Saturday, May 20, 2017

ప్రతిలోమానులోమ శ్లోకము


ప్రతిలోమానులోమ శ్లోకము
సాహితీమిత్రులారా!ప్రతిలోమానులోమ శ్లోకము అంటే
మొదటి, మూడవ పాదాలు అనులోమంగాను
రెండవ, నాలుగవ పాదాలు ప్రతిలోమంగాను
కూర్చబడిన శ్లోకం.

ఉదాహరణగా కిరాతార్జునీయంలోని
ఈ శ్లోకం  చూడండి-

నను హో మథనా రాఘో
ఘోరా నాథమహో ను న
తయదాతవదా భీమా
మాభీదా బత దాయత

ఈ శ్లోకం అర్జునుని ధాటికి తట్టుకోలేక
ఫలాయనం చిత్తగించిన సైన్యానికి
కుమారస్వామి ధైర్యం చెప్పే శ్లోకాలలోని
ఒకటి -
ఓ సైనికులారా వినండి. మీరు భయంకరులైన
శత్రువులను భయపెట్టేవారు. సమర్థులు.
శత్రువు విషయంలో క్రూరులు. ప్రభుభక్తి కలవారు.
రక్షకులు. మంచి ఆచరణకలవారు. వక్తలుకూడా.
శరణాగతులకు, అభయమివ్వగలవారు.
మీ పరిశుద్ధి అందరికీ తెలుసు - అని భావం.

ఈ శ్లోకంలో 1,3 పాదాలను
విలోమంగా వ్రాయగా
2,4 నాలుగుపాదాలు ఏర్పడతాయి
గమనించండి.

నను హో మథనా రాఘో
ఘోరా నాథమహో ను న
తయదాతవదా భీమా
మాభీదా బత దాయత

మూడవ పాదంలోని వదా అనేది
నాలుగవపాదంలో దావ అని రావాలి
కానీ దా బ అని వచ్చింది. దీనికి
కారణం సంస్కృతంలో -కును,
-కును భేదములేదు.


No comments: