోష్మకందము


అంతస్థోష్మకందము
సాహితీమిత్రులారా!

చిత్రమంజరి పేరుతో శ్రీబోడి వాసుదేవరావుగారు
ఒక పుస్తకాన్ని కూర్చారు. ఇందులో
బంధ - గర్భ - చిత్ర కవిత్వాలున్నాయని
చెప్పుకున్నాడు ఇందులోని చిత్రకవిత్వ విభాగంలోనిదే
అంతస్థోష్మకందపద్యం
మనకు హల్లులలో
స్పర్శముల(క నుండి మ వరకు ఉన్న హల్లులు)ని,
అంతస్థముల(య,ర,ల,వ - అనే నాలుగక్షరాలు)ని,
ఊష్మముల(శ,ష,స,హ - అనే నాలుగక్షరాలు)ని
విభాగాలున్నాయి
ఇపుడు య,ర,ల,వ అనే అంతస్థములు
       శ,ష,స,హ అనే ఊష్మములు
       (జిహ్వామూలీయము(కకార ఖకారములకు
         ముందున్న విసర్గ),
        అనుస్వారములు కూడ ఊష్మములే)
ఈ అక్షరముల తోటే కందపద్యం కూర్చబడినది కావున దీనికి
అంతస్థోష్మకందమని పేరు

వరహారవార! సువిహయ!
సరసరసా! శ్రీవిహార! సాహాయ! రరా!
సురహరి! సారసశరసా!
హరశర! సారవర! సారహరి! హరిశాయీ!

వరహారవార - శ్రేష్ఠమైన హార సమూహములు  గలవాడా
సువిహయ - (సు-వి-హయ) - చక్కని పక్షివాహనము
           (గరుడవాహనము) గలవాడా
సరసరసా - (స-రస-రసా) - అనురాగముతో కూడిన
                          భూదేవి గలవాడా
శ్రీవిహార - లక్ష్మీదేవియొక్క విహారము గలవాడా
సాహాయ (సా - హా - య) కాంతికిని, ఈవికిని నిలయమైనవాడా
ర రా - (ర - ర - అ) - మనోహరుడైన మన్మథునికి హేతువైనవాడా
సురహరి - అమరులునింద్రుడు గలవాడా
సారసశరసా(సారసశర - సా) మన్మథుని వంటి దేహకాంతి కలవాడా
హరశర - హరునికి బాణమైనవాడా
సారవర - (సార-వర) న్యాైయముచేత శ్రేష్ఠమైనవాడా
సారహరి - స్థిరాంశము గలిగిన విష్ణువా
హరిశాయీ - శేషుని(సర్పము)పై శయనించువాడా