Saturday, December 31, 2016

కుటిలాలక యెడమకన్ను కుడికన్నాయెన్


కుటిలాలక యెడమకన్ను కుడికన్నాయెన్




సాహితీమిత్రులారా!



మోచర్ల వెంకనకవి పూరించిన
సమస్యలలో మరొకటి-

సమస్య -
కుటిలాలక యెడమకన్ను కుడికన్నాయెన్

నిటలమున నీవు దాల్చిన
పటుతర కస్తూరిరేఖ బహుగతిరతిచే
నటునిటుజాఱినచెమటకుఁ
గుటిలాలక యెడమకన్ను కుడిక న్నాయెన్


ఎంత చతురంగా పూరించాడో కదా!



మీరు దీన్ని మరోరకంగా పూరించి పంపగలరు.

ఏకాక్షర నిఘంటువు - 27


ఏకాక్షర నిఘంటువు - 27




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........



స్మ - నిషేధము, స్మరణము, పాదపూరణము

స్వ - ధనము, జ్ఞాతి, తన సంబంధము,
             సుఖము, కాంతి, చంద్రకాంతి,
             తాను, స్వర్గము, పరలోకము

స్వర్ - స్వర్గము, పరలోకము, ఆకాశము


స్రక్ - పూలదండ

స్రజ్ - పూలమాల

స్రుచ్ - హోమము చేయు మిల్లిగంటె,
                    ఒక యజ్నోపకరణము

స్రాక్ - శీఘ్రముగా

సా - లక్ష్మి, పార్వతి, ప్రసిద్ధము

సాత్ - బ్రహ్మ

సిమ్ - అల్పము, సరస్వతి

స్విత్ - ప్రశ్న, వితర్కము


Friday, December 30, 2016

నిండు తెలుపుండు నడుమన నుండు నలుపు


నిండు తెలుపుండు నడుమన నుండు నలుపు




సాహితీమిత్రులారా!

కన్నడంలో సర్వజ్ఞ త్రిశతి ని
సర్వజ్ఞుడు రచించాడు - అందులోని
ఈ పొడుపు పద్యం చూడండి-

కడె బిళుదు నడుగప్పు ఉడువ వస్త్రవదల్ల
బిడదె నీరుంటు మడువల్ల కవిగళే 
బెడగ పేళువుదు సర్వజ్ఞ (కన్నడము) 

తెలుగు అనువాదము -
శివకవి యన్. శివగౌడు

నిండు తెలుపుండు నడుమన నుండు నలుపు
వలువయా కాదు, జలముండు కొలను గాదు
విజ్ఞులగువార లీముడి విప్పదగును 
త్రిపది కవిచంద్ర సర్వజ్ఞ దేశికేంద్ర

సమాధానము - కణ్ణు(కన్ను)

అంతా తెలుపు మధ్యలో నలుపు
వస్త్రంకాదు, నీళ్ళుంటాయి కాని 
కొలను కాదు - దీని సమాధానమేమి?

ఏకాక్షర నిఘంటువు - 26


ఏకాక్షర నిఘంటువు - 26




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


- స్వర్గము, దేశము, లక్ష్మి, గర్భము, మోక్షము,
          అవసానము, ఓర్చుట, పరోక్షము, శ్రేష్ఠము.

షః - స్వర్గము, కేశములు, పరోక్షము, శ్రేష్ఠము, నేర్పరి,
             పండితుడు, తుది, నాశము, ముక్తి, కాన్పు, తెలిసినది,
            గంభీర దృష్టిశాలి, ఉపద్రవము, ఎదురుగా.

షమ్ - ధర్మార్థ కామసిద్ధిదమగు ఒక పరిశుద్ధ బీజాక్షరము,
                 తడిద్భీజము, గర్భము, మోక్షము, తుద.

షట్ - ఆరు వస్తువులు

- గౌరీపుత్రుడు, వాయువు, శరీరకాంతి, రథ మార్గము,
          జ్ఞానము, ధాన్యము, నివారణము.

సః - ఏడు స్వరాలలో మొదటిది, సర్పస్థానము,
            విఘ్నేశ్వరుడు, వాయువు, బుధుడు, ఈశ్వరుడు,
           పాము, పక్షి, విష్ణువు, వాడు, సగణము, కోపము,
           హంస బీజము, ప్రాకారము.

సమ్ - సుందరము, సమము, కలయిక, లెస్సగా,
                 మిక్కిలి, వృద్ధి, సముచ్ఛయము, సర్వకారణము,
                 సమస్త వర్ణాత్మకమగు ఒక బీజాైక్షరము, శక్త్యాత్మక  
                సుఖాత్మకబీజము, జ్ఞానము, ధ్యానము, భేధములేనిది.

సత్ - నక్షత్రము, బ్రహ్మ.

సన్ - కాలము, సత్యము, విద్వాంసుడు, శ్రేష్ఠుడు,
               సత్పురుషుడు, పూజ్యుడు.

సహ్ - సహించుట, ఓర్చుట

సృ - పోవుట

సృజ్ - వదులు చేయుట, సృష్టించుట


Thursday, December 29, 2016

భామాకుచమండలంబు భస్మంబాయెన్


భామాకుచమండలంబు భస్మంబాయెన్




సాహితీమిత్రులారా!


వెంకటగిరి సంస్థాన
మహారాజుగారు ఇచ్చిన సమస్య-

భామాకుచమండలంబు భస్మంబాయెన్


మోచర్ల వెంకన కవిగారి పూరణ-

కామాతురుఁడై జంగము
ప్రేమంబున బూతిఁబూసి ప్రియమలరంగాఁ
గామినిఁ గౌఁగిఁటఁ జేర్చిన
భామాకుచమండలంబు భస్మంబాయెన్


భామాకుచమండలంబు భస్మంబాయెన్ - అన్నపుడు వచ్చెడి
విరుద్దార్థాన్ని భస్మము - కాలిపోవడం, అనే అర్థంనుండి
భస్మము - విభూతి అనే అర్థంగా పూరించి తన ప్రజ్ఞను
చాటుకున్నాడు వెంకనగారు.

మీరనూ మరోవిధంగా పూరించి పంపగలరు.

ఏకాక్షర నిఘంటువు - 25


ఏకాక్షర నిఘంటువు - 25




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి...........


శిక్ష్ - నేర్చుకొను.

శీ - నిద్రించు.

శుచ్ - నిరాశ, దుఃఖము.

శుధ్ - పరిశుద్ధముచేయుట.

శుభ్ -  ప్రకాశించు

శుష్ - ఎండిపోవుట.

శ్రీ - ఐశ్వర్యము, సంపద, వృద్ధి, అలంకారము,
     లక్ష్మి, సరస్వతి, పార్వతి, బుద్ధి, విషము,
     సాలెపురుగు, ఒక రాగము, మారేడు చెట్టు,
     మంగళప్రదము, లవంగము, చిల్లచెట్టు, కాంతి,
     గౌరవార్థము కొన్నిపదాలకుముందు వచ్చునది.

శ్రు - వినుట.

శ్లథ్ - సడలుట

శ్లాఘ్ - పొగడుట, మెచ్చుకొనుట.


శ్లిష్ - కాల్చుట, కౌగిలించుకొనుట, కలియుట.

శ్వన్ - కుక్క

శ్వస్ - రేపు, గాలిపీల్చు, జీవించు.

Wednesday, December 28, 2016

ఆకుంటే వృక్షంబగు


ఆకుంటే వృక్షంబగు




సాహితీమిత్రులారా!



గోల్కొండను పాలించిన ఇబ్రహీం కుతుబ్ షాహి ని
మన తెలుగు కవులు మల్కిభరాముడని కీర్తించారు.
ఒకమారు మల్కిభరాముడు ఇచ్చిన ఈ పదాలతో
సమస్యపూరణ చేయవలసిందిగా కోరగా ఒక కవి
పూరించిన పద్యం-

ఆకు, ఈక, మీకు, మాకు - అనే పదాలు
వచ్చేవిధంగా పద్యపూరణ చేయమన్నారు

పూరణ -
ఆకుంటే వృక్షంబగు
ఈకుంటే లోభియౌను హీనాత్ముండౌ
మీకుంటే మాకీయుడు
మాకుంటే మేమురాము మల్కిభరామా!



ఏకాక్షర నిఘంటువు - 24


ఏకాక్షర నిఘంటువు - 24




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి...........


శం - శివుడు, శాస్త్రము, శ్రేయస్సు, శుభము, కీర్తి,
            ఇంద్రధనుస్సు, స్వర్గము, ఎదుటలేనివాడు.

శః - సీమ(హద్దు), శయనము, హింస, పుట్ట, తాబేలు,
           రాజు, శిష్యుడు, న్యూనపరచు, శస్త్రము, శుభము.

శమ్ -  సర్వఫలప్రదము సుఖదాయకము అగు బీజాక్షరము.
                తగుట, అణగుట, సమృద్ధి.

శంస్ - ప్రశంసించుట, స్తోత్రము చేయుట, అంగీకరించుట.

శక్ - యోగ్యుడగుట, సమర్థుడగుట.

శంక్ - సందేహము

శప్ - శాపము పెట్టుట, నిందించుట.

శబ్ - శబ్దము

శా - దేవతాపూజ, శక్తి(సామర్థ్యము) శోభ, శ్రేష్ఠుడు, లక్ష్మి.

శాస్ - ఉదేశించు, పాలించు.

శి - శివుడు, శుభము, కాంతుడు, మోక్షము, హింస, నిద్ర.


Tuesday, December 27, 2016

శుద్ధకులజాత యొక సతి


శుద్ధకులజాత యొక సతి




సాహితీమిత్రులారా!


ఈ పొడుపు పద్యం విచ్చండి-

శుద్ధకులజాత యొక సతి
యిద్ధరణిం దండ్రిఁ జంపి యెసఁగ విశుద్ధిన్
బుద్ధిఁ బితామహుఁ బొందుచు
సిద్ధముగాఁ దండ్రిఁగనును చెప్పుడు దీనిన్

ఒక శుద్ధకులంలో పుట్టిన స్త్రీ
తండ్రిని చంపి  తాతను కలిసి
తండ్రిని కన్నదట - అదేమిటో
చెప్పమంటున్నాడు కవి-

సమాధానం - మజ్జిగ

సమాధానం ఎలాగంటే-
మజ్జిగకు పెరుగు తండ్రి
అలాగే మజ్జిగకు పాలు తాత
మజ్జిగ, తండ్రిని అంటే పెరుగును
చంపి పుడుతుందికదా
(పెరుగును చిలకడం వలన అంటే
మధించడం వలన పుడుతుంది)
అలా పుట్టిన మజ్జిగ తాతను అంటే
పాలను చేమిరి రూపంగా కలిసి
మళ్ళీ తండ్రిని కంటుంది - ఇది దీనిలోని
గూఢార్థం. కావున ఇది గూఢచిత్రంగాను
ప్రశ్న అడగడం వలన పొడుపు కధగాను
చెప్పబడుతున్నది.

ఏకాక్షర నిఘంటువు - 23


ఏకాక్షర నిఘంటువు - 23



సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.......


వి - నేత్రము, ఆకాశము, వాయువు, పరమాత్మ,
        పక్షి, (నిషేధము, వేఱు, విశేషము)


విట్ - వైశ్యుడు, జనుడు, పురీషము.


విశ్ - ప్రవేశించు, మనుష్యుడు.


విష్ - తడుపుట, వ్యాపించుట.


వీ - పోవుట, కనుట.


వీజ్ - విసరుట, పోవుట.


వృ - వరించుట, పూజించుట, ఆవరించుట.


వృజ్ - విడచి పెట్టుట.


వృత్ - ఉండుట, వరించుట, ఇష్టపడుట.


వృధ్ - పెరుగుట.


వృష్ - కురియుట, వానపడుట, ఇచ్చుట.


వే - నేయుట, కుట్టుట.


వేప్ - వణకుట.


వేల్ల్ - కదలుట.


వ్యథ్ - భయపడు, దుఃఖించు, గుచ్చుట, కొట్టుట.


వ్రజ్ - పోవుట

Monday, December 26, 2016

భార్యలిద్దరు శ్రీరామచంద్రునకును


భార్యలిద్దరు శ్రీరామచంద్రునకును




సాహితీమిత్రులారా!


సమస్య - 
భార్యలిద్దరు శ్రీరామచంద్రునకును


మోచర్ల వెంకన కవి పూరణ-

రావణుని సంహరించియు రాజ్యమునకు
నంగనను గూడి యభిషిక్తుడై వెలుంగ
హారతిచ్చిరి ప్రేమతో హరుని ముద్దు
భార్యలిద్దరు, శ్రీరామ భద్రునకును

ఏకపత్నీవ్రతుడని ప్రసిద్ధడైనవాడు 
శ్రీరామచంద్రుడు. ఆయనకు ఇద్దరు భార్యలు 
ఉన్నారని విరుద్ధార్థం స్ఫురించే సమస్య
ఇవ్వగా దాన్ని కవి ఎంత సమయస్ఫూర్తితో
వాక్యాన్ని విరిచి, శివుని భార్యలు గంగాపార్వతులు
శిరీరామునికి హారతి ఇచ్చి విజయాభినందనలతో 
స్వాగతం పలికారని చక్కగా పూరించాడు వెంకనగారు.


మీరును మీదైన శైలిలో పూరించి పంపగలరు.

ఏకాక్షర నిఘంటువు - 22


ఏకాక్షర నిఘంటువు - 22



సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి............



వర్  - కోరుట


వల్ - తిరుగుట, పోవుట

వశ్ - కోరుట

వస్ - నివసించు, ఉండు.

హ్ - మోయు, వీచు, ప్రవహించు, కొనిపోవు, ఓడ.

వా - వికల్పార్థము, ఉపమానార్థము, గాలి వీచుట.

వాచ్ - వాక్కు, సరస్వతి

వాంఛ్ - కోరుట

వార్ - నీరు

వి    - నేత్రము, ఆకాశము, వాయువు, పరమాత్మ, పక్షి,
             (నిషేధము, వేఱు, విశేషము)

విద్   - తెలిసికొనుట,పొందుట, ఉండుట, ఆలోచించుట.

Sunday, December 25, 2016

నక్షత్రము పైన వేసి నాథుని బిలిచెన్


నక్షత్రము పైన వేసి నాథుని బిలిచెన్




సాహితీమిత్రులారా!



ఈ గూఢచిత్ర పద్యాన్ని చూడండి -

నక్షత్రము గల చిన్నది
నక్షత్రము చేతబట్టి నక్షత్ర ప్రభున్
నక్షత్రమునకు రమ్మని
నక్షత్రము పైన వేసి నాథుని బిలిచెన్


ఈ పద్యంలో నక్షత్రం అనే 
పదం ఎక్కువ మార్లు వాడారు
విషయమేమిటో తెలియాలంటే
కొంత ఆలోచించాల్సిందే-

నక్షత్రము గల చిన్నది - 
తన పేరులో నక్షత్రము ఉన్న యువతి - ఉత్తర,

నక్షత్రము చేత బట్టి - 
భరణిని, కుంకుమ భరిణను చేతిలో పట్టుకొని,

నక్షత్ర ప్రభున్ - 
నక్షత్రాలకు ప్రభువైన వాని వంశపు అభిమన్యుని,

నక్ష్తమునకు రమ్మని - ఒక మూలకు రమ్మని పిలిచి,

నక్షత్రము పైన వేసి - హస్త - మును అతని మీద వేసి,

నాథుని పిలిచెన్ - 
పతియైన అభిమన్యుని ప్రేమతో పిలిచింది.

ఇది అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించటానికి
యుద్ధానికి వెళ్ళే సమయంలో అతని భార్య ఉతర
వీరతిలకం దిద్ది పంపే సందర్భములోనిది.

ఏకాక్షర నిఘంటువు - 21


ఏకాక్షర నిఘంటువు - 21



సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి............


లేప్ - పోవు, కదలు, ప్రార్థించు

లోక్ - చూచు, వీక్షించు, ప్రదర్శించు,
      తెలిసికొను, ప్రకాశించు, మాటలాడు.

లోచ్ - చూచు, ప్రదర్శించు, చూచి ఆలోచించు,
       పలుకు, ప్రకాశించు.

లోడ్- మూర్ఖుడగు

ల్యం - లయము, నిలయము.

ల్హౌం - హయగ్తీవబీజము

- సాత్వికుడు, వాయువు, వరుణుడు, మన్మథుడు.

వమ్ - అమృత(జల-తరంగ - అభ్ర - ధరణీ - వరుణ)బీజము.

వః - వాయువు, సముద్రము, నమస్కారము, వసతి, వరుణుడు,
      వరుణబీజము, భూబీజము, తమోబీజము.


వచ్ - పలుకు, చెప్పుట, వర్ణించుట.

వంచ్ - చేరుట, పోవుట, తిరుగుట, మోసగించుట.

వద్ - పలుకుట, తెలుపు.

వధ్ - చంపుట

వంద్ - నమస్కరించుట, స్తోత్రముచేయుట.

వప్ - విత్తుట, గొఱుగుట.

వమ్ - క్రక్కుట

వయ్ - నేయుట




Saturday, December 24, 2016

రుచించనివాడు పండితంమన్యుడై ఉండాలి


రుచించనివాడు పండితంమన్యుడై ఉండాలి


సాహితీమిత్రులారా!


కల్పలతా వివేకం అనే
అజ్ఞాత కర్తృక గ్రంధంలో
శబ్దాలంకారాలను వివరించిన
తరువాత ఈ శ్లోకం చెప్పాడు కవి
అది చూడండి-

యస్మైచ రోచతే నేదం 
నమస్తస్మై మనీషిణే
అపి భస్వన్న శక్నోతి 
భేత్తు మంతర్గుహం తమః

ఈ పుస్తకం ఎవరికి రుచించదో,
ఆ పండితునికొక నమస్కారం చేస్తాను.
ఎందుకంటే సూర్యుడు కూడ పర్వతగుహలోపల
ఉండే చీకటిని తొలగించలేడు కదా!

విజ్ఞాన, వినోద, పాండిత్య ప్రదర్శకమైన
నాయీ శబ్దచిత్రాలంకార గ్రంధం రుచించనివాడు
పండితంమన్యుడై ఉండాలి. అతనిలోని అజ్ఞానం
గుహలోపలి దట్టమైన చీకటివంటిదని గమ్యార్థం.

ఏకాక్షర నిఘంటువు - 20


ఏకాక్షర నిఘంటువు - 20




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.........



లష్ - కోరుట, ఇచ్చగించుట.

లస్ - ప్రకాశించుట, వెలుగొందుట, స్పటపడుట.

లస్జ్ - సిగ్గుపడుట.

లా - తీసుకొనుట, పొందుట.

లిఖ్ - వ్రాయుట, లిపిబద్ధముచేయుట, గీయుట, గీరుట.

లింప్ - పూయుట, మలినమొనర్చుట.

లిహ్ - నాకుట, నమలుట.

లీ - కఱగు, ద్రవించు, అనుసరించు, అంటుకొను,
          పట్టుకొనియుండు, కౌగిలించుకొను, కఱగిపోవు,
          అదృశ్యమగు.

లుంచ్ - కోయు, లాగు, చించు

లుఠ్ - పడగొట్టుట, నేలపై దొరలుట, బాధన నుభవించుట,
                 కదలుట, దొంగిలించు, దొరలుట.

లుడ్ - కల్లోలము చేయుట, కలియగలుపుట.

లుంట్ - పోవు, దొంగిలించు, కుంటివాడగు, సోమరియగు,
                       దోపిడీ చేయు, అనాదరము చేయు.

లుంఠ్ - పోవు, ఆందోళనచేయు, కుంటియగు,
                      నిష్క్రియుడగు, దోపిడీచేయు, అడగించు.

లుప్ - ఆశ్చర్యపడు, ఆశ్చర్యపరచు, కలవరపడప,
                  కలవరపెట్టు, త్రుంచుట, విఱచుట, కోయుట,
                 పాడుచేయుట, అపహరించుట, గుంజుకొనిపోవుట,
                 పట్టివేయుట, కప్పిపుచ్చుట.

లుభ్ - ఆసపడు, ఆతురతతో కోరు.

లుల్ - తిరుగు దొరలు, ఇటునటు ఊగిసలాడు,
                   కదలు, కలతనొందు, అణచు.



     

Friday, December 23, 2016

కలువలరాజు బావ సతి గన్నకుమారుని...


కలువలరాజు బావ సతి గన్నకుమారుని...




సాహితీమిత్రులారా!



కొందరు సూటిగా మాట్లాడరు వారిధోరణి
ఈ పద్యంలో గమనింపవచ్చు చూడండి-

కలువలరాజు బావ సితి గన్నకుమారుని యన్న మన్మనిన్
దొలచినవాని కార్యములు తూకొనిచేసిన వాని త్ండ్రినిం
జిలికినవాని వైరి పతి చెల్లెలి బావకు నన్న తండ్రికిన్
వలచిన వాహనంబు వలె వచ్చెడి నింటికిఁ జూడవే చెలీ!

ఒకస్త్రీ తన చెలితో పలికిన పద్యం ఇది-

దీని అర్థం గమనించండి-

కలువలరాజు - చంద్రుడు,
ఆతని బావ - విష్ణువు,
విష్ణువు సతి  - లక్ష్మి, 
లక్ష్మి కుమారుడు - మన్మథుడు,
మన్మఖుని అన్న - బ్రహ్మ,
బ్రహ్మ మనుమడు - రావణుడు,
రావణుని చంపినవాడు - రాముడు,
రాముని కార్యములు చేసినవాడు - ఆంజనేయుడు,
ఆంజనేయుని తండ్రి - వాయువు,
వాయువును చిలికినవాడు - శేషుడు,
శేషుని వైరి - గరుడుడు,
గరుడుని పతి - కృష్ణుడు,
కృష్ణుని చెల్లెలు - సుభద్ర, 
సుభద్ర బావ - భీముడు,
భీముని అన్న - ధర్మరాజు,
ధర్మరాజు తండ్రి - యముడు,
యముని వాహనము - దున్నపోతు,
దున్నపోతు వలె  ఇంటికి వస్తున్నతన్ని చూడవే చెలీ
- అని భావం.

ఏకాక్షర నిఘంటువు - 19


ఏకాక్షర నిఘంటువు - 19




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.........


రుక్ - రోషము, అగ్నిజ్వాల, ఇచ్ఛ, కాంతి,
               యుద్ధము, భయము,ధ్వని.

రూష్ - అలంకరించు, పూయు.

రై - ధనము, శబ్దముచేయుట.

- ఖండింపబడునది, గ్రహించుట,
          చంద్రుడు, లవణము.

లమ్ - విశ్వమును భరించునట్టి ఒక ప్రకాశబీజాక్షరము.

లః - కాంతి, ఆకాశము, భూమి, భయము, సంతోషము,
             గాలి, లవణము, దానము, ఆలింగనము, తలపు,
            ప్రళయము, సాధనము, మనస్సు, వరుణుడు, లీనము,    
            లఘువు, ఓదార్చుట.

లక్ష్ - చూచుట, గురిపెట్టుట, స్పష్టముచేయుట.


లగ్ - తగులుకొనుట, అంటుకొనుట, కలియుట.

లంఘ్ -  దూకుట, ఎక్కుట, ఎగురుట, దాటుట,
                       అనాదరించుట. నిలుపుట, ఆక్రమించుట,
                      ముందునకు చొచ్చుట, ఉపవాసముచేయుట.

లజ్ - సిగ్గుపడుట, కళంకితమొనర్చుట,
                అగపడుట, ప్రకాశించుట, మూయుట.

లజ్జ్ - సిగ్గుపడుట.


లప్ - మాటలాడుట.

లంబ్ - వ్రేలాడుట, అంటుకొనుట, ఆశ్రయించుట,
                     విలంబముచేయుట, ధ్వనిచేయుట.

లభ్ - పొందు, సంపాదించు, పట్టుకొను,
                తెలిసికొను, నేర్చుకొను.

లల్ - క్రీడించుట, ప్రేమతో చూచుట.


Thursday, December 22, 2016

కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘలుఘలు మనియెన్


కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘలుఘలు మనియెన్




సాహితీమిత్రులారా!


సమస్య -
కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘలుఘలు మనియెన్

ఇది వెంకటగిరి సంస్థాన భూపతిగారు ఇచ్చిన సమస్య.
దీన్ని మోచర్ల వెంకనకవి గారు పూరించారు.
ఆ పూరణ -

కొమ్మను మదనుం డపుడు జ
వమ్మున నీలోత్పలముల వడి నేయంగా,
సొమ్మసిలి మోము వంచినఁ
గమ్మలు మోకాళ్ళుదాఁకి ఘలుఘలు మనియెన్


మీరును రమణీయమైన పూరణచేసి పంపగలరు.  

ఏకాక్షర నిఘంటువు - 18


ఏకాక్షర నిఘంటువు - 18




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాత .........


రి - స్రావము, నాళము, అగ్నిబీజము.

రిః - స్రవించుట, క్షమించుట.

రిచ్ -  శూన్యము చేయుట, శుభ్రము చేయుట,
                పోగొట్టుట, విడగొట్టుట.

రుః - భయము.

రుచ్ - ప్రకాశించుట, ఇష్టమగుట.


రుజ్ - ముక్కలు చేయుట, నాశము చేయుట, బాధకలిగించుట,
                 పీడించుట, రోగగ్రస్తుని చేయుట,వంగుట, విరుగుట,
     

రుఢ్ - రాగము, అగ్నిజ్వాల, ఇచ్ఛ, కాంతి.
                యుద్ధము, భయము, ధ్వని.

రుద్ - ఏడ్చు, దుఃఖము, కన్నీరు కార్చు.

రుధ్ - అడ్డగించు, నిలుపు, ఎదిరించు, నిరోధించు,
                 నిలువచేయు, మూయు, కట్టివేయు.

రుశ్ - గాయపరచు, చంపు, నాశముచేయు.


రుష్ - కోపించుట, కలతనొందుట, గాయపరచుట, చంపుట,
                 బాధించుట, రోషము, కోపము.

రుహ్ - మొలకెత్తుట, పెరుగుట, ఎక్కుట.


రూ - యువతి, చెదలు, బంగారము, కామరూపి.

Wednesday, December 21, 2016

కామిగాఁడు మోక్షకామిగాఁడు


కామిగాఁడు మోక్షకామిగాఁడు




సాహితీమిత్రులారా!


సమస్య -
కామిగాఁడు మోక్షకామిగాఁడు


సీసపద్యంలో పూరణ-

నిపుణత్వమున రాజనీతి యెఱుంగక
         నేల నేలెడువాఁడు బేలిగాని
సంగీత సాహిత్య సరసత యెఱుఁగక
         కృతి చెప్పువాఁడు దుష్కృతుఁడు గాని
కుశలుఁడై యింతుల కోరికల్ దీర్చని
         విషయాతురుండు దుర్విటుఁడు గాని
మాధవ శ్రీపాద మగ్నత చెందక
         ముక్తి గోరెడువాఁడు రక్తిగాని
అతిదయాభిషక్తి, యతులితమగు యుక్తి,
యంగనానురక్తి, యచలరక్తి -
పరతఁగాంచకున్నఁ బతిగాఁడు కవిగాఁడు;
కామిగాఁడు; మోక్షకామిగాఁడు.
                                                   (చాటుపద్యరత్నాకరము -4 - 66)


మీరును ఒక రమణీయమైన పూరణను పంపగలరు.

ఏకాక్షర నిఘంటువు - 17


ఏకాక్షర నిఘంటువు - 17




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి........



- అగ్ని, మన్మథుడు, నాశనము,
         వజ్రము, హస్తము, ఋతువు.

రం - నెత్తురు, శిరస్సు, ధ్యానము, ఆకాశము,
             గ్రుడ్డు,కడుపు, ముఖము, భయము,
             విరసము, త్యాగము, రసహీనమైనది, తీక్షణము.

రః - రాముడు, వాయువు, అగ్ని, భూమి,
           ధనము, ఇంద్రియము, ధనాటంకము.

రంహ్ - కలిసిపోవుట, వేగముగా పోవుట.

రక్ష్ - కాపాడుట, రాజ్యము చేయుట, పొదుపుచేయుట.


రచ్ - రచించుట, సిద్ధము చేయుట,
              వ్రాయుట, అలంకరించుట.

రంజ్ - సంతోష పెట్టుట, ఎఱ్ఱనగుట,
                   అనురక్తుడగుట, ప్రసన్నుడగుట.

రట్   - అఱచుట, ఆక్రందించుట.

రణ్ - ధ్వనిచేయుట.

రద్ - ముక్కలు చేయుట, చీల్చుట.

రధ్ - గాయపరచుట, బాధకలిగించుట.

రభ్ - ఆరంభించుట, తొందరపడుట.

రమ్ - ప్రసన్నుడగుట, సంతుష్టుడగుట, ఆడుట,
                సంభోగము చేయుట, ఉండుట.

రయ్ - పోవుట.

రస్ - ధ్వనించుట, కూయుట,
              శబ్దము చేయుట, రుచిచూచుట.

రహ్ - విడచుట, త్యాగము చేయుట.

రా - బంగారము, మబ్బు, ధ్వని, శాల, చెప్పుట,
           నడచుట, ఇచ్చుట, గ్రహించుట, సమర్పించుట.

రాః - ముద్రాంకితమైన ధనము, పసిడి.

రాజ్ - రాజు, ప్రకాశించుట, మెఱయుట,
                సుందరముగా అగుపడుట.


Tuesday, December 20, 2016

నీ మగడు మానిని శ్రీసతి సంతసింపుమా!


నీ మగడు మానిని శ్రీసతి సంతసింపుమా!




సాహితీమిత్రులారా!


సమస్య -
మంగలవాడు నీ మగడు మానిని శ్రీసతి సంతసింపుమా!


ఈ సమస్య లక్ష్మీదేవిని సంబోధిస్తూ పలికింది.
వినగానే అసంగతార్థం స్ఫురిస్తుంది.
పూరణ శతావధాన ప్రబంధము
ప్రథమ ఖండము నుండి-

పూరణ -

సంగతశంఖచక్రముఖసాధన భీషణమూర్తి, యార్తి భి
న్మంగళదాయి చారుకరుణాశుభవీక్షణుడు జ్జ్వలాంబు భృ
త్తుంగవిలాససంహననధూర్వహు డవ్యయుడీ త్రిలోకి నో
మం గలవాడు నీ మగడు మానిని శ్రీసతి సంతసింపుమా

ఇందులో మూడవపాదంలో
అవ్యయుడు + ఈత్రిలోకిన్+ ఓమన్ + కలవాడు
అని సంధి కలిపి పూరించాడు దీనివల్ల ఉన్న సందర్భం
తొలగిపోయి రమ్యంగా మారింది.
త్రిలోకిన్ =  ముల్లోకములను,
ఓమన్ + కలవాడు =  ఓమంగలవాడు
అంటే కాపాడగలవాడు అని అర్థం.


మీరునూ మరోరకంగా ప్రయత్నించి పూరించి పంపగలరు

ఏకాక్షర నిఘంటువు - 16


ఏకాక్షర నిఘంటువు - 16




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........



యః  - కీర్తి, ప్రయాణము, వాయువు, త్యాగము, పోవువాడు,
               స్థానము, యోగము, యముడు, దాత, మగణము.

యమ్ -  సర్వవ్యాపకమగు ఒక పవిత్రబీజాక్షరము, వాయుబీజము,
                     వశ్యబీజము, వీరబీజము, యత్నము, యమున.

యజ్ - యాగముచేయుట, ఆహుతులిచ్చుట, పూజించుట.

యత్ - సర్వనామము, అవ్యయము, హేతువు, ప్రయత్నించుట.

యద్ - ఎవడు, ఎవతె, ఏది.

యన్త్ర్ - నిలువుట, అడ్డుకొను.

యా -  కీర్తి, యానము, వాహనము, పూలగుత్తి, కాంతి, లక్ష్మి,  
                నిర్మాణము, ప్రాప్తి, త్యాగము, పోవుట.

యాచ్ - కోరుట, అడుగుట.

యు - కలియుట, వేరువేరుగా చేయుట.

యుజ్ - కలియుట, అనురక్తుడగుట, చేరుట, ప్రయోగించుట,
                      నియోగించుట, కలుపుట, కలిసినవాడు.

యుధ్ - పోరు(సంగ్రామము), యుద్ధము చేయుట,
                      సంఘర్ష మొనర్చు.


     

Monday, December 19, 2016

అమ్మా! రమ్మని పిల్చె భార్యను


అమ్మా! రమ్మని పిల్చె భార్యను




సాహితీమిత్రులారా!



సమస్య -
అమ్మా! రమ్మని పిల్చె భార్యను మగండయ్యర్థ రాత్రంబునన్

శతావధాన ప్రబంధము ద్వితీయఖండము నుండి
పూరణ -

క్రమ్మెన్ మేఘము లీడతోడ జినుకు ల్రాలం దొడంగె న్గడున్
నెమ్మెక్కెన్ శయనమ్ము, దుప్పటియు మన్నింపందగుం దప్పులన్
వేమ్మున్నెమ్మది, ముద్దుగుమ్మ యల పూవిల్కాని క్రొందమ్మియౌ
నమ్మా రమ్మని పిల్చె భార్యను మగండర్థ రాత్రంబునన్

క్రొందమ్మి- అప్పుడే వికసించిన తామరపూవు,
తామరపూవు మన్మథబాణాలలో ఒకటి.
ఔ  +అమ్మా = యౌనమ్మా ,
అమ్మా , అమ్ము =  బాణము
అమ్మా= ఆ + అమ్మా = బాణమా
అంటే ఓ మన్మథబాణమా!
అమ్మా అనేదాన్ని బాణంగా అర్థంమార్చి
ప్రయోగించాడు కవి. అందువల్ల సమస్య
పూరణ రమణీయంగా మారింది.

ఆకాశం మబ్బులు కమ్మి ఈదురుగాలి వీస్తున్నది.
చినులు రాలుతున్నాయి. పరుపు దుప్పటి కూడ
తేమతో చల్లబడ్డాయి, నా పొరపాట్లను మన్నించి
కోపాన్ని వదులుకో తాపం కలుగుతూంది. పూలే
బాణాలుగా గల మన్నమథుని బాణమైన దానా
నా సమీపానికి రమ్మని అర్థరాత్రి సమయంలో
భార్యను భర్త పిలిచినాడని భావం

మీరునూ మరో రమ్యమైన భావనతో పూరించి పంపగలరు.

ఏకాక్షర నిఘంటువు - 15


ఏకాక్షర నిఘంటువు - 15




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి......



ముచ్ - మోసముచేయుట, వదులు చేయుట, విడిచిపెట్టుట,
                    స్వతంత్రము చేయుట(ఇచ్చుట).

ముండ్ - (తల)గొరుగుట, మునుగుట.

ముద్ - ఆనందము, సంతోషము, ప్రసన్నుడగుట.

ముర్చ్ - గాఢమగుట, కూడుట, మూర్ఛిల్లుట, పెరుగుట,
                      లావగుట, ప్రభావము చూపుట, నిండుట, వ్యాపించుట.

ముష్ - దొంగిలించుట, తీసికొనుట.


ముహ్ - పరవశించుట, మూర్ఛిల్లుట, మూఢుడగుట.

మృ - మరణించుట, నశించుట.

మృగ్ - వెదకుట, ప్రత్నించుట, అనుసరించుట.

మృజ్ - శబ్దము చేయుట, శుద్ధిచేయుట, అలంకరించుట.

మృద్ - త్రొక్కుట, అడచుట, చంపుట,
                      హింసించుట, జయించుట.
                     మట్టి, ఎర్రమన్ను.

మృశ్ - తాకుట, పట్టుకొనుట, ఆలోచించుట.

మృష్ - వెదజల్లుట, సహించుట,
                      అనుభవించుట, క్షమించుట.

మే - మార్చుకొనుట.

మేధ్ - కలియుట, ఒండొరులు కలిసికొనుట. తెలిసికొనుట,
                  దెబ్బతీయుట, చంపుట.

మోక్ష్ - విడచుట, స్వతంత్రునిచేయుట.

మ్నా - మరలమరల చెప్పుట, వల్లించుట,
                  స్మరించుట, తలంచుట, ఆలోచించుట.

మ్లై - వాడిపోవుట, అలసటనొందుట, నిరుత్సాహమునొందుట.


Sunday, December 18, 2016

శ్రీరత మహిమతరశ్రీ


శ్రీరత మహిమతరశ్రీ




సాహితీమిత్రులారా!


పాదభ్రమకము అనే గతిచిత్రాన్ని
ఇక్కడ చూద్దాం-

గతి అంటే నడక
నడకలోని చిత్రం
గమనించటమే
ఇందులోని చిత్రం.

ఒకమాట ముందుకే గాదు
వెనకకూ అలాగే ఉంటే
మనము అది చిత్రంగా
గుర్తిస్తాం కదా
అదే పద్యపాదమైతే
అది ఇంకా చిత్రం
పులుపు, జలజ, వికటకవి - ఇలాంటి పదాలు
ముందుకు వెనక్కు ఒకలాగే చదువుతాం కదా!

ఈ పద్యం చూడండి-
ఇది శ్రీమాన్ వైద్యంవేంకటేశ్వరాచార్యులవారి
సంపాదకత్వంలో వెలువడిన
అధ్యాత్మరామాయణంలోనిది-

ఇది సుందరకాండలోని ఆశ్వాసాంతంలో
కాణాదం పెద్దన సోమయాజిగారు హనుమంతుడు
లంకకువెళ్ళి తిరిగి వచ్చిన సందర్భంలో కూర్చడం
ఒక విశేషం-

శ్రీరత మహిమతరశ్రీ
సారసవనయ శహితాహి శయనవసరసా
ధీరశమ సోమ శరధీ
మార పరకమాన్యధన్య మాకరపరమా


మొదటిపాదంలో 9 అక్షరాలున్నాయి
శ్రీరత మహిమతరశ్రీ
అందులో నడిమి అక్షరం 5వది - హి
దాన్నుండి మళ్ళీ వెనక్కు
అవే అక్షరాలొచ్చేలా చేశాడు కవి

అలాగే రెండవపాదంలో  17 అక్షరాలున్నాయి.
సారసవనయ శహితాహి శయనవసరసా
వీటిలో మధ్యన ఉన్న అక్షరం 9వ అక్షరం - తా
దీనితరువాతనుండి అక్షరాలను వెనుకకు కూర్చాడు

3వపాదంలో మొత్తం అక్షరాలు 9
ధీరశమ సోమ శరధీ
అందులో 5వ అక్షరం సో
దాన్నుండి వెనుకకు కూర్చాడు

4వపాదంలో మొత్తం అక్షరాలు 15
మార పరకమాన్యన్య మాకరపరమా
అందులో మధ్యఅక్షరం 8వది -
దీన్నుండి వెనుకకు అక్షరాలను కూర్చాడు
దీనివల్ల ఇది పాదభ్రమకంగా మారుతున్నది.

శ్రీరత మహిమతరశ్రీ
సారసవనయ శహితాహి శయనవసరసా
ధీరశమ సోమ శరధీ
మార పరకమాన్యన్య మాకరపరమా

ఏకాక్షర నిఘంటువు - 14


ఏకాక్షర నిఘంటువు - 14




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి......



మః - మగణము, బంధనము, పచ్చవన్నె, గోరోజనము
             వంటి వర్ణము, బ్రహ్మ, విష్ణువు, శివుడు, యముడు,
            వేళ, విషము, మంత్రము, చంద్రుడు.

మండ్ - అలంకరించు

మద్ - మత్తిల్లుట, పిచ్చివాడగుట,
                 సంతోషించుట, ఆపదనొందుట.

మన్ - గర్వించిట, పూజించుట, విశ్వసించుట, కల్పించుట,
                ఆదరించుట, తెలిసికొనుట, స్వీకరించుట, కోరుట,  
               మనస్సు లగ్నంచేయుట.

మన్ద్ - ప్రసన్నుడగుట, శిధిలమగు, ప్రకాశించుట,
                  మెల్లమెల్లగా పోవుట, తిరుగుట.

మహ్ - ఆదరించుట, సమ్మానముచేయుట,
                  వికసించుట, వృద్ధినొందుట.

మమ్ - శత్రువులను ముగ్ధులను చేసే ఒక బీజాక్షరము,
                   భేకీబీజము, శిలీబీజము

మా - ప్రమాణము, మరణము, సముద్రపుటొడ్డు, ధారణగల బుద్ధి,
             లక్ష్మీదేవి, మధ్యప్రదేశము, తల్లి, నిషేధము, జనము

మార్గ్ - ప్రార్థించుట, వెదకుట, అలరించుట, పోవుట.

మార్జ్ - పరిశుద్ధము చేయుట.

మాస్ - చంద్రుడు, మాసము.

మిథ్ - సహకారి అగుట, ఒక్కచో కలియుట,
                మైధున మొనర్చుట,  గాయముకలిగించుట,
                 దెబ్బతీయుట.

మిల్ - కలియుట, చేరుట.

మిశ్ర్ - కలుపుట.

మిష్ - కన్నుతెఱచుట, చూచుట.

మిహ్ - తడుపుట, మూత్రవిసర్జనము,
                   వీర్య పాతము చేయుట.

మీ - పోవుట, నశించుట, తెలిసికొనుట, చచ్చుట,
            (చంపుట, నాశనముచేయుట) తగ్గించుట,
            మార్చుట, మీరుట.

మీల్ - (కండ్లు)మూయుట, ముడుచుకొనుట,
                  కలియుట, మూసుకొనుట.


Saturday, December 17, 2016

దశరథాధీశుండు పెంపొందగన్


దశరథాధీశుండు పెంపొందగన్ 




సాహితీమిత్రులారా!



ఈ గూఢచిత్రపద్యం చూడండి-
ఇది భాస్కరరామాయణములోనిది
దశరథుని వర్ణించే పద్యం.

జనలోకైక మహారథుండు ద్విజరక్షాదక్షుఁడాజింద్రిలో
చనుఁడుద్యచ్చతురంగ సైన్యుఁడును భాస్వద్రూపపంచాస్త్రుఁడ
న్యనృపక్రౌంచషడాననుండు ఘనసప్తాశ్వాన్వయుండష్టమం
త్రి నవద్రవ్యనిధీశుఁడై దశరథాధీశుండు పెంపొందగన్ 
                                                      (భాస్కరరామాయణము - 1- 44)

ఈ ప్రపంచంలో దశరథుడు ఏకైక మహారథుడు.
బ్రాహ్మణ రక్షణలో దక్షుడు, యుద్ధంలో రుద్రుడు,
చతురంగసైన్యాలు కలిగినవాడు. రూపంలో మన్మథుడు,
శత్రువులను చెండాడంలో  కార్తికేయుడు,
సూర్యవంశంలో పుట్టినవాడు, చుట్టూ ఎనిమిది మంది
మంత్రులను కలిగినవాడు, నవద్రవ్యాలకు అధిపతియైనవాడు,
దశరథుడు.... అని వర్ణించాడు కవి

కానీ ఇందులో పెద్ద గొప్పదైన ప్రత్యేకమైన
వర్ణన ఏముంది అంటే ఇందులో లేదు

ఇందులో ఒకటి నుండి పది వరకుగల
సంఖ్యలను పద్యంలో గోపనం చేశాడు
కావున ఇది గోపన చిత్రమగుచున్నది.
అవి ఇక్కడ గమనించండి-

జనలోకైక మహారథుండు ద్విజరక్షాదక్షుఁడాజింద్రిలో
చనుఁడుద్యచ్చతురంగ సైన్యుఁడును భాస్వద్రూపపంచాస్త్రుఁడ
న్యనృపక్రౌంచషడాననుండు ఘనసప్తాశ్వాన్వయుండష్టమం
త్రి నవద్రవ్యనిధీశుఁడై దశరథాధీశుండు పెంపొందగన్ 


లోకైక = (లోక+ ఏక) = 1
ద్వి = 2, త్రి= 3, 
చతురంగ - (చతుః - అంగ) పదంలో - 4
పంచాస్త్ర లో - 5, షడాననలో - 6 , సప్తాశ్వలో - 7,
అష్టమంత్రిలో - 8, నవద్రవ్య లో 9, 
దశరథలో 10 ఈ విధంగా కవి గోపనం చేశాడు.




ఏకాక్షర నిఘంటువు - 13


ఏకాక్షర నిఘంటువు - 13




సాహితీమిత్రులారా!

నిన్నటి తరువాయి..........


భాః -  సాధనము, కాంతి, ఆకాశము, రాశి, నక్షత్రము,
             త్రిపుండ్రము, ఊర్థ్వ పుండ్రము, చక్రము.

భాష్ - మాట్లాడుట.

భాస్ - ప్రకాశించుట.

భిః  - గోడ, పక్షి, భయము.

భిక్ష్ - యాచించుట.

భీః - భయము

భుః - శివుడు, బ్రహ్మ, చంద్రుడు.

భూ -  అగుట, పుట్టుట, వెలువడుట, ఉండుట,
              జీవించి ఉండుట, నిలుచుట.

భూః - భూమి, ఉనికి, చోటు, ఒకటి.

భూష్ - అలంకరిచుట

భృ - భరించుట, మోయుట.

భోః - ఆహ్వానము, సంబోధనము.

భ్రమ్ - ఇటు నటు తిరుగుట.

భ్రాజ్ - ప్రకాశించుట.

Friday, December 16, 2016

ఏకాక్షర నిఘంటువు - 12


ఏకాక్షర నిఘంటువు - 12




సాహితీమిత్రులారా!

నిన్నటి తరువాయి..........


- కుంభము, వరుణుడు, బిందువు, వికల్పము, గురువు,
         మదము, సంపదలను కలుగజేయువాడు,  కలహము,
         పక్షము, గర్భము, పర్వతము.

బః -  సంద్రము, జలము, వరుణడు, కడవయోని,
            గొఱుగుట, గదాయుధము, పండు.

బమ్ - సకల దోషములను హరించు నొక ఊర్మి బీజాక్షరము.

బర్హ్ - పలుకు, ఇచ్చు, గాయపరచు, చంపు,
              నాశనముచేయు, వ్యాపించు.

బా - బూరుగ, తీగె, సంకిళ్లు, స్వచ్ఛమైన.

బాధ్ - పీడించు, హింసించు, తొలగించు, గాయపరచు.

బృహ్ - పెరుగు వృద్ధినొందు, గర్జించు.

- శివుడు, తుమ్మెద, స్వభావము, శుక్రుడు, కిరణము,
         మేఘము, భూమి, అలంకారము, ప్రకాశము.

భః - గ్రహము, భ్రాంతి, భగణము, భవనము, గృహము,
            భార్గవుడు, భూధరము, భృంగము.

భక్ష్ - తినుట, మ్రింగుట, జీర్ణించుకొనుట, ఉపయోగించుట.

భజ్ -  పంచుట, నిర్దేశించుట, అనుభవించుట,
                అభ్యసించుట,  సేవించుట, గౌరవించుట.

భంజ్ - ముక్కలుగ చేయుట, చెడగొట్టుట, ఓడించుట.

భష్ - మొరుగుట.

భమ్ -   నక్షత్రము, (మేషాది)రాశి,  సమస్త భూతోచ్ఛాటన
                చేయునట్టి భీకర బీజాక్షరము.


తనసతి పెండ్లి జూచుటకు దానును నేగె


తనసతి పెండ్లి జూచుటకు దానును నేగె




సాహితీమిత్రులారా!





సమస్య -
తనసతి పెండ్లి జూచుటకు దానును నేగెను సత్వరంబుగన్

ఈ సమస్య మరియు పూరణ
శతావధాన ప్రబంధము - 2 లోనిది.

ఘనగతి నేమి ఘోషమెసగన్ ఋతుపర్ణు రథమ్ము దోలుచున్
మనమున నగ్నియై దరికొనన్ దమయంతి పునః స్వయంవరం
బనియెడి వార్త బాహుకసమాఖ్యుడు నైషధు దావిదర్భకున్
దనసతి పెండ్లి జూచుటకు దానును నేగెను సత్వరంబుగన్

ఈ పూరణలో పదాల విరుపులు లేవు,
శబ్దశ్లేష వంటి చమత్కారాలు లేవు.
కేవలం కథాపరంగానే చెప్పడం జరిగింది.
నలోపాఖ్యానంలో నలుని జాడ తెలిసికోటానికి
విదర్భరాజు రెండవ స్వయంవరం ప్రకటించగా,
దానికి ఋుతుపర్ణుడు వెళుతూ సారథిగా
బాహుకుడనే పేరుతో నలుడుకూడ వెళ్ళినాడు.

ఇందులో కథాపూరణ తప్ప తమత్కారమేమీ లేదు.

మీరెవరైనా చమత్కారపూరకంగా పూరించి పంపగలరు.





Thursday, December 15, 2016

సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్


సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్



సాహితీమిత్రులారా!


శ్రీ విజయనగర సంస్థానాధీశుడు,
మహాపండిత నిత్యగోష్ఠీనిరంతరుడు,
అయిన శ్రీమదానందగజపతీ సార్వభౌముడు
ఒకరోజు పండితులందరికి ఒక సమస్యనిచ్చి
ఈ మకుటంతో ఒక శతకం వ్రాయవలసినదగా
పండితులందరికీ ఆజ్ఞాపించాడు -
ఆ సమస్య-
సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్

దీనికి అనేకమంది తమ ప్రజ్ఞాప్రాభవాలతో శతకాలను వ్రాశారు.
కాని ఈ శతకాలన్నీ భూపతికి చేరి పరిశీలించే లోపే
ఆయన కాలవశమ్మున చిక్కి కీర్తిశేషులైనారు.

అందులో శ్రీవిజయనగరమహారాజావారి
కళాశాలలో సంస్కృత పండితుడు అయిన 
శ్రీభాగవతుల లక్ష్మీనారాయణ శాస్త్రిగారు
సత్యవ్రతి శతకాన్ని వ్రాశారు.
కానీ ఇది వ్రాసిన సుమారు 40 సంవత్సరాల
తరువాత 20-03-1929న శ్రీభాగవతుల లింగమూర్తి గారిచే
ముద్రింపించబడెను.

ఇది చిత్రకవితాశతకం దీని విశేషాలు-

ఈ శతకానికి కవిగారే టిప్పణము వ్రాశారు.
ఇందులోని అన్ని పద్యాలు కందపద్యాలే.
ఏకప్రాస శతకం ఇది.
శతకమంతా - కార ప్రాసతో సాగింది.

ఇందులో శతకప్రారంభంలో
రెండు పద్యాలు ఉన్నాయి అవి-
సరస్వతీ, శంకరుల ప్రార్థనలు.

వాణీవీణా విలస
త్పాణీ ఘ్రాణజిత గంధఫలి భారతి బ్ర
హ్మాణీ హరిమధ్యమ క
ల్యాణీ మద్రసన తుదమెలంగుము కరుణన్

కనకహార్యశరాస రాసభవిపక్షాజిహ్మగా జిహ్మగా
వనిపస్ఫారగుణా గుణాకర కరవ్రాతా ధరీపూత పూ
న యాదిత్యముఖగ్రహా గ్రహపతీం ద్వర్చిష్మదుస్రాంచితా
నన నాళీకుసుమా సుమాంబకవపుర్నా శంకరా శంకరా

అని శబ్దాలంకారసమన్వితంగా ప్రార్థించారు శంకరుని.

ఈ శతకం మొత్తం అన్ని పద్యాలు ఏదో ఒక ప్రత్యేకతతో ఉన్నాయి.
83వ పద్యం ఏకాక్షరిగాను
84వ పద్యం సనాళ షోడశదళ పద్మబంధంగా కూర్చారు.
ఇక్కడ ఏకాక్షరి పద్యాన్ని చూద్దాం-

ఋత తిత ఊత్తు త్తీతా
తతేతి తాతేత తాత తత్తై తత్తా
తత తుత్తా తతి తుత్తిన్ 
సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్

ఇందులో త - అనే హల్లు ఒకటే
ఉపయోగించి కూర్చబడినది.
మరియు  ఇందులో నాలుగవ పాదము
అన్ని పద్యములకు
మకుటంగా ఉన్నందున
అది ఒకే వ్యంజనము
ఉండనవసరములేదు.

ఋత - సత్యమనెడు, తితఉ - జల్లెడచేతను,
ఇత - పొందబడిన, ఆతత - విస్తారియగు,
ఇతి - జ్ఞానము చేతను, తాత - తండ్రివంటి
పరమేశ్వరుని యొక్క, ఇత - పొందబడిన,
తాత - దయచేతను, తత్తైతత్తా - అది ఇది
అనే భేదభావముచేత కలిగిన, తత - అధికమగు,
తుత్తాతతి - బాధ సమూహమును,
తుత్తిన్ - కొట్టుటచేతను,
సత్యవ్రతికి సంతసమొసగును.

పదార్థశోధనముచే గలిగిన జ్ఞానముచేతను,
ఈశ్వరజ్ఞానము చేతను, సంసార దుఃఖము
తొలగుననియు అందుకు సత్యము మూలమని
తాత్పర్యము.

ఈ విధంగా భాగవతుల లక్ష్మీనారాయణ శాస్త్రిగారు
చిత్రకవితా సమన్వితంగా శతకాన్ని రచించారు.



ఏకాక్షర నిఘంటువు - 11


ఏకాక్షర నిఘంటువు - 11



సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి......



- వాయువు, పర్వతము, ప్రకాశము, కౌస్తుభము,
         క్షణము, శుభలగ్నము.

పమ్ -  బంగారము, పానముచేయువాడు, నీటిధార,
             సమ్మతి, ఆపన్నుడు, కోపశూన్యుడు.

పః - పరమాత్మ, పానము, పవనము, పతనము, పవిత్రము,
           పాపనాశకరము, పంచమస్వరస్థానము, కుబేరుడు,
           పడమటి దిక్కు, పాలించివాడు.

పాః -  పాలనకర్త, పవిత్రము, పూరితము, బూరుగుచెట్టు,
             తీగసంకెల, నిర్మలమైనది.

పా - రక్షించుట, త్రాగుట, పీల్చుట.

పుం - పురుషుడు,  పరమాత్మ.

పూ - పూవు, శిద్ధి, పవిత్రము.

పూర్ - పురము, శరీరము, పూరించుట.

పణ్ - వ్యవహారము చేయుట, స్తోత్రము చేయుట.

పత్ - పడుట, దిగుట, క్రిందికి వచ్చు, ఎగురుట.

పద్ - పాదము, అడుగు, నాల్గవభాగము.

ప్ర - ప్రాధాన్యము, అతిశయించుట.

ప్లు - ఈదుట, తేలుట, నావచే దాటుట, ఎగురుట, జారుట.

- గాలితోకూడిన వాన, భుజమును తట్టుట, ఫూత్కారము,
        నివారించుట, యుద్ధము. పిలుచుట

ఫః - అభివృద్ధి, కఠినోక్తి, నిరర్థక సంభాషణ,
           వాతము, కఫము, విస్తారమైన, మరుగైన.

ఫాః - వృద్ధి, వర్ధకము, సంతాపము, వ్యర్థవాక్యము.
             16వ భాగము,  ఆట, గుడిసె.




Wednesday, December 14, 2016

ఇన శశిబింబ యుగ్మముదయించె


ఇన శశిబింబ యుగ్మముదయించె



సాహితీమిత్రులారా!


సమస్య-
ఇన శశిబింబ యుగ్మముదయించె దినాంతమునందు దద్దిశన్

సూర్యచంద్రులు రెండూ ఒకేసారి అదీ సాయంకాలం
ఒకే దిక్కులో  ఉదయించాయని పూరించడం
కవి సామర్థ్యానికి పరీక్షే కాని కవి ఇలా పూరించారు మరి

పూర్వకవి పూరణ -

ఇనసమతేజ మీరు సెలవిచ్చిన పీఠము హేమరత్న సం
జననము, మేరు ప్రస్తరము చక్కగ దీర్చితి పక్షమయ్యె నే
ర్పున సుర కోటులం దిశల బొల్పుగ వ్రాయుచురాగ నేటికా
యిన శశిబింబ యుగ్మముదయించె దినాంతమునందు దద్దిశన్

సూర్యుని వంటి తేజస్సుగలవాడా!
నీవు నాకు ఆజ్ఞాపించిన దేవతా పీఠమును
బంగారము, రత్నాలతో నిర్మిస్తున్నాను.
పక్షం కింద మేరు పర్వత శిఖరమణి
నిర్మించినాను. దేవతలందరిని
ఆ యా దిక్కులలో శిల్పాలుగా
చెక్కుతూరాగా ఈ వేళకి
సూర్యచంద్రుల బింబాలను
సాయంకాల సమయాన ఆ దిక్కున
పీఠముపైన చిత్రించాను - అని పద్యభావం.