Thursday, August 11, 2016

తామ్రకమ్రవస్త్రేవ వారుణీ


తామ్రకమ్రవస్త్రేవ వారుణీ


సాహితీమిత్రులారా!


వృత్త్యనుప్రాసాలంకారంలో చివరి
విధము పౌండ్రీ వృత్త్యనుప్రాసము.
సరూపసంయుక్తములైన వర్ణముల
అనుప్రాస ఘటనం గలదాన్ని పౌండ్రీ వృత్త్యనుప్రాసము అంటారు.
దీనికి ఉదాహరణ-

అస్తమస్తక పర్యన్త సమస్తార్కాంశు సంస్తరా
పీనస్తన స్థితా తామ్రకమ్రవ స్త్రేవ వారుణీ
               
                            (సరస్వతీకంఠాభరణము - 2 - 189)

(అస్తాచల శిఖరము నావరించియున్న
సూర్యకిరణాల సమూహంచేత కప్పబడిన
పశ్చిమదిశ పీనస్తనములయందు ఎఱ్ఱని
మనోహరమయిన వస్త్రమును కప్పుకొన్నట్లున్నది.)

పౌండ్రీ వృత్త్యనుప్రాసములో ఒక హల్లుకు అదే హల్లుగాక వేరే వ్యంజనము సంయోగము చెంది పునరుక్తములగును. ఈ శ్లోకంలో స-కార త-కారములు సంయుక్తములై అనేకమార్లు ఆవృత్తమయినవి. ఈవిధంగా కావున ఇది పౌండ్రీకి ఉదాహరణ అవుతున్నది.

No comments: