Wednesday, May 31, 2017

ప్రశ్నోత్తరోక్తి -2


ప్రశ్నోత్తరోక్తి -2




సాహితీమిత్రులారా!



ప్రశ్నోత్తరోక్తిలో రెండవ విధము
విద్వాంసుడు శబ్దవిద్యామహత్త్వముచేత
హృదయగత భావమును హృద్యంగా
భంగ్యంతరముగా స్ఫురింప చేసిన ఎడల
దానిని ప్రతీయమాన ప్రశ్నోత్తరోక్తిగా చెబుతారు.
ఉదాహృత శ్లోకము-

కియన్మాత్రం జలం విప్ర 
జానుదఘ్నం నరాధిప
తథాపీయ మవస్థా తే
న హి సర్వే భవాదృశాః

ఇది రాజుకు పండితుని మధ్య జరిగిన ప్రసంగము

రాజు - విప్రా! జల మెంతమాత్రము
విప్రుడు - రాజా! మోకాళ్ళవరకు
రాజు- అంతమాత్రానికే నీకీ అవస్థా
విప్రుడు - అందరు మీ వంటివారు కారు కదా

దీనిలో  రాజుకు ఉన్న సంపన్నత్వ విషయము,
దాతృత్వ విషయమున రాజుకున్న స్థానము ఉన్నతము
అదియే పండితోక్తిచేత ప్రతీతమానమయినది. కావుననే
ఇది ప్రతీయమాన హృద్యప్రశ్నోత్తరోక్తి అగుచున్నది.

గవాక్ష బంధము


గవాక్ష బంధము




సాహితీమిత్రులారా!

గవాక్ష బంధములో నిలువుగా
మధ్యవరుసలో కవిపేరు గాని
కావ్యం పేరుగాని వచ్చును.
లక్ష్మీసహస్రంలోని
గవాక్ష బంధము
చూడండి-

వే వేంకటవక్షోటన
దేవీ మాతా మహత్త్వదీప్తి నిఁక సుఖి
త్వావాసం బిడుమా నీ
శ్రీవాసాపాంగవినుతిఁ జేసితి జైజై

బంధము-

వే 
వేఙ్క
వక్షోదే
వీ మాతా హత్త్వదీ
ప్తి నిఁక సుఖిత్వావాసం బి
డుమా నీశ్రీవాసాపాం
గవినుతిఁ జే
సితి జై
జై

మధ్యలో వేంకటమఖి శ్రీనుతిజై - అని ఉన్నది.





Tuesday, May 30, 2017

ప్రశ్నోత్తరోక్తి


ప్రశ్నోత్తరోక్తి




సాహితీమిత్రులారా!



ప్రశ్న-ఉత్తరము+ ఉక్తి = ప్రశ్నోత్తరోక్తి
ఇది రెండు రకములని
సరస్వతీ కంఠాభరణంలో చెప్పబడుచున్నది.
మొదటి రకము -
వక్త స్పష్టముగా తనమనోభావమును తెలిపిన దానిని
అభిధీయమాన హృద్యము అంటారు
దీనికి ఉదాహరణ అమరుక శతకంలోనిది-

క్వ ప్రస్థితాసి కరభోరు ఘనే నిశీథే
ప్రాణేశ్వరోవలతి యత్ర మనఃప్రియే మే
ఏకాకినీ వద కథం న బిభేషి బాలే
నన్వస్తి పుంఖితశరో మదనః సహాయః

సంకేత స్థానాన్ని చేరుకొన్న ప్రియురాలిని
ప్రియుడు ప్రశ్నిస్తున్నాడు-

కరభోరూ! దట్టమైన చీకటిలో ఎక్కడికి బయలుదేరావు

నా మనఃప్రియుడు ప్రాణేశ్వరుడు ఉండేచోటుకు

బాలా! ఒక్కతివేకదా! భయపడకుండా వెళుతున్నావు
కారణమేమి?

బాణం సంధించి మదనుడు సహాయుడై ఉన్నాడు కదా!

ఇందులో తన మనసులోని మాటను స్పష్టంగా చెప్పడం
వలన ఇది అభిధీయమానహృద్యప్రశ్నోత్తరి అగుచున్నది.

అష్టారచక్రబంధం


అష్టారచక్రబంధం




సాహితీమిత్రులారా!

చక్రబంధంలో 6 ఆకులుండే బంధాలను చూచాము
ఇక్కడ ఎనిమిది ఆకులున్న బంధాన్ని అష్టారచక్రబంధం
అంటాము దాన్ని చూద్దాం-

లక్ష్మీసహస్రంలోని ఈ బంధం చూడండి- ఇందులో
ఎనిమిది ఆకులలోని1,3,6,8 గడులలోని అక్షరాలను
వరుసగా కలుపగా గ్రంథకర్త పేరు, అనువాదకర్త పేరు,
గోత్ర నామ గుణ ప్రార్థనలను తెలిపే మరో పద్యంకూడ
ఉద్దారం చేయవచ్చు.

శార్దూలం-
ఆదిధ్యేయ రమా ప్రశాసః మహిజాతా భాగ్యదాయామ శ్రీ
యాదేయున్, హృదయాలయున్, శమములన్ బ్రారబ్ధమున్ జించుశ్రీ
త్రేదున్, వేంకటపాదుఁ బ్రోవు, మహిరాట్చ్రీద్వారు వే శర్మ మా
యాదా కట్ కట యీభవంబు మటుమాయన్ జార్చి కర్మన్ ననున్

దీన్నుండి ఉద్దారమయ్యే పద్యం-
విద్యున్మాల-
ఆ యాత్రేయశ్రీశ్రీ మానున్
ధ్యేయున్ వేంకట్ యాజిం శర్మన్
మాయాపాయీ భారద్వాజా
శాయున్ బ్రోవన్ జాలన్ రా మా

బంధం చూడండి-
పద్యం చూస్తూ బంధం చదవండి
ఇందులో 1,2,3,4 ఇలా సంఖ్యలు
చూచించ బడ్డాయి వాటిని గమనించండి-



Monday, May 29, 2017

అచలజిహ్వ కందము


అచలజిహ్వ కందము




సాహితీమిత్రులారా!


పెదిమలుమాత్రమే తగులుతూ పలికే
అక్షరాలు ఓష్ఠ్యాలు వీటితో
వాసవదత్తా పరిణయంలోని ఈ పద్యం వ్రాయబడింది
ఇది పెదిమలు తగలడంతో మాత్రమే పలుకవచ్చు
కాని దీన్ని పలికేప్పుడు నాలుకకదలదు గమనించండి
అందుకే దీన్ని అచలజిహ్వ కందము అన్నారు.
ఇందులో ప,ఫ,బ,భ,మ - అనే అయిదింటిని మాత్రమే
వాడి కూర్చారు.

మాపై పాపము ముప్పే
బాపుముమైమొప్పుపమ్మి ప్రభమింపుంబే
మీపైప్రేమంబేపై
ప్రాపైపెంపొప్ప మమ్ముఁ బంపుము భీమా
                                                   (వాసవదత్తా పరిణయము - 4 80)

ఈ పద్యం చదివి గమనించండి.

ఫణిపతి తల్పంబుపైన భానుడు గ్రుంకెన్


ఫణిపతి తల్పంబుపైన భానుడు గ్రుంకెన్




సాహితీమిత్రులారా!



సమస్య -
ఫణిపతి తల్పంబుపైన భానుడు గ్రుంకెన్


విద్వాన్ వి.యమ్.భాస్కరరాజుగారి పూరణ-

మణిమయ భూషణుఁడై హరి
తనరగ శ్రీదేవిఁగూడి ధన్యతఁ గడిపెన్
అనయము సాయపువేళన్
ఫణిపతి తల్పంబుపైన - భానుడు గ్రుంకెన్

ఇందులో ఫణిపతి తల్పముపై భానుడు గ్రుంకడము
అబ్బురమేకదా భానుడు పడమటి దిక్కున క్రుంకవలెకదా
దీనికి కవిగారు రెండుగా విరిచి సందర్భశుద్ధిగా పూరించాడు.


మీరు మరోవిధంగా పూరించి పంపగలరు.

Sunday, May 28, 2017

షష్ఠార చక్ర బంధము


షష్ఠార చక్ర బంధము




సాహితీమిత్రులారా!

చక్రబంధములో ఆరు అకులు గల చక్రబంధాన్ని
షష్ఠార చక్రబంధము అంటారు.
కవిపేరును,  గ్రంథము పేరును చక్రములోని
3,6 గడులలోకూర్చుదురు.
ఈ చక్రబంధము లక్ష్మీసహస్రములోనిది.


నిత్యావేక్షణకర్మరక్ష హరిరాజ్ఞీ సర్వదాశస్త మా
స్తుత్యంక మ్మిది మంగళావహము దాసో2హం సుశర్మప్రభా
భృత్యాటశ్రమాలాస్యసంగహరణా విస్రంభమూల ప్రమా
మా త్యాగానిశ నిస్తులప్రభృతధామా విష్ణుభామా రమా

ఈ పద్యాన్ని బంధరూపంలో చూడండి-
1వపాదము 1 అన్న నిలువులోను
2వ పాదము 2 అన్న నిలువులోను
3వ పాదము 3 అన్న నిలువులోను
చూడవచ్చును 4 వపాదము 6వ సంఖ్య
దగ్గరనుండి వృత్తాకారంలో చదివిన వచ్చును.
దీనిలో3,6 గడులను కలిపిన వచ్చు
అక్షరాలను కలుపగా
వేంకటశర్మలకమలాసహస్రము
అని వచ్చును.




ముక్తపదగ్రస్తఘటిత మధ్యవృత్తము


ముక్తపదగ్రస్తఘటిత మధ్యవృత్తము




సాహితీమిత్రులారా!



శబ్దాలంకారాలలో ముక్తపదగ్రస్తము ఒకటి.
విడిచినపదమును మళ్ళీ తీసుకోవడం
అనే దాన్ని ముక్తపదగ్రస్తము అంటాము
ఉదాహరణ చూడండి-

పద్యం మధ్యలో ముక్తపదగ్రస్తము రావడం
ఈ ఉదాహరణలో చూడవచ్చు-

దులదులమించు కన్దొగలతోఁ గల తోరపుచందుమోముతో
దుల ఫణిగాఁగ మించు జడతోజడతో రుప క్రమంబుతోఁ
దొలఁకెడు వీక్షణాంచ దళితో దళతోడు నఖప్రభాళితో
తొలగకఁ గొల్చు కోపనలతో నలతొయ్యలి చాల లోలయై
                                                       (ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము - 446)

ఇందులో ముక్తపదగ్రస్తము మధ్యలో కలదు గమనించండి-

దులదులమించు కన్దొగలతోఁ గల తోరపుచందుమోముతో
దుల ఫణిగాఁగ మించు జడతోజడతో రుప క్రమంబుతోఁ
దొలఁకెడు వీక్షణాంచ దళితో దళతోడు నఖప్రభాళితో
తొలగకఁ గొల్చు కోపనలతో నలతొయ్యలి చాల లోలయై

Saturday, May 27, 2017

భాషాగోపన చిత్రం


భాషాగోపన చిత్రం




సాహితీమిత్రులారా!

మనం సాధారణంగా ఒక పద్యం
మొదటి నుండి చదివినా
చివర నుండి చదివినా ఒకే విధంగా ఉన్నవి
ఒకే భాషలో ఉన్నవి గమనించాము.
ఇక్కడ మరో విధమైన చిత్రం ఏమిటంటే
పద్యం మొదటినుండి చదివిన తెలుగు భాషగాను
చివరనుండి చదివిన సంస్కృతభాషగాను అర్థం
ఇచ్చే పద్యం చూద్దాం.
దీన్ని మన తెలుగుకవి
పింగళిసూరన 
కళాపూర్ణోదయములో
కూర్చారు గమనించండి-

తా వినువారికి సరవిగ
భావనతో నానునతివిభావిసు తేజా
దేవరగౌరవమహిమన
మావలసినకవిత మరిగి మాకు నధీశా
       (కళాపూర్ణోదయము - 6- 172)

మొదటి నుండి తెలుగుపద్యం
చివర నుండి సంస్కృత పద్యం
అర్థం -
తెలుగు పద్యం -
అతివిభావిసుతేజా - మిక్కిలి ప్రకాశించు పరాక్రమంగల,
అధీశా - మహారాజా,
దేవరగౌరవమహిమన - మీ ఘనత యొక్క మహిమచేతనే,
మావలసినకవిత - మా ప్రియమైన కవిత్వం,
తాన్ - అది,
వినువారికి
సరవిగన్ - యుక్తముగా,
భావనతోన్ - వినువారు సముచితముగా ఉన్నదని అనుకునేట్లు,
మాకు 
మరగి - అలవడి, అనున్ - కనిపించును.

రాజేంద్రా మే మాశ్రయించిన మీ మహత్వం వల్లనే
శ్రోతలకు ఆనందదాయకమైన కవిత్వం మాకు అబ్బినది - భావం

సంస్కృత పద్యం(తలకిందుగా)
ఇన - రాజా,
ఆగిరి - పర్వతములు ఉన్నంతకాలము,
కుమ్ - భూమిని,
శాధి - శాసింపుము,
మత - సర్వసమ్మతుడా,
వికనసి -  మిక్కిలి ప్రసిద్ధిచే విరాజిల్లుచున్నావు,
లవమాన - లవుని మానమువంటి మానము గలిగిన,
నను - ఓయీభూవరా
మహిమవరగౌరవదే - గొప్పతనముచే శ్రేష్ఠమైన గౌరము నిచ్చునట్టి,
సువిభౌ - మంచిరాజు,
ఇతి - ఈ విధంగా,
జాతే - కలిగియుండగా,
నా పండితుడైన, మనుష్యుడు
అతః - ఇట్టి గౌరవమువల్ల, నవభాః - క్రొత్తవికాసము గలవాడై,
రసకిరి - రసము చిమ్మునట్టి,
గవి - భాషయందు,
అనువితా వా - స్తుతింపనివాడగునా
             తప్పక నుతించువాడగును అని అర్థం.

రాజాదరము వల్ల, కవిత్వము నవనవోన్మేషమై విలసిల్లుననుచు
తన ఈ కవిత్వ సంపదకు రాజుగారి ఆదరమే కారణఅని సూచించెను-
అని భావం.


సర్వగురు వచనము


సర్వగురు వచనము




సాహితీమిత్రులారా!


సర్వ లఘువులుగాని
సర్వగురువులుగాని
వ్రాయడం కొంత కష్టంతో కూడినది.
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలోని
సర్వగురు వచనాన్ని చూడండి-
ఇందులో అన్నీ గురువులే లఘువులులేవు అని
గ్రహించగలరు. చూడండి-

ఆవేశం దాశ్చర్యారూఢాత్మాం భోజాతోద్యత్కందర్పాటోపస్ఫాయన్నా
రాచస్తోమ శ్రేష్ఠోద్బోధాదీనాం 
చ ద్చోధానైపుణ్య ప్రౌఢి 
శ్రీ నారీరత్నం బిట్లూహించెన్   (447)

చూచారుకదా ఇందులో ఏవైనా
లఘువులున్నాయేమో గమనించండి.

Friday, May 26, 2017

షట్చక్రవర్తి షోడశరాజనామాభిరామ ప్రాసభేద భాసమానవృత్తము


షట్చక్రవర్తి షోడశరాజనామాభిరామ 
ప్రాసభేద భాసమానవృత్తము



సాహితీమిత్రులారా!



ప్రబంధరాజ వేంకటేశ్వర 
విజయవిలాసములోని
ఈ పద్యం చూడండి-
ఇందులో షట్చక్రవర్తుల పేర్లు,
షోడశమహారాజుల పేర్లతో పాటు
ప్రాస భేదంతో కూర్చబడిన పద్యం.


పృథువిఁ బూరూరవు స్సగరు హైహయజున్ బురుకుత్సుఁ జంద్రమ
త్యధిపు నలుం దిలీపు యవనాశ్వభవుం భరతున్ గయు న్భగీ
రథుని మరు త్తనంగు శిబి రాము సుహోత్రుని నంబరీషునిం
బృథుని యయాతి రంతి శశిబిందుని భార్గవు మించవే హరీ!

భూమిమీద షట్చక్రవర్తులను, షోడశమహారాజులను
మించవయా ఓ హరీ  అని భావం.

ఈ పద్యంలో షట్చక్రవర్తులను గమనించండి-
పృథువిఁ బూరూరవు స్సగరు హైహయజున్ బురుకుత్సుఁ జంద్రమ
త్యధిపు నలుం దిలీపు యవనాశ్వభవుం భరతున్ గయు న్భగీ
రథుని మరు త్తనంగు శిబి రాము సుహోత్రుని నంబరీషునిం
బృథుని యయాతి రంతి శశిబిందుని భార్గవు మించవే హరీ!

హైహయజున్= కార్తవీర్యార్జునుడు
జంద్రమత్యధిపు = హరిశ్చంద్రుడు
షట్చక్రవర్తులు-
హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు,
పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు.


షోడశమహారాజులను గమనించండి-

పృథువిఁ బూరూరవు స్సగరు హైహయజున్ బురుకుత్సుఁ జంద్రమ
త్యధిపు నలుం దిలీపు యవనాశ్వభవుం భరతున్ గయు న్భగీ
రథుని మరు త్తనంగు శిబి రాము సుహోత్రుని నంబరీషునిం
బృథుని యయాతి రంతి శశిబిందుని భార్గవు మించవే హరీ!
షోడశమహారాజులు-
గయుడు, అంబరీషుడు, శశిబిందువు,
అంగుడు, పృథువు, మరుతి, సుహోత్రుడు,
పరశురాముడు, శ్రీరాముడు, భరతుడు, దిలీపుడు,
భృగుడు, రంతిదేవుడు, యయాతి, మాంధాత,
భగీరథుడు

ఈ పద్యంలో ప్రాసలో -కారము మొదటి,మూడవ, నాలుగవ పాదాల్లో ఉంది కాని రెండవపాదంలో - కారము ప్రయోగించబడినది- గమనించగలరు.

పృథువిఁ బూరూరవు స్సగరు హైహయజున్ బురుకుత్సుఁ జంద్రమ
త్యధిపు నలుం దిలీపు యవనాశ్వభవుం భరతున్ గయు న్భగీ
థుని మరు త్తనంగు శిబి రాము సుహోత్రుని నంబరీషునిం
బృథుని యయాతి రంతి శశిబిందుని భార్గవు మించవే హరీ!

కందద్వయగర్భిత భాస్కరవిలసితవృత్తము ముద్రాలంకారము


కందద్వయగర్భిత భాస్కరవిలసితవృత్తము ముద్రాలంకారము




సాహితీమిత్రులారా!



ఈ పద్యం శీర్షికే ఎంత పెద్దగా ఉందోకదా
ఇది ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము
లోనిది(825)-
ఇందులో భాస్కరవృత్తములో
రెండు కందపద్యాలు ఇమిడి ఉన్నాయి
మరియు ఈ పద్యం ముద్రాలంకారంలో ఉంది.

భాస్కరవిలసిత వృత్తము-
పంకజదళ నిభలోచన శంకాభావ మునిహృదయ సతత విహారా
కుంకుమమృగమద సాంకవ పంకోరస్థలకృతపద వననిధి కన్యా
లంకృత మణిగణభూషణయం కీకృత మృదుగతి మరుద సితశరీరా
వేంకటగిరివర రుచ్యకలంకా భాస్కరవిలసిత లగదరిహస్తా

ఇందులో గర్భితమైన మొదటికందము-

పంకజదళ నిభలోచన శంకాభావ మునిహృదయ సతత విహారా
కుంకుమమృగమద సాంకవ పంకోరస్థలకృతపద వననిధి కన్యా
లంకృత మణిగణభూషణయం కీకృత మృదుగతి మరుద సితశరీరా
వేంకటగిరివర రుచ్యకలంకా భాస్కరవిలసిత లగదరిహస్తా


పంకజదళ నిభలోచన 
శంకాభావ మునిహృదయ సతత విహారా
కుంకుమమృగమద సాంకవ 
పంకోరస్థలకృతపద వననిధి కన్యా

రెండవ గర్భిత కందము-
పంకజదళ నిభలోచన శంకాభావ మునిహృదయ సతత విహారా
కుంకుమమృగమద సాంకవ పంకోరస్థలకృతపద వననిధి కన్యా
లంకృత మణిగణభూషణయం కీకృత మృదుగతి మరుద సితశరీరా
వేంకటగిరివర రుచ్యకలంకా భాస్కరవిలసిత లగదరిహస్తా


లంకృత మణిగణభూషణ
యం కీకృత మృదుగతి మరుద సితశరీరా
వేంకటగిరివర రుచ్యక
లంకా భాస్కరవిలసిత లగదరిహస్తా

ఈ వృత్తముపేరు భాస్కరవిలసితము అని
పద్యంలో రావడం వల్ల ఇది
ముద్రాలంకారమౌతుంది.
పంకజదళ నిభలోచన శంకాభావ మునిహృదయ సతత విహారా
కుంకుమమృగమద సాంకవ పంకోరస్థలకృతపద వననిధి కన్యా
లంకృత మణిగణభూషణయం కీకృత మృదుగతి మరుద సితశరీరా
వేంకటగిరివర రుచ్యకలంకా భాస్కరవిలసిత లగదరిహస్తా

ఇందులో గర్భిత పద్యాలున్నాయి 
కావున ఇది గర్భచిత్రము.
మరియు శబ్దాలంకారమైన
ముద్రాలంకారమున్నందున
ఇది శబ్దాలంకార చిత్రము
అవుతున్నది.
రెండు చిత్రములిందులో ఉన్నందున

ఇది మిశ్రమ చిత్రమవుతుంది

Thursday, May 25, 2017

వర్గపంచకరహిత సుగంధి వృత్తము


వర్గపంచకరహిత సుగంధి వృత్తము




సాహితీమిత్రులారా!



క,చ,ట,త,ప - అనే వర్గముల
అక్షరములు లేకుండా వ్రాయబడిన
పద్యం ఇది- అంటే ఇందులో
క-మొదలు, మ-వరకుగల అక్షరాలే
ఉండవు గమనించండి-

సుగంధి వృత్తము-
హార, హీర, సారసారి, హారశైల, వాసవో
ర్వీరుహా, హిహార, శేషవేషహాసలాలస
శ్రీరసోరుయాశసాంశుశీలవైరివీర సం
హార సారశౌర్యసూర్యహర్యవార్యసాహసా


(హీరము - మణి, సారసారి - చంద్రుడు,
హారశైలము - కైలాసము, అహిహారుడు - శివుడు,
యాశసాంశశుశీల - కీర్తికాంతులచే ఒప్పువాడా,
సూర్యహర్యవార్యసాహసా - సూర్యుని గుర్రాలచేతను
వారింపరాని(చొఱవగల)సాహసముగలవాడా.)

చూచారుకదా ఇందులో క మొదలు మ వరకు
ఉన్న వాటిలో ఒక అక్షరమైనా ఉందా లేదుకదా
అందుకే దీనికి వర్గపంచకరహిత పద్యమంటారు. 

మూగబిరాన పాడె నవమోహనమంజులకృష్ణగీతికల్


మూగబిరాన పాడె నవమోహనమంజులకృష్ణగీతికల్




సాహితీమిత్రులారా!





సమస్య-
మూగబిరాన పాడె నవమోహనమంజులకృష్ణగీతికల్


విద్వాన్ వి.యమ్. భాస్కరరాజు గారి పూరణ-

రాగమనోజ్ఞమూర్తియయి రాధ-మనోహరువేణుగానముల్
ఏగతి విందునో అనుచు-హేధవ మాధవ యంచు ప్రార్థనల్
వేగమె చేయ- కృష్ణుడును వేణువునూదగ-రాధ సంతస
మ్మూగ, బిరాన పాడె నవమోహనమంజులకృష్ణగీతికల్

ఈ సమస్యలో మూగవాడు పాడినట్లు చెప్పబడింది
ఎలా సాధ్యం. అంటే మూగ కాదు, సంతసమ్మూగ
అని మార్చడంతో సమస్య రసవంతంగా మారింది.

మీరును మరో విధంగా పూరించి పంపగలరు.


Wednesday, May 24, 2017

ఏక ద్వి త్రి చతుః పంచ షట్సప్తష్టాక్షర క్రమపాద సీసము


ఏక ద్వి త్రి చతుః పంచ షట్సప్తష్టాక్షర క్రమపాద సీసము




సాహితీమిత్రులారా!




ఏకాక్షరి, ద్వ్యక్షరి, త్య్రక్షరి ఇలా చూసి ఉన్నారు.
కానీ ఇప్పుడు ఈ సీసంలో ఒక అక్షంతో ఒక పాదం,
రెండక్షరాలతో రెండవపాదం, మూడక్షరాలతో
మూడవ పాదం, నాలుగక్షరాలతో నాలుగపాదం,
ఐదక్షరాలతో ఐదవపాదం, ఇలా కూర్చటం జరిగింది
గమనించండి

రారార రారర రూరూర రేరార
         రేరార రీరర రూరరార 
భాభీరు భీభర భారభేరీరేభి
         భూరిభాభాభీ భూభూ భరాభ
నలినీ నివనైక లలనాకళానూన
         లాలనలోలా కళంక లీల 
దరదారి దర ధర కరదదాదోదర
         దార కాదర కరోదారవరద 
గోపబాలక పాలక పాపలోప 
సాలక విలాస వేంకటశైలవాస
భవ్యభాస భవాకారదివ్యరూప
రాధికాస్పుటదిక్కరి కాధరాంగ
                                (ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము - 878)


1వ పాదము-       1- అక్షరం-
రెండవపాదం- రెండక్షరాలు - ,
మూడవపాదం - 3 అక్షరాలు-క,,
నాలుగవ పాదం- 4 అక్షరాలు - క,,,
ఐదవపాదం-  5 అక్షరాలు - క,,ప,,ల
ఆరవపాదం -  6 అక్షరాలు - క,,ల,,శ.
ఏడవపాదం-  7 అక్షరాలు - క,,భ,,ప,,య
ఎనిమిదవపాదం- 8 అక్షరములు - క,,ట,,ధ,,స,
ఈ విధంగా కూర్చబడినది

సంవత్సరయుక్త సీసము


సంవత్సరయుక్త సీసము




సాహితీమిత్రులారా!


ఈ సీసపద్యం గణపవరపు వేంకటకవి కృత
ప్రబంధరాజ వేంకటేశ్వరవిజయవిలాసములోనిది.

శ్రీముఖప్రభవ సుస్మేరాభకౌస్తుభ
        సర్వజిద్విక్రమ చక్రహస్త
సౌమ్య భావ మునీంద్ర సన్మనోంబుజ భృంగ
        యవ్యయానంద హృద్భవ్యరూప
ధాత్ర సాధారణస్తమనీయ నిజచర్య
        విభవప్రమోదాప్త విబుధనాథ
జయదుందుభిధ్వాన చకితాసురాధ్యక్ష
        దుర్మతి రాక్షసశర్మహరణ
చిత్రభాను స్వభాను జిత్సిద్ధతేజ
విజయనందన ఖరసూత విధివినోద
మన్మథ క్రోధి ధర్మనిర్మధనసార
వృషగిరీశ్వర సంకాశ వేంకటేశ   - (389)

ఇందులో అనేక పదాలు సంవత్సరాలకు
సంబంధించినవి కావున దీనికి సంవత్సర
యుక్తసీసమని పేరు.
ఇందులోని సంవత్సరాలు-

శ్రీముఖప్రభవ సుస్మేరాభకౌస్తుభ
        సర్వజిద్విక్రమ చక్రహస్త
సౌమ్య భావ మునీంద్ర సన్మనోంబుజ భృంగ
        యవ్యయానంద హృద్భవ్యరూప
ధాత్ర సాధారణస్తమనీయ నిజచర్య
        విభవప్రమోదాప్త విబుధనాథ
జయదుందుభిధ్వాన చకితాసురాధ్యక్ష
        దుర్మతి రాక్షసశర్మహరణ
చిత్రభాను స్వభాను జిత్సిద్ధతేజ
విజయనందన ఖరసూత విధివినోద
మన్మథ క్రోధి ధర్మనిర్మధనసార
వృషగిరీశ్వర సంకాశ వేంకటేశ

Tuesday, May 23, 2017

ద్విపాది


ద్విపాది




సాహితీమిత్రులారా!



ఒక శ్లోకం/ పద్యంలో ఏరెండు పాదాలు
సమానంగా ఉన్న దాన్ని ద్విపాది అంటారు.
దీనికే సముద్గతయమకము అనికూడ అంటారు.
భారవి కృత కిరాతార్జునీయమ్ లోని ఈ శ్లోకం
చూడండి-

స్యందనా నో చతురగాః 
సురేభా వావిపత్తయః
స్యందనా నో చ తురగాః
సురేభా వా విపత్తయః

ఈ ముని వద్ద వేగంగా పరుగెత్తే రథాలుగాని,
మంచినడకగల్గిన గుర్రాలుగానీ, బాగాఘీంకరించే
దేవగజాలుగాని, ఏ విఘ్నాలులేని పదాతి దళాలుగాని
లేవు. అందువల్ల భయపడాల్సిన పనేలేదు.
చతురంగబలలాల్లో ఏ ఒక్కటీ లేనపుడు భయమెందుకు
- అని భావం

ఇందులో 1,3 పాదాలు, 2,4 పాదాలు
సమానంగా ఉన్నవి కావున ఇది
ద్విపాది అగుచున్నది.
అలాగే పూర్వ ఉత్తర భాగాల్లోని
విశేషణ- విశేష్యాలకు, ఉద్దేశ ఉద్దేశ్యీ
భూతాలైన వానిని యథాసంఖ్యంగా
కూర్చటం జరిగింది కావున దీనికి
సముద్గతయమకమని పేరు.



Monday, May 22, 2017

శుద్ధాంధ్ర గోమూత్రికాబంధము


శుద్ధాంధ్ర గోమూత్రికాబంధము




సాహితీమిత్రులారా!

శుద్ధాంధ్రము ఒక చిత్రమైతే
అందులో బోమూత్రికాబంధము కావడంతో
ఇది మిశ్రమ చిత్రము అవుతుంది.

శేషధర్మలోని ఈ పద్యం చూడండి
ఇది పూర్తిగా ఆంధ్రములో వ్రాయబడినది-

పులితోలుం బలుమేలుం
దలపై విన్నేటిజాలుదగునలవేల్పా
తెలిడాలుం నలుగేలుం
దలమౌ విల్మేటివాలుదగునెలదాల్పా
                                                 (శేషధర్మము 5ఆశ్వాసము)

దీనికి గోమూత్రికాబంధమును చూడండి

పులితోలుంలుమేలుం పై విన్నేటిజాలుగువేల్పా
తెలిడాలుం లుగేలుం మౌ విల్మేటివాలుగునెదాల్పా


పు    తో       బ     మే       ద    పై       న్నే   జా  ద   న     వే
    ↘↗       ↘↗    ↘↗    ↘↗     ↘↗   ↘↗      ↘↗   ↘↗  ↘↗   ↘↗   ↘
   లి    లుం    లు   లుం    ల       వి      టి    లు  గు  ల      ల్పా
  ↗  ↘    ↗  ↘     ↗  ↘    ↗  ↘    ↗  ↘   ↗ ↘   ↗  ↘   ↗  ↘ ↗↘   ↗ 
తె    డా      న      గే         ద    మౌ     ల్మే  వా   ద    నె     దా



ద్వ్యక్షరి కందము


ద్వ్యక్షరి కందము




సాహితీమిత్రులారా!


రెండు వ్యంజనాలతో కందము కూర్చడం
ఇందులో ఏ అచ్చై(స్వరమై)నా ఉండవచ్చును.
ఈ విధంగా కూర్చిన కంద పద్యాన్ని
ద్వ్యక్షర కందము అంటారు.

ఇక్కడ కొన్ని గ్రంథాలలోని ద్వ్యక్షరులు చూద్దాం.

కాకలికాకలకలకల
కోకిలకులలీలకలులకులుకులకలుకే
కైకోకుకేలికొలఁకుల
కో కాలీకేలికులికికొంకకుకలికీ
                                                               (వరాహపురాణము11-69)
ఇందులో క,ల - అను వ్యంజనాలను మాత్రమే
ఉపయోగించి కూర్చారు.

వేదవదావదవాదవి
వేదేదేవాదిదేవవిద్వద్వేదీ
వాదీదేవీదేవవి
వేదేవేదుద్దుదిద్దవేవేదావే
                                  (వాసవదత్తాపరిణయము -4-79)
ఇందులో వ, ద, అనే వ్యంజనాలను
ఉపయోగించి కూర్చారు.

నానెమ్మనమునుమానీ
మాననిమౌనమునమననుమన్నననన్నో
మానిని నీమనముననను
మానము మానమునుమానిమనమునునెమ్మిన్
                                                                 (కళాపూర్ణోదయము -7-219)

ఇందులో న,మ - అను వ్యంజనములను కూర్చి
పద్యం వ్రాయబడింది.


ఈ విధంగా చాల ద్వ్యక్షరి కందములను చూడవచ్చు.

Sunday, May 21, 2017

కామిని కుచమధ్యమందు గరుడుండాడెన్


కామిని కుచమధ్యమందు గరుడుండాడెన్




సాహితీమిత్రులారా!


సమస్య-
కామిని కుచమధ్యమందు గరుడుండాడెన్


పూర్వకవి పూరణ-

చేమంతి చెట్టుకిందను
భామామణి నిదుర బోవఁ బయ్యెదజాఱన్
రోమాళి పామో యని
కామిని కుచమధ్యమందు గరుడుండాడెన్

కుచముల మధ్య గరుడుడు ఆడటం సమంజసంకాదు
దాన్ని రోమాళి పామనుకోవడంతో సమంజసం చేసినాడుకవి.


మీరును మరోవిధంగా పూరించి పంపగలరు

దీని పేరు నెద్దియొ చెపుమా


దీని పేరు నెద్దియొ చెపుమా




సాహితీమిత్రులారా!


పొడుపు పద్యం చూడండి
విప్పగలరేమో

వృక్షము మూఁడక్షరములు
తక్షణమున మధ్యగురువు తగ్గించినచో
నక్షయము వర్తమానము
నీక్షించును దీనిపేరు నెద్దియొ చెపుమా

ఇది మూడక్షరాలుగల చెట్టట,
దీనిలోని మధ్యగురువును తగ్గించిన
అంటే తీసివేస్తే ప్రస్తుతమని అర్థం వస్తుందట
మరి దీని పేరేదో చెప్పమంటున్నాడు కవి-
చూడండిమరి.

సమాధానం - నేరేడు
ఇందులో మూడక్షరాలున్నాయి.
మధ్యగురువు తీసివేస్తే - నేడు
అంటే ప్రస్తుతమనేగా
సరిపోయింది కదా సమాధానం.

Saturday, May 20, 2017

పాదగోపనము


పాదగోపనము




సాహితీమిత్రులారా!


కిరాతార్జునీయంలోని
పాదగోపనము చూడండి-

ద్యువియద్గామినీ తార
సంరావ విహత శ్రుతిః
హైమీషుమాలా శుశుభే

దీనిలో నాలుగవపాదం గోపనమైనది
దీనిలో బాగా గమనించినట్లయిన
మొదటి రెండుపాదాలలోనే
నాలుగవపాదం గోపనం చేశారు

ద్యువియద్గామినీ తా
సంరా విత శ్రుతిః
హైమీషుమాలా శుశుభే

ఆ అక్షరాలను గుర్తించి వ్రాయగా
విద్యుతామివసంహతి - అనే పాదం
బహిర్గతమౌతుంది.

ద్యువియద్గామినీ తా
సంరా విత శ్రుతిః
హైమీషుమాలా శుశుభే
విద్యుతామివసంహతి

శివుని స్వర్ణమయాలైన బాణాల పంక్తులు
స్వర్గ అంతరిక్షాలలో సంచరించగలవి,
తమస్వరంతో కర్ణకుహరాలను ఛేదించగలవై
విద్యుత్ సమూహంతో సమానంగా వెలుగొందాయి-
అని భావం.

ప్రతిలోమానులోమ శ్లోకము


ప్రతిలోమానులోమ శ్లోకము




సాహితీమిత్రులారా!



ప్రతిలోమానులోమ శ్లోకము అంటే
మొదటి, మూడవ పాదాలు అనులోమంగాను
రెండవ, నాలుగవ పాదాలు ప్రతిలోమంగాను
కూర్చబడిన శ్లోకం.

ఉదాహరణగా కిరాతార్జునీయంలోని
ఈ శ్లోకం  చూడండి-

నను హో మథనా రాఘో
ఘోరా నాథమహో ను న
తయదాతవదా భీమా
మాభీదా బత దాయత

ఈ శ్లోకం అర్జునుని ధాటికి తట్టుకోలేక
ఫలాయనం చిత్తగించిన సైన్యానికి
కుమారస్వామి ధైర్యం చెప్పే శ్లోకాలలోని
ఒకటి -
ఓ సైనికులారా వినండి. మీరు భయంకరులైన
శత్రువులను భయపెట్టేవారు. సమర్థులు.
శత్రువు విషయంలో క్రూరులు. ప్రభుభక్తి కలవారు.
రక్షకులు. మంచి ఆచరణకలవారు. వక్తలుకూడా.
శరణాగతులకు, అభయమివ్వగలవారు.
మీ పరిశుద్ధి అందరికీ తెలుసు - అని భావం.

ఈ శ్లోకంలో 1,3 పాదాలను
విలోమంగా వ్రాయగా
2,4 నాలుగుపాదాలు ఏర్పడతాయి
గమనించండి.

నను హో మథనా రాఘో
ఘోరా నాథమహో ను న
తయదాతవదా భీమా
మాభీదా బత దాయత

మూడవ పాదంలోని వదా అనేది
నాలుగవపాదంలో దావ అని రావాలి
కానీ దా బ అని వచ్చింది. దీనికి
కారణం సంస్కృతంలో -కును,
-కును భేదములేదు.


Friday, May 19, 2017

అష్టదళ పద్మ బంధము


అష్టదళ పద్మ బంధము



సాహితీమిత్రులారా!

ఆంధ్ర లక్ష్మీసహస్రంలోని
అష్టదళ పద్మ బంధము
చూడండి -
ఇందులో కవిపేరు
గోపనము చేశారు-

స్రగ్ధరావృత్తము-

మాతా రమ్యాక్షి రమ్మామరగగఁగర మంబా ఘృణద్దేవతా మా
మాతా వద్దేది నా కామరదద దర మమ్మా చరిత్రావ్రతీ మా
మాతీవ్రత్రా యనంగా మహితతతహిమ మ్మాద రమ్మా రతో మా
మాతోరమ్మా ఘనుండంబ్రరమ మమరబ్రహ్మాండగమ్యా రతామా

దీన్ని అష్టదళ పద్మ బంధముగా గీయగా
ఈ క్రింది విధంగా వస్తుంది.





































ఇందులో దళముల అగ్రములందు గల
అక్షరములను కలుపగా-
రఘునాధనందనుండ అని వస్తుంది
దీన్ని రఘునాథుడు సంస్కృతంలో
వ్రాయగా అనువాదకర్త ఆయనకుమారునిగా
భావించి రఘునాధనందనుడని చెప్పికొన్నాడు.
ఇందులో పద్మము మధ్యలో మా - అనే అక్షరం
ఉంటుంది. ఈ పద్యం ప్రతిపాదంలో చివరి
నాలుగక్షరములు తరువాతి పాదం మొదటిలో వస్తుంది
చిరిపాదం నాలుగక్షరాలు మొదటిపాదం మొదట్లో వచ్చాయి.

మాతా రమ్యాక్షి రమ్మామరగగఁగర మంబా ఘృణద్దేవతా మా
మాతా వద్దేది నా కామరదద దర మమ్మా చరిత్రావ్రతీ మా
మాతీవ్రత్రా యనంగా మహితతతహిమ మ్మాద రమ్మా రతో మా
మాతోరమ్మా ఘనుండంబ్రరమ మమరబ్రహ్మాండగమ్యా రతామా

చదువవలసిన విధానము-
మధ్యలోని మా - తో ప్రారంభించి పైకి అక్షరములు
కలుపుకొంటూ చివరికి చేరిన తరువాత దిగువ అక్షరాలను
కలుపుకోవాలి కుడివైపుకు దిగుచూ చివరి అక్షరాన్ని
మూడుమార్లు కలుపుకొని క్రిందికి దిగి మధ్యలోని మా -
కలుపుకోవాలి.
పద్యం చూస్తూ బంధం చదివితే విషయం పూర్తిగా
అవగతమౌతుంది.

కవనమా భువనమా నవనమా


కవనమా భువనమా నవనమా




సాహితీమిత్రులారా!



గణపవరపు వేంకటకవి
తనను గురించి
ప్రబంధరాజ వేంకటేశ్వర
విజయవిలాసములో చెప్పిన సీసము-
దీనికి కవిగారు పెట్టిన పేరు-
ప్రతిచరణ త్రిస్తబక యమకైకనియమ భాసమాన సీసము
ఈ సీసపద్యంలో ప్రతి చరణంలో మూడు అక్షరాల గుత్తి
యమకనియమంతో వెలుగుతూందట చూడండి-

కవనమా భువనమా నవనమా నయహారి
                    నయహారి భయకారి జయము దయము
లవనమా యవనమా నవనమా నలభాతి
                   నలభాతి కలరీతి నానుమేను
భవనమా సవనమా న్యవనమా యవికాసి
                  యవికాసి పవిభాసి నదము మదము
జవనమా పవనమా నవనమా సుకృతిత
                  సుకృతితత్వకృతి విత్సుగతి జగతి
వదన మామద మాతుల సదన మనుచు
ననుచు ఘనులెంచి పొగడఁగ వినుచుఁ గవుల
మనుచు దయమీఱ నప్పయార్యునికుమార
లక్షణకవి వేంకటమంత్రి లలితతంత్రి

ఇందులోని త్రిస్తబక యమక నియమం-
వనమా భువనమా వనమా నయహారి
                    నయహారి భయకారి జయము దయము
వనమా వనమా వనమా నలభాతి
                   నలభాతి కలరీతి నానుమేను
వనమా వనమా న్యవనమా యవికాసి
                  యవికాసి పవిభాసి నదము మదము
వనమా వనమా వనమా సుకృతిత
                  సుకృతితత్వకృతి విత్సుగతి జగతి
వదన మామద మాతుల సదన మనుచు
ననుచు ఘనులెంచి పొగడఁగ వినుచుఁ గవుల
మనుచు దయమీఱ నప్పయార్యునికుమార
లక్షణకవి వేంకటమంత్రి లలితతంత్రి


Thursday, May 18, 2017

గోమూత్రికా బంధము


గోమూత్రికా బంధము



సాహితీమిత్రులారా!

కిరాతార్జునీయమ్ లోని
ఈ శ్లోకం చూడండి -
ఇది గోమూత్రికా బంధమునకు
సంబంధించినది-

నాసురోయం న వా నాగో
ధరసంస్థో న రాక్షసః
నా సుఖోయం నవాభోగో
ధరణిస్థో హి రాజసః

ఈ తపస్వి దానవుడో, నాగరోజో, రాక్షసుడోకాడు.
జయించ వీలయ్యో ఉత్సాహపురుషుడు. రజోగుణ
యుక్తుడైన మానవమాత్రుడు- అని భావం.

నా     రో          న       నా      ధ    సం      న         క్ష  
                   ↗      ↗                    ↗         
    సు      యం      వా     గో     ర        స్థో        రా          సః
       ↘           ↘     ↘        ↘       ↘     ↘    
నా     ఖో         న       భో      ధ    ణి        హి       జ

ఏకపాది


ఏకపాది


సాహితీమిత్రులారా!



ఒక పద్యం లేక శ్లోకంలో అన్ని పాదాలు
ఒకటిగా ఉంటే దాన్ని ఏకపాది అంటారు.
దీనిలోని పదములు ఆవృత్తి అయిన
మహాయమకము అని.,
చతుర్వ్యవసితయమకము 
కూడా అంటారు

భారవి   కిరాతార్జునీయమ్ లోనిది  ఈ  శ్లోకం
ఇందులో అన్ని పాదాలు ఒకేలా ఉన్నాయి.
కావున దీన్ని ఏకపాది అంటాము.
శ్లోకం చూడండి-

వికాశమీయుర్జగతీశమార్గణా
వికాశమీయుర్జగతీశమార్గణా:
వికాశమీయుర్జగతీశమార్గణా
వికాశమీయుర్జగతీశమార్గణా:
                             (కిరాతార్జునీయమ్ - 15- 52)

ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసే అర్జునుని
పరీక్షించ వచ్చిన కిరాతుని రూపంలో ఉన్న
శివునికి అర్జునునికి జరిగే పోరాటంలోని
విషయం తెలిపేదీ శ్లోకం-

అర్జునుని బాణాలు విస్తరిస్తుండగా
శివుని బాణాలు భంగమవుతున్నాయి.
రాక్షసులు చూచి శంకరుని బాణాలు కూడా
వ్యర్థమవుతున్నాయని ఆశ్చర్యం పొందగా,
ఋుషులు దేవతలు ఆకాశంలో చేరి భయంకరమైన
యుద్ధాన్ని చూడటానికి ఒకే చోటికి చేరారు - అని పద్య భావం.

దండి కావ్యాదర్శంలోనిది ఈ శ్లోకం

సమానయాసమానయా
సమానయాసమానయా
స మా న యాసమానయా
సమానయాసమానయా
                        (కావ్యాదర్శము 3-71)

హే అసమ = ఓ సాటిలేని స్నేహితుడా, స = అట్టి నీవు, మా = నన్ను,
సమాన-యాస-మానయా = సమానమైన ఆయాసముయొక్క
 ప్రమాణము కలదియు, సమానయా = మానముతో కూడినదియు,
అసమాన మా = సాటిలేనిదియు అగు, అనయా = ఈ నాయికతో,
సమానయ = కలుపుము. యా = ఏ నాయికతో,
అసమానయా = లక్ష్మీ నయములతో కూడినది కానిది,
న = కాదో, ఆమె లక్ష్మీ - నయములు గల నాయిక అగుటచే
ఉపేక్షింపదగినదికాదు అని భావము.

సరస్వతీకంఠాభరణములోని శ్లోకం-

సభాసమానా సహసాపరాగాత్
సభాసమానా సహసాపరాగాత్
సభాసమానా సహసాపరాగాత్
సభాసమానా సహసాపరాగాత్

కాంతితోడను, గౌరవముతోడను శత్రువిక్షేపముతోడను,
హాసముతోడను, రాగహీనత్వమును తినివేయుచున్నది.
ప్రకాశముతో శోభించుచున్నదై ఉండి మార్గశీర్షముచేత
పరాగకణములను పొందుచున్నది. శత్రువులను
సంహరించువారితో కూడినదై కాంతికి సరూపములైన
వానిని కలిగియున్నది. ఈ విధమైన అసమానమయిన
సభ ఒక కొండ నుండి ఆకస్మికముగా మరొకచోటికి
వెళ్ళిపోయినది - అని భావం.


నాట్యశాస్త్రంలోని ఈ శ్లోకం చూడండి.

వారణానామయమేవకాలో, 
వారణానామయమేవకాల:
వారణానామయమేవకాలో, 
వారణానామయమేవకాల:

(ఇది వారణపుష్పములు వికసించుటకు తగిన కాలము.
ఇది ఏనుగులు విజృంభించుటకు తగిన కాలము.
ఇది శత్రువులకు అనుకూలమైన కాలము.


ఇది యుద్ధములకు అనుకూలమైన కాలము.)

Wednesday, May 17, 2017

చతుర్ధపాదగూఢము


చతుర్ధపాదగూఢము




సాహితీమిత్రులారా!


పద్యం యొక్క ఒకపాదాన్ని గోపనము చేసి
పద్యాన్ని వ్రాయడం గూఢచిత్రంలోని
ఒక విభాగం. ఇందులో పద్యం మొదటిపాదం
నుండి మూడవ పాదం వరకు గల అక్షరాలలో
నాలుగవపాదం అక్షరాలను గోపనం చేస్తారు
ఇది చతుర్ధపాదగూఢము.
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము
లోని ఈ కందపద్యం ఉదాహరగా చూడండి-

వెలలి యుదార మధుర దయ
నిలుపు గుహన్ దత్తి నలరు నీవిడు భుక్తిన్
గలిని ఘనదేహ శౌరీ

దీని నాలుగవ పాదం కనుక్కోవాలంటే
ఈ మూడుపాదాలలోని అక్షరాలను
1,3,5,7, ఈవిధంగా అక్షరాలను తీసుకున్న
నాలుగవపాదం వస్తుంది.
వెలి యుదాధు
నిలుపు గుహన్ త్తి రు నీవిడు భుక్తిన్
లినిదేశౌరీ

వెలిదామరయలుఁగు దనరు విభుగనిన హరీ -
అని నాలుగవపాదం వచ్చును
పూర్తి పద్యం ఇక్కడచూడండి.

వెలలి యుదార మధుర దయ
నిలుపు గుహన్ దత్తి నలరు నీవిడు భుక్తిన్
గలిని ఘనదేహ శౌరీ
వెలిదామరయలుఁగు దనరు విభుగనిన హరీ - 

నాగబంధము


నాగబంధము




సాహితీమిత్రులారా!

ప్రబంధరాజ వేంకటేశ్వర 
విజయవిలాసములోని
నాగబంధము చూడండి-

కరివరదానశూరసురగౌరవసజ్జితపాదసారసా
ధరధరధారిసూరినరతారకనిత్యనశోకదాసభా
సర్వమదకౌశలారహరసారకుభృద్వరధీరమౌనిభా
సురశుకగీతమారనిభశోభనరమ్యశరీరసంభృతా

ఈబంధమున తలనుండి తోకవరకు చదువవలెను
పద్యం చూస్తూ బంధము చదవండి -