Wednesday, August 10, 2016

ముఖముగాని ముఖమేది?


ముఖముగాని ముఖమేది?


సాహితీమిత్రులారా!

విద్వాన్ పండిత కవిశేఖర బయిరెడ్డి సుబ్రహ్మణ్యంగారి
శ్రీవేంకటేశ్వర సారస్వతవినోదిని అనే గ్రంథం నుండి
రెండు పొడుపు పద్యాలు చూశారు.
ఇపుడు మరొక పద్యం చూడండి.

ముఖముగానయువంటిముఖమేది యగుచుండు?
          ముఖముగానయువంటి ముఖమేది?
ముఖముగానయువంటిముఖమేది యగుచుండు?
          ముఖముగానయువంటి ముఖమేది?
ముఖముగానయువంటిముఖమేది యగుచుండు?
          ముఖముగానయువంటి ముఖమేది?
ముఖముగానయువంటిముఖమేది యగుచుండు?
          ముఖముగానయువంటి ముఖమేది?
ముఖముగానటువంటిదౌ ముఖమదేది?
ముఖముగానటువంటిదౌ ముఖమదేది?
చెప్పవలె ముఖమంత్యానఁజేర్చి చేర్చి
దేవ శ్రీవేంకటేశ! పద్మావతీశ!

ఇందులో 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతిసమాధానికి చివర ముఖము అని చేర్చి
సమాధానం చెప్పాలి. ఆలోచించండి.

1. ముఖముకాని ముఖము - అయోముఖము (బాణము)
2. ముఖముకాని ముఖము - ఆ ముఖము (పీఠిక)
3. ముఖముకాని ముఖము - అగ్నిముఖము (జీడిచెట్టు)
4. ముఖముకాని ముఖము - గోముఖము (మొసలి)
5. ముఖముకాని ముఖము - సూచీముఖము (సూదిమొన)
6. ముఖముకాని ముఖము - కుహూముఖము (కోకిల)
7. ముఖముకాని ముఖము - బలిముఖము (కోఁతి)
8. ముఖముకాని ముఖము - అహిర్ముఖము (తెల్లవారువేళ)
9. ముఖముకాని ముఖము - రజనీముఖము (ప్రొద్దుగ్రుంకువేళ)
10. ముఖముకాని ముఖము - సేనాముఖము (సేనకుముందుండు భాగము)

No comments: