ఆది వరాహ స్తుతి
సాహితీమిత్రులారా!
శ్రీ మోహన్‌లాల్ శర్మ పాండే గారి నతితతి అనే గ్రంథం నుండి
ఆది వరాహ స్తుతి ఆదివర్ణావృత్తి చిత్రంగా కూర్చబడినది.
ఘంటాఘోషో ఘృణాలుర్ఘుణితఘుటఘటో ఘస్మరో ఘాతుకానాం
ఘ్రాతిఘ్రాతాతిఘోరో ఘృణిఘృణిఘుసృణో ఘర్ఘరాఘుఘురీకృత్ |
ఘర్మాంభోధారఘాతో ఘనఘృతఘటకో ఘాతినాం ఘాతుకో ఘాత్
ఘట్టే ఘోరాభిఘాతీ ఘటితఘటఘనో ఘూర్ణతే ఘోరఘోణిః || 4
||
అన్వయము:
ఘుణితఘుటఘటః, ఘాతుకానాం
ఘస్మరః, ఘృణిఘృణిఘుసృణః, ఘ్రాతిఘ్రాతాతిఘోరః, ఘర్ఘరాఘుఘురీకృత్, ఘనఘృతఘటకః, ఘర్మాంభోధారఘాతః, ఘాత్
ఘాతినాం ఘాతుకః, ఘటితఘటఘనః, ఘట్టే
ఘోరాభిఘాతీ, ఘృణాలుః, ఘంటాఘోషః, ఘోరఘోణిః
ఘూర్ణతే.
వ్యాఖ్య -
·
ఘుణితఘుటఘటః = తిరుగుతున్న
చీలమండల అమరిక కలవాడు.
·
ఘాతుకానామ్ = క్రూరులను/హింసకులను.
·
ఘస్మరః = భక్షించువాడు.
·
ఘృణిఘృణిఘుసృణః = ప్రకాశవంతమైన
కిరణాల వంటి కేసరములు (రంగు) కలవాడు.
·
ఘ్రాతిఘ్రాతాతిఘోరః = వాసన
చూసే క్రియలో మిక్కిలి భయంకరుడు.
·
ఘర్ఘరాఘుఘురీకృత్ = గజ్జెల
సవ్వడి వంటి ఘుమఘుమ శబ్దము చేయువాడు.
·
ఘనఘృతఘటకః = గాఢమైన
జలమున ప్రవేశించినవాడు.
·
ఘర్మాంభోధారఘాతః = చెమట
బిందువుల సేచనముతో శత్రువులను నాశనం చేయువాడు.
·
ఘాత్ ఘాతినామ్ = సంహారకులను
దెబ్బతీయువాడు.
·
ఘాతుకః = హంతకుడు
(శత్రువులకు).
·
ఘటితఘటఘనః = కుంభక
ప్రాణాయామముతో నిశ్చలముగా ఉన్నవాడు.
·
ఘట్టే = సముద్ర
తీరమున.
·
ఘోరాభిఘాతీ = భయంకరమైన
శత్రువులను దెబ్బతీయువాడు.
·
ఘృణాలుః = భక్తుల
పట్ల దయాళువు.
·
ఘంటాఘోషః = గంటల
వంటి నాదము కలవాడు.
·
ఘోరఘోణిః = భయంకరమైన
నాశిక (ముక్కు) కలవాడు (వరాహ స్వామి).
·
ఘూర్ణతే = ఇటునటు
సంచరించుచున్నాడు.
ఈ 'ఘ' కార
పద్యం ద్వారా భగవంతుడైన విష్ణుమూర్తి యొక్క వరాహావతారాన్ని వర్ణించారు. భక్తుల
పట్ల దయాళువు, గంటల వంటి గంభీర నాదము
కలవాడు, క్రూరులను భక్షించేవాడు, ప్రకాశవంతమైన
దేహము కలవాడు, సముద్ర గర్భమున
ప్రవేశించి భూమిని ఉద్ధరించినవాడు మరియు భయంకరమైన నాశికా శక్తి కల వరాహ రూప
పరమాత్మ శత్రువులను సంహరిస్తూ సముద్ర తీరమున విహరించుచున్నాడు. ఇక్కడ 'ఘంటాఘోషః' అనే
పదంలో ఉపమాలంకారం ఉంది.
No comments:
Post a Comment