Thursday, May 4, 2017

మత్తేభ గర్భిత సీసము


మత్తేభ గర్భిత సీసము




సాహితీమిత్రులారా!


కంకంటి పాపరాజు కృత
ఉత్తర రామాయణములోని
మత్తేభ గర్భిత సీసము చూడండి-

సీసములో మత్తేభము ఇమిడ్చి చెప్పిన సీసము

అభవ కందర్ప మదాపహానల దృశా
          పద్మారికోటిప్రభా జొహారు
సుకవి సంస్తుత్యరజోగుణేతరమతీ
          గౌరీవధూనాయకా జొహారు
ప్రభవ కుంభీంద్రవిభంజనక్రమహరీ
          బ్రహ్మాదిదేవాధిపా జొహారు
త్రిభువనాధీశ్వర దేవసంయమిమనః
          పూజావిధేయాత్మకా జొహారు
చంద్రశకలశిరోవతంసక జొహారు
సురధరాధర కోదండధర జొహారు
శరధికన్యామనోహరశర జొహారు
ప్రణతరక్షా విచక్షణేక్షణ జొహారు
                                  (ఉత్తర రామాయణము - 1- 308)

ఇందులో సీసపద్యభాగంలోనే
మత్తేభము గర్భితమై ఉన్నది
గమనించండి

గర్భిత మత్తేభము -
భవ కందర్ప మదాపహానల దృశా
          పద్మారికోటిప్రభా జొహారు
సుకవి సంస్తుత్యరజోగుణేతరమతీ
          గౌరీవధూనాయకా జొహారు
ప్రభవ కుంభీంద్రవిభంజనక్రమహరీ
          బ్రహ్మాదిదేవాధిపా జొహారు
త్రిభువనాధీశ్వర దేవసంయమిమనః
          పూజావిధేయాత్మకా జొహారు
చంద్రశకలశిరోవతంసక జొహారు
సురధరాధర కోదండధర జొహారు
శరధికన్యామనోహరశర జొహారు
ప్రణతరక్షా విచక్షణేక్షణ జొహారు


భవ కందర్ప మదాపహానల దృశా పద్మారికోటిప్రభా 
కవి సంస్తుత్యరజోగుణేతరమతీ గౌరీవధూనాయకా 
భవ కుంభీంద్రవిభంజనక్రమహరీబ్రహ్మాదిదేవాధిపా 
భువనాధీశ్వర దేవసంయమిమనః పూజావిధేయాత్మకా 


No comments: