Tuesday, August 2, 2016

నాన్నా అమ్మ కోప్పడుతోంది!


నాన్నా అమ్మ కోప్పడుతోంది!


సాహితీమిత్రులారా!

ఇది కుమారస్వామికి - శివునికి మధ్య సంభాషణ చూడండి.

అమ్బా కువ్యతి తాత! మూర్ధ్షివిధోతా గంగేయ ముత్సృజ్యతామ్
విద్వన్! షణ్ముఖ! కా గతి ర్మమ చిరం మూర్ధ్షిస్థితాయా: వద
కోపావేశవశా రశెషవదనై: ప్రత్యుత్తరం దత్తవాన్
అంబోధి, ర్జలధి: పయోధి, రుదధి: వారాంనిధి: వారిధి:

కుమారస్వామి - నాన్నా! అమ్మ కోప్పడుతోంది. నీతలనెక్కి పెత్తనం చేస్తున్న
                            ఆగంగమ్మను వదిలించుకోరాదా!
శివుడు - ఒరే! ఆరుముఖాలుగల కుమారస్వామీ నన్నే నమ్మి,
                ఇంతకాలంగా నాతలపై ఉన్న గంగమ్మను విడిచిన
                ఇక దాని గతి ఏమౌతుందో, నీవు పండితుడవుగదా! కొంచెం ఆలోచించి చెప్పు?
             (అనగానే కోపం వచ్చి ఆర్ముగం ఆరుముఖాలతో ఒక్కసారిగా)
కుమారస్వామి - అంబోధి, జలధి, పయోధి:, ఉదధి, వారాంనిధి:, వారిధి:
           (అని ఈ ఆరుపదాలు సముద్రానికి పర్యాయపదాలు చెప్పాడు.
             అంటే నదులకు భర్త సముద్రుడు ఉన్నాడు కదా
              అక్కడికే వెళుతుందిలే కావున ఆమెను వదిలిపెట్టు అని అన్నాడు.)