Monday, August 10, 2026

 మాతృకావిలాసంలోని ఏకాక్షరనిఘంటువు - 5


సాహితీమిత్రులారా!

మాతృకావిలాములోని ఏకాక్షరనిఘంటువు తరువాయి భాగం ..


చచాచిచిచుచూచేచైచోచౌచంచః ॥ 6

చౌరే వాసవే చంద్రే చందనే చలనేపి చ ॥ 19

చా దితిః కన్యా చిః పూషా మాప ఏవ చ ॥

చీఋషిర్దంతి పత్నీ స్యాచ్చః కీలాలం పవిః శరః ॥ 20

భీరుర్మార్గగోపి స్యాత్పక్షీ భూమిజరాడ్రవిః ॥

చేః కృష్ణోర్కస్తురాషాట్ చ చైః సోమో వినతాసుతః ॥ 21

చోః పాఖండీ చ చౌర్ధేనురనంగానగ్నిరుద్భవః ॥

చం చరిత్రం సుఖం దుఃఖం కశ్మలం కమలం పయః ॥

చః ప్రాగుక్తోపి చపలచటకశ్చతురాననః ॥ 22

·         చ: దొంగ (చోర), ఇంద్రుడు (వాసవ), చంద్రుడు, గంధము, కదలడం.

·         చా: అదితి, కన్య.

·         చి: సూర్యుడు (పూషా).

·         చీ: ఋషి, ఏనుగు భార్య.

·         చు: నీరు (కీలాలము), వజ్రాయుధము (పవి), బాణము.

·         చూ: పిరికివాడు, మార్గంలో వెళ్లేవాడు, పక్షీ, సూర్యుడు.

·         చే: కృష్ణుడు, సూర్యుడు, ఇంద్రుడు.

·         చై: చంద్రుడు (సోమః), గరుత్మంతుడు (వినతాసుతః).

·         చో: పాషండీ (నాస్తికుడు).

·         చౌ: ఆవు (ధేనువు), మన్మథుడు.

·         చం: చరిత్ర, సుఖము, దుఃఖము, తామర (కమలం), నీరు.

·         చః: చపలుడు, పిచుక (చటక), బ్రహ్మ (చతురానన).



ఛఛాచిఛీఛుఛూచేఛైఛోఛౌఛంఛః ॥ 7

ఛస్సోమశ్ఛలికశ్ఛన్నశ్ఛా రుద్రశ్ఛః కులాలకః ॥

ఛీర్విష్ణుశ్ఛుః శుకశ్ఛూర్భూశ్ఛేః పాశీ ఛైః సురాలయః ॥ 23

ఛోః పూర్ణోలంకృతో వాయుశ్ఛౌః సమీరస్తరుర్నగః ॥

ఛమర్చిర్భూతలం స్వః స్యాత్కూలం కూటం సుఖం కులమ్ ॥ 24

ఛః ప్రాగుక్తోపి ఛదనశ్ఛటాకారశ్ఛవిర్యుతః ॥

·         ఛ: చంద్రుడు (సోమః), కపటము (ఛలిక), దాచబడినది.

·         ఛా: శివుడు (రుద్రుడు), కుమ్మరి (కులాలుడు).

·         ఛీ: విష్ణువు.

·         ఛు: చిలుక (శుకః).

·         ఛూ: భూమి.

·         ఛే: పాశము ఉన్నవాడు (వరుణుడు).

·         ఛై: దేవాలయం (సురాలయః).

·         ఛో: పూర్ణము, అలంకరించబడినది, వాయువు.

·         ఛౌ: వాయువు, చెట్టు, పర్వతం.

·         ఛం: అగ్ని కాంతి (అర్చిః), భూతలం, స్వర్గము

               తీరము (కూలము), సుఖము, కులము.

·         ఛః: కప్పడం (ఛదన), కాంతి.


 

No comments: