Monday, February 6, 2017

కాంతామణి చంటిమీదఁ గాకర మొలిచెన్


కాంతామణి చంటిమీదఁ గాకర మొలిచెన్
సాహితీమిత్రులారా!


సమస్య-
కాంతామణి చంటిమీదఁ గాకర మొలిచెన్


పూర్వకవి పూరణ-

చింతామణి యను బాఁపఁడు
పంతంబున గోడమీఁదఁ బ్రతిమను వ్రాసెన్  
అంతట వర్షము గురిసెను
కాంతామణి చంటిమీదఁ గాకర మొలిచెన్

ఇందులో నిజమైన కాంతమీదకాక ప్రతిమమీద
కాకర మొలిచిందని పూరించటం వలన
సమస్య అర్థవంతమైంది.


మీరును మరోభావనతో పూరించి పంపగలరు

No comments: