Friday, February 3, 2017

మానవతీ లలామ కభిమానమె చాలు చీరయేటికిన్?


మానవతీ లలామ కభిమానమె చాలును చీరయేటికిన్?
సాహితీమిత్రులారా!


సమస్య - 

మానవతీ లలామ కభిమానమె చాలును చీరయేటికిన్


తిరుపతి వేంకట కవుల పూరణ-

ఓ నవనీతచోర! కృపయుంచి పటమ్ముల నిచ్చి వేగ మా
మానము కావుమన్న వ్రజమానిని పల్కులకెంతొ వింత న
వ్వాననసీమఁ దోప ధవళాక్షుడు తానిటు పల్కు - మానినీ
మానవతీ లలామ కభిమానమె చాలును చీరయేటికిన్

పూరణ గోపికా వస్త్రాపహరణతో
చేయడం వలన అందులోని
భావన సవ్యమైనదిగా మారినది.


మీరును మరోవిధమైన పూరణ చేసి పంపగలరు.

No comments: