Monday, February 13, 2017

కప్పను జూడఁగఁ బాము గడగడ వడఁకెన్


కప్పను జూడఁగఁ బాము గడగడ వడఁకెన్
సాహితీమిత్రులారా!సమస్య -
కప్పను జూడఁగఁ బాము గడగడ వడఁకెన్


మోచర్ల వెంకనకవి పూరణ -

కుప్పలకావలి కేఁగఁగఁ
జెప్పులు కఱ్ఱయునుఁ బూని శీఘ్రముగాఁగన్
జప్పుడుఁజేయుచు జను వెం
కప్పను జూడఁగఁ బాము గడగడ వడఁకెన్


ఇందులో కప్పను చూచి పాము వణకలేదు
వెంకప్పను చూచి పాము వణిందని పూరించడం
రమణీయంగా ఉంది.

మీరును మరో మనోహరమైన భావనతో పూరించి పంపండి

No comments: