Monday, March 9, 2020

సీతారావణ సంవాదం


సీతారావణ సంవాదం




సాహితీమిత్రులారా!


చిత్రమీమాంసలోని చ్యుతాక్షర శ్లోకం
ఇది చ్యుతాక్షర చిత్రానికి ఉదాహరణగా ఇవ్వబడినది.

భవిత్రీ రమ్భోరు త్రిదశవదనగ్లానిరధునా
స మే రామ: స్థాతా న యుధి పురతో లక్ష్మణసఖ:
ఇయం యాస్యత్యుచ్చైర్విపదమధునా వానరచమూ:
లఘిష్ఠేదం షష్ఠాక్షరపరవిలోపాత్పఠ పున:

ఇందులో సీతా రావణ సంవాదం ఉంది.

రావణుడు -  భవిత్రీ రమ్భోరు త్రిదశవదనగ్లానిరధునా
                   స మే రామ: స్థాతా న యుధి పురతో లక్ష్మణసఖ:
                   ఇయం యాస్యత్యుచ్చైర్విపదమధునా వానరచమూ:
(అరటిస్తంభాల వంటి ఊరువులు గల
ఓ సీతా! ఇపుడు దేవతల ముఖాలు వాడిపోతాయి.
లక్ష్మణసహితుడైన ఆ రాముడు యుద్ధంలో నా ఎదుట నిలబడలేడు.
ఇప్పుడీ వానరసేన గొప్ప ఆపద పొందగలదు.)
సీత - లఘిష్ఠేదం షష్ఠాక్షరపరవిలోపాత్పఠ పున:
     (ఓ నీచుడా! దీనినే ఏడవ అక్షరం తొలగించి మళ్ళీ చదువు)
మూడు పాదాలలోని ఏడవ అక్షరాలు తీసివేయగా

భవిత్రీ రమ్భోరు త్రిదశవదనగ్లానిరధునా
స మే రామ: స్థాతా యుధి పురతో లక్ష్మణసఖ:
ఇయం యాస్యత్యుచ్చైర్విపదమధునా వానరచమూ:
లఘిష్ఠేదం షష్ఠాక్షరపరవిలోపాత్పఠ పున:
మొదటి పాదం (భవిత్రీ రమ్భోరు త్రిదశవదనగ్లానిరధునా)లో -
                            దశవదనగ్లాని:(రావణుని లేదా పది ముఖాల గ్లాని
                            (శ్రమముచేత కలిగిన దౌర్బల్యము))
రెండవ పాదం (స మే రామ: స్థాతా న యుధి పురతో లక్ష్మణసఖ:)లో -
                            రామ: స్థాతా యుధి(రాముడు యుద్ధంలో నిలబడతాడు)
మూడవ పాదం(ఇయం యాస్యత్యుచ్చైర్విపదమధునా వానరచమూ:)లో
                      - ఉచ్చై: పదమ్ (ఉన్నతస్థితిని)
                      అనే అర్థాలున్న పదాలు ఏర్పడ్డాయి.
దీనిలో రావణుడు అనుకున్న వాటికి విరుద్ధంగా వచ్చాయి.

No comments: