Showing posts with label ''క'' నుండి ''మ'' వరకు అక్షరాల్లేని పద్యం. Show all posts
Showing posts with label ''క'' నుండి ''మ'' వరకు అక్షరాల్లేని పద్యం. Show all posts

Friday, July 16, 2021

''క'' నుండి ''మ'' వరకు అక్షరాల్లేని పద్యం

''క'' నుండి ''మ'' వరకు అక్షరాల్లేని పద్యం





సాహితీమిత్రులారా!



''క'' నుండి ''మ'' వరకు గల అక్షరాలను వర్గాక్షరాలు అంటారు

వర్గపంచకరహితము అంటే
క - వర్గము -    క, ఖ, గ, ఘ, ఙ
చ - వర్గము - చ, ఛ, జ, ఝ, ఞ
ట - వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
త - వర్గము - త, థ, ద, ధ, న
ప - వర్గము - ప, ఫ, బ, భ, మ
ఈ ఐదు వర్గాలలోని 25 వ్యంజనము(హల్లు)లను
వదలి కూర్చబడినది.-
ఇందులో ఈ 25 అక్షరాలు ఉండవు
క్రిందివాటిలో ఈ లక్షణాలు గమనించండి-


సరసీరుహశర హర వర 
శరాస విలయాసహాయ శౌర్యవహ హరీ
శ్వర హరిహయహయ సింహ
స్వరు సురలహరీ సురర్షి శశి శర్వయశా

                                              (మహాసేనోదయము - 7- 387)


హార హీర సార సారి హర శైలవాస వో
ర్వీరు హాహి హారశేషవేష హాసలాలస
శ్రీరసోరుయాశసాంశుశీల వైరివీరసం
హార సారశౌర్యసూర్య హర్యవార్యసాహసా

                                                    (కావ్యాలంకారసంగ్రహము - 5- 245)