Showing posts with label వావివరుసల పద్యం. Show all posts
Showing posts with label వావివరుసల పద్యం. Show all posts

Wednesday, February 16, 2022

వావివరుసల పద్యం - 3

 వావివరుసల పద్యం - 3




సాహితీమిత్రులారా!



ఈ పద్యంలోని వావివరుసలు గమనించి

ఈ పద్యానికి భావం చెప్పండి-


ధరణిపుత్రుని పినతల్లి తమ్ముని సుతు

                  తాత యల్లునిరాణి తండ్రికొడుకు

కొడుకు తండ్రికి తండ్రికోడలి సుతుబంటు

                  నణచి నాతని తండ్రికగ్రసుతుఁడు

తమ్ముని యేలిక తండ్రి వియ్యంకుని

                   కూతు నేర్పుగఁ జెఱఁగొన్నవాని

తనయుని ద్రుంచిన గనయౌషధముఁ దెచ్చు

                   తండ్రిసుతు పుత్రుతద్దొరకుమారు

యవ్వకోడలు కోడలు యన్నతండ్రి

భార్యవద్దను కొలువున్న భామజనకు

తనయుచేతన గూలిన ఘనుని తల్లి

ధరుఁడు మీకిచ్చు పుత్రుపౌత్రాభివృద్ధి

                                                              దీనికి భావం కామెంట్స్ లో ఉంచండి.

Wednesday, November 24, 2021

వావివరుసల పద్యం - 2

 వావివరుసల పద్యం - 2




సాహితీమిత్రులారా!



ఈ వావివరుసల పద్యాన్ని గమనించి

దీన్ని అర్థాన్ని మీరే కామెంట్స్ లో పెట్టగలరు-


ఇల్లాలు మనుమరాలేరీతియాయెనో

              మనుమరాలికియెట్లు మామయయ్యె

మామయే వావిని మరిఁదియెయుండెనో

              మరఁదియెందునుఁగూర్చి మనుమఁడయ్యె

మనుమఁడే వానిని మరియల్లుఁడాయెనో

              యల్లునిల్లాలెట్టులత్తయయ్యె

యత్తయేవానిని యాయెను కూఁతురు

               కూఁతురు సరియెట్లు కోడలయ్యె

దీనియర్థంబు జనులకు దెలియరాదు

తెలియవచ్చిన కవులకుఁ దేటపడును

జలజహితరంగ సారసచంద్రనిన్ను

వర్ణనలుచేయ లేరెంత వారలైన

Saturday, November 20, 2021

వావివరుసల పద్యం

 వావివరుసల పద్యం




సాహితీమిత్రులారా!



ఈ పద్యంలోని వరుసలను మీరే కనిపెట్టి చెప్పగలరు

మగువ నా మరదలౌ మారుతల్లివినీవు

              వరుసఁజెప్పవుగదే వదినె గాక

అత్తబిడ్డవునీవు యనుఁగుచెల్లెలనైతె

          మనకువావులు గల్గె మనుమరాల

గారాబునాబిడ్డ యేరాలుమరదలౌ

                నాకూఁతురవుగదే నాఁతినీవు

మాయత్తతమ్ముని మరదలు వదినెనౌ

                దానిపిన్నత్త నామేనవదిన

తల్లిపెద్దత్తకోడలు తల్లిరావె

మారుటత్తకు మరదలు మనుమరాల

యనుచు విజ్జోడువావులు బెనసికలిపి

యొక్కవావిని వరుసఁగా లెక్కజెపుమ

                (శృంగారయుక్తి చమత్కార పద్యారత్నావళి - పుట -66)

(మీరే ఈ పద్యంలోని వావివరుసలను కనుగొని కామెంటులో పెట్టగలరు)