Wednesday, August 19, 2026

మాతృకావిలాసంలోని ఏకాక్షరనిఘంటువు - 14

 

మాతృకావిలాసంలోని ఏకాక్షరనిఘంటువు - 14


సాహితీమిత్రులారా!

మాతృకావిలాములోని ఏకాక్షరనిఘంటువు తరువాయి భాగం ..


యయాయీయీయుయూయేయైయోయౌయంయః ॥ 26

అథ యాదేః । యో యజ్ఞశ్చైవ యస్తోయం సుదేవీసూనురీశ్వరః ॥

యా యోనిర్విశ్వ సంగ్రామో యీర్గజః సారవిద్రుమః ॥ 79

యుః సర్పో యూః స్మృతా యూకా యేః సార్థో యైశ్చ వాసవః ॥

యోర్యాదో యౌః కణః స్వర్గో యం యత్నః కరణం మధు ॥ 80

యః ప్రాగుక్తోపి యమరాడ్ యమీ యమలజః పుమాన్ ॥


·         య: యజ్ఞము, నీరు (తోయము), ఈశ్వరుడు.

·         యా: పుట్టుక స్థానము, ప్రపంచము, యుద్ధము.

·         యీ: ఏనుగు, పగడము (విద్రుమము).

·         యు: పాము.

·         యూ: పేను (యూకా).

·         యే: గుంపు (సార్థః).

·         యై: ఇంద్రుడు (వాసవః).

·         యో: జలచరము (యాదః).

·         యౌ: కణము, స్వర్గము.

·         యం: ప్రయత్నము (యత్నము), ఇంద్రియము, తేనె (మధు).

·         యః: యమధర్మరాజు, ఇంద్రియ నిగ్రహం కలవాడు (యమీ).

--------------------------------------------------------------------------------

రరారిరీరురూరేరైరోరౌరంరః ॥ 27

అథ రాదేః । రో రమేశోథ రః కామో వహ్నిః సూర్యోథ తోయధిః ॥ 81

లక్ష్మీ రాః సమృద్ధిః స్యాద్రిః కర్పూరో మహేశ్వరః ॥

రీః కామీ నృగపత్నీ రీ రుమృగో రూః ప్రజాపతిః ॥ 82

రేః ఖేదో నీచసంబుద్ధీ రైః కృష్ణో వర్ణ ఉచ్యతే ।

రోః శేషో రౌర్భవః స్వర్గే రం రక్తం రోధనం ధనమ్ ॥ 83

రః ప్రాగుక్తోపి రక్తాఢ్యో రజనీపతిరేవ చ ॥


·         ర: మన్మథుడు (కామః), అగ్ని (వహ్ని), సూర్యుడు, సముద్రము (తోయధి).

·         రా: లక్ష్మి, సమృద్ధి (ఐశ్వర్యము).

·         రి: కర్పూరము, శివుడు (మహేశ్వరః).

·         రీ: కామము కలవాడు, నృగ మహారాజు భార్య.

·         రు: జింక (మృగము).

·         రూ: బ్రహ్మ (ప్రజాపతి).

·         రే: దుఃఖము (ఖేదము), నీచుడిని పిలిచే పిలుపు (నీచసంబుద్ధి).

·         రై: శ్రీకృష్ణుడు, వర్ణము (రంగు).

·         రో: విష్ణువు (రమేశుడు), ఆదిశేషుడు.

·         రౌ: శివుడు (భవః), స్వర్గము.

·         రం: రక్తము, ఆటంకము (రోధనము), ధనము.

·         రః: ఎర్రని రంగు కలవాడు, చంద్రుడు (రజనీపతి).


No comments: