Friday, August 5, 2016

చతురే కిం ప్రాణేశ:?


చతురే కిం ప్రాణేశ:?


సాహితీమిత్రులారా!

నాయిక - సఖి సంవాదము-

రాగీ భినత్తి నిద్రాం తల్పం న జహాతి నిష్టురం దశతి
చతురే! కిం ప్రాణేశ: -  నహి నహి సఖి! మత్కుణవ్రాత:

నాయిక - రాగీ నిద్రాం భినత్తి (రాగియై నిద్రాభంగం చేయును)
               తల్పం న జహాతి (పడకను విడువకుండును)
               నిష్టురం దశతి (గట్టిగా కరచును)

సఖి - చతురే! కిం ప్రాణేశ:? 
          (ఓ చతురురాలా! నీ ప్రాణేశుడేనా?(అట్లాచేసింది))
          (తల్పము విడువక నిద్రాభంగం చేసి దంతాలతో కరచింది
            నీ ప్రాణేశుడేనా?)
నాయిక - నహి నహి సఖి మత్కుణవ్రాత:
              (కాదు కాదు చెలియా ప్రాణేశుడు కాదు,
                ఇదంతా చేసింది నల్లుల బారు సుమా!)

No comments: