Sunday, August 16, 2026

 

మాతృకావిలాసంలోని ఏకాక్షరనిఘంటువు - 11


సాహితీమిత్రులారా!

మాతృకావిలాములోని ఏకాక్షరనిఘంటువు తరువాయి భాగం ..


దదాదిదీదుదూదేదైదోదౌదందః ॥ 18

అథ దాదేః । దః పాతా ఖండితా దాతా దా దాత్రీ ధారిణీ శుభా ॥

దిదినో దీః సుధానాథో దుర్దరిద్రీ కరో వరః ॥ 55

దూర్దుఃఖీ దేః స్మృతా జాయా డైర్మత్స్యో వామనో నభః ॥

దోర్హస్తశ్చరణః శిశ్నో దౌః స్వర్గః ప్రాణ ఆత్మజః ॥ 56

దం దానం శరణం కర్మ భవ్యం నూన మకిల్విషమ్ ॥

దః ప్రాగుక్తోపి దధ్యాఢ్యో దమీ దానీ దయాపరః ॥ 57

·         ద: రక్షకుడు (పాతా), ఖండించేవాడు, దాత (ఇచ్చేవాడు).

·         దా: ఇచ్చేది (దాత్రీ), ధరించేది (ధారిణీ), శుభప్రదమైనది.

·         ది: పగలు (దినము).

·         దీ: చంద్రుడు (సుధానాథః).

·         దు: దరిద్రుడు, చెయ్యి, శ్రేష్ఠమైనవాడు.

·         దూ: దుఃఖము కలవాడు.

·         దే: భార్య (జాయా).

·         దై: చేప (మత్స్యః), వామనుడు, ఆకాశము (నభః).

·         దో: చెయ్యి (హస్తము), కాలు (చరణము), శిశ్నము.

·         దౌ: స్వర్గము, ప్రాణము, కుమారుడు (ఆత్మజః).

·         దం: దానము, శరణు, కర్మ, శుభము (భవ్యము), తక్కువైనది, పాపం లేనిది.

·         దః: పెరుగుతో నిండినవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు (దమీ), దయాశీలి.



ధధాధిధీధుధూధేధైధోధౌధంధః ॥ 19

అథ ధాదేః । ధో ధర్మీ ధనవాన్ ధన్యో ధాతా విష్ణుర్వినాయకః ॥

ధా ధరిత్రీ రమా గౌరీ ధిర్ధర్మో ధీర్వృకోసురః ॥ 58

ధుః సూనుః కరో భారో ధేర్వృక్షో ధైశ్చ రావణః ॥

ధోః పాపీ వృషణః పూషా ధౌర్ధర్మః పృథివీ గిరా ॥ 59

ధం ధనం ధూననం దానం ధారణం కరణం సుఖమ్ ॥

ధః ప్రాగుక్తోథ ధమ్మిల్లే బంధో ధన్వంతరిమృగః ॥ 60

·         ధ: ధర్మపరుడు, ధనవంతుడు, ధన్యుడు, బ్రహ్మ (ధాతా), విష్ణువు, వినాయకుడు.

·         ధా: భూమి (ధరిత్రీ), లక్ష్మి (రమా), పార్వతి (గౌరీ).

·         ధి: ధర్మము.

·         ధీ: తోడేలు (వృకః), అసురుడు (రాక్షసుడు), బుద్ధి.

·         ధు: కుమారుడు (సూనుః), చెయ్యి, భారము.

·         ధే: వృక్షము.

·         ధై: రావణుడు.

·         ధో: పాపాత్ముడు, వృషణము, సూర్యుడు (పూషా).

·         ధౌ: ధర్మము, భూమి, వాక్కు (గిరా).

·         ధం: ధనము, కంపింపజేయడం (ధూననము), దానము, ధరించడం, సుఖము.

·         ధః: కొప్పు (ధమ్మిల్లము), బంధము, ధన్వంతరి, జింక (మృగః).



ననానినీనునూనేనైనోనౌనంనః ॥ 20

అథ నాదేః । నో నాట్యజ్ఞో నలో నమ్రో భావో నస్యో నరాంతకః ॥

నరనారీ సమూహేపి నా పుమాన్ గరిమా తథా ॥ 61

నిర్దుర్గతిశ్చ నీ రాగో నుర్హస్తో నూః కలత్రవాన్ ॥

నేః సమో నైః కురంగో నిరాప్తిర్మాతాథ శోభనః ॥ 62

నోర్నిషేధః ఖలో భూమినైస్తరిః పురుషోమరః ॥

నం నేత్రమంజనం శ్రోత్రం కరణం కారణం సుఖమ్ ॥ 63

నః ప్రాగుక్తోథ నో నీచో నఖేపధరోపరః ॥

·         న: నాట్యం తెలిసినవాడు, నలుడు, వినయము కలవాడు (నమ్రః)

            భావము, ముక్కుకు సంబంధించినది, మృత్యువు (నరాంతకః).

·         నా: మనుష్యు సమూహము, పురుషుడు, గొప్పతనము (గరిమ).

·         ని: దుర్గతి (చెడు స్థితి).

·         నీ: అనురాగము.

·         ను: చెయ్యి (హస్తము).

·         నూ: భార్య కలవాడు (కలత్రవాన్).

·         నే: సమానమైనవాడు.

·         నై: జింక (కురంగః), తల్లి, మంగళకరమైనవాడు.

·         నో: నిషేధము (వద్దు అనడం), దుష్టుడు (ఖలః), భూమి.

·         నౌ: పడవ (తరిః), పురుషుడు, దేవత (అమరః).

·         నం: కన్ను (నేత్రము), కాటుక (అంజనము), చెవి (శ్రోత్రము), కారణము, సుఖము.

·         నః: నీచమైనవాడు, గోళ్లు కలవాడు.


No comments: