Thursday, June 30, 2022

కందపద్య తనుమధ్యావృత్త గర్భ ప్రియకాంతావృత్తం

 కందపద్య తనుమధ్యావృత్త గర్భ ప్రియకాంతావృత్తం




సాహితీమిత్రులారా!



కొక్కొండ వెంకటరత్నం గారి

బిలేశ్వరీయంలోని ద్వితీయబింబంలోని

గర్భచిత్రం

కందపద్య తనుమధ్యావృత్త గర్భ ప్రియకాంతావృత్తం

ప్రియకాంతావృత్తంలో కందపద్యం, 

తనూమధ్యావృత్తాలు ఇమిడ్సడం జరిగింది

గమనించగలరు-

కందపద్య తనుమధ్యావృత్త గర్భ ప్రియకాంతావృత్తం-








Tuesday, June 28, 2022

కంద గర్భ తేటగీతి

 కంద గర్భ తేటగీతి




సాహితీమిత్రులారా!



ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారి

రసస్రువు వేము వంశ గాధావళి నుండి

కంద గర్భ తేటగీతి-


తేటగీతిలో కందపద్యం ఇమిడి ఉన్న పద్యం


గురుని ఋణమెట్లు తీర్తును కరుణ నతడు

నాకొమరుని కాకతి పృతనావరు సభ 

బలి పశువును భూవరుని ప్రపత్తి గొనుచు

విడివడగను చేసెన్ గదా వింత గాదె


దీనిలోని కందపద్యం-

గురుని ఋణమెట్లు తీర్తును కరుణ నతడు

నాకొమరుని కాకతి పృతనావరు సభ 

బలి పశువును భూవరుని ప్రపత్తి గొనుచు

విడివడగను చేసెన్ గదా వింత గాదె



గురుని ఋణమెట్లు తీర్తును 

కరుణ నతడు నాకొమరుని కాకతి పృతనా

వరు సభ బలి పశువును భూ

వరుని ప్రపత్తి గొనుచు విడివడగను చేసెన్ 


Sunday, June 26, 2022

మత్తేభ కంద గర్భ సీసం

 మత్తేభ కంద గర్భ సీసం




సాహితీమిత్రులారా!

కొక్కొండ వెంకటరత్నంగారి

బిలేశ్వరీయంలోని ప్రథమబింబంలోని

మత్తేభ కంద గర్భ సీసం

గమనించండి-









Thursday, June 23, 2022

తాలాంకనందినీ పరిణయములోని ఖడ్గ బంధం

 తాలాంకనందినీ పరిణయములోని 

ఖడ్గ బంధం


సాహితీమిత్రులారా!

ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్య

ప్రణీతమైన తాలాంకనందినీ పరిణయము లోని

ఖడ్గబంధం ఆస్వాదించండి-


కం. శూరవరసారకరఖర

      మారణరణరంగనిహతమధుమురనరకా

      కారణసమధిక నిపుణ ర

      మారణీమానసౌక మన్మథజనకా (1-320)

పద్యాన్ని చూస్తూ బంధాన్ని చదవాలి

పిడి దగ్గర నుండి పద్యం ప్రారంభమౌతుంది

బంధం-




Tuesday, June 21, 2022

రెండు హల్లుల పద్యం

 రెండు హల్లుల పద్యం




సాహితీమిత్రులారా!



రూపగోస్వామి కూర్చిన చిత్రకవిత్వాని

అనే చిత్రకావ్యంలోని రెండు హల్లుల పద్యం

ఇందులో ర-- అనే రెండు హల్లులు మాత్రమే

ఉపయోగించి పద్యం కూర్చారు గమనించండి-


రసాసారరసుసారోరురసురారిః ససార సః

సంసారసిరసౌ రాసే సురిరంసుః ససారసః


Sunday, June 19, 2022

స - కార గుణింత పద్యం

 స - కార గుణింత పద్యం




సాహితీమిత్రులారా!



రాప్తాటి ఓబిరెడ్డి గారు కూర్చిన

శబ్దాలంకార శతకంలోని

స -కార గుణింత పద్యం-


రస సారసాక్ష సిరితాల్పు సీతేశ

సుకర సూరి సేతుసుప్రయత్న

సైన్యరక్ష సోమసమ సౌమ్యసంశీల

పండమేటిరాయ భక్తగేయ


స-కార గుణితం గమనించండి.

Friday, June 17, 2022

గోపురబంధం

 గోపురబంధం




సాహితీమిత్రులారా!

నాదెళ్ళ పురుషోత్తమకవి కృత

చిత్రకందపద్యరత్నాకరం - లోని

గోపురబంధం చూడండి-


రామా మహితా మనమున

నీమంబును గొని తలంతు నినుఁగను గతి నీ

నామమునె యనుదు మనుపవె

ప్రేమ న్సతతంబు మీకు భృత్యుండ గదా


గోపురబంధం-



Saturday, June 11, 2022

అన్నపానాలతో అంతమైండు

 అన్నపానాలతో అంతమైండు




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు విప్పండి-

జడల మహాముని భూమ్మీద ఆరునెల్లు తబస్సు పట్టెండు

తబుసు పట్టిన కొన్ని దినాలకు భూచక్రగొడుగుతో భూమ్మీద పడ్డ

కొన్ని దినాలకు మొండి కత్తితో పైకి లేచిండు, 

పైకి లేచిన కొన్ని దినాలకు నందివాహనమ్మీద నాల్గు బజార్లు తిరిగిండు, 

నాల్గు బజార్లూ తిరిగిన కొన్ని దినాలకు 

తులాభారంతో తూగిండు, 

తులతూగిన కొన్ని దినాలకు, 

కూరపాటి వీరులతో 

కూని యుద్ధం చేసిండు, 

యుద్ధం చేసిన కొన్ని దినాలకు కారంపూడి వీరులతో యుద్ధం చేసిండు, 

యుద్ధం చేసిన కొన్ని దినాలకు అన్నపానాలతో అంతమైండు


సమాధానం - ఉల్లిగడ్డ

(ఉల్లిగడ్డ పొలంలో వేసిన దగ్గరనుండి కూరలతో అన్నంతో కలిసి మనం తినేదాకా ఈ కత)


Thursday, June 9, 2022

గుచ్ఛబంధం

 గుచ్ఛబంధం




సాహితీమిత్రులారా!

విక్రాల శేషాచార్య కృత

వేంకటేశ్వర చిత్రరత్నాకరం

ఒకటవభాగం 94 వ పద్యం

గుచ్ఛబంధం గమనించండి-


సారసనేత్రా సురసా

సారసుఖశ్రీతరసా

సారతరాత్మాదరసా

సారదరాఢ్యా సరసా

(మాణవక వృత్తం)


బంధం - 




Tuesday, June 7, 2022

సర్వస్వరాక్షర చిత్రం

 సర్వస్వరాక్షర చిత్రం




సాహితీమిత్రులారా!



శ్రీహరిద్వాదశాక్షరీ స్తోత్రం అనే

చిత్రకావ్యాన్ని స్వామీ శ్రీలక్ష్మణశాస్త్రి గారు 

కూర్చారు. దీనిలో మొదట అన్ని అచ్చులతో 

ఒక శ్లోకాన్ని ఈ విధంగా కూర్చారు 

దీన్నే సర్వస్వరాక్షరచిత్రం అంటున్నాం

గమనించగలరు-


హో త్మేష్టా సా తి విదిత శో భువనపా

దగ్రోజా రోకృతపురుతపా ధితవలః

శ్వయౌంకా మితిపదసుధా ర్వసమభా,

జనా అంహో సా జః క్షిపతు బహుదూరం హి భవతామ్


ఇందులో మొత్తం 12 అచ్చును ఉపయోగించారు.

ఈ విధంగానే  ప్రతి శ్లోకంలో

క - మొదలు హ - వరకు అన్ని హల్లులకు ఈ 12 అచ్చులను ఉపయోగించి శ్లోకాలను కూర్చారు

Sunday, June 5, 2022

సుదర్శనచక్ర బంధం

 సుదర్శనచక్ర బంధం




సాహితీమిత్రులారా!

Dr. D.S.గణపతిరావుగారు కూర్చిన 

పద్మవ్యూహం చిత్రకావ్యం 

నుండి  వేంకటేశ్వర స్తుతిలో

సుదర్శనచక్రబంధం

గమనించగలరు-


చిత్రపదం(ఛందస్సు)-

రాజువ కావ పరాకా

రాజువు నీవు చిరాకా

రాజుగ వేగమె రా మా

రాజ చకాచక రావా


బంధ ఆకృతి -




Friday, June 3, 2022

చిక్కబోదు గుట్టు దక్కబోదు

 చిక్కబోదు గుట్టు దక్కబోదు




సాహితీమిత్రులారా!



పొడుపు పద్యం విప్పండి-


గోడకున్న చెవులు గోచరించవుకాని

సన్ననైన కనులు చాలగలవు

ఇక్కడున్నచోటు ఏకాంతమైనను

చిక్కబోదు గుట్టు దక్కబోదు


సమాధానం - తడిక

Wednesday, June 1, 2022

నీచే దెబ్బలు తిన్నాను

 నీచే దెబ్బలు తిన్నాను




సాహితీమిత్రులారా!


ఈ పొడుపును విప్పండి-

అమ్మా! నీ కడుపున పడ్డానూ, అంత సుఖాన వున్నానూ

చుచ్చో మళ్ళీ వచ్చాను. సోలీ ఇంట్లో పడ్డాను,

నీచే దెబ్బలు తిన్నానూ, నిలువు యెండీ పోయినాను

నిప్పుల గుండం దొక్కాను, నీరై మారీ పొయ్యాను


సమాధానం -

నీ కడుపున పడ్డానూ, అంత సుఖాన వున్నానూ - గడ్డి

చుచ్చో మళ్ళీ వచ్చాను. సోలీ ఇంట్లో పడ్డాను, - పేడ

నీచే దెబ్బలు తిన్నానూ, నిలువు యెండీ పోయినాను - పిడక

నిప్పుల గుండం దొక్కాను, నీరై మారీ పొయ్యాను  - బూడిద