Sunday, February 12, 2017

పళ్లు లేవుకాని రాళ్ళను తింటుంది


పళ్లు లేవుకాని రాళ్ళను తింటుంది




సాహితీమిత్రులారా!


ఈ ప్రహేలిక చూడండి-

దన్తైర్హీనః శిలాభక్షీ నిర్జీవః బహుభాషకః
గుణ స్యూతి సమృద్ధోపి పరపాదేన గచ్ఛతి

దానికి పళ్లులేవు కాని రాళ్లను తింటుంది
ప్రాణం లేకున్నా అనేక భాషలు మాట్లాడుతుంది
గుణం(దారం) అల్లికతో పెరిగినా, ఇతరుల
కాలితో నడుస్తుంది - అది ఏది?

దీనికి సమాధానం - చెప్పు

దానికి దంతాలుండవుకదా దాని మధ్యలోపడి
రాళ్ళు చగిలిపోతాయికదా, ప్రాణం లేకున్నా
కిర్రు కిర్రుమని అనేక విధాలుగా శబ్దం చేస్తుందికదా
దారంతో కుట్టబడి పెరిగి పెప్పుగా తయారౌతుందికదా
మరి చెప్పు పరుల పాదాలతోనే కదా నడిచేది.

No comments: