Wednesday, February 8, 2017

దీని దెలుయు శ్రేష్ఠులు గలరే!


దీని దెలుయు శ్రేష్ఠులు గలరే!




సాహితీమిత్రులారా!


ఈ పొడుపు పద్యాన్ని విప్పండి-

శిల వృక్షలతల బుట్టిన
చెలువులు మువ్వురును గూడి శివలగ్నమునన్
తలవాకిట రమియింతురు
చెలువలరగ దీని దెలుయు శ్రేష్ఠులు గలరే!

రాతినుండి, చెట్టునుండి, తీగలనుండి
పుట్టిన ముగ్గురు స్త్రీలు మంచి సమయంలో
తలవాకిట చేరి క్రీడిస్తారు- దీన్ని తెలిసినవారు
ఉన్నారా - అనేది పొడుపు.
ఆలోచించండి-

విడుపువిషయానికి వస్తే-

రాతినుండి పుట్టినది - సున్నం
వృక్షం నుండి పుట్టినది - వక్క
తీగనుండి పుట్టినది - తమలపాకు
ఈ ముగ్గురు స్త్రీలు కలిసి మంచి సమయంలో
తలవాకిట(నోట్లో) క్రీడిస్తే దాన్ని తాంబూలం అంటాంకదా!
సమాధానం - తాంబూలం

చూచారా ఆలోచిస్తే మెదడుకు పదునెక్కుతుంది
సమస్యలకు పరిష్కారం సులువవుతుంది.

No comments: