Tuesday, November 30, 2021

ఆశీర్వాద పద్యాలు ఇవి

 ఆశీర్వాద పద్యాలు ఇవి
సాహితీమిత్రులారా!ఈ పద్యాలు ఆశీర్వాదానికి సంబంధించినవి

అయితే ఆశీర్వాదం గూఢంగా చెప్పడం జరిగింది

అది మీరు గమనించగలరు


మగని దిగనాడి వగలాడి తగులుకొన్న

యతని పట్టపు దేవి, దానబ్బడాలు

దాని మిండడి కొడుకైన వానితల్లి

సిరులు మాకిచ్చు నెప్పట్ల కరుణవెలయ


గ్రుడ్డికొమరుని దునిమిన దొడ్డవాని

కన్న తండ్రికి తండ్రినకె గన్నదోయి

కొమ్మకోడలు పెనిమిటి తమ్మునణచె

గిత్తుకంటియు మిమ్ము, రక్షించుగాక


పతిసుతుకుం బ్రతిగాఁగొను

సతిసుతుఁ జెఱఁగన్నజెట్టి జనకుని జనకున్

క్షితిగన్న దాని గను దు

ర్మతి కరు, యా కోమలాంగి రక్షించు మిమున్


Sunday, November 28, 2021

ప్రశ్నోత్తరాలు ఇందే

 ప్రశ్నోత్తరాలు ఇందే
సాహితీమిత్రులారా!ఈ క్రింది పద్యాలు కలిపి చదివినచో ప్రశ్నలును, 

విడదీసి చదివినచో జవాబులును వచ్చును

గమనించండి-


ఎద్దీశున కశ్వంబగు

గ్రద్దననే దడవిఁదిరుగు ఖరకంటకియై

హద్దుగనేవాఁడు ఘనుఁడు

పద్దుగ నుత్తరములిందె పడయంగానౌ


శూరనికరమే దురమునుఁ జూచిమెచ్చు

రహిగలువ యలరేఱేని రాకఁగోరు

పూవులేమావి గున్నకుఁ బొడమకుండు

నరయ నుత్తరములు నిందె యమరియుండు


Friday, November 26, 2021

వీటి అర్థం చెప్పగలరు

 వీటి అర్థం చెప్పగలరు
సాహితీమిత్రులారా!ఈ పద్యాలకు అర్థాలను

చెప్పండి


గ్రుడ్డు బిడ్డన్న దొరఁగన్న కొడుకుకన్న

పిన్నయాతని పినతండ్రి పెద్దకొడుకు

ప్రభువు తమ్మునిచే నాజిఁబడినవాని

తండ్రితమ్ముని పురమును స్థలము చెపుమ


వాసవి రవి సోమాదులు

వాసవి రవి సోమరవులు వాసవిరవులున్

వాసవులు రవులు సోములు

వాసవి రవిసోమనాథు వాకిటభృత్యుల్


వీటి అర్థాలను కామెంట్స్ లో పెట్టగలరు.

Wednesday, November 24, 2021

వావివరుసల పద్యం - 2

 వావివరుసల పద్యం - 2
సాహితీమిత్రులారా!ఈ వావివరుసల పద్యాన్ని గమనించి

దీన్ని అర్థాన్ని మీరే కామెంట్స్ లో పెట్టగలరు-


ఇల్లాలు మనుమరాలేరీతియాయెనో

              మనుమరాలికియెట్లు మామయయ్యె

మామయే వావిని మరిఁదియెయుండెనో

              మరఁదియెందునుఁగూర్చి మనుమఁడయ్యె

మనుమఁడే వానిని మరియల్లుఁడాయెనో

              యల్లునిల్లాలెట్టులత్తయయ్యె

యత్తయేవానిని యాయెను కూఁతురు

               కూఁతురు సరియెట్లు కోడలయ్యె

దీనియర్థంబు జనులకు దెలియరాదు

తెలియవచ్చిన కవులకుఁ దేటపడును

జలజహితరంగ సారసచంద్రనిన్ను

వర్ణనలుచేయ లేరెంత వారలైన

Monday, November 22, 2021

వీటికి అర్థం వివరించండి

 వీటికి అర్థం వివరించండి
సాహితీమిత్రులారా!ఈ పద్యాలకు అర్థం వివరించండి-


వనచరు కూరిమి తమ్ముని

వెనుకాతని యాలిసుతుని వేడుక మామన్

గనుఁగొన్నతండ్రి తాతను

విను మామ్రొక్కించుకొన్న వీరుండితఁడే


ఖగవైరి వైరి వాహను

ఖగ సుతునకు మిత్రవైరి ఖగపత్రేశున్

ఖగ సూనుమేన మామయు

ఖగధారుఁడు వినగదమ్మ కంజదళాక్షీ


వీటి అర్థం కామెంట్స్ లో తెలుపగలరని మనవి

Saturday, November 20, 2021

వావివరుసల పద్యం

 వావివరుసల పద్యం
సాహితీమిత్రులారా!ఈ పద్యంలోని వరుసలను మీరే కనిపెట్టి చెప్పగలరు

మగువ నా మరదలౌ మారుతల్లివినీవు

              వరుసఁజెప్పవుగదే వదినె గాక

అత్తబిడ్డవునీవు యనుఁగుచెల్లెలనైతె

          మనకువావులు గల్గె మనుమరాల

గారాబునాబిడ్డ యేరాలుమరదలౌ

                నాకూఁతురవుగదే నాఁతినీవు

మాయత్తతమ్ముని మరదలు వదినెనౌ

                దానిపిన్నత్త నామేనవదిన

తల్లిపెద్దత్తకోడలు తల్లిరావె

మారుటత్తకు మరదలు మనుమరాల

యనుచు విజ్జోడువావులు బెనసికలిపి

యొక్కవావిని వరుసఁగా లెక్కజెపుమ

                (శృంగారయుక్తి చమత్కార పద్యారత్నావళి - పుట -66)

(మీరే ఈ పద్యంలోని వావివరుసలను కనుగొని కామెంటులో పెట్టగలరు)


Wednesday, November 17, 2021

పానుగంటివారి సరిగమల పద్యం

 పానుగంటివారి సరిగమల పద్యం
సాహితీమిత్రులారా!ఒకమారు పీఠాపురం రాజావారి దివాణంలో ప్రభు సమక్షంలో
తుమురాడ సంగమేశ్వరశాస్త్రిగారి వీణకచ్చేరి జరిగింది. వచ్చిన శ్రోతల్లో
పానుగంటివారు ఒకరట. వీణాగానం తర్వాత సంగమేశ్వర శాస్త్రిగారిని
అభినందస్తున్న మహారాజును ప్రశంసిస్తూ పానుగంటివారు చెప్పిన పద్యం ఇది.

స్వజనుల నేరీతిఁబరిపాలన మొనర్తు నాశ్రితు నెవ్వాని నాదరింతు
వాదాయమున నెంత యర్థుల కిచ్చెద వెదెటు చేసిన భృత్యు నెదగణింతు
నవని పాలన నేది యార్జించినాఁడవు కవితగానంబు నేపగిది విందు
వెట్లుగాఁబృథు సౌఖ్య మీక్షింపఁగా నుంటి వాత్మ సంస్తుతుల కేమందు వయ్య
సరిగ, ధని, సగమ పనిని సరిగ, గరిమ
మరిమరిగ, పాపనినిగని, సరిసర్ యను

వీణకాని "మా" వెన్క "నీ" వీణ వరుస
మీఁద "నీ" వెన్క "మా" సూర్యమేదినీశ

సీసపద్యంలోని ఎనిమిది ప్రశ్నలకు ఎత్తుగీతిలో వీణా స్వరవిన్యాసంతో జవాబులిచ్చారు.
1.ప్ర- స్వజనుల నేరీతిఁబరిపాలన మొనర్తు - సరిగ
2.ప్ర- నాశ్రితునెవ్వాని నాచరింతువు - ధని
3.ప్ర- ఆదాయమున నెంత యర్థుల కిచ్చెదవు - సగమ
4.ప్ర- ఎదెటు చేసిన భృత్యు నెదగణింతువా - పనిని సరిగ
5.ప్ర- అవని పాలన నేది యార్జించినాఁడవు - గరిమ
6.ప్ర- కవితగానంబు నేపగిది విందువు - మరిమరిగ
7.ప్ర- ఎట్లుగాఁబృథు సౌఖ్య మీక్షింపఁగా నుంటివి - పాపనినిగని
8.ప్ర- ఆత్మ సంస్తుతులకేమందు వయ్య - సరిసరి

అని ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. 

ఇంకా చమత్కార మేమంటే "ఓ మహారాజా! ఈ వీణ వరుసమీద ఆరోహణావరోహణ క్రమంలో "మా వెన్కనీ" అంటున్నది. కాని "నీ వెన్క"  "మా" అన్నది ఉంటుంది. "మా" అంటే లక్ష్మి. నీ వెనుక లక్ష్మిగాని, లక్ష్మి వెనుక నీవు ఉండవు అని భావం.

Monday, November 15, 2021

రెండు హల్లులతో పద్యాలు

 రెండు హల్లులతో పద్యాలు
సాహితీమిత్రులారా!రెండు హల్లులతోనే కూర్చబడిన పద్యాన్ని
ద్వ్యక్షరి అంటాము. ఇక్కడ మనం
చిత్రబంధరామాయణంలోని
ఈ ఉదాహరణ చూద్దాం-

వారం వారం వారారావం వార్వరం రవివారరః
వారం వారం వారివిరో రురావ విరివావరః

                                                                (చిత్రబంధరామాయణం - 5 - 2)

ఇది  - అనే రెండు హల్లులతో కూర్చబడింది.
ఇది హనుమంతుడు సముద్రాన్ని లంఘించే సందర్భంలో
కూర్చబడినది.
దీని భావం -
హనుమంతుడు సముద్రాన్ని దాటే సందర్భంలో
సూర్యుని ఎర్రటి బంతిగా ఊహించి పట్టుకొన బోయే
సందర్భంలో జరిగిన సంఘటనలో హనుమంతునికి
బ్రహ్మ, ఇంద్రుడు ఇతరదేవతలు ఇచ్చిన వరాల
బలంతో అనేకమార్లు తాను ఎంతగా గర్జించగలడో
అంతగా గర్జించాడు సమగద్రంలోని అలలకంటే
శక్తివంతంగా. గరుత్మంతుని వలె ఆకాశంలోకి ఎగిరాడు.

మరో ఉదాహరణ కావ్యదర్శంలోనిది గమనించండి-

సూరి: సురాసురాసారిసార: సారససారసా:
ససార సరసీ: సీరీ ససూరూ: స సురారసీ

                                                                    (కావ్యాదర్శము-3-94)
(పండితుడును దేవతల విషయమునను అసురుల
విషయమునను ప్రసరించు బలము కలవాడును,
మద్యమునందు ఆసక్తి కలవాడును అగు
బలరాముడు అందమైన ఊరువులు గల ప్రియురాలుతో
కూడినవాడై, ధ్వనితో కూడిన (ధ్వని చేయుచున్న)
సారసపక్షులు గల సరస్సులను సంచరించెను.)

దీనిలో  - అనే రెండు వ్యంజనములు(హల్లులు)
మాత్రమే ఉపయోగించబడినది.

Saturday, November 13, 2021

వీటికి అర్థం చెప్పగలరు

 వీటికి అర్థం చెప్పగలరు
సాహితీమిత్రులారా!ఈ క్రింది పద్యాలకు అర్థం చెప్పగలరని మనవి-


మగని దిగనాడి వగలాడి తగులుకొన్న

యతని పట్టపుదేవి, దానబ్బడాలు

దాని మిండడి కొడుకైన వానితల్లి

సిరులు మాకిచ్చు నెప్పట్ల కరుణవెలయ


గ్రుడ్డికొమరుని దునిమిన దొడ్డవాని

కన్న తండ్రికి తండ్రినకెగన్నదోయి

కొమ్మకోడలు పెనిమిటి తమ్మునణచె

గిత్తుకంటియు మిమ్ము, రక్షించుగాక


పతిసుతుకుం బ్రతిగాఁగొను

నతిసుతుఁ జెఱఁకొన్న జెట్టి జనకుని జనకున్

క్షితిగన్న దాని గను దు

ర్మతి కరు, యా కోమలాంగి రక్షించు మిమున్


వీటికి అర్థాలు చెప్పగలవారు కామెంట్స్ లో

తెలుపగలరు

Thursday, November 11, 2021

ఒకేహల్లు పద్యాలు

 ఒకేహల్లు పద్యాలు
సాహితీమిత్రులారా!ఈ పద్యాలలో హల్లు ఒకటే ఉంటుంది

కానీ అచ్చులు ఏవైనా వాడవచ్చు.

గమనించండి-

 నిన్ను నిను నెన్న నీనే
 నెన్నిన నన్నన్న ననననిన నానే నా
 నిన్నూని నా ననూనున్
 నన్నూనన్నాను నేననా నున్నానా

                                        శ్రీవేంకటేశ చిత్రరత్నాకరం పూర్వభాగంలోనిది.

అనిన = నీకుపైన ప్రభువులులేని, నానా = సర్వమునకు, ఇనా = ప్రభువైనవాడా, ఇనున్ = సర్వేశ్వరుడవైన, నిన్నున్, ఎన్నన్ = స్తుతించుటకొరకు, ఈనేను, ఎన్నినన్ = ఆలోచించినచో, ననను = చిగురును, (అల్పుడని అర్థం), అన్నన్న= చోద్యం, అనూనున్ = గొప్పవాడవైన, 
నినున్ = నిన్ను, ఊనినాను = ఆశ్రయించినాను, నున్న = త్రోసివేయబడిన, అనా = శకటముగలవాడవైన, అనా = తండ్రీ, నేను, నన్ను+ ఊను = ఆదుకొనుము, 
అన్నాను = అంటిని.

మామా మీమో మౌమా
మామా! మిమ్మొమ్ము మామ మామా మేమా
మేమొమ్మము మీ మైమే
మేమే మమ్మోము మోము మిమ్మౌ మౌమా!

                                                           (చంపూ భారతం పుట. 249 )

మా = చంద్రుని యొక్క, మా = శోభ,
మోము + ఔ = ముఖముగా గల,
మామా- మా = మాయొక్క, మా = మేధ,
మిమ్ము = మిమ్ములను, ఒమ్ము =-అనుకూలించును,
మామమామా = మామకు మామవైన దేవా!,
ఆము = గర్వమును, ఏమి =- ఏమియు,
ఒమ్మము = అంగీకరించము, మీమై = మీ శరీరము,
మేము ఏమే = మేము మేమే, మమ్ము,
ఓ ముము + ఓముము = కాపాడుము, కాపాడుము,
ఇమ్ము = అనుకూలము, ఔము = ఔమా + అగుము - అగుమా


లోలాళిలాలిలీలా
ళీలాలీలాలలేలలీలలలలులే
లోలోలైలాలలల
ల్లీలైలలలాలలోలలేలోలేలా
                               (ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలోని 223వ పద్యం)
(ఇందులో ల-ళ లకు భేదము లేదు కావున పద్యమంతా
ల - అనే హల్లుతో కూర్చబడినదిగా భావించాలి)

లోల - చలించుచున్నట్టి, అళి - తుమ్మెదలను,
లాలి - లాలించునట్టి, లీలా - శృంగారక్రియగలిగినట్టి,
ఆళీ - చెలికత్తెలయొక్క, లాలీ - లాలిపాటలయొక్క,
లాల - లాలయను పాటయొక్క, ఏల - ఏలపదాలయొక్క,
లీలలు - విలాసములు, అలలు - అతిశయములు,
లే - అవులే, లోలో - లోలోయనే, ల - స్వీకరించయోగ్యమయినట్టి,
ఐల - గుహలయందు, అల - అఖండములయినట్టి,
లలత్ - కదలుచున్నట్టియు, లీల - క్రీడార్థమయినట్టియు,
ఏలల - ఏలకీతీగలయొక్క, లాల - ఉయ్యాలలు,
 ఓలలు - హేరాళములే, లోల - ఆసక్తిగలిగిన,
ఐలా - భూదేవిగల శ్రీవేంకటేశ్వరస్వామీ

Tuesday, November 9, 2021

శతలేఖినీపద్యసంధానధౌరేయు

శతలేఖినీపద్యసంధానధౌరేయు

సాహితీమిత్రులారా!రామరాజభూషణుడనే పేరుగల

భట్టుమూర్తి తన ప్రతిభ ఏమిటో

ఈ పద్యంలో వివరించారు

గమనించండి-


శతలేఖినీపద్యసంధానధౌరేయు                    

                            ఘటికాశతగ్రంథకరణధుర్యు

నాశుప్రబంధబంధాభిజ్ఞు నోష్ఠ్యని

                          రోష్ఠ్యజ్ఞు నచలజిహ్వోక్తి నిపుణు

దత్సమభాషావితానజ్ఞు బహుపద్య

                          సాధిత వ్యస్తాక్షరీధురీణు

నేకసంధోదితశ్లోక భాషాకృత్య

                        చతురు నోష్ఠ్య నిరోష్ఠ్యసంకరజ్ఞు

నమితయమకాశుధీప్రబంధాంకసింగ

రాజసుతతిమ్మరాజపుత్రప్రసిద్ధ

సరసవేంకటరాయభూషణసుపుత్రు

నను బుధవిధేయు శుభమూర్తి నామధేయు

                                                                                                (నరస - 13)

ఈ పద్యం నరసభూపాలీయములోనిది.

ఇందులో కృతి భర్త భట్టుమూర్తిని పిలిచే సందర్భంలో కవి వర్ణించాడు-

ఇందులో తనకు పదిరకాల ప్రజ్ఞలున్నట్లు తెలుపుకున్నాడు కవి.

అవి

1. శతలేఖినీపద్య సంధానధౌరేయత -

నూరు ఘంటాలకు పద్యాలను చెప్పేనేర్పు (శతావధానం)

2. ఘటికాశతగ్రంథకరణశక్తి -

గడియకు నూరు అనుష్టుప్ శ్లోకాలను చెప్పగల ప్రజ్ఞ

3. ఆశుప్రబంధబంధాభిజ్ఞత-

ఆశువుగా ప్రబంధాలను, బంధకవిత్వాన్ని చెప్పగల నేర్పు

4. ఓష్ఠ్యనిరోష్ఠ్యజ్ఞత -

పెదవులు కలిపి, పెదవులు కలపని విధంగా ఉండేవిధంగా 

అచ్చులు హల్లులతోపద్యాలను కూర్చడం

5. అచలజిహ్వోక్తినైపుణ్యం-

నాలుక కదలకుండా ఉండే విధంగా అచ్చులు హల్లులతో పద్యాలను కూర్చడం

6. తత్సమభాషావితానజ్ఞత -

కేవలం తత్సమపదాలతోనే కవిత్వం చెప్పడం

7. బహుపద్యసాధిత వ్యస్తాక్షరీధురీణత-

ఏకకాలంలో అనేక వ్యస్తాక్షరి పద్యాలను జ్ఞాపకం పెట్టుకోగలగడం

8. ఏకసంబోధిత శ్లోకభాషాకృత్యచతురత -

ఒకసారి శ్లోకం వినగానే శ్లోకమంతా తిరిగి అప్పజెప్పడం

9. ఓష్ఠ్యనిరోష్ఠ్యసంకరజ్ఞత-

పెదవులు మూసుకున్నవెంటనే తెరచుకొనేటట్టు వీలుగా అక్షరాలను పేరుస్తూ

పద్యాలను చెప్పడం

10. అమితయమకాశుధీశక్తి -

అమితమైన యమకంతో ఆశువుగా పద్యాలను చెప్పడం

ఇంతటి ప్రజ్ఞతనకు కలదని చెప్పుకున్న ప్రజ్ఞావంతుడు

రామరాజభూషణుడు(భట్టుమూర్తి) 

Sunday, November 7, 2021

అరిగా బంచమ మేవగించిన

 అరిగా బంచమ మేవగించిన
సాహితీమిత్రులారా!


వసుచరిత్రలో రామరాజభూషణుడు

వసంతోత్సవం జరిగే సమయంలో స్త్రీపురుషులు

పాటలు పాడుతున్నారు ఎలాగని కవి వర్ణించారో

ఈ పద్యంలో తెలుస్తుంది గమనించండి-


అరిగా బంచమ మేవగించి నవలా లవ్వేళ హిందోళవై

ఖరి సూపం బికజాతి మాత్మరవభంగవ్యాకులంబైవనీ

ధర నాలంబితపల్లవ వ్రతవిధుల్దాల్పం దదీయధ్విన్

సరిగా గైకొనియెన్ వసంతము మహాసంపూర్ణభావోన్నతిన్

                                                                                                                (వసు-1-130)

ఈ పద్యంలో కవి తన సంగీతకళా రహస్యనిధులను విప్పాడు

స్త్రీలు హిందోళరాగం పాడితే కోయిలలు బాధపడ్డాయట.

ఆ రాగంలో తమ స్వరమైన పంచమం లేదని వ్యాకులత చెంది ఆకులూ అలములూ తింటూ చపస్సు చేశాయట. ఆ వ్రతవిధులను మెచ్చి వాసంతం మహాసంపూర్ణభావంతో పంచమస్వరాన్ని స్వీకరించిందట. 

కవికి పద్యకల్పనలో రెండు విషయాలు తోడ్పడ్డాయి. హిందోళరాగంలో పంచమమం అంటే రిషభం ఉండవు. (హిందోళంలో - సమగమదనిస - సనిదమగమస అని ఆరోహ అవరోహణలు) ఈ రెండు ఉన్న రాగం హిందోళవసంతం (సగమపదనిదస-సనిదమగరిగస -అని ఆరోహణ అవరోహణలు) ఈ వాస్తవిక లక్షణాలను తీసుకొని విశ్లేషించాడు కవిగారు. ఇది ఇలా ఉంటే అరిగా అనే చోట అరి అంటే శత్రువు అని,  అరి అంటే ''రి''లేని(పంచమం లేని) అర్థాలు ఉన్నాయి. దీని బట్టి ఇది చ్యుత చిత్రానికి సంబంధించినదిగా కూడ చెప్పవచ్చు.

Friday, November 5, 2021

ఆశుకవిత్వంపై మొహం మొత్తిందా!

  ఆశుకవిత్వంపై మొహం మొత్తిందా!

సాహితీమిత్రులారా!రాయప్రోలు సుబ్బారావుగారు 1911లో 

బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సభలో

ఆశుకవిత్వంపై మొహంమొత్తి ఇష్టదేవతా ప్రార్థన ఇలాచేశారు

గమనించండి-


తెనుగే తీయని, దందు పద్య పదరీతి క్రీడలత్యంత మో

హాసముల్ శోభనముల్ తదీయరస రక్తాలాపనంబుల్ లభిం

చిన వాగర్థకలాకలాప జయ లక్ష్మిన్ గాలికింబుత్తునే

జననీ యేమిటి కింక ఆశుకవితా సన్యాస మిప్పింపవే


రసమో, భావమొ, జీవదర్థసుకుమార వ్యంజనామంజు శ

బ్ద సమాసారచనంబొ, సాధు హృదయస్పంద ప్రతిష్టా కథా

విసరంబో, సకలార్థ శూన్యమగు నీవేగాతి వేగోక్తి దు

ర్వ్యసనం బేటికి త్రిప్పుమింక జననీ రమ్యాక్షర క్షోణికిన్

                                                                                      (సమగ్రాంధ్ర సాహిత్యం - 4 - పుట373)


Wednesday, November 3, 2021

ముక్తగ్రస్తాక్షరోత్తర ప్రశ్న పద్యము

 ముక్తగ్రస్తాక్షరోత్తర ప్రశ్న పద్యము

సాహితీమిత్రులారా!ఈ పద్యంలోని సమాధానాల చివరి అక్షరాన్ని రెండవ ప్రశ్నసమాధానంగా వస్తుంది.

అదేవిధంగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రావాలి పద్యం గమనించండి-


మనుజుని యాకార మహిమకు మొదలేది?

                  నగవైరి వైరికి నగరమెద్ది?

రఘుపతిగాచిన రాక్షస పక్షేది?

     శిబి(సిరి)కన్నులార్జించు చెలువమెద్ది?

పంచబాణునియింటఁబరగినరుచియేది?

             గిరజపతి భుజించు గిన్నెయెద్ది?

నయనాంగరక్షకు నలువొందు చెలువేది?

             చెలఁగిమానముఁగాచు చెట్టదెద్ది?

యన్నిటికిఁజూడ రెండేసి యక్కరములు

యాదులుపంగ తుదలెల్ల నాదులగుచు

చెప్పునాతఁడు భావజ్ఞశేఖరుండు

లక్షణోపేంద్ర పౌఢరా!యక్షితీంద్ర


ఈ పద్యంలోని ప్రతిప్రశ్నకు సమాధానం రెండక్షరాలుగల పదం

ప్రతిపదం చివరి అక్షరం తరువాతి సమాధానంలోని మొదటి అక్షరం 

అయ్యేలాగున సమాధానాలు ఉండాలి

మనుజుని యాకార మహిమకు మొదలేది?

1. తల

నగవైరి వైరికి నగరమెద్ది?

2. లంక

రఘుపతిగాచిన రాక్షస పక్షేది?

3. కాకి

 శిబి(సిరి)కన్నులార్జించు చెలువమెద్ది?

4. కత్తి

పంచబాణునియింటఁబరగినరుచియేది?

5. తీపు

గిరజపతి భుజించు గిన్నెయెద్ది?

6. పుఱ్ఖె

నయనాంగరక్షకు నలువొందు చెలువేది?

7. ఱెప్ప

 చెలఁగిమానముఁగాచు చెట్టదెద్ది?

8. ప్రత్తి


1. త

2. లం

3. కాకి

4. త్తి

5. తీపు

6. పుఱ్ఖె

7. ఱెప్ప

8. ప్రత్తి

Monday, November 1, 2021

ఒకే పాదానికి రెండర్థాలా!

 ఒకే పాదానికి రెండర్థాలా!
సాహితీమిత్రులారా!మాడుగుల మహారాజును
ఇద్దరు కవీశ్వరులు ఇలా దీవించారు-

అ శ్లోకం చూడండి -

విక్రమేణార్జున ముఖా: కృష్ణభూపాల! తే హితా:
విక్రమేణార్జున ముఖా :కృష్ణభూపాల! తే హితా:రెండు పాదాలు
ఒకలానే ఉన్నాయి కదా!

ఇద్దరూ ఒకే పాదాన్ని చెప్పారా? అంటే చూద్దాం మరి

మొదటికవి చెప్పిన పాదానికి అర్థం-

ఓ కృష్ణభూపాలా!
విక్రమేణ అర్జునముఖా: -
పరాక్రమంలో (పాండవ మధ్యముడైన) అర్జునుడు మొదలైనవారు,
తే హితా: - నీకు సమాన స్నేహితులుగా పోల్చదగినవారు
.
రెండవకవి చెప్పిన పాదానికి అర్థం -

ఇందులో తే2హితా - అని తీసుకోవాలి
అపుడు
ఓ కృష్ణభూపాలా!
తేऽహితా: = తే అహితా: = నీ శత్రువులు,
విక్రమేణ - పరాక్రమంలో
అర్జున ముఖా: -
తెల్లమొగంతో వెలవెల పోతున్నారు.