Friday, May 5, 2017

తల్లి గాని తల్లి ఎవరట?


తల్లి గాని తల్లి ఎవరట?
సాహితీమిత్రులారా!


బయిరెడ్డి సుబ్రహ్మణ్యం గారి
శ్రీవేంకటేశ సారస్వత వినోదిని లోని
పొడుపు పద్యం చూడండి-

ఘృతముగానటువంటి ఘృతమేది యగుచుండు?
చాపమ్ముగానట్టి చాపమేది?
సరముగానటువంటి సరమేది యగుచుండు?
ధూమమ్ముగానట్టి ధూమమేది?
గరముగానట్టి గరమేది యగుచుండు?
దంతమ్ముగానట్టి దంతమేది?
నదముగానటువంటి నదమేది యగుచుండు?
దారముగానట్టి దారమేది?
కర్ణుఁడచ్చముగానట్టి కర్ణుఁడెవఁడు?
తల్లియచ్చముగానట్టి తల్లియెవతె?
మెప్పుగానుత్తరమ్ములు చెప్పవలయు
దేవ శ్రీ వేంకటేశ! పద్మావతీశ!

పై ప్రశ్నలకు సమాధానాలు 
ఏమైవుండునో ఆలోచించారా


సమాధానాలు -

ఘృతముకాని ఘృతము - అమృతము(సుధ)

చాపముకాని చాపము - స్కంధచాపము (కావడిబద్ద)

సరముకానిసరము - కేసరము(పొగడచెట్టు)

ధూమముగాని ధూమము - వ్యోమధూమము (పొగ)

గరముకాని గరము - ఉంగరము(అంగుళీయము)

దంతముకాని దంతము - పుష్పదంతము(ఒక దిగ్గజము)

నదముగాని నదము - జాంబూనదము(బంగారు)

దారముగాని దారము - ఉదారము(గొప్పది)

కర్ణుడుగాని కర్ణుడు - కుంభకర్ణుడు(రావణుని సోదరుడు)

తల్లిగాని తల్లి - పార్వతి(జగజ్జనని)


No comments: