Saturday, March 14, 2020

"దామోదర రదమోదా" (పాదభ్రమక పద్యం)


"దామోదర రదమోదా" (పాదభ్రమక పద్యం)


సాహితీమిత్రులారా!

ఒక పద్యం లేదా శ్లోకం లోని పాదాలు మొదటినుండి
చివరకు చదివినా చివరనుండి మొదటికి చదివినా
ఒకలాగే ఉంటే దాన్ని పాదభ్రమకం అంటాం.
పాదభ్రమకానికి ఉదాహరణగా  ఈ  పద్యం చూడండి-
ఇది "విక్రాల శేషాచార్యు"లవారి
"శ్రీవేంకటేశ్వరచిత్రరత్నాకరం" ఉత్తర భాగంలోనిది.

దామోదర రదమోదా
రామా తతరా జయ యజరా తతమారా
రామా జని నిజ మారా
భూమా తతభూమతతమ భూతత మాభూ

ఇది ప్రతి పాదం ఎటునుంచి చదివినా ఒకలాగే ఉంటుంది గమనించండి -

(ర - జంకును, ద - ఖండించువాడా, మోదా - ఆనంద స్వరూపుడా
తత - విస్తృతమైన, రా - బంగారు కలవాడా, తత - అధకమైన,
మా - బుద్ధికి, రా - శాలయైనవాడా, రామా - లక్ష్మి వలన, జని - పుట్టుక కల, నిజ - నిత్యుడైన, మారా - కాముడు కలవాడా, భూమా - విరాట్ స్వరూపుడా, తత - పెద్దదియగు, భూ - భూదేవికి, మతతమ - మిక్కిలి ప్రియుడా, భూ - భూమివలె, తత - గొప్పదియగు, మా - లక్ష్మికి, భూ - స్థానమైనవాడా, దామోదర, జయ - జయించుము.)

Thursday, March 12, 2020

యాదవరాఘవీయ విలోమకావ్యం


యాదవరాఘవీయ విలోమకావ్యం




సాహితీమిత్రులారా!


వేంకటాధ్వరి కృత యాదవరాఘవీయం విలోమకావ్యం
అంటే ముందు నుండి (మామూలుగా) చదివితే
యదుకులభూషణుడైన కృష్ణుని కథను
అదే చివరనుండి చదివితే రామచంద్రునికథ
వచ్చేవిధంగా వ్రాయబడిన కావ్యం ఇది.
ఇందులో కేవలం 30 శ్లోకాలే ఉన్నాయి.
వీటికి విలోమము కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది
ఆస్వాదించగలరు.


వందేఽహం దేవం తం శ్రీతం రన్తారం కాలం భాసా యః ।
రామో రామాధీరాప్యాగో లీలామారాయోధ్యే వాసే ॥ ౧॥

విలోమమ్
సేవాధ్యేయో రామాలాలీ గోప్యారాధీ మారామోరాః ।
యస్సాభాలంకారం తారం తం శ్రీతం వన్దేఽహం దేవమ్ ॥ ౧॥

సాకేతాఖ్యా జ్యాయామాసీద్యావిప్రాదీప్తార్యాధారా ।
పూరాజీతాదేవాద్యావిశ్వాసాగ్ర్యాసావాశారావా ॥ ౨॥

విలోమమ్
వారాశావాసాగ్ర్యా సాశ్వావిద్యావాదేతాజీరాపూః ।
రాధార్యప్తా దీప్రావిద్యాసీమాయాజ్యాఖ్యాతాకేసా ॥ ౨॥

కామభారస్స్థలసారశ్రీసౌధాసౌఘనవాపికా ।
సారసారవపీనాసరాగాకారసుభూరుభూః ॥ ౩॥

విలోమమ్
భూరిభూసురకాగారాసనాపీవరసారసా ।
కాపివానఘసౌధాసౌ శ్రీరసాలస్థభామకా ॥ ౩॥

రామధామసమానేనమాగోరోధనమాసతామ్ ।
నామహామక్షరరసం తారాభాస్తు న వేద యా ॥ ౪॥

విలోమమ్
యాదవేనస్తుభారాతాసంరరక్షమహామనాః ।
తాం సమానధరోగోమాననేమాసమధామరాః ॥ ౪॥

యన్ గాధేయో యోగీ రాగీ వైతానే సౌమ్యే సౌఖ్యేసౌ ।
తం ఖ్యాతం శీతం స్ఫీతం భీమానామాశ్రీహాతా త్రాతమ్ ॥ ౫॥

విలోమమ్
తం త్రాతాహాశ్రీమానామాభీతం స్ఫీత్తం శీతం ఖ్యాతం  ।
సౌఖ్యే సౌమ్యేసౌ నేతా వై గీరాగీయో యోధేగాయన్ ॥ ౫॥

మారమం సుకుమారాభం రసాజాపనృతాశ్రితం ।
కావిరామదలాపాగోసమావామతరానతే ॥ ౬॥

విలోమమ్
తేన రాతమవామాస గోపాలాదమరావికా ।
తం శ్రితానృపజాసారంభ రామాకుసుమం రమా ॥ ౬॥

రామనామా సదా ఖేదభావే దయా-
వానతాపీనతేజారిపావనతే ।
కాదిమోదాసహాతాస్వభాసారసా-
మేసుగోరేణుకాగాత్రజే భూరుమే ॥ ౭॥

విలోమమ్
మేరుభూజేత్రగాకాణురేగోసుమే-
సారసా భాస్వతాహాసదామోదికా ।
తేన వా పారిజాతేన పీతా నవా
యాదవే భాదఖేదాసమానామరా ॥ ౭॥

సారసాసమధాతాక్షిభూమ్నాధామసు సీతయా ।
సాధ్వసావిహరేమేక్షేమ్యరమాసురసారహా ॥ ౮॥

విలోమమ్
హారసారసుమారమ్యక్షేమేరేహవిసాధ్వసా ।
యాతసీసుమధామ్నాభూక్షితాధామససారసా ॥ ౮॥

సాగసాభరతాయేభమాభాతామన్యుమత్తయా ।
సాత్రమధ్యమయాతాపేపోతాయాధిగతారసా ॥ ౯॥

విలోమమ్
సారతాగధియాతాపోపేతాయామధ్యమత్రసా ।
యాత్తమన్యుమతాభామా భయేతారభసాగసా ॥ ౯॥

తానవాదపకోమాభారామేకాననదాససా ।
యాలతావృద్ధసేవాకాకైకేయీమహదాహహ ॥ ౧౦॥

విలోమమ్
హహదాహమయీకేకైకావాసేద్ధ్వృతాలయా ।
సాసదాననకామేరాభామాకోపదవానతా ॥ ౧౦॥

వరమానదసత్యాసహ్రీతపిత్రాదరాదహో ।
భాస్వరస్థిరధీరోపహారోరావనగామ్యసౌ ॥ ౧౧॥

విలోమమ్
సౌమ్యగానవరారోహాపరోధీరస్స్థిరస్వభాః ।
హోదరాదత్రాపితహ్రీసత్యాసదనమారవా ॥ ౧౧॥

యానయానఘధీతాదా రసాయాస్తనయాదవే ।
సాగతాహివియాతాహ్రీసతాపానకిలోనభా ॥ ౧౨॥

విలోమమ్
భానలోకినపాతాసహ్రీతాయావిహితాగసా ।
వేదయానస్తయాసారదాతాధీఘనయానయా ॥ ౧౨॥

రాగిరాధుతిగర్వాదారదాహోమహసాహహ ।
యానగాతభరద్వాజమాయాసీదమగాహినః ॥ ౧౩॥

విలోమమ్
నోహిగామదసీయామాజద్వారభతగానయా ।
హహ సాహమహోదారదార్వాగతిధురాగిరా ॥ ౧౩॥

యాతురాజిదభాభారం ద్యాం వమారుతగన్ధగమ్ ।
సోగమారపదం యక్షతుంగాభోనఘయాత్రయా ॥ ౧౪॥

విలోమమ్
యాత్రయాఘనభోగాతుం క్షయదం పరమాగసః ।
గన్ధగంతరుమావద్యం రంభాభాదజిరా తు యా ॥ ౧౪॥

దణ్డకాం ప్రదమోరాజాల్యాహతామయకారిహా ।
ససమానవతానేనోభోగ్యాభోనతదాసన ॥ ౧౫॥

విలోమమ్
నసదాతనభోగ్యాభో నోనేతావనమాస సః ।
హారికాయమతాహల్యాజారామోదప్రకాణ్డదమ్ ॥ ౧౫॥

సోరమారదనజ్ఞానోవేదేరాకణ్ఠకుంభజమ్ ।
తం ద్రుసారపటోనాగానానాదోషవిరాధహా ॥ ౧౬॥

విలోమమ్
హాధరావిషదోనానాగానాటోపరసాద్రుతమ్ ।
జమ్భకుణ్ఠకరాదేవేనోజ్ఞానదరమారసః ॥ ౧౬॥

సాగమాకరపాతాహాకంకేనావనతోహిసః ।
న సమానర్దమారామాలంకారాజస్వసా రతమ్ ॥ ౧౭॥

విలోమమ్
తం రసాస్వజరాకాలంమారామార్దనమాసన ।
సహితోనవనాకేకం హాతాపారకమాగసా ॥ ౧౭॥

తాం స గోరమదోశ్రీదో విగ్రామసదరోతత ।
వైరమాసపలాహారా వినాసా రవివంశకే ॥ ౧౮॥

విలోమమ్
కేశవం విరసానావిరాహాలాపసమారవైః ।
తతరోదసమగ్రావిదోశ్రీదోమరగోసతామ్ ॥ ౧౮॥

గోద్యుగోమస్వమాయోభూదశ్రీగఖరసేనయా ।
సహసాహవధారోవికలోరాజదరాతిహా ॥ ౧౯॥

విలోమమ్
హాతిరాదజరాలోకవిరోధావహసాహస ।
యానసేరఖగశ్రీద భూయోమాస్వమగోద్యుగః ॥ ౧౯॥

హతపాపచయేహేయో లంకేశోయమసారధీః ।
రాజిరావిరతేరాపోహాహాహంగ్రహమారఘః ॥ ౨౦॥

విలోమమ్
ఘోరమాహగ్రహంహాహాపోరాతేరవిరాజిరాః ।
ధీరసామయశోకేలం యో హేయే చ పపాత హ ॥ ౨౦॥

తాటకేయలవాదేనోహారీహారిగిరాసమః ।
హాసహాయజనాసీతానాప్తేనాదమనాభువి ॥ ౨౧॥

విలోమమ్
విభునామదనాప్తేనాతాసీనాజయహాసహా ।
ససరాగిరిహారీహానోదేవాలయకేటతా ॥ ౨౧॥

భారమాకుదశాకేనాశరాధీకుహకేనహా ।
చారుధీవనపాలోక్యా వైదేహీమహితాహృతా ॥ ౨౨॥

విలోమమ్
తాహృతాహిమహీదేవ్యైక్యాలోపానవధీరుచా ।
హానకేహకుధీరాశానాకేశాదకుమారభాః ॥ ౨౨॥

హారితోయదభోరామావియోగేనఘవాయుజః ।
తంరుమామహితోపేతామోదోసారజ్ఞరామయః ॥ ౨౩॥

విలోమమ్
యోమరాజ్ఞరసాదోమోతాపేతోహిమమారుతమ్ ।
జోయువాఘనగేయోవిమారాభోదయతోరిహా ॥ ౨౩॥

భానుభానుతభావామాసదామోదపరోహతం ।
తంహతామరసాభక్షోతిరాతాకృతవాసవిమ్ ॥ ౨౪॥

విలోమమ్
వింసవాతకృతారాతిక్షోభాసారమతాహతం ।
తం హరోపదమోదాసమావాభాతనుభానుభాః ॥ ౨౪॥

హంసజారుద్ధబలజాపరోదారసుభాజిని ।
రాజిరావణరక్షోరవిఘాతాయరమారయమ్ ॥ ౨౫॥

విలోమమ్
యం రమారయతాఘావిరక్షోరణవరాజిరా ।
నిజభాసురదారోపజాలబద్ధరుజాసహమ్ ॥ ౨౫॥

సాగరాతిగమాభాతినాకేశోసురమాసహః ।
తంసమారుతజంగోప్తాభాదాసాద్యగతోగజమ్ ॥ ౨౬॥

విలోమమ్
జంగతోగద్యసాదాభాప్తాగోజంతరుమాసతం ।
హస్సమారసుశోకేనాతిభామాగతిరాగసా ॥ ౨౬॥

వీరవానరసేనస్య త్రాతాభాదవతా హి సః ।
తోయధావరిగోయాదస్యయతోనవసేతునా ॥ ౨౭॥

విలోమమ్
నాతుసేవనతోయస్యదయాగోరివధాయతః ।
సహితావదభాతాత్రాస్యనసేరనవారవీ ॥ ౨౭॥

హారిసాహసలంకేనాసుభేదీమహితోహిసః ।
చారుభూతనుజోరామోరమారాధయదార్తిహా ॥ ౨౮॥

విలోమమ్
హార్తిదాయధరామారమోరాజోనుతభూరుచా ।
సహితోహిమదీభేసునాకేలంసహసారిహా ॥ ౨౮॥

నాలికేరసుభాకారాగారాసౌసురసాపికా ।
రావణారిక్షమేరాపూరాభేజే హి ననామునా ॥ ౨౯॥

విలోమమ్
నామునానహిజేభేరాపూరామేక్షరిణావరా ।
కాపిసారసుసౌరాగారాకాభాసురకేలినా ॥ ౨౯॥

సాగ్ర్యతామరసాగారామక్షామాఘనభారగౌః ॥
నిజదేపరజిత్యాస శ్రీరామే సుగరాజభా ॥ ౩౦॥

విలోమమ్
భాజరాగసుమేరాశ్రీసత్యాజిరపదేజని ।
గౌరభానఘమాక్షామరాగాసారమతాగ్ర్యసా ॥ ౩౦॥

॥ ఇతి శ్రీవేఙ్కటాధ్వరికృతం శ్రీరాఘవయాదవీయం సమాప్తమ్ ॥

Monday, March 9, 2020

సీతారావణ సంవాదం


సీతారావణ సంవాదం




సాహితీమిత్రులారా!


చిత్రమీమాంసలోని చ్యుతాక్షర శ్లోకం
ఇది చ్యుతాక్షర చిత్రానికి ఉదాహరణగా ఇవ్వబడినది.

భవిత్రీ రమ్భోరు త్రిదశవదనగ్లానిరధునా
స మే రామ: స్థాతా న యుధి పురతో లక్ష్మణసఖ:
ఇయం యాస్యత్యుచ్చైర్విపదమధునా వానరచమూ:
లఘిష్ఠేదం షష్ఠాక్షరపరవిలోపాత్పఠ పున:

ఇందులో సీతా రావణ సంవాదం ఉంది.

రావణుడు -  భవిత్రీ రమ్భోరు త్రిదశవదనగ్లానిరధునా
                   స మే రామ: స్థాతా న యుధి పురతో లక్ష్మణసఖ:
                   ఇయం యాస్యత్యుచ్చైర్విపదమధునా వానరచమూ:
(అరటిస్తంభాల వంటి ఊరువులు గల
ఓ సీతా! ఇపుడు దేవతల ముఖాలు వాడిపోతాయి.
లక్ష్మణసహితుడైన ఆ రాముడు యుద్ధంలో నా ఎదుట నిలబడలేడు.
ఇప్పుడీ వానరసేన గొప్ప ఆపద పొందగలదు.)
సీత - లఘిష్ఠేదం షష్ఠాక్షరపరవిలోపాత్పఠ పున:
     (ఓ నీచుడా! దీనినే ఏడవ అక్షరం తొలగించి మళ్ళీ చదువు)
మూడు పాదాలలోని ఏడవ అక్షరాలు తీసివేయగా

భవిత్రీ రమ్భోరు త్రిదశవదనగ్లానిరధునా
స మే రామ: స్థాతా న యుధి పురతో లక్ష్మణసఖ:
ఇయం యాస్యత్యుచ్చైర్విపదమధునా వానరచమూ:
లఘిష్ఠేదం షష్ఠాక్షరపరవిలోపాత్పఠ పున:
మొదటి పాదం (భవిత్రీ రమ్భోరు త్రిదశవదనగ్లానిరధునా)లో -
                            దశవదనగ్లాని:(రావణుని లేదా పది ముఖాల గ్లాని
                            (శ్రమముచేత కలిగిన దౌర్బల్యము))
రెండవ పాదం (స మే రామ: స్థాతా న యుధి పురతో లక్ష్మణసఖ:)లో -
                            రామ: స్థాతా యుధి(రాముడు యుద్ధంలో నిలబడతాడు)
మూడవ పాదం(ఇయం యాస్యత్యుచ్చైర్విపదమధునా వానరచమూ:)లో
                      - ఉచ్చై: పదమ్ (ఉన్నతస్థితిని)
                      అనే అర్థాలున్న పదాలు ఏర్పడ్డాయి.
దీనిలో రావణుడు అనుకున్న వాటికి విరుద్ధంగా వచ్చాయి.

Saturday, March 7, 2020

చరకాష్టకమ్


చరకాష్టకమ్




సాహితీమిత్రులారా!

మంగిడిపూడి వేంకటశర్మగారి
చరకాష్టకమ్ తిలకించండి-
ఇది ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1925
నుండి -



Thursday, March 5, 2020

పెదిమలు తగులుతూ - నాలుక కదలని పద్యం


పెదిమలు తగులుతూ - నాలుక కదలని పద్యం




సాహితీమిత్రులారా!

ఓష్ఠ్యములు అంటే పెదిమలు తగిలే విధంగా పలికే అక్షరాలు
అంటే పెదవుల నుండి పుట్టే అక్షరాలు.
 వీటితోను నాలుకతాకు లేకుండా కూర్చిన పద్యం ఇది.
"ఆయలూరు కందాళయార్య" విరచిత
"అలంకారశిరోభూషణే "
శబ్దాలంకారప్రకరణంలోనిది ఈ శ్లోకం.
చూడండి నాలుక కదులుతుందేమో!

భవభామా భావగాహ బహుభామా మవాభవ
మమ భోభవభూమావ భవభూపా వభూమహ 

(పార్వతీదేవి యొక్క హృదయమందు చేరినవాడా(శ్రీరామనామ రూపంతో
ఆమె హృదయమందున్నవాడు) అధిక తేజస్సంపన్నుడా! సంసారగంధ గ్రహితుడా
శ్రీ భూవల్లభా! సంసార మండలంలో కలిగిన పాపాధిత్యాను నశింపచేయువాడా!
నన్ను రక్షించు)

Tuesday, March 3, 2020

జారుల గాంచి వందనము సల్పిరి భక్తులు


జారుల గాంచి వందనము సల్పిరి భక్తులు 




సాహితీమిత్రులారా!


సమస్య - 
జారుల గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తి కాంతకై

 సింహాద్రి శ్రీరంగం గారి పూరణ -
సారములేని సంసరణ సాగర మియ్యదటంచు నెంచి, సం
సారము తోడ మెట్లు వరుసన్ తరియించుచు కొండలయ్య! మా
భారము నీవె కావు మని పల్కుచు కోవెలచేరి యందు పూ
జారుల గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తి కాంతకై

పూరణలో జారులకు గాక పూజారులకు వందనం చేశారనటంతో
సమస్య తొలగిపోయింది కదా

Sunday, March 1, 2020

చిత్రకావ్య కౌతుకమ్


చిత్రకావ్య కౌతుకమ్




సాహితీమిత్రులారా!

రామరూప్ పాఠక్ సంస్కృతభాషలో పేరుపొందిన కవి. సంస్కృత సాహిత్యాన్ని, భారతచరిత్ర సంస్కృతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వ్యక్తి రామరూప్ పాఠక్. ఈయన 1891లో బీహార్ లోని షహాబాద్ లో మంచి చదువు సంస్కారం ఉన్న కుటుంబంలో జన్మించారు.
చిత్రకావ్య కౌతుకమ్ కు 1967లో సాహిత్య అకాడమీ అవార్డు
లభించింది. చిత్రకవిత్వ విధానంలో చేసిన ప్రయోగాలకు ఈ పుస్తకం పేరుపొందింది. ఆధునికయుగంలో చిత్రకావ్య వైతాళికుడుగా కీర్తిని పొందాడు పాఠక్.  చిత్రకవిత్వంలో అంతకు ముందున్న గ్రంథాలకన్న
అభివ్యక్తిలోనూ, ఇతివృత్తం విషయంలోనూ విశిష్టమైనదిగా విమర్శకుల మన్ననలు పొందింది. ఈ గ్రంథంలో 55 రకాల చిత్రబంధాలున్నాయి.
ఈ గ్రంథంలో మూడు ఖండాలున్నాయి. మొదటి ఖండంలో చిత్రకావ్య భూమికను, రెండవ ఖండంలో చిత్రకావ్య మూల గ్రంథాలను గురించి వివరిస్తూ 55 బంధాలను వివరించారు. మూడవ ఖండంలో రెండు అనుబంధాలున్నాయి. వాటిలో మొదటి అనుబంధంలో పాఠక్ కృత
లఘుకృతులు ఇచ్చాడు. రెండవ ఖండంలో సమస్యాపూరణలు కూర్చారు.
ఇక్కడ బంధం గమనించండి-