Showing posts with label ఒకే అక్షరంతో పద్యం. Show all posts
Showing posts with label ఒకే అక్షరంతో పద్యం. Show all posts

Tuesday, June 22, 2021

ఒకే అక్షరంతో పద్యం

 ఒకే అక్షరంతో పద్యం




సాహితీమిత్రులారా!



ఒకే అక్షరంతో పద్యం కూర్చడాన్నే

ఏకాక్షరి అని అంటారు. దీనిలో హల్లు ఒకటే

ఉంటుంది కాని అచ్చులు ఏవైనా వాడవచ్చు.

దీనికి ఉదాహరణగా విక్రాల శేషాచార్యులవారి

శ్రీ వేంకటేశ్వర చిత్రరత్నాకరములోని 

ఈ కందపద్యం చూడండి-

నిన్ను నిను నెన్న నీనె
నెన్నిన నన్నన నన్నన నన ననిన నానేనా
ని న్నూనినా ననూనున్
న న్నూనన్నాను నేననా నున్నానా!

దీన్ని ఈ విధంగా పదవిభాగం తీసుకోవాలి-

నిన్నున్ - ఇనున్ - ఎన్నన్ - ఈనేను - ఎన్నినన్-
అన్నన్న - ననను -అనిన - నానేనా - నిన్ను -
ఊనినాను - అనూనున్ - నన్ను - ఊను -
అన్నాను - నేను - అనా - నున్నానా

అర్థం -
నీకు పైన ప్రభువులులేని, సర్వస్వమునకు ప్రభువైనవాడా
సర్వేశ్వరుడవైన నిన్ను స్తుతించుటకొరకు ఈ నేను ఆలోచిస్తే
చిగురువలె అల్పుడను. చోద్యము గొప్పవాడవైన నిన్ను ఆశ్రయించాను
శకటాసురుని సంహరించినవాడా తండ్రీ నన్ను ఆదుకొనుము అంటిని